సాక్షి, విజయవాడ: ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఎల్లో మీడియా దుష్ప్రచారంపై సీఐడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఛార్జ్‌షీట్‌ను ఏసీబీ కోర్టు తిరస్కరించిందన్న వార్తలను సీఐడీ ఖండించింది. ఛార్జ్‌షీట్‌కు దాఖలు చేయబడిన అనుబంధ పత్రాలను పరిశీలించడానికి కొంత సమయం పడుతుందని సీఐడీ అధికారులు పేర్కొన్నారు. ఎల్లో మీడియాపై న్యాయపరమైన చర్యలకు సీఐడీ సిద్ధమవుతుంది.
కాగా, టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు యథేచ్ఛగా సాగించిన కుంభకోణాలపై సీఐడీ దూకుడు పెంచింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో గురువారం చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో ఏ–1గా చంద్రబాబు, ఏ–2గా పొంగూరి నారాయణలను పేర్కొంది. లింగమనేని కుటుంబంతో కలిసి సాగించిన ఈ క్విడ్ ప్రో కో కుంభకోణంలో హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్‌గా వ్యవహరించిన నారా లోకేశ్‌ను ఏ–14గా, లింగమనేని రమేశ్ తదితరులను కూడా నిందితులుగా పేర్కొంది. వారిపై ఐపీసీ 120(బి), 409, 420, 34, 35, 37.. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(2), రెడ్‌విత్ 13(1)(సి),(డి)ల ప్రకారం వారిపై కేసు నమోదు చేసినట్టు ఆ చార్జ్‌షీట్‌లో వెల్లడించింది.
తద్వారా ఈ భారీ భూ కుంభకోణంపై న్యాయ విచారణ ప్రక్రియకు రంగం సిద్ధమైంది. కాగితాల మీదే ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌లో ఇష్టానుసారం మార్పులు చేసి, వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టిన చంద్రబాబు ముఠా అవినీతి బాగోతం విభ్రాంతి పరుస్తోంది. టీడీపీ ప్రభుత్వంలో సీఆర్‌డీఏ చైర్మన్‌గా అప్పటి సీఎం చంద్రబాబు, వైస్ చైర్మన్‌గా అప్పటి మంత్రి పొంగూరు నారాయణ బరితెగించి ఇలా అవినీతికి పాల్పడ్డారు. ఇందుకోసం లింగమనేని రమేశ్‌తో క్విడ్ ప్రో కో కు తెరలేపారు.
ఈ తతంగంలో నారా లోకేష్ కూడా ప్రధాన పాత్ర పోషించారు. చంద్రబాబు బినామీ, సన్నిహితుడు లింగమనేని భూముల మార్కెట్ విలువ రూ.177.50 కోట్ల నుంచి రూ.877.50 కోట్లకు.. రాజధాని నిర్మాణం అనంతరం ఏకంగా రూ.2,130 కోట్లకు చేరేలా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌ను ఖరారు చేయడం భారీ దోపిడీకి నిదర్శనం. ఈ అవినీతి పాపంలో చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కల్యాణ్‌కు కూడా వాటా ఇవ్వడం గమనార్హం.
ఇదీ చదవండి: 'దొరికారు దొంగలు' ఏ–1 చంద్రబాబు, ఏ–2 నారాయణ
Comments
Please login to add a commentAdd a comment