సాక్షి, తాడేపల్లి: ఎల్లో మీడియా చేసే దుష్ప్రచారంపై ఏపీ సీఐడీ సీరియస్ అయింది. ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్‌లో హెరిటేజ్ డాక్యుమెంట్లు తగలబెట్టారంటూ ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడింది. ఫైల్స్ తగలబెట్టారంటూ చేసిన ప్రచారాన్ని సీఐడీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సీఐడీ ఐజీ రఘురామిరెడ్డి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
‘డాక్యుమెంట్లు కాల్చారంటూ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోంది. కొన్ని ఛానళ్లలో బాధ్యత రహితంగా ప్రచారం చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్డు సహా 5 కేసుల్లో ఛార్జ్ షీట్లు దాఖలు చేశాం. ప్రతి ఛార్జ్ షీట్‌కు 8 వేల నుండి 10 వేల కాపీలతో రూపొందించాం.
ప్రతి కేసు ఛార్జ్ షీట్ కాపీలను ప్రతి కేసులో ఉన్న నిందితులకు అందించాం. హెరిటేజ్‌కి సంబంధించిన డాక్యుమెంట్లు అన్ని కోర్టుకి అందజేశాం. హెరిటేజ్ కంపెనీకి చెందిన వ్యక్తుల ఐటీ రిటర్న్స్ వివరాలు కోర్టుకి అందజేశాం. హెరిటేజ్ కంపెనీకి చెందిన వారికి కూడా ఆ డాక్యుమెంట్లు అందించాం’ అని సీఐడీ ప్రకటనతో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment