ప్రజల కోసం ఏ త్యాగానికైనా సిద్ధమే | lands registration lssue | Sakshi
Sakshi News home page

ప్రజల కోసం ఏ త్యాగానికైనా సిద్ధమే

Published Mon, Apr 3 2017 11:56 PM | Last Updated on Tue, Sep 5 2017 7:51 AM

lands registration lssue

  • టీడీపీ నేతల దాడులు సహించం 
  • జక్కంపూడి విజయలక్ష్మి 
  • ఉద్యమానికి అందరూ మద్దతు
  •  
    రెండేళ్లుగా నిలిపివేసిన భూముల రిజిస్ట్రేషన్లు వెంటనే చేయాలన్న డిమాండ్‌తో రైతులు, ప్రజలు సోమవారం కోరుకొండలో చేపట్టిన ఉద్యమానికి అన్ని వర్గాల నుంచి మద్దతు లభించింది. బంద్, రాస్తారోకో, ప్రదర్శనతో కోరుకొండ అట్టుడికిపోయింది. వైఎస్సార్‌ సీపీతో పాటు అన్ని పార్టీలు టీడీపీ సహ ప్రజల ఆందోళనకు సంఘీభావం తెలిపాయి. మహోద్యమంగా మారుతున్నప్పటికీ ప్రజల డిమాండ్‌ను పరిష్కరించేందుకు పాలకులు ముందుకు రావడం లేదు. ఉన్నతాధికారులకు సమస్య నివేదిస్తామని, అప్పటికీ వారు స్పందించకుంటే కోర్టునే ఆశ్రయిస్తామని వైఎస్సార్‌ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి అల్టిమేటం ఇచ్చారు.
     
    కోరుకొండ (రాజానగరం) :
    రైతులు, ప్రజల భూములు రిజిస్ట్రేషన్లు వెంటనే చేయించకుంటే వారి పక్షాన ఏ త్యాగానికైనా సిద్ధమేనని వైఎస్సార్‌ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు. ఈ సమస్యపై సోమవారం నిర్వహించిన బంద్‌ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుమారు 1,200 ఎకరాల భూములకు రిజిస్ట్రేషన్లు చేయించేలా ఇప్పటికైనా ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్‌ ప్రయత్నించాలన్నారు. రైతుసేవా కమిటీ చేస్తున్న ఆందోళనకు పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. అన్నవరం దేవస్థానం, ప్రభుత్వం ఈ సమస్యను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కలెక్టరు, సబ్‌ కలెక్టరు, దేవాదాయ శాఖ కమిషనర్‌ దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్తామన్నారు. అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తామన్నారు. ఈ విషయంలో న్యాయం చేయాలని కోరుతుంటే రైతులు, వైఎస్సార్‌ సీపీ నాయకులపై టీడీపీలోని కొందరు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పార్టీ వివిధ విభాగాల నాయకులు బొరుసు బద్రి, అయిల శ్రీను, వాకా నరసింహరావు, తోరాటి శ్రీను, కోడినాగుల ప్రసాద్, పినమరెడ్డి సూర్యచంద్రం, పసుపులటి శివ, కాలచర్ల శివాజీ, కాలచర్ల నాగు, అయిల రామకృష్ణ, పసుపులేటి బుల్లియ్యనాయుడు, కోడూరి సత్తిరెడ్డి, వుల్లి గణనాథ్, అత్తిలి రాంప్రసాద్, సూరిశెట్టి అప్పలస్వామి, కోయిడాల అప్పల నరసింహరావు, కల్యాణం రాంబాబు, గణేషుల పోసియ్య, యడ్ల సత్యనారాయణ, కామిశెట్టి విష్ణు, సొంగా వెంకటేశ్వరరావు, జాజుల సత్తిబాబు, గింజాల వెంకట్రావు, పాలం నాగవిష్ణు, తోరాటి సత్యప్రసాద్, బెల్లం ప్రసాద్,అడపా జగదీష్, గొల్లవల్లి అప్పలనర్స, కాకి జగపతి, దాసరి యేసు, తదితరులు పాల్గొన్నారు. 
     
    13వ రోజుకు చేరిన రిలే దీక్షలు
    భూముల రిజిస్ట్రేషన్లు చేయాలని కోరుతూ కోరుకొండ, పశ్చిమగానుగూడెం, శ్రీరంగపట్నం, జంబూపట్నం, కాపవరం తదితర గ్రామాల రైతులు, ప్రజలు చేపట్టిన రిలే దీక్షలు సోమవారం 13వ రోజుకు చేరాయి. ఓలేటి సూర్యనారాయణమూర్తి, ముత్యాల శ్రీనివాస్, కోరిమిల్లి అరవాలరాజు, కర్రి మరికృష్ణ, పరిమి శివాజీ, కత్తుల శ్రీనివాసరావు, సూరిశెట్టి అవతారం, కొయిడాల సీతారాముడు, కోరిమిల్లి నాగరత్నం, మల్ల అప్పలనర్సమ్మ, సూరిశెట్టి సత్యవతి, దాడి రామాయమ్మ, దాడి సీతారామాయమ్మ, చరకణం పార్వతమ్మ, కాళ్ల అప్పలరాజు, అళ్ల పోషమ్మ, పెనకటి వేదవతి, సూరిశెట్టి తాతారావు తదితరులు దీక్షలో పాల్గొన్నారు.
     
    నేతల సంఘీభావం
    దీక్షా శిబిరాన్ని జక్కంపూడి విజయలక్ష్మి సందర్శించి దీక్షాపరులకు సంఘీభావం తెలిపారు. 13 రోజులుగా దీక్ష చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని ఖండించారు. ఆమె వెంట వైఎస్సార్‌ సీపీ నాయకులు ఉన్నారు. శిబిరానికి వచ్చిన ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్‌ మాట్లాడుతూ రైతులు ప్రజలు ఆందోళన పడవద్దని అందరికీ న్యాయం చేసేలా పాటుపడతానని హామీ ఇచ్చారు. రాజమహేంద్రవరం మార్కెట్‌ యార్డ్‌ చైర్మ¯ŒS తనకాల నాగేశ్వరరావు, టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు మతా సీతారాముడు, మల్ల అవతారం, తెలగంశెట్టి శ్రీనివాస్, పరస శ్రీను, కాళ్ల శ్రీరాములు, కోర్పు బుజ్జి, మైరెడ్డి రాంబాబు, మాతా ప్రభు, మాదబో యిన అప్పారావు, కొయ్యా శామ్యూల్, వాసిరెడ్డి సుబ్రహ్మణ్యం, కోర్పు బుజ్జి తదితరులు పాల్గొన్నారు. జేపీ మండల అధ్యక్షుడు పసుపులేటి బాపిరాజు, పార్టీ నాయకులు గొట్టుముక్కల అన్నమాచార్యులు, తగరంపూడి గణపతి, లోక్‌సత్తా జిల్లా నాయకుడు కాళ్ళకూరి కృష్ణమోహన్, రాజానగరం నియోజక కన్వీనర్‌ నాగులపాటి బాలాజీ, మండల అధ్యక్షుడు నాగులపాటి సుబ్రహ్మణ్యం, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్‌ రాజానగం కన్వీనర్‌ కొత్తపల్లి భాస్కర రామం, సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ పార్టీ జిల్లా నాయకులు పి.ప్రదీప్, చొంగా సూర్యనారాయణమూర్తి, కె.భాస్కర్,. కాంగ్రెస్‌ నాయకులు డాక్టర్‌ పీఎస్‌ భార్గవ, కర్రి వీరగణేష్, గరగ శ్రీధర్‌బాబు తదితరులు సంఘీభావం తెలిపారు. కోరుకొండలో వివిధ కుల సంఘాలు, కార్మిక సం ఘాలు, ఆ«ధ్యాత్మిక సంఘాల ప్రతినిధులు కూడా దీక్షాపరులకు సంఘీభావం తెలిపారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement