సాక్షి, గుంటూరు: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ కుంభకోణం కేసులో రెండో రోజు నారా లోకేష్‌ను ఏపీ సీఐడీ విచారిస్తోంది. మంత్రి వర్గ ఉప సంఘం నిర్ణయాలపై సీఐడీ వరుస ప్రశ్నలు సంధించింది.
లోకేష్‌కు సీఐడీ ప్రశ్నలు
ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ మార్పుకి ఒత్తిడి చేశారా లేదా?. మీరు మంత్రి అవ్వగానే మంత్రి వర్గ ఉప సంఘంలో ఎందుకు చేర్చారు?. మంత్రి వర్గ ఉప సంఘంలో ఇతర సభ్యులను ఒత్తిడి చేశారా కదా..?. హెరిటేజ్, లింగమనేని, నారాయణ భూములకు లబ్ధి చేసేలా అలైన్‌మెంట్ ఎందుకు మార్చారు?. ఇన్నర్ రింగ్ రోడ్డు భూసేకరణ పరిహారాన్ని భారీగా పెంచడంలో మీ పాత్ర ఉంది కదా?. భూ సేకరణ వ్యయాన్ని 210 కోట్లు అదనంగా ఎందుకు పెంచారు?. లింగమనేని రమేష్ మీకు ఎందుకు ఇల్లు ఉచితంగా ఇచ్చారు’’ అంటూ లోకేష్‌ను సీఐడీ అధికారులు ప్రశ్నించారు.
5 గంటల పాటు పునీత్‌ను విచారించిన సీఐడీ అధికారులు
ఐఆర్‌ఆర్ అలైన్‌మెంట్ మార్పు కేసులో మాజీ మంత్రి నారాయణ అల్లడు పునీత్‌ను సీఐడీ అధికారులు ఐదు గంటల పాటు విచారించారు. ఈ విచారణలో భాగంగా సీఐడీ ఎదుట హాజరైన పునీత్‌ను అధికారులు ప్రశ్నించారు. రేపు(గురువారం) మళ్లీ విచారణకు రావాలని పునీత్‌ను అధికారులు ఆదేశించారు.
కాగా, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ14గా ఉన్న లోకేశ్.. తొలిరోజు పొంతనలేని సమాధానాలు చెప్పారు. నిన్న ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు సీఐడీ విచారించిన సంగతి తెలిసిందే. లోకేష్‌కు 30 ప్రశ్నలు వేసిన సీఐడీ అధికారులు.. హెరిటేజ్‌లో డైరెక్టర్‌గా ఉన్న సమంయలో లోకేష్ తీసుకున్న నిర్ణయాలపై ప్రశ్నించారు.
అయితే, సీఐడీ సంధించిన సూటి ప్రశ్నలకు తత్తరపాటుకు గురై బిత్తరపోవడం లోకేశ్ వంతైంది. మాజీ సీఎం చంద్రబాబు తరహాలోనే ఆయన తనయుడు నారా లోకేశ్ కూడా సీఐడీ దర్యాప్తునకు సహకరించకుండా మొండికేసేందుకు శతవిధాలుగా ప్రయత్నించారు. అయితే సీఐడీ అధికారులు పూర్తి ఆధారాలతో ప్రశ్నించేసరికి తడబాటుకు గురై అసహనం ప్రదర్శించారు.
న్యాయస్థానం ఆదేశాలను పాటిస్తూ లోకేశ్‌కు సమీపంలో న్యాయవాది ఉండేందుకు అవకాశం కల్పించి మరీ విచారించారు. ముందుగా సిద్ధం చేసుకున్న ప్రశ్నావళిని బట్టి సీఐడీ అధికారులు ఒక్కో ప్రశ్న అడుగుతూ విచారణ కొనసాగించారు. సుహృద్భావ వాతావరణంలో విచారణ ప్రక్రియ కొనసాగించేందుకు ప్రాధాన్యమిచ్చారు. లోకేశ్ సహకరించడం లేదని స్పష్టమవుతున్నా ఓపిగ్గా ప్రశ్నలు సంధిస్తూ ఆరు గంటల పాటు విచారించారు.
చదవండి: తత్తరపాటు.. బిత్తర చూపులు!
Comments
Please login to add a commentAdd a comment