బండి వెనుక బండి..!
జక్కంపూడి వైవీ రావు ఎస్టేట్ నుంచి పైపులరోడ్డు జంక్షన్ ఉడా నిర్మించిన ఇన్నర్ రోడ్డులో ఆదివారం భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పుష్కర స్నానాలకు విచ్చేసే యాత్రికుల వాహనాలతో పాటు ఆర్టీసీ బస్సుల సంఖ్య ఒక్కసారిగా పెరగడంతో ఇన్నర్ రోడ్డులో వాహనాలు ముందుకు కదిలే పరిస్థితి లేకుండా పోయింది.
చిట్టినగర్ :
జక్కంపూడి వైవీ రావు ఎస్టేట్ నుంచి పైపులరోడ్డు జంక్షన్ ఉడా నిర్మించిన ఇన్నర్ రోడ్డులో ఆదివారం భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పుష్కర స్నానాలకు విచ్చేసే యాత్రికుల వాహనాలతో పాటు ఆర్టీసీ బస్సుల సంఖ్య ఒక్కసారిగా పెరగడంతో ఇన్నర్ రోడ్డులో వాహనాలు ముందుకు కదిలే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో గంట పాటు వాహనాలు ఒక దాని వెంట మరొకటి నిలిపిపోయాయి. నైనవరం ఫ్లై ఓవర్ మీదగా వాహనాలను అనుమతించకపోవడమే ట్రాఫిక్‌జామ్‌కు కారణంగా తెలుస్తోంది. మరో వైపున వైవీ రావు ఎస్టేట్ సమీపంలోని పుష్కర్‌నగర్ నుంచి నడుపుతున్న ఉచిత బస్సులను సైతం ఫ్లై ఓవర్ మీదకు అనుమతించలేదు. దీంతో పలుమార్లు ఆర్టీసీ, పోలీసు సిబ్బందికి వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి.