Andhra pradesh CID
-
సీఐడీ కేసుల్లో దోషులకు శిక్ష ఖాయం
సిట్ దర్యాప్తు చేస్తున్న కేసులకు సంబంధించిన పత్రాలన్నీ న్యాయస్థానాల్లో ఉన్నాయి. ఆ కేసుల్లో దోషులకు శిక్షలు పడటం ఖాయం. – సిట్‌కు నేతృత్వం వహిస్తున్న ఐజీ కొల్లి రఘురామరెడ్డి సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో అవినీతి, కుంభకోణాలపై సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నమోదు చేసిన కేసుల్లో దోషులకు శిక్ష ఖాయమని తేలడంతో ఎల్లో గ్యాంగ్ బెంబేలెత్తుతోంది. దాంతో సిట్‌పై దుష్ప్రచారం చేసేందుకు యత్నించి బోర్లా పడింది. చంద్రబాబు కేసుల పత్రాలను సిట్ కార్యాలయం ప్రాంగణంలో కాల్చివేస్తున్నారంటూ ఎల్లో చానళ్లు సోమవారం హడావుడి చేశాయి. ఈ ఎన్నికల తరువాత వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని భావించే సిట్ అధికారులు ఇలా పత్రాలను కాల్చివేస్తున్నారంటూ వక్రీకరించిన కథనాలతో ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించాయి. కానీ తాము దర్యాప్తు చేస్తున్న అయిదు కేసుల్లో పూర్తి ఆధారాలతో న్యాయస్థానాల్లో చార్జ్షీట్లు దాఖలు చేశామని, అంతకు ముందే కీలక కేస్ డైరీలు, ఆధారాలుగా ఉన్నఒరిజినల్ పత్రాలను కూడా న్యాయస్థానాలకు సమర్పించామని సిట్ స్పష్టం చేసింది. ఆ సందర్భంగా తీసిన లక్షలాది ఫొటోస్టాట్ కాపీల్లో సరిగా రాని వాటిని చిత్తుగా పరిగణించి కాల్చివేశామని వెల్లడించడంతో ఎల్లో మీడియా నోళ్లు మూతపడ్డాయి. అసలు కేసులకు సంబంధించిన పత్రాలను రహస్యంగా కాల్చివేసే ఉద్దేశమే ఉంటే ఎక్కడో రహస్యంగా చేస్తారు. అది పెద్ద కష్టమేమీ కాదు. కానీ, సిట్ కార్యాలయ ప్రాంగణంలో.. అదీ పట్టపగలు అందరూ చూస్తుండగా ఎందుకు చేస్తారు? ఈ చిన్న లాజిక్‌ను మర్చిపోయిన ఎల్లో మీడియా బోల్తా పడింది. అదిగో తోక.. ఇదిగో పులి తాడేపల్లిలోని సిట్ కార్యాలయం ఉన్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాంగణం సమీపంలో కొన్ని చిత్తుకాగితాలను సిబ్బంది సోమవారం ఉదయం కాల్చివేశారు. అది చూసి టీడీపీ నేతలు, ఆ పారీ్టకి కొమ్ముకాసే ఎల్లో మీడియా చానళ్లు హడావుడి మొదలుపెట్టాయి. చంద్రబాబుపై నమోదు చేసిన కేసుల కీలక పత్రాలను సిట్ అధికారులు రహస్యంగా దహనం చేసేస్తున్నారని, వాటిలో హెరిటేజ్ ఫుడ్స్‌కు సంబంధించిన పత్రాలు ఉన్నాయంటూ ప్రచారం ప్రారంభించాయి. అనుమతి లేకుండా సిట్ అధికారులు తీసుకున్న హెరిటేజ్ ఫుడ్స్, నారా భువనేశ్వరిల ఆదాయ పన్ను రిటర్న్ కాపీలు వీటిలో ఉన్నాయని ఊదరగొట్టాయి. చంద్రబాబుపై అక్రమంగా కేసులు నమోదు చేశారని, లోకేశ్‌ను అక్రమంగా విచారించారని, అందుకే ఆ కేసుల కాపీలను దహనం చేసేస్తున్నారని కూడా చెప్పుకొచ్చాయి. అంతే కాదు.. ఈ ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బండారం బయటపడుతుందనే ఆందోళనతోనే సిట్ అధికారులు ఇలా పత్రాలను రహస్యంగా దహనం చేసేస్తున్నారని కూడా ఇష్టానుసారం వక్రీకరణలతో కూడిన కథనాలను ప్రసారం చేశాయి. ఎన్నికల వేళ ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు పడరాని పాట్లు పడ్డాయి. దుష్ప్రచారాన్ని తిప్పికొట్టిన సిట్ టీడీపీ నేతలు, ఎల్లో మీడియా దుష్ప్రచారాన్ని సిట్ ఓ ప్రకటనలో సమర్థంగా తిప్పికొట్టింది. ‘సిట్ కార్యాలయం సమీపంలో దహనం చేసినవి చిత్తు ప్రతులే. మేము దర్యాప్తు చేస్తున్న 5 కేసుల్లో పూర్తి ఆధారాలతో ఇప్పటికే విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో చార్జిషిట్లు దాఖలు చేశాం. ఈ కేసుల కేస్ డైరీలు, ఇతర కీలక ఆధారాలను న్యాయస్థానానికి ఎప్పటికప్పుడు సమర్పించాం. ఆధారాల్లో వేటినీ ధ్వంసం చేయలేదు. ఆధారాలన్నీ భద్రంగా ఉన్నాయి. పూర్తి ఆధారాలతో నమోదు చేసిన ఈ కేసుల్లో దోషులకు శిక్షలు పడటం ఖాయం. ప్రతి కేసులో 40 మంది వరకు నిందితులు ఉన్నారు. ఒక్కో కేసులో ఒక్కో నిందితునికి సంబంధించి దాదాపు 10 వేల పేజీలను ఫొటోస్టాట్ కాపీలు తీయాల్సి వచ్చింది. లక్షలాది పేజీలు కాపీలు తీసే క్రమంలో మెషిన్లు వేడెక్కడం కాగితాలు వాటిలో ఇరుక్కుపోవడం, ఇంకు తగ్గిపోవడం వంటి కారణాలతో చాలా కాపీలు ఫేడ్ అవుట్ అయ్యాయి. వీటిని పక్కనపెట్టేసి కొత్తగా మళ్లీ కాపీలు తీయాల్సి వచ్చింది. ఫేడ్ అవుట్ అయిన వాటిని చిత్తుగా పరిగణించి కాల్చివేశాం. ఇది అన్ని దర్యాప్తు సంస్థల్లో, సాధారణ ఆఫీసుల్లో కూడా పాటించే ప్రక్రియే’ అని సిట్ అధికారులు పేర్కొన్నారు. నిబంధనల ప్రకారమే హెరిటేజ్ ఐటీ రిటర్న్‌లు తీసుకున్నాం హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీ, చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యుల ఆదాయ పన్ను రిటర్న్ కాపీలను అక్రమంగా తీసుకున్నారని, అందుకే వాటిని దహనం చేశారన్న ఎల్లో మీడియా దుష్ప్రచారాన్ని కూడా సిట్ తిప్పికొట్టింది. తాము నిబంధనల ప్రకారమే హెరిటేజ్ ఫుడ్స్, ఇతర నిందితుల ఆదాయ పన్ను రిటర్న్ కాపీలను తీసుకున్నామని తెలిపింది. ఆదాయ పన్ను శాఖకు అధికారికంగా లిఖిత పూర్వకంగా కోరి వారి నుంచి ఆ కాపీలను తీసుకున్నామని చెప్పింది. హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీ నుంచి కూడా అధికారికంగానే లేఖ రాసి మరీ చాలా పత్రాలను తీసుకున్నామంది. ఆ ఐటీ రిటర్న్‌లు, హెరిటేజ్ ఫుడ్స్ నుంచి తీసుకున్న పత్రాల ఆధారంగానే ఈ కేసులో లోకేశ్, ఇతర నిందితులను విచారించామని సిట్ తెలిపింది. ఆ దర్యాప్తు నివేదికను కూడా న్యాయస్థానానికి సమర్పించామని చెప్పింది. ఓ వర్గం మీడియా ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేయడాన్ని సిట్ తీవ్రంగా ఖండించింది. ఆ మీడియా చానళ్లు దుష్ప్రచారాన్ని మాని వాస్తవాలను తెలుసుకోవాలని హితవు చెప్పింది. ‘హెరిటేజ్’కు దీటైన జవాబు ఇచ్చిన సిట్ చంద్రబాబుపై నమోదైన కేసులకు సంబంధించిన తమ కంపెనీ పత్రాల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ హెరిటేజ్ ఫుడ్స్ రాసిన లేఖకు సీఐడీ దీటైన సమాధానం ఇచ్చింది. హెరిటేజ్ ఫుడ్స్‌కు సంబంధించిన పత్రాలపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని, అవన్నీ న్యాయస్థానానికి తాము ఎప్పుడో సమర్పించామని, అన్ని పత్రాలు భద్రంగా ఉన్నాయని స్పష్టం చేసింది. ఈమేరకు సిట్ అధికారులు హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీ సెక్రటరీ ఉమాకాంత బారిక్‌కు సోమవారం ఓ లేఖ రాళారు. తాము హెరిటేజ్ ఫుడ్స్‌కు అధికారికంగా లేఖ ద్వారా కోరి 2022 సెప్టెంబర్ 12 నుంచి 2023 అక్టోబరు 4 వరకు ఏడుసార్లు పొందిన ఆ కంపెనీ పత్రాల వివరాలను వెల్లడించారు. ఆ ఒరిజినల్ పత్రాలను న్యాయస్థానానికి సమర్పించిన వివరాలను సీఎఫ్ఆర్ నంబర్లతో సహా తెలిపారు. ఓ వర్గం మీడియా ఉద్దేశపూర్వకంగా చేసిన దుష్ప్రచారాన్ని ఖండిస్తూ తాము జారీ చేసిన ప్రెస్ నోట్‌ను కూడా ఈ లేఖకు జతపరిచారు. ఆ వర్గం మీడియా రాజకీయ దురుద్దేశాలతో సిట్‌పై చేస్తున్న దుష్ప్రచారంపై ఎన్నికల కమిషన్‌కు చేసిన ఫిర్యాదు కాపీని కూడా హెరిటేజ్ ఫుడ్స్‌కు అందించారు. -
ఎల్లో మీడియా దుష్ప్రచారంపై ఏపీ సీఐడీ సీరియస్
సాక్షి, తాడేపల్లి: ఎల్లో మీడియా చేసే దుష్ప్రచారంపై ఏపీ సీఐడీ సీరియస్ అయింది. ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్‌లో హెరిటేజ్ డాక్యుమెంట్లు తగలబెట్టారంటూ ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడింది. ఫైల్స్ తగలబెట్టారంటూ చేసిన ప్రచారాన్ని సీఐడీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సీఐడీ ఐజీ రఘురామిరెడ్డి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘డాక్యుమెంట్లు కాల్చారంటూ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోంది. కొన్ని ఛానళ్లలో బాధ్యత రహితంగా ప్రచారం చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్డు సహా 5 కేసుల్లో ఛార్జ్ షీట్లు దాఖలు చేశాం. ప్రతి ఛార్జ్ షీట్‌కు 8 వేల నుండి 10 వేల కాపీలతో రూపొందించాం. ప్రతి కేసు ఛార్జ్ షీట్ కాపీలను ప్రతి కేసులో ఉన్న నిందితులకు అందించాం. హెరిటేజ్‌కి సంబంధించిన డాక్యుమెంట్లు అన్ని కోర్టుకి అందజేశాం. హెరిటేజ్ కంపెనీకి చెందిన వ్యక్తుల ఐటీ రిటర్న్స్ వివరాలు కోర్టుకి అందజేశాం. హెరిటేజ్ కంపెనీకి చెందిన వారికి కూడా ఆ డాక్యుమెంట్లు అందించాం’ అని సీఐడీ ప్రకటనతో పేర్కొంది. -
ఫైబర్ నెట్ స్కామ్‌లో నిందితుల ఆస్తుల అటాచ్
సాక్షి, విజయవాడ: ఫైబర్ నెట్ స్కామ్‌లో నిందితుల ఆస్తుల అటాచ్‌మెంట్‌కు ఏపీసీఐడీకి రాష్ట్ర హోంశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఫైబర్ నెట్ స్కామ్‌లో ఏ1గా చంద్రబాబు, ఏ2గా వేమూరి హరికృష్ణ ప్రసాద్, ఏ4గా టెరా సాఫ్ట్ ఎండీ, ఏ5గా తుమ్మల గోపిచంద్ ఉన్నారు. మొత్తం రూ. 17.75 కోట్ల విలువైన ఆస్తుల అటాచ్‌మెంట్‌కు సీఐడీకి అనుమతి లభించింది. ఫైబర్ నెట్ స్కామ్‌లో నిందితులు వేమూరి హరికృష్ణ ప్రసాద్ ఆస్తుల అటాచ్‌మెంట్‌కు సీఐడీకి అనుమతి వచ్చింది. మరో నిందితుడు తుమ్మల గోపిచంద్, తుమ్మల పవన దేవి, తుమ్మల బాపయ్య చౌదరి ఆస్తుల అటాచ్‌మెంట్‌కు కూడా ఏపీ సీఐడీకి అనుమతి లభించింది. నిందితుల ఆస్తుల అటాచ్‌మెంట్‌కు సంబంధించి సీఐడీ.. ఏసీబీ కోర్టు అనుమతి కోరనుంది. చదవండి: Fibernet Scam Case: ఫైబర్‌నెట్ స్కామ్ కేసు.. సీఐడీ చార్జ్‌షీట్‌లో ఏ-1గా చంద్రబాబు -
అసైన్డ్ భూముల కుంభకోణం:చంద్రబాబుపై సీఐడీ ఛార్జ్‌షీట్
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ సీఐడీ చంద్రబాబుపై ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. అసైన్డ్ భూముల కుంభకోణంలో చంద్రబాబుపై ఛార్జ్‌షీట్ దాఖలు చేసినట్లు సోమవారం వెల్లడించింది. రూ.4400 కోట్ల అసైన్డ్ భూముల కుంభకోణం జరిగినట్టు సీఐడీ నిర్ధారించింది. చంద్రబాబు.. అసైన్డ్ భూముల స్కాంలో ప్రధాన ముద్దాయి. చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణ ముద్దాయిగా ఛార్జ్‌షీట్‌లో సీఐడీ పేర్కొంది. 1100 ఎకరాల అసైన్డ్ భూముల కుంభకోణం జరిగినట్టు సీఐడీ తెలిపింది. అమరావతి రాజధానిలో భారీ భూదోపిడీ, క్యాపిటల్ సిటీ ప్లాన్‌తో చంద్రబాబు అండ్ కో భూ దోపిడికి పాల్పడినటట్లు సీఐడీ నిర్ధారించింది. చంద్రబాబు, ఆయన బినామీలు అసైన్డ్ భూములు కాజేసినట్టు సీఐడీ గుర్తించింది.రికార్డులను ట్యాంపరింగ్ చేసి అసైన్డ్ భూముల స్కాం చేసినట్టు సీఐడీ నిర్ధారణ చేసింది. చంద్రబాబు, నారాయణతో పాటుమాజీ తహసీల్దార్ సుధీర్ బాబు, రామక్రిష్ణ హౌసింగ్ లిమిటెడ్ ఎండీ అంజనీ కుమార్ ముద్దాయిలుగా సీఐడీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. చదవండి: అసైన్డ్ భూములు కొట్టేసేందుకు.. ‘నల్ల’మార్గం -
ఫైబర్‌నెట్ స్కామ్ కేసు.. సీఐడీ చార్జ్‌షీట్‌లో ఏ-1గా చంద్రబాబు
అమరావతి: ఏపీ ఫైబర్‌నెట్ స్కామ్ కేసులో సీఐడీ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ మేరకు ఏసీబీ కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేసింది సీఐడీ. ఈ చార్జ్‌షీట్‌లో ఏ-1గా చంద్రబాబు, ఏ-2గా వేమూరి హరికృష్ణ, ఏ-3గా కోగంటి సాంబశివరావులను పేర్కొంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి దోపిడీ పర్వంలో ఫైబర్‌నెట్ కుంభకోణం ఒకటి. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన ఫైబర్ నెట్ ప్రాజెక్టులో పచ్చ ముఠా అడ్డగోలు అవినీతికి పాల్పడింది. మొత్తం రూ.2 వేల కోట్ల ఈ ప్రాజెక్టు కింద మొదటి దశలో రూ.333 కోట్ల విలువైన పనుల్లో అక్రమాలను సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) బట్టబయలు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు, లోకేశ్‌కు సన్నిహితుడైన వేమూరి హరికృష్ణకు చెందిన “టెరా సాఫ్ట్’ కంపెనీకి టెండర్లు కట్టబెట్టారని నిగ్గు తేల్చింది. ఈ మేరకు సీఐడీ.. ఏసీబీ కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఇదీ చదవండి: ఫైబర్‌నెట్‌లోనూ బాబు మార్కు అవినీతి -
రెడ్ బుక్ అంశం: నారా లోకేష్‌కు సీఐడీ నోటీసులు
విజయవాడ: రెడ్‌బుక్ అంశంపై నారా లోకేష్‌కు ఏపీ సీఐడీ నోటీసులు ఇచ్చింది. రెడ్‌బుక్ పేరుతో నారా లోకేష్ బెదిరిస్తున్నారంటూ సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. కోర్టు సూచనల మేరకు సీఐడీ.. లోకేష్‌కు వాట్సాప్‌లో నోటీసులు పంపింది. నోటీసులు అందుకున్నట్లు లోకేష్ వాట్సాప్‌లో సీఐడీకి సమాధానం ఇచ్చారు. లోకేష్‌కు నోటీసులు ఇవ్వడానికి నిన్న(గురువారం) ఇంటికి వెళ్లిన సీఐడీ అధికారులు.. లోకేష్ నోటీసులను నేరుగా తీసుకోకపోవడంతో నేడు(శుక్రవారం) ఆయనకు వాట్సప్‌లో పంపించారు. కాగా, లోకేశ్ అరెస్ట్‌కు అనుమతి ఇవ్వాలన్న సీఐడీ పిటిషన్‌పై విచారణను ఏసీబీ కోర్టు జనవరి9వ తేదీకి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.. టీడీపీ ప్రభుత్వ హయాంలో అవినీతి కేసుల్లో చంద్రబాబుకు రిమాండ్ విధింపును తప్పుబట్టడంతోపాటు కీలక సాక్షులుగా ఉన్న అధికారులను బెదిరిస్తూ వ్యాఖ్యలు చేసిన నారా లోకేష్‌కు నోటీసులు జారీచేయాలని విజయవాడ ఏసీబీ న్యాయస్థానం గురువారం ఆదేశించింది. లోకేష్‌ను అరెస్ట్ చేసేందుకు అనుమతించాలన్న సీఐడీ పిటిషన్‌పై న్యాయస్థానం కీలక ఆదేశాలివ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో 41ఏ నోటీసు కింద సీఐడీ విచారణకు హాజరైన సందర్భంగా విధించిన ఆంక్షలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడం, ఈ కేసుల్లో కీలక సాక్షులుగా ఉన్న అధికారులు, న్యాయస్థానంలో వాంగ్మూలాలు ఇచ్చిన అధికారుల పేర్లను రెడ్‌బుక్‌లో రాశానని.. వారి సంగతి తేలుస్తానని లోకేశ్ ఇటీవల పలు మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూ లలో బెదిరించడం కలకలం రేపింది. చదవండి: నారా లోకేష్‌కు ఎదురుదెబ్బ -
చంద్రబాబు కేసు.. సీఐడీ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో నేడు విచారణ
సాక్షి, ఢిల్లీ: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ స్కాం కేసులో నేడు సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. సుప్రీంకోర్టులో చంద్రబాబుకు బెయిల్ రద్దు చేయాలని ఏపీ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరుగనుంది. ఈ పిటిషన్‌పై జస్టిస్ బేలా త్రివేది , జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఈరోజు చంద్రబాబు కేసు సుప్రీంకోర్టులో ఐటెం నెంబర్ 64గా లిస్ట్ అయ్యింది. అయితే, స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది. హైకోర్టు తీర్పును రద్దు చేయాలని కోరుతూ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ ఎస్ఎల్పీ తేలేంత వరకు హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని పిటిషన్లో కోరింది. ఏపీ సీఐడీ పిటిషన్లో కీలక అంశాలు.. చంద్రబాబుకు బెయిల్ విషయంలో పరిధి దాటింది. సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు నిర్దేశించిన కొలమానాలను హైకోర్టు అతిక్రమించింది కేసు లోతుల్లోకి వెళ్లి క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం చేసింది ట్రయల్ కోర్టును ప్రభావితం చేసేలా ఆ తీర్పు ఉంది మినీ ట్రయల్ నిర్వహణ.. 39 పేజీల తీర్పే ఇందుకు నిదర్శనం దుర్వినియోగం చేసిన నిధులు టీడీపీ ఖాతాల్లోకి వెళ్లాయి అందుకు పూర్తి ఆధారాలున్నా ఏ మాత్రం పట్టించుకోలేదు చంద్రబాబుకు రాజకీయ పలుకుబడి ఉంది.. సాక్షులను బెదిరించడం ద్వారా దర్యాప్తును ప్రభావితం చేస్తారు హైకోర్టు తేల్చిన అంశాలు వాస్తవ విరుద్ధం -
చంద్రబాబుపై మరో కేసు నమోదు
సాక్షి, అమరావతి: చంద్రబాబు నాయుడిపై మరో కేసు నమోదైంది. టీడీపీ హయాంలో ఇసుక అక్రమాలపై కేసు నమోదు చేసింది సీఐడీ. ఏపీఎమ్డీసీ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు సీఐడీ అధికారులు. ఈ కేసులో ఏ-1గా పీతల సుజాత, ఏ-2గా చంద్రబాబు, ఏ-3గా చింతమనేని, ఏ-4గా దేవినేని ఉమాలు ఉన్నారు. ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం చేశారనే ఫిర్యాదుతో సీఐడీ అధికారులు.. చంద్రబాబుపై కేసు నమోదు చేశారు. చంద్రబాబు హయాంలో విచ్చలవిడిగా ఇసుక అక్రమ తవ్వకాలు జరిగాయి. ఆయన ఇంటి పక్కనే అక్రమ తవ్వకాలు జరిగినా చంద్రబాబు పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే ప్రభుత్వానికి చంద్రబాబు రూ. 100 కోట్ల జరిమానా విధించింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్,. ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డుపడ్డ ఓ మహిళా ఎమ్మార్వోపై నాటి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెగబడ్డ దాష్టీకానికి అప్పట్లో యావత్తు రాష్ట్రం విస్తుబోయింది. ఇసుక అక్రమ తరలింపును అడ్డుకున్నందుకు ఎమ్మార్వో వనజాక్షిని చింతమనేని జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్లటం ఎవ్వరూ మరిచిపోలేరు. కాకపోతే ఈ వ్యవహారంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించిన తీరే అన్నిటికన్నా హైలైట్. ఇదేదో గట్టుకింద తగవు మాదిరి... వాళ్లిద్దరినీ కూర్చోబెట్టి రాజీ చేసే సిగ్గుమాలిన ప్రయత్నం చేశారు. అంతేకాని చింతమనేనిపై కేసు పెట్టడానికి మాత్రం చంద్రబాబుకు మనసొప్పలేదు. తవ్వు కోవడం.. దండకోవడం..! చంద్రబాబు హయాంలో ఇసుక దిన్నె(రీచ్)లను గ్రామైక్య సంఘాలకు అప్పగించి, తద్వారా అక్రమ రవాణికు అడ్డుకట్ట వేయాలన్న ప్రభుత్వ నిర్ణయం బెడిసికొట్టింది. అనంతపురం జిల్లాలో మూడు చోట్ల పెన్నా, చిత్రావతి నదుల్లో ఇసుక తవ్వి అమ్ముకోవడానికి ప్రభుత్వం గ్రామైక్య సంఘాలకు అనుమతి ఇవ్వగా, ఇసుక తవ్వకాల్లో కనీస ప్రమాణాలు పాటించకుండా నదుల్లో ఇష్టానుసారం ఇసుక తవ్వేశారు.. చదవండి: తవ్వుకో.. దండుకో..! చంద్రబాబు సాక్షిగానే రెచ్చిపోయారు.. చంద్రబాబు హయాంలో గుంటూరు జిల్లాలో ప్రకృతి సహజ సంపద అయిన ఇసుకను అక్రమంగా దోచేస్తూ అప్పటి అధికార పార్టీ నేతలు జేబులు నింపుకున్నారు. ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా, ధనార్జనే ధ్యేయంగా వీరు డ్రెడ్జర్లు, పొక్లెయినర్లతో ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడ్డారు. ఇసుక అక్రమ దందాలో జిల్లాకు చెందిన టీడీపీ నేత, మాజీ మంత్రి, మరో ఐదుగురు సీనియర్ టీడీపీ నేతలు వారి బంధువులు, అనుచరులు ఇసుక మాఫియా నడుపుతుండటంతో అధికారులు సైతం వీరి జోలికి వెళ్లలేదు. కూలీలను తొలగించి ప్రొక్లయినర్ల ద్వారా ట్రాక్టర్లు, లారీల్లో లోడు చేస్తూ భారీ మొత్తంలో డబ్బు దండుకున్నారు. ఇది చదవండి: పట్టపగలే దోపిడీ చెలరేగిపోయిన ఇసుకమాఫియా చంద్రబాబు హయాంలో ప్రకాశం బ్యారేజీకి దిగువన 50 మీటర్ల దూరంలోనే అడ్డగోలుగా కృష్ణానదిలో ఇసుకను తవ్వేశారు. ఎన్జీటీ ఉత్తర్వులు బేఖాతరు చేసి మరీ ఇసుకను తవ్వేశారు. దాంతో బ్యారేజీకి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారు. ప్రభుత్వ పెద్దల దన్నుతోనే ఇసుక మాఫియా అలా చెలరేగిపోవడం అప్పట్లో విస్మయానికి గురిచేసింది. ఇది చదండి: ప్రకాశం బ్యారేజీకి ముప్పు! చంద్రబాబుపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు -
చంద్రబాబు కన్నింగ్ ప్లాన్.. శ్రీనివాస్ ఎక్కడ?
స్కిల్ స్కాంలో వందల కోట్ల రూపాయలను హవాలా మార్గం ద్వారా లోకేష్‌కు అందించిన కిలారు రాజేష్ నెల రోజులకుపైగా అజ్ఞాతంలో ఉండి హఠాత్తుగా సీఐడీ ముందు ప్రత్యక్షమయ్యాడు. ఒక రోజు విచారణ తర్వాత మళ్లీ మాయం. మరి చంద్రబాబు నాయుడి పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ ఎక్కడ ఉన్నట్లు?. శ్రీను విదేశాలకు చెక్కేశాడా? లేక కిలారు రాజేష్ మాయ మాటలు చెప్పినట్లు అతగాడు కూడా ఏపీలోనో ఢిల్లీలోనో దాగి ఉన్నాడా?. స్కిల్ కార్పొరేషన్లో అసలు కుంభకోణమే జరగలేదని వాదిస్తున్న టీడీపీ నేతలు కానీ.. వారికి వంతపాడే ఎల్లో మీడియా కానీ ఏ తప్పూ జరగకపోతే పెండ్యాల శ్రీనివాస్, కిలారు రాజేష్ ఎందుకు పారిపోయారో? ఎందుకు సీఐడీ నోటీసులు ఇచ్చిన వెంటనే విచారణకు హాజరు కాలేదో చెప్పాలంటున్నారు న్యాయ రంగ నిపుణులు. రూ.371 కోట్లు అవినీతి బాగోతంతో చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం గుడ్డిగా విడుదల చేసిన 371 కోట్ల రూపాయల్లో 241 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని షెల్ కంపెనీల ద్వారా తరలించిన ఘరానా దొంగలు.. ఆ తర్వాత ఆ డబ్బును హవాలా మార్గంలో బాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్.. లోకేష్ సన్నిహిత సహచరుడు కిలారు రాజేష్‌లకు పంపారు. ఆ ఇద్దరూ డబ్బు అందుకున్నట్లు ఇప్పటికే ఆధారాలు వెలికి తీసింది ఈడీ. తాము అందుకున్న డబ్బును వారు చంద్రబాబు, లోకేష్‌లకు అందజేశారని ఆరోపణ. అందులో రూ.27 కోట్ల రూపాయలను చంద్రబాబు అధ్యక్షుడిగా ఉన్న టీడీపీ ఖాతాలో జమ చేసిన ఆధారాలను కూడా సీఐడీ సేకరించి కోర్టు ముందు ఉంచిన సంగతి తెలిసిందే. సీఐడీ ప్రశ్నల వర్షం.. చంద్రబాబు అరెస్ట్‌కు నాలుగు రోజుల ముందు సెప్టెంబరు 5న హవాలా లావాదేవీపైనే విచారించడానికి శ్రీనివాస్‌కు.. లోకేష్ కుడిభుజం కిలారు రాజేష్‌లకు ఏపీ సీఐడీ నోటీసులు అందించింది. అంతే రాత్రికి రాత్రే ఇద్దరూ మాయం అయిపోయారు. ఇద్దరూ విదేశాలకు చెక్కేశారని ప్రచారం జరిగింది. నెల రోజుల తర్వాత నేనిక్కడే ఉన్నా అంటూ కిలారు రాజేష్ సీఐడీ ముందు ప్రత్యక్షం అయ్యాడు. ఇన్ని రోజులూ ఏ కలుగులో దాగున్నావని పోలీసులు అడిగితే రాజేష్ సమాధానం చెప్పలేక నీళ్లు నమిలేశాడు. ఇక రెండో కీలక నిందితుడు పెండ్యాల శ్రీనివాస్ కూడా బయటకు వస్తే దర్యాప్తు మరింత వేగంగా ముందుకు సాగుతుంది. అంతే కాదు, ఆ డబ్బు ఏ ఖాతాలోకి పంపారో కూడా తేలిపోతుంది. అయితే, శ్రీనివాస్ మాత్రం అడ్రస్ లేకుండా పోయాడు. నిజంగానే చంద్రబాబు కానీ.. శ్రీనివాస్ కానీ ఏ పాపం ఎరక్కపోతే, ఏ నేరానికి పాల్పడకపోతే సీఐడీ నోటీసులు ఇచ్చిన మరునాడే విచారణకు హాజరయ్యేవారు. అలా జరగలేదంటే వాళ్లు తప్పు చేసినట్లు రుజువైనట్లే అంటున్నారు నిపుణులు. శ్రీనివాస్ గురించే ఢిల్లీలో ఓ చానెల్ డిబేట్లో నారా లోకేష్ మాట్లాడుతూ శ్రీనివాస్ అర్జంట్‌గా అమెరికాకి పిక్నిక్ వెళ్లాడని చెప్పారు. ఏ పిక్నిక్కు వెళ్లాడు? ఎవరు పంపించారు? తిరిగి ఎప్పుడు రావాలని చెప్పారు? అన్నవి లోకేష్ చెప్పలేదు. కాకపోతే శ్రీనివాస్ కూడా ఎక్కడో దూరాన టీవీల ముందు కూర్చుని చంద్రబాబు అరెస్ట్ తర్వాత తాను భాగస్వామి అయిన కుంభకోణం గురించి కోర్టుల్లో ఏం విచారణ జరుగుతోందో.. తమ గురించి ఏమనుకుంటున్నారో గమనిస్తూనే ఉండచ్చు. కాకపోతే, ఏదో ఒక రోజున కిలారు రాజేష్లానే శ్రీనివాస్ కూడా సీఐడీ ముందు కనిపించి నేను కూడా ఏపీలోనే ఉన్నానని ఓ కథ చెప్పినా చెప్పవచ్చంటున్నారు విశ్లేషకులు. -సీఎన్ఎస్ యాజులు, సీనియర్ జర్నలిస్టు. -
సాక్షి మీడియాపై నారా లోకేష్ అక్కసు
గుంటూరు: ఎప్పుడూ సాక్షి మీడియాపై నోరు పారేసుకునే నారా లోకేష్..మరోసారి తన దురుసు ప్రవర్తనను ప్రదర్శించారు. పదే పదే సాక్షి మీడియాపై తప్పుడు ఆరోపణలు చేయడం పరిపాటిగా మార్చుకున్న నారా లోకేష్.. మళ్లీ అక్కసును ప్రదర్శించాడు. రెండో రోజు సీఐడీ విచారణకు హాజరైన నారా లోకేష్.. విచారణ అనంతరం సాక్షి మీడియాపై అసహనం ప్రదర్శించాడు. సాక్షి మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక రెచ్చిపోయాడు లోకేష్. అరుపులు, కేకలతో సాక్షి మీడియా ప్రతినిధులపై దాడికి దిగాడు. ప్రశ్నలు అడిగితే సాక్షి మీడియా పెట్టుబడులు అంటూ అక్కర్లేని అసంబద్ధ ప్రేలాపనలు చేశాడు లోకేష్. వాలంటీర్లను సాక్షి పేపర్ కొనాలంటూ జీవో ఇచ్చారని తప్పుడు ఆరోపణలకు దిగాడు లోకేష్,. చదవండి: రెండో రోజు సీఐడీ విచారణకు నారా లోకేష్ -
రెండో రోజు సీఐడీ విచారణకు నారా లోకేష్
సాక్షి, గుంటూరు: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణం కేసులో రెండో రోజు నారా లోకేష్‌ను ఏపీ సీఐడీ విచారిస్తోంది. మంత్రి వర్గ ఉప సంఘం నిర్ణయాలపై సీఐడీ వరుస ప్రశ్నలు సంధించింది. లోకేష్‌కు సీఐడీ ప్రశ్నలు ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పుకి ఒత్తిడి చేశారా లేదా?. మీరు మంత్రి అవ్వగానే మంత్రి వర్గ ఉప సంఘంలో ఎందుకు చేర్చారు?. మంత్రి వర్గ ఉప సంఘంలో ఇతర సభ్యులను ఒత్తిడి చేశారా కదా..?. హెరిటేజ్, లింగమనేని, నారాయణ భూములకు లబ్ధి చేసేలా అలైన్మెంట్ ఎందుకు మార్చారు?. ఇన్నర్ రింగ్ రోడ్డు భూసేకరణ పరిహారాన్ని భారీగా పెంచడంలో మీ పాత్ర ఉంది కదా?. భూ సేకరణ వ్యయాన్ని 210 కోట్లు అదనంగా ఎందుకు పెంచారు?. లింగమనేని రమేష్ మీకు ఎందుకు ఇల్లు ఉచితంగా ఇచ్చారు’’ అంటూ లోకేష్‌ను సీఐడీ అధికారులు ప్రశ్నించారు. 5 గంటల పాటు పునీత్‌ను విచారించిన సీఐడీ అధికారులు ఐఆర్ఆర్ అలైన్మెంట్ మార్పు కేసులో మాజీ మంత్రి నారాయణ అల్లడు పునీత్‌ను సీఐడీ అధికారులు ఐదు గంటల పాటు విచారించారు. ఈ విచారణలో భాగంగా సీఐడీ ఎదుట హాజరైన పునీత్‌ను అధికారులు ప్రశ్నించారు. రేపు(గురువారం) మళ్లీ విచారణకు రావాలని పునీత్‌ను అధికారులు ఆదేశించారు. కాగా, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ14గా ఉన్న లోకేశ్.. తొలిరోజు పొంతనలేని సమాధానాలు చెప్పారు. నిన్న ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు సీఐడీ విచారించిన సంగతి తెలిసిందే. లోకేష్‌కు 30 ప్రశ్నలు వేసిన సీఐడీ అధికారులు.. హెరిటేజ్‌లో డైరెక్టర్‌గా ఉన్న సమంయలో లోకేష్ తీసుకున్న నిర్ణయాలపై ప్రశ్నించారు. అయితే, సీఐడీ సంధించిన సూటి ప్రశ్నలకు తత్తరపాటుకు గురై బిత్తరపోవడం లోకేశ్ వంతైంది. మాజీ సీఎం చంద్రబాబు తరహాలోనే ఆయన తనయుడు నారా లోకేశ్ కూడా సీఐడీ దర్యాప్తునకు సహకరించకుండా మొండికేసేందుకు శతవిధాలుగా ప్రయత్నించారు. అయితే సీఐడీ అధికారులు పూర్తి ఆధారాలతో ప్రశ్నించేసరికి తడబాటుకు గురై అసహనం ప్రదర్శించారు. న్యాయస్థానం ఆదేశాలను పాటిస్తూ లోకేశ్‌కు సమీపంలో న్యాయవాది ఉండేందుకు అవకాశం కల్పించి మరీ విచారించారు. ముందుగా సిద్ధం చేసుకున్న ప్రశ్నావళిని బట్టి సీఐడీ అధికారులు ఒక్కో ప్రశ్న అడుగుతూ విచారణ కొనసాగించారు. సుహృద్భావ వాతావరణంలో విచారణ ప్రక్రియ కొనసాగించేందుకు ప్రాధాన్యమిచ్చారు. లోకేశ్ సహకరించడం లేదని స్పష్టమవుతున్నా ఓపిగ్గా ప్రశ్నలు సంధిస్తూ ఆరు గంటల పాటు విచారించారు. చదవండి: తత్తరపాటు.. బిత్తర చూపులు! -
Live: చంద్రబాబు కేసు లైవ్ అప్డేట్స్.. Click & Refresh
LIVE : Chandrababu Arrest, Remand, Cases, Scams And Ground updates 7:01PM, అక్టోబర్ 11, 2023 ►మళ్లీ ఢిల్లీకి నారా లోకేష్ ►గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయల్దేరిన నారా లోకేష్ 6:25 PM, అక్టోబర్ 11, 2023 మళ్లీ ఢిల్లీకి లోకేష్ ► విజయవాడ నుంచి ఢిల్లీకి నారా లోకేష్ ► ఎల్లుండి సుప్రీం కోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ ► పిటిషన్ అంశాలపై న్యాయవాదులతో మాట్లాడతానన్న లోకేష్ 6:20 PM, అక్టోబర్ 11, 2023 మొన్న దోమలు, నిన్న వేడినీళ్లు, నేడు ఉక్కపోత ► పెరిగిపోతున్న చంద్రబాబు డిమాండ్లు ► చంద్రబాబు రాజమండ్రి జైలులో ఇబ్బందిపడుతున్నారు : లోకేష్ ► ఉష్ణోగ్రతలు పెరిగాయి..రాజమండ్రిలో ఉక్కపోత ఎక్కువ ఉంది : లోకేష్ ► వేడి వల్ల చంద్రబాబు డీ హైడ్రేషన్ అవుతోంది : : లోకేష్ ► మాజీ సిఎంగా చంద్రబాబుకు జైల్లో క్లాస్ ఏ సౌకర్యాలు ఇవ్వాలి ► చంద్రబాబుకు అందాల్సిన క్లాస్ ఏ సౌకర్యాలు ఇవ్వాలి : లోకేష్ 6:15 PM, అక్టోబర్ 11, 2023 రింగ్ మాయ.. ఆవుల ముందస్తు బెయిల్ 17న విచారణ ► ఆవుల మునిశంకర్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా ► తదుపరి విచారణను ఈ నెల 17 కు వాయిదా వేసిన ఏపీ హైకోర్టు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన మాజీ మంత్రి నారాయణ బావమరిది ఆవుల మునిశంకర్ 6:15 PM, అక్టోబర్ 11, 2023 PT వారంటుపై రేపు విచారణ ► ఫైబర్ నెట్ పీటీ వారెంట్ పిటిషన్ పై ఏసీబీ కోర్టు విచారణ రేపటికి వాయిదా ► ఏసీబీ కోర్టులో ఫైబర్ నెట్ కుంభకోణంపై స్పెషల్ పీపీ వివేకానంద వాదనలు ► ఫైబర్ నెట్ కుంభకోణంలో చంద్రబాబే ప్రధాన ముద్దాయి ► ఫైబర్ నెట్ స్కాం లో రూ. 115 కోట్ల నిధులు గోల్ మాల్ అయ్యాయని సిట్ దర్యాప్తులో తేలింది ► సిట్ దర్యాప్తు లో చంద్రబాబు పాత్ర బయటపడడంతో కేసు నమోదు ► ఫైబర్ నెట్ స్కాం లో చంద్రబాబు పాత్రను గుర్తించిన తర్వాతే FIR లో చేర్చాం ► టెర్రా సాఫ్ట్ కి అక్రమ మార్గంలో టెండర్లు ఖరారు చేయడానికి అక్రమాలకు పాల్పడ్డారు ► టెర్రా సాఫ్ట్ కోసం నిబంధనలకు విరుద్ధంగా టెండర్ గడువును వారం రోజులు పొడిగించారు ► ఫైబర్ నెట్ స్కాం లో మనీ ల్యాండరింగ్ జరిగినట్లు ఈడీ గుర్తించింది ► చంద్రబాబు సీఎం హోదాను అడ్డుపెట్టుకొని అక్రమాలకు పాల్పడినట్లు ఆధారాలున్నాయి : 6:05 PM, అక్టోబర్ 11, 2023 లోకేషా, జవాబులు చెప్పలేక సాక్షిపై రంకెలా? ► రెండోరోజు ముగిసిన లోకేష్ సిఐడి విచారణ ► ఆరు గంటలపాటు సిఐడి అధికారులు విచారించారు ► ఇవాళ నా ముందు ఒక డాక్యుమెంట్ పెట్టారు ► భువనేశ్వరి ఐటీ రిటర్న్‌లకు సంబంధించి డాక్యుమెంట్ పెట్టారు ► లింగమనేని రమేష్ కు రెంటల్ అడ్వాన్స్ రూ.27 లక్షలు కట్టారని చెప్పారు ► రెంటల్ అడ్వాన్స్ కు సంబంధించి ఐటీ రిటర్న్‌ల్లో లేదని చెప్పారు ► ఐటీ రిటర్న్‌లకు సంబంధించి ఆడిటర్ ను అడగాలని చెప్పా ► ఇంట్లో ఉండి అద్దె చెల్లిస్తే క్విడ్‌ప్రోకో ఎలా అవుతుంది ► ఐఆర్ఆర్కు సంబంధించి నాలుగైదు ప్రశ్నలు అడిగారు ► నా శాఖకు సంబంధించి పలు ప్రశ్నలు పదేపదే అడిగారు ► ఈ కేసులో మరోసారి ఏమైనా లేఖ ఇస్తారా అని అడిగా ► హెరిటేజ్ కొనుగోలు చేసిన 9 ఎకరాలు గూగుల్ ఎర్త్‌లో చూపించారు ► ఐఆర్ఆర్ లో నాకు, కుటుంబసభ్యులకు ఎలాంటి పాత్ర లేదు ► పదేళ్లుగా కుటుంబసభ్యుల ఆస్తుల ప్రజల ముందుంచుతున్నా ► ఒక కంపెనీలో షేర్లు కొన్నందుకు కంపెనీ నిర్ణయాలపై నన్ను ప్రశ్నించారు ► నాకు టిసీఎస్ సహా అనేక కంపెనీల్లో షేర్లు ఉన్నాయి ► సాక్షి మీడియా సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసేందుకు లోకేష్ ప్రయత్నం ► సాక్షి మీడియా : లింగమనేని ఇల్లు మీకెందుకు ఇచ్చారు? ► లోకేష్ : 2019 తర్వాత మేం రూ.27 లక్షల అద్దె చెల్లించాం ► సాక్షి మీడియా : మరి 2014-19 మధ్య కాలంలో అద్దె ఎందుకు చెల్లించలేదు? ► సమాధానం చెప్పకుండా సబ్జెక్ట్ మార్చిన లోకేష్ (ఈ ఇంటిని లింగమనేని ప్రభుత్వానికి ఇచ్చారని గతంలో ప్రకటించిన చంద్రబాబు) ► సాక్షి మీడియా : మీ పాదయాత్రలో అత్యంత క్లోజ్‌గా కనిపించిన కిలారు రాజేష్ నోటీసులు ఇవ్వగానే అమెరికా ఎందుకు పారిపోయారు? ► లోకేష్ : నాకు తెలియని ప్రశ్నలు నన్నెలా అడుగుతారు? చంద్రబాబును అక్రమంగా జైల్లో పెట్టారు ► సాక్షి మీడియా : రిమాండ్ ఇచ్చింది కోర్టులు అయితే.. ప్రభుత్వం జైల్లో పెట్టిందని ఎలా చెబుతారు? ► సమాధానం చెప్పలేక సాక్షి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన లోకేష్ 5:05 PM, అక్టోబర్ 11, 2023 ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుని కూడా విచారించాల్సి ఉంది: స్పెషల్ పిపి వివేకానంద ► ఫైబర్ నెట్ కుంభకోణంలో చంద్రబాబు ప్రదాన ముద్దాయిగా ఏసీబీ కోర్టులో సీఐడీ దాఖలు చేసిన పిటి వారెంట్ పై వాదనలు వినిపించిన స్పెషల్ పిపి వివేకానంద ► ఫైబర్ నెట్ కుంభకోణంలో రూ. 115 కోట్ల నిధులగోల్ మాల్ అయ్యాయని సిట్ దర్యాప్తులో తేలింది ► 2021 లోనే ఫైబర్ నెట్ కుంభకోణంపై 19 మందిపై సీఐడీ కేసు నమోదు చేసింది ► సిట్ దర్యాప్తులో చంద్రబాబు పాత్ర బయటపడడంతో ఆయనపైనా కేసు నమోదు ► ఎ-1 ముద్దాయిగా వేమూరి హరిప్రసాద్, మాజీ ఎండి సాంబశివరావు ఏ-2గా, చంద్రబాబు ఏ-25గా ఎఫ్ఐఆర్ నమోదు అయింది ► ఫైబర్‌నెట్ కుంభకోణంలో చంద్రబాబు పాత్రని గుర్తించిన తర్వాతే ఎఫ్ఐఆర్లో చేర్చాం ► టెర్రా సాఫ్ట్‌కి అక్రమ మార్గంలో టెండర్లు ఖరారు చేయడానికి అక్రమాలకి పాల్పడ్డారు ► టెర్రా సాఫ్ట్ కోసం నిబంధనలకి విరుద్దంగా టెండర్ గడువుని వారం రోజులు పొడిగించారు ► బ్లాక్ లిస్ట్ లో ఉన్న టెర్రా సాఫ్ట్‌కి టెండర్ దక్కేలా అక్రమాలకి పాల్పడ్డారు ► ఫైబర్ నెట్ లో ఫేజు-1 లో 320 కోట్లకి టెండర్లు పిలిస్తే 115 కోట్ల అవినీతి జరిగింది ► టెర్రా సాప్ట్ కి టెండర్లు కట్టబెట్టేందుకు నిబంధనలు పక్కన పెట్టారు ► సివిల్ సప్లైస్ శాఖకి నాసిరకం ఇ- పోస్ మిషన్లు పంపిణీ చేసినందుకు టెర్రా సాఫ్ట్ ని బ్లాక్ లిస్ట్ లో పెట్టారు ► బ్లాక్ లిస్ట్‌లో ఉన్న టెర్రా సాఫ్ట్ ని రెండు నెలలు కూడా పూర్తి కాకుండానే బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించారు ► నిబంధనలకి విరుద్దంగా అప్పటి సివిల్ సప్లైస్ డైరక్టర్ రవిబాబు టెర్రా సాఫ్ట్ ని బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించారు ► టెర్రా సాఫ్ట్‌ని బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించాలని చంద్రబాబు ఒత్తిడి తెచ్చారు ► టెర్రా సాఫ్ట్‌కి టెండర్లు కట్టబెట్టేందుకు పలు అక్రమాలకు పాల్పడ్డారు ► టెర్రా సాఫ్ట్‌తో కన్సార్టియంలో భాగమైన హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ కంపెనీ ► టెండర్లు దక్కించుకున్న తర్వాత టెర్రా సాఫ్ట్ నుంచి హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ కంపెనీని నిబంధనలకి విరుద్దంగా బయటకి పంపించారు ► తమని మోసం చేసి నిబంధనలకి విరుద్దంగా మరొక కంపెనీ నుంచి రూ. 115 కోట్ల నాసిరకం మెటీరియల్‌ని టెర్రా సాఫ్ట్ కొనుగోలు చేసి ఫైబర్ నెట్ కి సరఫరా చేసినట్లు వాంగ్మూలమిచ్చిన హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ ► ఇప్పటికే హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ అనీల్ జైన్ స్టేట్మెంట్ రికార్డు చేసిన సీఐడీ ► ఈ కేసులో చంద్రబాబుని కూడా విచారించాల్సి ఉంది ► చంద్రబాబు సీఎం హోదాని అడ్డుపెట్టుకుని అక్రమాలకి పాల్పడినట్లు ఆధారాలున్నాయి ► ఫైబర్ నెట్ కేసులో పిటి వారెంట్ అనుమతించండి 4:10 PM, అక్టోబర్ 11, 2023 చంద్రబాబు పిటిషన్ డిస్మిస్ ► చంద్రబాబు లాయర్లు వేసిన రైట్ టు ఆడియెన్స్ పిటిషన్ డిస్మిస్ ► రైట్ టు ఆడియెన్స్ పిటిషన్ ను డిస్మిస్ చేసిన ఏసీబీ కోర్టు ► చంద్రబాబుపై పెండింగ్ లో ఉన్న పీటీ వారెంట్ల పై విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు ► హైకోర్టు ఆదేశాలు, జరిగిన పరిణామాలను జడ్జికి వివరించిన ఇరుపక్షాల లాయర్లు ► కేసు వివరాలు, ఎంత మందిని అరెస్ట్ చేశామన్న విషయాన్నీ జడ్జికి వివరించిన సీఐడీ లాయర్ వివేకా 3:10 PM, అక్టోబర్ 11, 2023 తప్పు చేయలేదని కాకుండా అరెస్ట్ గురించి వాదిస్తారా? : చంద్రబాబు తీరుపై సజ్జల విమర్శలు ► చంద్రబాబు అరెస్టు అయి నెల దాటింది ► రెండు పక్షాల వాదనలు విన్న తర్వాత స్కాం ఆధారాలు ఉన్నాయని కోర్టు నమ్మి రిమాండ్ వేసింది ► చంద్రబాబును ప్రోటోకాల్ ప్రకారం అరెస్టు చేయలేదనే ఆయన లాయర్లు, ఆ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు ► అంతేతప్ప నేరం జరగలేదని ఒక్క ఆధారం కూడా చూపించలేక పోయారు ► రూ.3,300 కోట్ల ప్రాజెక్టు అని క్యాబినెట్ ఆమోదం పొంది, జీవోలలో మొత్తం మార్చేశారు ► అసలు రూ.3వేల కోట్ల ప్రాజెక్టు వస్తే రూల్స్ ప్రకారం ఏందుకు వ్యవహరించలేదు? ► ఫైనాన్స్ విభాగం కూడా ఇందులో తప్పులు ఉన్నాయని చెప్పినా వినిపించుకోలేదు ► దీనిపై ఎలాంటి స్టడీ చేయకుండా డబ్బు ఎలా రిలీజ్ చేశారు? ► ఆ ప్రాజెక్టుతో సంబంధం లేదని సీమెన్స్ కూడా చెప్పారు? ► ఈ ప్రాజెక్టు మొత్తం కుట్రపూరితంగా జరిగిందనేందుకు అనేక సాక్ష్యాలు ఉన్నాయి ► ఇవన్నీ చూశాకనే చంద్రబాబును అరెస్టు చేశారు ► సుదీర్ఘ విచారణ జరిగాకనే ఈడీ కూడా కొందరిని అరెస్టులు చేసింది ► అన్ని వేళ్లూ చంద్రబాబు పైనే చూపిస్తున్నాయి ► కోర్టుకు సీఐడీ ఆధారాలు చూపించటం వలనే రిమాండ్ కు పంపింది ► విచారణ జరిగితే అన్ని వాస్తవాలు బయటకు వస్తాయని కప్పిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ► పెండ్యాల శ్రీనివాస్, కిలారి రాజేష్ ల ద్వారా చంద్రబాబుకు డబ్బు ఎలా చేరిందో ఆధారాలు దొరికాయి ► అందుకే కొందరిని దేశం దాటించారు ► ఈ కుట్రలో పాత్రధారి, సూత్రధారి చంద్రబాబే ► ఈ విషయాల గురించి మాట్లాడకుండా 17A గురించి కోర్టులో వాదిస్తున్నారు ► రెండు ఎకరాల నుండి లక్షల కోట్లకు ఎలా ఎదిగిందీ అందరికీ తెలుసు ► కానీ టెక్నికల్ ఆధారాలు చూపించి కేసుల నుండి జారుకునేవారు ► ఐతే స్కిల్ స్కాం కేసులో పక్కా ఆధారాలు దొరికాయి ► ప్రజాకోర్టులో కూడా చంద్రబాబు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి ► ప్రజలు కూడా చంద్రబాబు మోసాలపై నిలదీయాలి ► టీడీపీ నేతలు కూడా బయటకు వచ్చి మాట్లాడాలంటే సిగ్గు పడుతున్నారు ► లోకేష్ కూడా ఢిల్లీ వెళ్లి కూర్చుంటారు ► రాజధాని పేరుతో వేల ఎకరాల భూములను కూడా అలాగే కొట్టేశారు ► రైతులను, ప్రజలను నిలువునా మోసం చేశారు ► ఆయన మనమడికి కూడా లక్షల కోట్ల ఆస్తిని సిద్ధం చేయాలని ప్లాన్ వేశారు ► రింగ్ రోడ్డు స్కాంలో కూడా ఇలాంటి కుట్రే చేశారు ► వ్యవస్థలను మేనేజ్ చేయగలమనే ధీమాతో ఢిల్లీ నుండి కిందివరకు వ్యవహరిస్తున్నారు ► జైల్లో ఉండి కూడా బాబు రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారనటం పెద్ద జోక్ ► టిడిపి లీడర్లు ఇలాంటి దిగజారిన స్టేట్మెంట్లు ఇచ్చి జుగుప్స కలిగిస్తున్నారు ► లోకేష్ ఢిల్లీలో ఉంటే ఒక్క జాతీయ పార్టీ ఐనా సానుభూతి చూపిందా? ► అడ్డంగా దొరికిన దొంగకి ఎవరు సపోర్టు చేస్తారు? ► రాజమండ్రి జైల్లో చంద్రబాబుకు మంచి భద్రత ఉంది 3:02 PM, అక్టోబర్ 11, 2023 చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ ► చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో వాదనలు ► ఇన్నర్ రింగ్‌రోడ్డు, అంగళ్లు కేసుల్లో విచారణకు చంద్రబాబు సహకరిస్తాడని చెప్పిన బాబు లాయర్లు ► చంద్రబాబును అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న దమ్మాలపాటి ► సీఐడీ, హోంశాఖతో మాట్లాడి చెప్పాలని ప్రభుత్వ న్యాయవాదులను కోరిన కోర్టు ► ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో సోమవారం వరకు చంద్రబాబును అరెస్ట్ చేయొద్దన్న కోర్టు ► అంగళ్లు కేసుల్లో రేపటి వరకు చంద్రబాబును అరెస్ట్ చేయొద్దన్న కోర్టు ► ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో పీటీ వారెంట్, పోలీస్ కస్టడీ పై ఎలాంటి ఆదేశాలు ఇవ్వొద్దని ఏసీబీ కోర్టుకు హైకోర్టు ఆదేశాలు 3:00 PM, అక్టోబర్ 11, 2023 మన వాళ్లు బ్రీఫ్డ్ మీ.. బాబును వెంటాడుతున్న పాపాలు ► సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు ► చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని 2017లో సుప్రీంకోర్టులో ఎమ్మెల్యే ఆళ్ల పిటిషన్ ► ఓటుకు నోటు కేసు సీబీఐకి బదిలీ చేయాలని మరో పిటిషన్ ► తమ లాయర్ లూథ్రా అందుబాటులో లేరని చెప్పిన చంద్రబాబు లాయర్ ► విచారణ 4 వారాలు వాయిదా వేయాలని కోరిన బాబు లాయర్ ► అభ్యంతరం వ్యక్తం చేసిన ఆళ్ల రామకృష్ణా రెడ్డి తరఫు న్యాయవాది ► త్వరలోనే విచారణ తేదీని ఖరారు చేస్తామన్న సుప్రీంకోర్టు 2:55 PM, అక్టోబర్ 11, 2023 తప్పు చేసి.. రాజకీయ కక్ష అంటారా? : సజ్జల ► చంద్రబాబు అరెస్ట్ పై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు ► స్కిల్ స్కామ్ లో చంద్రబాబు సాక్ష్యాధారాలతోనే అరెస్టు అయ్యారు ► చంద్రబాబు అరెస్టు లో కక్ష సాధింపు ఎక్కడ ఉంది ? ► నేరం జరగలేదని చంద్రబాబు నిరూపించగలరా ? ► రూ. 300 కోట్లకు పైగా ప్రజాధనాన్ని చంద్రబాబు దుర్వినియోగం చేశారు ► ఊరు, పేరు లేకుండా అగ్రిమెంట్ తయారు చేసుకున్నారు ► సీమెన్స్ సైతం మాకు సంబంధం లేదని చెప్పింది ► ఫేక్ ఇన్వాయిస్ లతో నిధులు పక్కదారి పట్టించారు ► నిందితుల్లో ఇద్దరు విదేశాలకు పారిపోయారు ► ఈ స్కామ్ కు సూత్రధారి, లబ్ధిదారు చంద్రబాబే : సజ్జల 2:50 PM, అక్టోబర్ 11, 2023 ఏపి హైకోర్టుకు కొత్త జడ్జిల నియామకం ► ఏపి హైకోర్టుకు నలుగురు కొత్త జడ్జిలను నియమించిన సుప్రీంకోర్టు ► జడ్జిలుగా సీనియర్ న్యాయవాదులు హరినాథ్ , కిరణ్మయి, సుమిత్, విజయ్‌లు ► ఉత్తర్వులు జారీ చేసిన సుప్రీంకోర్టు కొలీజియం 2:40 PM, అక్టోబర్ 11, 2023 హైకోర్టులో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు ► ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పై వాదనలు ► ఏసిబీ కోర్టులో పీటీ వారెంట్ పెండింగ్ లో ఉందన్న ఏజీ శ్రీరామ్ ► ఈ దశలో చంద్రబాబుకు మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వొద్దన్న ఏజీ శ్రీరామ్ ► ఈ కేసులో చంద్రబాబును అరెస్టు చూపించే అవకాశం ఉందన్న బాబు తరపు లాయర్ దమ్మాలపాటి శ్రీనివాస్ ► చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరిన దమ్మాలపాటి శ్రీనివాస్ 2:10 PM, అక్టోబర్ 11, 2023 ఢిల్లీ: చంద్రబాబు ఓటుకు కోట్లు కేసు విచారణ వాయిదా ►సీనియర్ లాయర్ సిద్ధార్థ్ లూథ్రా అందుబాటులో లేరు ►4 వారాలు వాయిదా వేయాలని కోరిన బాబు తరపు న్యాయవాది ►విచారణ తేదీని ఖరారు చేస్తామన్న ధర్మాసనం 2:01 PM, అక్టోబర్ 11, 2023 కాసేపట్లో చంద్రబాబు పిటీ వారెంట్లపై ఏసీబీ కోర్టులో విచారణ ►ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్ కుంభకోణాలపై సీఐడీ వేసిన వారెంట్లపై వాదనలు విననున్న ఏసీబీ కోర్టు 1:49 PM, అక్టోబర్ 11, 2023 ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్న ఏజీ శ్రీరామ్ ►చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ ►ఐఆర్ఆర్, అంగళ్లు కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్లు ►ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్‌పై తీర్పు పెండింగ్‌లో ఉంది: ఏజీ ►కాబట్టి మధ్యంతర బెయిల్ ఇవొద్దు ►మధ్యాహ్నం 2.15కి వాదనలు వింటానన్న ధర్మాసనం 12:35 PM, అక్టోబర్ 11, 2023 చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ ►రింగ్‌రోడ్డు, అంగళ్లు కేసుల్లో విచారణకు సహకరిస్తామన్న చంద్రబాబు న్యాయవాదులు ►చంద్రబాబును అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న దమ్మాలపాటి ►సీఐడీ, హోంశాఖతో మాట్లాడి చెప్పాలని ప్రభుత్వ న్యాయవాదులను కోరిన కోర్టు ►పిటిషన్లపై మధ్యాహ్నం విచారణ చేపడతామన్న హైకోర్టు 12:33 PM, అక్టోబర్ 11, 2023 సెలవులో రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ ►రేపటి నుంచి 4 రోజులు సెలవు తీసుకోనున్న రాహుల్ ►ఇంఛార్జ్ సూపరింటెండెంట్‌గా డిప్యూటీ సూపరింటెండెంట్ రాజ్‌కుమార్‌కు బాధ్యతలు 11:45 AM, అక్టోబర్ 11, 2023 లోకేష్‌కు సీఐడీ ప్రశ్నలు ►రెండో రోజు కొనసాగుతున్న నారా లోకేష్ సీఐడీ విచారణ ►మంత్రి వర్గ ఉప సంఘం నిర్ణయాలపై సీఐడీ వరుస ప్రశ్నలు ►ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పుకి ఒత్తిడి చేశారా లేదా? ►మీరు మంత్రి అవ్వగానే మంత్రి వర్గ ఉప సంఘంలో ఎందుకు చేర్చారు? ►మంత్రి వర్గ ఉప సంఘంలో ఇతర సభ్యులను ఒత్తిడి చేశారా కదా..? ►హెరిటేజ్, లింగమనేని, నారాయణ భూములకు లబ్ధి చేసేలా అలైన్మెంట్ ఎందుకు మార్చారు? ►ఇన్నర్ రింగ్ రోడ్డు భూసేకరణ పరిహారాన్ని భారీగా పెంచడంలో మీ పాత్ర ఉంది కదా? ►భూ సేకరణ వ్యయాన్ని 210 కోట్లు అదనంగా ఎందుకు పెంచారు? ►లింగమనేని రమేష్ మీకు ఎందుకు ఇల్లు ఉచితంగా ఇచ్చారు ►లింగమనేనికి మేలు చేసినందుకే మీకు ఇంటిని క్విడ్ ప్రోకోలో ఇచ్చారు కదా? ►ఇన్నర్ రింగ్ రోడ్ కాంట్రాక్ట్ వ్యయాన్ని అదనంగా పెంచేందుకు సిఫార్స్ చేశారా? 11:45 AM, అక్టోబర్ 11, 2023 చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ ►ఇన్నర్ రింగ్‌రోడ్డు, అంగళ్లు కేసులో మధ్యాహ్నం 12 గంటల తర్వాత వాదనలు వింటామన్న హైకోర్టు 11:19 AM, అక్టోబర్ 11, 2023 ఐఆర్ఆర్ కేసులో సీఐడీ విచారణకు నారాయణ అల్లుడు పునీత్ ►ఐఆర్ఆర్లో నారా లోకేష్, పునీత్ మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు సీఐడీ గుర్తింపు ►ఐఆర్ఆర్ కేసులో విచారణకు హాజరుకావాలని ఈ నెల 6న సీఐడీ నోటీసులు 10:10 AM, అక్టోబర్ 11, 2023 రెండో రోజు విచారణకు లోకేశ్ ►నారా లోకేశ్‌ను రెండో రోజు విచారిస్తున్న ఏపీ సీఐడీ ►సిట్ కార్యాలయంలో నారా లోకేశ్. ►ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ14గా నారా లోకేశ్. ►తొలిరోజు నారా లోకేశ్ పొంతనలేని సమాధానాలు. ►సీఐడీ విచారణకు హాజరైన మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్ 09:58 AM, అక్టోబర్ 11, 2023 చంద్రబాబు పై సీఐడీ పీటీ వారెంట్ల పై నేడు విచారణ ►నేడు విచారించనున్న విజయవాడ ఏసీబీ కోర్టు ►విచారణ అనంతరం ఆర్డర్ ఇవ్వనున్న న్యాయమూర్తి ►ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్ కేసుల్లో పీటీ వారెంట్లు 09:56 AM, అక్టోబర్ 11, 2023 మాజీమంత్రి నారాయణ బంధువు ముందస్తు బెయిల్ పిటిషన్ ►మునీశంకర్ బెయిల్‌పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ ►IRR కేసులో నిందితుడిగా చేరుస్తూ సీఐడీ పిటిషన్ 09:50 AM, అక్టోబర్ 11, 2023 సిట్ కార్యాలయానికి బయల్దేరిన నారా లోకేష్ ►రెండో రోజు లోకేష్‌ను ప్రశ్నించనున్న సీఐడీ ►ఐఆర్ఆర్ కేసులో లోకేష్‌ను విచారించనున్న అధికారులు ►నిన్న ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు విచారించిన సీఐడీ ►నిన్న లోకేష్‌కు 30 ప్రశ్నలు వేసిన సీఐడీ అధికారులు ►హెరిటేజ్‌లో డైరెక్టర్‌గా ఉన్న సమంయలో లోకేష్ తీసుకున్న నిర్ణయాలపై ప్రశ్నించిన సీఐడీ ►నేడు లోకేష్‌తో పాటు విచారణకు మాజీమంత్రి నారాయణ అల్లుడు, లోకేష్, పునీత్‌ను వేర్వేరుగా విచారించనున్న సీఐడీ 09:14 AM, అక్టోబర్ 11, 2023 జైల్లో ఆరోగ్యంగానే ఉన్న చంద్రబాబు ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో 32వ రోజు రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు ►చంద్రబాబు పూర్తిస్థాయిలో జైల్లో భద్రత ►చంద్రబాబు స్వల్ప అస్వస్థత గురయ్యారని డీహైడ్రైజేషన్ లోనయ్యారని పచ్చ మీడియా హడావిడి ►ఎండ ఎక్కువగా ఉండటంతో ఇబ్బందిగా ఉందని వైద్యాధికారికి చెప్పిన చంద్రబాబు ►దాంతో చంద్రబాబుకు మూడుసార్లు వైద్య పరీక్షలు జరిపిన జైలు అధికారులు ►ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని స్పష్టం చేసిన అధికారులు 08:13 AM, అక్టోబర్ 11, 2023 చంద్రబాబు పిటి వారెంట్లపై ఏసీబీ కోర్టులో నేడు విచారణ ►ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్ కుంభకోణాలపై సీఐడీ వేసిన పిటి వారెంట్లపై వాదనలు విననున్న ఏసీబీ కోర్టు ►నిన్న ఏసీబీ న్యాయమూర్తి సెలవు కావడంతో విచారణ నేటి మధ్యాహ్నానికి వాయిదా ►రైట్ టు ఆడియన్స్ పిటీషన్ ప్రకారం తమ వాదనలు వినాలని పట్టుబట్టిన చంద్రబాబు న్యాయవాదులు ►పిటి వారెంట్లలో రైట్ టు ఆడియన్స్ పిటీషన్ వర్తించదంటున్న సీఐడీ తరపు న్యాయవాదులు ►రైట్ టు ఆడియన్స్ పిటీషన్ వర్తిస్తుందా లేదా అనేది నిర్ణయించనున్న కోర్టు ►నేటి మధ్యాహ్నం 2.30 గంటల ప్రారంభం కానున్న వాదనలు ►చంద్రబాబు బెయిల్ పిటీషన్ తిరస్కరించిన ఏసీబీ కోర్టు ►కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున చంద్రబాబుకి బెయిల్ ఇవ్వద్దని వాదనలు వినిపించిన సీఐడి న్యాయవాదులు ►చంద్రబాబు సాక్షులని ప్రభావితం చేస్తున్నారని వాదనలు వినిపించిన ఏఏజీ పొన్నవోలు ►సీఐడీ తరపు న్యాయవాదుల వాదనలతో ఏకీభవిస్తూ చంద్రబాబు బెయిల్ పిటీషన్ తిరస్కరించిన ఏసీబీ కోర్టు 07:31 AM, అక్టోబర్ 11, 2023 అత్యవసర విచారణ కుదరదు ►సాధారణ పద్ధతిలోనే ఆ పిటిషన్లను విచారణ చేస్తాం ►ఐఆర్ఆర్, అంగళ్లు కేసుల్లో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టు.. నేడు విచారణ ►నారాయణ, ఆయన బావ మరిది పిటిషన్లపై నేడు విచారణ 07:13 AM, అక్టోబర్ 11, 2023 సీఐడీ విచారణకు చంద్రబాబు సహకరించాలి: మంత్రి తానేటి వనిత ►అప్పుడే నిజాలు బయటకు వస్తాయి ►కేసుల్లో తీవ్రత ఉంది కాబట్టే బెయిల్ రావడం లేదు ►కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు.. బాబు తప్పు చేయలేదని చెప్పలేకపోతున్నారు ►చంద్రబాబును మోయడం తప్ప పవన్ కళ్యాణ్‌కు మరే ఎజెండా లేదు 07:04 AM, అక్టోబర్ 11, 2023 అన్నిటా బాబు బాటలోనే.. ►అవినీతికి పాల్పడటంలోనే కాదు.. సీఐడీ దర్యాప్తునకు సహకరించని లోకేష్ ►మొండికేయడంలో తండ్రి చంద్రబాబు బాటనే అనుసరించిన లోకేశ్ ►విచారణను తప్పించుకునేందుకు బెడిసికొట్టిన యత్నాలు ►అనివార్యంగా లోకేశ్ సీఐడీ ఎదుట హాజరు ►సీఐడీ అధికారులు ఏ ప్రశ్న అడిగినా తనకు తెలీదనే సమాధానం 06:57 AM, అక్టోబర్ 11, 2023 తెలుగు యువత నాయకుల అత్యుత్సాహం ►సీఐడీ సిట్ కార్యాలయం గోడలు దూకేందుకు ప్రయత్నం ►అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదం ►ఏడుగురిని పోలీస్‌స్టేషన్‌కు తరలించిన పోలీసులు 06:47 AM, అక్టోబర్ 11, 2023 తత్తరపాటు.. బిత్తర చూపులు! ►ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమాలపై సీఐడీ ►విచారణలో లోకేశ్ తడబాటు.. అసహనం ►అబ్బే నాకేం తెలీదు... మరి ఈ సంతకాలు మీవే కదా? ►ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమాలపై ప్రశ్నించిన అధికారులు ►హెరిటేజ్ భూముల కొనుగోలు దందాపై ప్రశ్నల వర్షం ►సంతకాలతో సహా ఆధారాలను చూపిస్తూ సూటిగా ప్రశ్నలు ►కలవరపాటుతో న్యాయవాదులతో చినబాబు మంతనాలు ►ఆరు గంటల పాటు విచారణ.. నేడు మరోసారి విచారణ చంద్రబాబు అవినీతి చేశాడా లేదా ? సీమెన్స్ వాళ్ళు ఇస్తామన్న రూ.3,000 కోట్లు ఇచ్చారా ? ఇస్తే ఏమయ్యాయి. వీటికి రామోజీ, టీడీపీ సమాధానం చెప్పాలి.#BanYellowMediaSaveAP#GajadongaChandrababu#SkilledCriminalCBNInJail #CorruptionKingCBN pic.twitter.com/yzjhFzOVbq — YSR Congress Party (@YSRCParty) October 10, 2023 -
సీఐడీ కార్యాలయంలో నారా లోకేష్
అమరావతి: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు విచారణలో భాగంగా తాడేపల్లి సమీపంలోని పాతూరు రోడ్డులో ఉన్న సిట్ కార్యాలయానికి చేరుకున్న టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ను సీఐడీ ప్రశ్నిస్తోంది. ఈరోజు సాయంత్రం ఐదు గంటల వరకూ లోకేష్‌ను సీఐడీ విచారించనుంది. ఇన్నర్‌రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పుపై లోకేష్‌ను విచారించేందుకు సీఐడీకి హైకోర్టు అనుమతినిచ్చింది. దీనిలో భాగంగా నిన్న(సోమవారం) మంగళగిరికి చేరుకున్నారు లోకేష్. కోర్టు ఉత్తర్వుల ప్రకారం మంగళవారం ఉదయం 10గంటలకు సీఐడీ ఎదుట నారా లోకేష్ హాజరు కావాల్సి ఉంది. కాగా, చంద్రబాబు అరెస్ట్ తర్వాత.. న్యాయ నిపుణులతో చర్చ పేరిట ఢిల్లీకి నారా లోకేష్ వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే లోకేష్‌కు ఢిల్లీ వెళ్లి మరీ నోటీసులిచ్చారు సీఐడీ అధికారులు. ఇన్నర్‌రింగ్ రోడ్ కేసులో ఏ-14గా ఉన్నారు లోకేష్ రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ అక్రమాల కేసులో ఈనెల 10వ తేదీన సీఐడీ అధికారుల ఎదుట విచారణకు స్వయంగా హాజరు కావాలని మాజీ మంత్రి నారా లోకేశ్‌ను హైకోర్టు ఆదేశించింది. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ లోకేష్‌ను విచారించవచ్చన్న హైకోర్టు.. మధ్యాహ్నం గంట పాటు భోజన విరామం ఇవ్వాలని సూచించింది. విచారణ సమయంలో లోకేశ్ కనిపించేంత దూరం వరకు మాత్రమే న్యాయవాదిని అనుమతించాలని నిర్దేశించింది. విచారణకు వచ్చేటప్పుడు నిర్దిష్ట డాక్యుమెంట్లు తీసుకురావాలని లోకేష్‌ను ఒత్తిడి చేయబోమని సీఐడీ చెప్పిన విషయాన్ని హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. సీఆర్పీసీ సెక్షన్ 41 ఏ కింద నోటీసులకు అనుగుణంగా విచారణకు హాజరు కావాలని లోకేశ్‌కు స్పష్టం చేసింది. -
Oct 10th 2023 : చంద్రబాబు కేసు అప్డేట్స్
LIVE : Chandrababu Arrest, Remand, Cases, Scams And Ground updates 07:31PM, అక్టోబర్ 10, 2023 చంద్రబాబు పాపాలు పండాయి ►కేసు క్లోజ్ చేసుకోవాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నాడు ►టెక్నికల్ అంశాలతో చంద్రబాబుకి రిలీఫ్ రాదు ►మేం అధికారంలోకి వచ్చిన ఆర్నెల్లలోనే చంద్రబాబును జైల్లో పెట్టలేదు ►చంద్రబాబు ఏరకమైన దోపిడీకి శ్రీకారం చుట్టాడో అన్ని డాక్యుమెంట్లు పరిశీలించాం ►చంద్రబాబు ప్రమేయం ఉందని తేలాకే అరెస్టు చేశారు ►చంద్రబాబు దోపిడీని కూడా కోర్టులు నమ్మాయి ►ముందస్తు బెయిల్స్ , క్వాష్ పిటిషన్ వేస్తే కోర్టులు కొట్టేశాయి ►అవినీతి , తప్పు చేయలేదని చంద్రబాబు ఎక్కడా చెప్పడం లేదు ►17ఏ ప్రకారం తనను అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి తీసుకోవాలనే అంటున్నాడు ►కోట్లు తీసుకునే చంద్రబాబు ఢిల్లీ లాయర్లు కూడా అదే చెబుతున్నారు ►చంద్రబాబు తన జీవితంలో 18 కేసుల్లో స్టేలు తెచ్చుకున్నాడు ►కేవలం టెక్నికల్ అంశాలను బేస్ చేసుకుని స్టేలు తెచ్చుకుంటాడు ►2016లోనే స్కిల్ స్కామ్ మీద సీఐడీ వాళ్లు ఎఫ్ఐఆర్ వేశారు ►ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు ఆపుకుంటూ వచ్చాడు ►చంద్రబాబు రెండెకరాలతో రాజకీయ జీవితం ప్రారంభించాడు ►హెరిటేజ్ లో 2 శాతం షేర్లు అమ్మితే 400 కోట్లు వస్తాయని భువనేశ్వరి చెబుతున్నారు ►హెరిటేజ్ ఆస్తుల విలువ 20 వేల కోట్లని భువనేశ్వరి స్వయంగా ప్రజలకు చెప్పారు ►ఒక్క హెరిటేజ్ లో 20 వేల కోట్లు వైట్ మనీ ఐతే ... 70 వేల కోట్లు బ్లాక్ మార్కెట్ ఉంటుంది ►చంద్రబాబుకు కొండాపూర్ , మాదాపూర్ , అమరావతి , సింగపూర్ , దుబాయ్ లో లక్షల కోట్ల రూపాయల ఆస్తులున్నాయి ► వినేవాడుంటే చంద్రబాబు హరికథ ఇంగ్లీష్ లో చెబుతాడు ►ఈ రాష్ట్రంలో అత్యంత అవినీతి పరుడు చంద్రబాబు ►రెండెకరాల పొలం నుంచి లక్షల కోట్లు సంపాదించిన వ్యక్తి చంద్రబాబు ►చంద్రబాబు పాపాలు పండాయి.. ఇప్పుడు బయట పడ్డాయి ►తన 14 ఏళ్ల పరిపాలన చూసి ఓటేయమని చెప్పే దమ్ము చంద్రబాబుకు ఉందా ►నేను మంచి చేశానని నమ్మితేనే ఓటేయమని అడిగే దమ్మున్న నాయకుడు జగన్ మోహన్ రెడ్డి :::మాజీ మంత్రి,కొడాలి నాని కామెంట్స్ 07:03PM, అక్టోబర్ 10, 2023 సీఎం జగన్ ప్రకటించినా.. ఏడుపే: YSRCP ►చంద్రబాబుపై తనకి ఎలాంటి కక్ష లేదన్న సీఎం వైఎస్ జగన్ ►బహిరంగంగా ప్రకటించినా టీడీపీ ఏడుపు ►2019లో చిత్తుగా ఓడిన తర్వాత టీడీపీ, బాబు అంపశయ్యపైకి ► ఎల్లో మీడియా కష్టపడి జాకీలేసి లేపే ప్రయత్నం చేసినా.. అవినీతి బయటపడి మరింత పాతాళంలోకి ►నిజంగా బాబుపై కక్ష సాధించాలనుకుంటే..? అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగేళ్లు ఎదురుచూడాలా..? ► మీ బాబు నిప్పు.. తుప్పు అని ఎగిరెగిరి పడుతున్నారు కదా..? ► మరి.. క్వాష్ పిటీషన్లు వేసి పరువు తీసుకోవడం ఎందుకు? ► నిజాయతీగా విచారణ ఎదుర్కోవచ్చు కదా 06:45PM, అక్టోబర్ 10, 2023 రేపు హైకోర్టు ముందుకు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు ► ఇన్నర్ రింగ్ రోడ్డు కేసును లంచ్‌మోషన్‌లో స్వీకరించాలని కోరిన బాబు లాయర్లు ► బాబు బెయిల్ పై వాదనలు వినాలని కోరిన చంద్రబాబు లాయర్లు ► రేపు రెగ్యులర్ కోర్టులో విచారిస్తామన్న హైకోర్టు ► ఇదే కేసులో మాజీ మంత్రి నారాయణకు సీఐడీ నోటీసులపై విచారణ రేపటికి వాయిదా ► సీఐడీ విచారణలో తన ఆరోగ్య కారణాలను పరిగణనలోకి తీసుకోవాలని నారాయణ పిటిషన్ (చదవండి : బాబు సృష్టించిన మాయా ప్రపంచం, కరకట్ట రీఅలైన్మెంట్ పేరిట ఏం జరిగింది?) 06:15PM, అక్టోబర్ 10, 2023 నారాయణ అల్లుడికి హైకోర్టులో దక్కని ఊరట ► ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్ పిటిషన్ ► సీఐడీ నోటీసులను సస్పెండ్ చేయాలని కోరిన పునీత్ ► పునీత్ పిటిషన్ ను డిస్మిస్ చేసిన ఏపీ హైకోర్టు ► సీఐడీ విచారణకు సహకరించాలన్న హైకోర్టు ► న్యాయవాదుల సమక్షంలో విచారించాలని ఆదేశం ► ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పునీత్‌ను ప్రశ్నించనున్న దర్యాప్తు అధికారులు 06:25PM, అక్టోబర్ 10, 2023 తప్పు చేయలేదన్న వాదన కాదు, అరెస్ట్ గురించి బాబు బాధ : అంబటి ► చంద్రబాబు చట్టం నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తున్నారు : మంత్రి అంబటి ► చంద్రబాబు స్కాం చేయలేదని చెప్పలేకపోతున్నారు ► దొంగలు దొరికిపోయారని ప్రజలకు తెలిసిపోయింది ► టెక్నికల్ అంశాలపైనే చంద్రబాబు లాయర్లు ► వాదనలు వినిపిస్తున్నారు తప్పు....నేరం చేయలేదని చెప్పడం లేదు ► చట్టంలో లొసుగులున్నాయా అని చంద్రబాబు వెతుకులాట ► గతంలో అనేకసార్లు విచారణల నుంచి చంద్రబాబు తప్పించుకున్నారు ► సీఐడీ అన్ని ఆధారాలతోనే చంద్రబాబు అరెస్ట్ చేసింది ► దొంగ అన్ని సార్లు తప్పించుకోలేడని బాబు విషయంలో రుజువైంది ► ఇన్ని రోజులు లోకేష్ ఢిల్లీ ఓపెన్ జైలులో ఉన్నారు ► పురంధేశ్వరి బంధుత్వ ప్రేమతో ఆరాటపడుతున్నారు ► పురంధేశ్వరి తన మరిదిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు ► చంద్రబాబును కాపాడేందుకు పురంధేశ్వరి ఢిల్లీ వెళ్లారు ► మంత్రి రోజా బండారు వ్యాఖ్యలను పురంధేశ్వరి ఖండించలేదు ► చంద్రబాబును పార్టీని కాపాడేందుకే పవన్ రాజకీయాలు ► కాపుల ఓట్లను చంద్రబాబుకు అమ్మేందుకు పవన్ పార్టీ పెట్టారు ► అది జనసేన కాదు బాబు సేన అని ప్రజలు గమనించారు 06:05PM, అక్టోబర్ 10, 2023 జైల్లో ముగిసిన ములాఖత్ ► రాజమండ్రి సెంట్రల్ జైలు :చంద్రబాబుతో ముగిసిన ములాఖత్ ► చంద్రబాబును కలిసిన భువనేశ్వరి, బ్రాహ్మణి, పయ్యావుల కేశవ్ ► ముందు కుటుంబసభ్యులతో మాట్లాడిన చంద్రబాబు ► అనంతరం పయ్యావుల కేశవ్‌తో చంద్రబాబు మంతనాలు ► ఇవ్వాళ సుప్రీంకోర్టులో జరిగిన కేసు పరిణామాలపై చర్చించినట్టు సమాచారం ► జనసేనతో పొత్తు పెట్టుకుంటే పర్యవసనాలపై చర్చ ► ఇటీవల బహిరంగ సభలో తెలుగుదేశం బలహీనపడిందని ప్రకటన చేసిన పవన్ కళ్యాణ్ 06:00 PM, అక్టోబర్ 10, 2023 లోకేష్‌కు ఎందుకంత ఉలుకు : మంత్రి ఆదిమూలపు ► అన్ని ఆధారాలతోనే చంద్రబాబు పై సీఐడీ కేసు పెట్టింది ► కేసులకు భయపడుతున్న లోకేష్ ఇప్పటివరకు ఢిల్లీ వెళ్లి కూర్చున్నాడు ► 20 మంది లాయర్లను పక్కనపెట్టుకుని బెయిల్ కోసం ప్రార్థనలు చేస్తున్నాడు ► IRR, ఫైబర్ నెట్ స్కామ్ లో లోకేష్ పాత్ర స్పష్టం : మంత్రి ఆదిమూలపు 05:55PM, అక్టోబర్ 10, 2023 పవన్ కల్యాణ్ కు వైరల్ ఫీవర్ ► జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు జ్వరం ► రేపు జరగాల్సిన జనసేన విస్తృతస్థాయి సమావేశం వాయిదా ► పవన్ కు వైరల్ ఫీవర్ వచ్చిందంటూ భేటీ వాయిదా వేసిన జనసేన ► రేపటి ఎజెండాలో క్షేత్ర స్థాయిలో టీడీపీతో కలిసి వెళ్లే అంశంపై జరగాల్సిన చర్చ ► పార్టీ నేతలకు దిశా నిర్ధేశం చేయాల్సిన పవన్ కళ్యాణ్ ► త్వరలో మరో తేదీ ప్రకటిస్తామన్న జనసేన నేతలు 05:35PM, అక్టోబర్ 10, 2023 మళ్లీ రేపు రమ్మన్నారు : లోకేష్ ► సీఐడీ అధికారులు నాకు సంబంధం లేని ప్రశ్నలు అడిగారు : లోకేష్ ► నన్ను 50 ప్రశ్నలు అడిగారు, లేని ఇన్నర్ రింగ్ రోడ్డుపై ప్రశ్నించారు ► నాకు ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధం లేదు ► గూగుల్‌లో దొరికే సమాచారంపై నన్ను ప్రశ్నించారు ► మళ్లీ రేపు ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని చెప్పారు ► సీఐడీ ఒక్క ఆధారం కూడా చూపించకుండా విచారించారు ► వాళ్లు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చా 04:15PM, అక్టోబర్ 10, 2023 నాకేం తెలియదు: నారా లోకేష్ ►సీఐడీ విచారణలో నీళ్లు నములుతున్న నారా లోకేష్ ►అధికారులు అడిగిన ప్రతీ ప్రశ్నకు తెలియదనే సమాధానం ►హెరిటేజ్ బోర్డు మీటింగ్ నిర్ణయాలపై లోకేష్‌ను ప్రశ్నించిన సీఐడీ ►హేరిటేజ్ నిర్ణయాలు తనకు తెలియదని లోకేష్ సమాధానం ►లోకేష్ హాజరై స్వయంగా సంతకాలు పెట్టిన డాక్యుమెంట్లు చూపించిన సీఐడీ ►ఖంగుతిని తన లాయర్ల లాయర్ల వద్దకు వెళ్లి ఏం చెప్పాలో తెలుసుకున్న లోకేష్ ►హెరిటేజ్ భూములు ఆ ప్రాంతంలోనే ఎందుకు కొన్నారని సీఐడీ ప్రశ్న ►పొంతన లేని సమాధానం చెప్పిన లోకేష్ ►విచారణలో మాటిమాటికి లాయర్ల దగ్గరికి వెళ్లి వస్తున్న లోకేష్ 03:53PM, అక్టోబర్ 10, 2023 చంద్రబాబుతో ములాఖత్ కోసం.. ►చంద్రబాబుతో మలాఖత్ కోసం రాజమండ్రి సెంట్రల్ జైలుకు కుటుంబ సభ్యులు ►భువనేశ్వరి, బ్రాహ్మణిలతో పాటు సీనియర్ నేత పయ్యావుల కేశవ్ ► 45 నిమిషాల పాటు కొనసాగనున్న ములాఖత్ 02:40PM, అక్టోబర్ 10, 2023 నారాయణ అల్లుడికి హైకోర్టులో ఎదురుదెబ్బ ►అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్‌కు సీఐడీ నోటీసులు ►హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పునీత్ ►సీఐడీ నోటీసులను సస్పెండ్ చేయాలని పునీత్ పిటిషన్ ►పునీత్ పిటిషన్‌ను డిస్పోజ్ చేసి.. న్యాయవాదితో కలిసి రేపు విచారణకు హాజరు కావాలని ఆదేశించిన హైకోర్టు 02:29PM, అక్టోబర్ 10, 2023 లంచ్ తర్వాత ప్రారంభమైన లోకేష్ విచారణ ►ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేష్‌ను ప్రశ్నిస్తున్న సీఐడీ ►ఏ14గా నారా లోకేష్ పేరును చేర్చిన సీఐడీ ►ఉదయం మూడు గంటలపాటు విచారించిన సీఐడీ ►ఆన్లైన్మెంట్ మార్పులో ముందస్తు సమాచారంపై లోకేష్‌కు ప్రశ్నలు ►హెరిటేజ్ భూముల కొనుగోలుపైనా ప్రశ్నలు ►భోజన విరామం తర్వాత తిరిగి ప్రారంభమైన విచారణ 02:08PM, అక్టోబర్ 10, 2023 సుప్రీంకోర్టు : శుక్రవారం మిగతా వాదనలు ►చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ శుక్రవారానికి వాయిదా ►చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సాల్వే మరో గంట వాదనలు ►అనంతరం కౌంటర్ వాదనలు వినిపించిన CID లాయర్ ముకుల్ రోహత్గీ 1:30 PM, అక్టోబర్ 10, 2023 జైల్లో చంద్రబాబును కలవనున్న కుటుంబ సభ్యులు ► రాజమండ్రి సెంట్రల్ జైల్‌కు కుటుంబ సభ్యులు ► మధ్యాహ్నం మూడున్నరకు చంద్రబాబుతో ములాఖత్ ► బాబును కలవనున్న భువనేశ్వరి, బ్రాహ్మణి ► కుటుంబ సభ్యులతో పాటు తెలుగుదేశం నేత పయ్యావుల కేశవ్ 1:15 PM, అక్టోబర్ 10, 2023 చంద్రబాబు కేసులో ఏం జరగవచ్చు? : నిపుణులు ఏమంటున్నారు? ► ఇరు వర్గాల వాదన భిన్నంగా ఉన్నాయి ► FIR కొట్టేయడానికి ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఎలాంటి ఆస్కారం లేదు ► అయితే అవినీతి నిరోధక చట్టంపై విస్తృతంగా పరిశీలన జరపాల్సి రావొచ్చు ► అవసరమయితే ఈ ఒక్క విషయంలో (17a) కేసును విస్తృత ధర్మాసనానికి నివేదించవచ్చు.! #CBN challenge to Sec 17A in Supreme Court is likely to be transferred to Constitution Bench which is to hear from Nov 20. Though FIR is unlikely to be quashed, any relief would be for PC Act provisions only. IPC provisions, 409, 468, 471 will continue to stay in FIR. 🙏🙏🙏 — PVS Sarma (@pvssarma) October 10, 2023 1:15 PM, అక్టోబర్ 10, 2023 విజయవాడ : ACB కోర్టులో బాబు కేసులు వాయిదా ► ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్ కేసులలో పిటి వారెంట్లపై విచారణ ► రేపటికి వాయిదా వేసిన ACB కోర్టు 1:10 PM, అక్టోబర్ 10, 2023 గుంటూరు జిల్లా : CID కార్యాలయంలో లోకేష్ విచారణ ► సీఐడీ కార్యాలయంలో లోకేష్‌ను ప్రశ్నించిన అధికారులు ► మధ్యాహ్నం ఒంటిగంటకు నారా లోకేష్‌కు లంచ్ బ్రేక్ ► గంట పాటు లంచ్ బ్రేక్ ► లోకేష్‌కు ఇంటి నుంచి భోజనం తెచ్చిన వ్యక్తిగత సిబ్బంది 1:06 PM, అక్టోబర్ 10, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు ► CID లాయర్ ముకుల్ రోహత్గీ : అసలు ప్రజాధనం దుర్వినియోగం చేసిన ఇలాంటి కేసుల్లో ఎలాంటి రక్షణ లేదని సెక్షన్లు చెబుతున్నాయి ► జస్టిస్ బోస్ : వాదనలకు ఇంకా ఎంత సేపు కావాలి? ► CID లాయర్ ముకుల్ రోహత్గీ : ఒక గంట సరిపోతుంది ► జస్టిస్ బోస్ : అయితే మిగతా వాదనలు శుక్రవారం 2గంటలకు వింటాం ► బాబు లాయర్ లూథ్రా : దయచేసి ఈ కేసులో వాదనలను ఇవ్వాళ ముగించండి ► జస్టిస్ బోస్ : ముందే చెప్పాం కదా. మిగతా చాలా కేసులున్నాయి ► CID లాయర్ ముకుల్ రోహత్గీ : ఒకవేళ ఇవ్వాళ సాధ్యం కాదు అనుకుంటే శుక్రవారం వాదనలు వినిపిస్తాం. ► బాబు లాయర్ లూథ్రా : గురువారానికి కేసు వాయిదా వేయండి ► CID లాయర్ ముకుల్ రోహత్గీ : శుక్రవారం లేదా సోమవారం ► బాబు లాయర్ లూథ్రా : మా లాయర్ సాల్వే మరో కేసులో వాదనలు వినిపించేందుకు వెళ్లాడు. ఆయన్ను అడిగి మీకు మధ్యాహ్నం 2గంటలకు చెబుతాను. ► జస్టిస్ బోస్ : సరే కోర్టుకు లంచ్ బ్రేక్ 1:05 PM, అక్టోబర్ 10, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు ► CID లాయర్ ముకుల్ రోహత్గీ : సెక్షన్ 6 ఏం చెబుతుందంటే.. ► జస్టిస్ త్రివేదీ : విచారణ అవసరం లేదంటుంది కదా.! ► CID లాయర్ ముకుల్ రోహత్గీ : అది నిజం లార్డ్‌షిప్. కానీ ఇక్కడ ముఖ్యమైన అంశమేమంటే FIR నమోదు అయిందా అన్నది.! 1:02 PM, అక్టోబర్ 10, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు ► CID లాయర్ ముకుల్ రోహత్గీ : CrPC సెక్షన్ 468 ఏం చెబుతుందంటే.. ఒక వేళ ఒక కేసులో అభియోగాలు మూడేళ్ల జైలు శిక్ష కంటే మించినది అయితే అలాంటి కేసుల్లో దర్యాప్తుకు ఎలాంటి పరిధి ఉండదని స్పష్టంగా పేర్కొంది. ఇలాంటి కేసుల్లో దర్యాప్తు జరపవచ్చని, ఛార్జ్‌షీట్ నమోదు చేయవచ్చని చెబుతోంది. 1:00 PM, అక్టోబర్ 10, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు ► జస్టిస్ త్రివేదీ : మీరు ఇంతకు ముందు చెప్పినట్టు సెక్షన్ 13(1)(c) మరియు సెక్షన్ 13(1)(d)లు 2018 సవరణలో తొలగించారు కదా. ► CID లాయర్ ముకుల్ రోహత్గీ : కళ్ల ముందు కనిపిస్తున్న ఏ నేరంలోనయినా FIR నమోదు చేయకుండా ఏ చట్టం అడ్డంకులు చెప్పలేదు. ఆ సెక్షన్ తొలగించామన్నది దానికి హేతువు కాలేదు. ► జస్టిస్ త్రివేదీ : ఈ విషయంలో మరింత విస్తృతంగా వాదనలు చెప్పండి ► CID లాయర్ ముకుల్ రోహత్గీ : రాజ్యాంగంలోని ఆర్టికల్ 20(1) ఏం చెప్పిందంటే.. ఒక వ్యక్తి నేరం చేశాడన్న విషయం చాలా ఆలస్యంగా తెలిసిందనుకోండి. చట్టం ఏం చెబుతుందంటే.. కేసు నమోదు చేయమని.! కొన్ని పరిధులు ఉండొచ్చేమో కానీ అడ్డంకులు మాత్రం లేవు. ' (CID లాయర్ రోహత్గీ కోర్టు ముందుంచిన డాక్యుమెంట్) 12:55 PM, అక్టోబర్ 10, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు ► CID లాయర్ ముకుల్ రోహత్గీ : అసలు చంద్రబాబు కేసులో మెరిట్స్‌లోకి క్వాష్ పిటిషన్ సమయంలో వెళ్లవచ్చా? అలా వెళ్లకూడదని కోర్టును కోరుతున్నాను. ► ఒక దర్యాప్తు అధికారి అధికారిక విధులేంటీ? ► దర్యాప్తు సంస్థ ముందు ఎలాంటి మార్గదర్శకాలున్నాయి? ► దర్యాప్తు అధికారి ఏం నిర్ణయాలు తీసుకున్నారు? ► ఈ ప్రశ్నలన్నింటికీ నిర్ణయించాల్సింది తన ముందున్న సాక్ష్యాధారాలను బట్టి మాత్రమే. ఇది మౌఖికంగా జరిగే వాదనలను బట్టి కాదు. దర్యాప్తు అధికారి దగ్గర ఏ ఏ సాక్ష్యాధారాలున్నాయన్న బట్టి మాత్రమే కోర్టు నిర్ణయం తీసుకోవాలి. ► జస్టిస్ త్రివేదీ : ఒక వేళ చట్ట సవరణ జరిగిన తర్వాత అసలు ఆ సెక్షన్‌ను సవరణలో తొలగించిన తర్వాత.. అదే సెక్షన్ కింద FIR నమోదు చేయవచ్చా? ► CID లాయర్ ముకుల్ రోహత్గీ : కచ్చితంగా. దానికి వెసులుబాటు ఉంది. దానికొక పరిధి ఉంది. నేరం ఎప్పుడు జరిగిందన్న సమయం పక్కనబెడితే... FIR నమోదు చేయవచ్చు. 12:45 PM, అక్టోబర్ 10, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు ► CID లాయర్ ముకుల్ రోహత్గీ : కేవలం 17a సవరణను అడ్డుపెట్టుకుని ఏమైనా చేయవచ్చా? తప్పు చేసిన ప్రతీ ఒక్కరు 17aను బూచిగా చూపించి ముందస్తు అనుమతి తీసుకురమ్మంటే ఎలా? అసలు ఇదే విధానం అన్ని కేసుల్లో అమలయితే అవినీతి కేసుల్లో దర్యాప్తు చేసేందుకు ఏ అధికారి అయినా ముందుకొస్తాడా? అసలు మన దేశ పార్లమెంట్ విధానమే అవినీతి రహిత దేశం కదా. ఇందులో భాగంగానే చట్టాలు, సవరణలు వచ్చాయి కదా.! ► CID లాయర్ ముకుల్ రోహత్గీ : అవినీతికి పాల్పడే వారికి సెక్షన్ 17a అండగా ఉండరాదు, ఉండకూడదు. ► జస్టిస్ బోస్ : 17a సవరణలో తెచ్చిన ముందస్తు అనుమతి అన్నది పాత తేదీల్లో జరిగే నేరాలకు వర్తిస్తుందా? ► CID లాయర్ ముకుల్ రోహత్గీ : ఎట్టి పరిస్థితుల్లో వర్తించదు. 17a ఉంది కదా అని పారాచ్యూట్‌తో గతంలోకి ప్రయాణం చేయగలమా? 12:35 PM, అక్టోబర్ 10, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు ► CID లాయర్ ముకుల్ రోహత్గీ : ఒక చట్ట సవరణను ఎప్పుడు చేయాలి? అది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందన్నది పార్లమెంట్‌కు ఉన్న అధికారం. కానీ ఈ కేసులో ముందునుంచే వర్తిస్తుందని పార్లమెంట్ తెచ్చిన సవరణలో లేదు. ► CID లాయర్ ముకుల్ రోహత్గీ : ఈ అంశానికి సంబంధించి ఒక కీలక విషయం అర్థం చేసుకోవాలి. కొన్ని సెక్షన్లను 2018లో తొలగించారు. అయితే నేరం 2018కి ముందే జరిగి ఉంటే మాత్రం.. తొలగించిన సెక్షన్లు కూడా వర్తిస్తాయి. అందువల్ల 2018 కంటే ముందు జరిగిన ఈ నేరంలో సెక్షన్ 17a వర్తించడానికి అవకాశమే లేదు. చంద్రబాబుపై ఈ కేసులో సెక్షన్ 13(1), (c), (d) కింద అభియోగాలున్నాయి ► జస్టిస్ త్రివేదీ : ఆ సెక్షన్లను తొలగించారు కదా. ► CID లాయర్ ముకుల్ రోహత్గీ : సరిగ్గా ఆ పాయింట్‌నే మీ ముందుకు తీసుకొస్తున్నాను. సెక్షన్ 482 ఈ సవాళ్లను నిర్ణయించలేదు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు, చేసిన పనుల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి అంతులేని నష్టం వాటిల్లింది. జరిగిన అక్రమాల వల్ల ఖజానా నష్టపోయింది. ► జస్టిస్ త్రివేదీ : ఏ సమయంలో దర్యాప్తు సంస్థ ఈ విషయాలను కనుగొంది? ► CID లాయర్ ముకుల్ రోహత్గీ : దర్యాప్తు జరుగుతున్న కొద్దీ కొత్త విషయాలు తెరపైకి వచ్చాయి. ఇంత పెద్ద స్థాయిలో అవినీతి జరిగినపుడు.. ఈ కేసును ఆదిలోనే కొట్టేయాలన్న ఆలోచనే సరికాదు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17a ఏం చెబుతుందంటే.. ముందస్తు అనుమతి లేకుండా కూడా దర్యాప్తు చేపట్టేందుకు కొన్ని మినహాయింపులు ఇచ్చింది. (సుప్రీంకోర్టు బెంచ్ ముందు CID లాయర్ రోహత్గీ ఉంచిన డాక్యుమెంట్) 12:25 PM, అక్టోబర్ 10, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు ► CID లాయర్ ముకుల్ రోహత్గీ : ఈ చట్ట సవరణ 2018లో జరిగింది. 17a అనేది ఇందులో కేవలం ఒక భాగం మాత్రమే. 2018కు ముందు జరిగిన నేరాలన్నింటిలో 2018 కంటే ముందున్న చట్టానికి లోబడి (17a సవరణకు ముందు) దర్యాప్తు జరుగుతాయి. ► CID లాయర్ ముకుల్ రోహత్గీ : 2018 తర్వాత జరిగిన నేరాల్లో మాత్రమే 17a సవరణకు లోబడి దర్యాప్తు జరుగుతుంది. ఈ కేసును పరిశీలిస్తే.. నేరం 2018కు ముందు జరిగింది, అంటే పాత చట్టం ప్రకారమే దర్యాప్తు జరగాలి, అలాగే జరిగింది కూడా. ► CID లాయర్ ముకుల్ రోహత్గీ : మీకు స్పష్టత ఇవ్వడానికి ఒక ఉదాహరణ ఇస్తాను. ఒక వ్యక్తి మరొకరిని కొట్టాడనుకుందాం. కొట్టిన వ్యక్తిపై సెక్షన్ 323 కింద కేసు నమోదవుతుంది. ఒక వేళ ఏదైనా కారణంతో సెక్షన్ 323 కొట్టేసినంత మాత్రాన.. అ వ్యక్తి మీద ఉన్న అభియోగాలు ఎటూ పోవు. ఆ వ్యక్తి చట్టానికి లోబడి శిక్ష అనుభవించాల్సిందే. కొత్తగా సెక్షన్లలో వచ్చిన సవరణ ఎలాంటి మార్పు తెచ్చిందన్నది కేవలం ప్రయోజనం దృష్ట్యా పరిశీలించాలి కానీ.. సవరణ వచ్చింది కదా అని కేసు పూర్తిగా కొట్టేయాలంటే ఎలా? (చదవండి : చంద్రబాబు స్క్వాష్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ హైకోర్టు ఏం చెప్పిందంటే..) (సుప్రీంకోర్టు ముందు CID తరపు లాయర్ రోహత్గీ వాదనలు (Right window)) 12:15 PM, అక్టోబర్ 10, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు ► CID లాయర్ ముకుల్ రోహత్గీ : ఒక కేసులో అవినీతి నిరోధక చట్టం, PC actను తొలగిస్తే.. మిగతా అభియోగాలన్నీ కేవలం IPC కిందకు వస్తే ఏమవుతుందన్న దానిపై ఇదే కోర్టు నేరుగా ఓ జడ్జిమెంట్ ఇచ్చింది. దాన్ని మీ ముందుంచుతున్నాను. ► A శ్రీనివాసరెడ్డి (2023) కేసులో సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఏం చెప్పిందంటే : ప్రత్యేక కోర్టుకు ప్రత్యేక సందర్భాల్లో ప్రత్యేక అధికారాలుంటాయి. అవినీతి నిరోధక చట్టం లేకున్నా.. ప్రత్యేక కోర్టులు IPC కింద నమోదయిన అభియోగాలపై కేసు విచారణ చేపట్టవచ్చు. ► CID లాయర్ ముకుల్ రోహత్గీ : ఈ కేసులో ఒక వేళ అవినీతి నిరోధక చట్టం, PC actను తొలగించినా.. మిగతా అభియోగాలపై దర్యాప్తు జరపవచ్చు ► జస్టిస్ త్రివేదీ : ఈ కేసులో బాబు లాయర్ సాల్వే ఏం చెబుతున్నారంటే.. కేసులో అవినీతి నిరోధక చట్టం కింద ఉన్న అభియోగాలను తొలగిస్తే.. సెక్షన్ 4(3) కింద నమోదు చేసిన అభియోగాలకు అర్హత లేదంటున్నారు? అప్పుడు ప్రత్యేక కోర్టు పరిధి ఏంటీ? ఆ కోర్టు జారీ చేసిన ఉత్తర్వుల సంగతేంటీ? ► CID లాయర్ ముకుల్ రోహత్గీ : ఒక కేసులో సెక్షన్ 420 కింద అభియోగాలుంటే.. వాటిని తొలగించలేం. ఈ కేసులో అవినీతి నిరోధక చట్టం PC act ను తొలగించలేం. ► జస్టిస్ త్రివేదీ : అది కేవలం ఒక పరిశీలన మాత్రమే 12:08 PM, అక్టోబర్ 10, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు ► CID లాయర్ ముకుల్ రోహత్గీ : ఒక కేసులో అవినీతి నిరోధక చట్టం, PC act తో పాటు ఇండియన్ పెనల్ కోడ్,IPC సెక్షన్లు ఉంటే ఏం చేయాలి? చేసిన నేరం, మోపబడిన అభియోగాలు రెండు సెక్షన్లకు వర్తిస్తే ఏం చేయాలి? ప్రత్యేక కోర్టులో (ACB కోర్టు) ఉన్న న్యాయమూర్తికి ఈ రెండు కేసులను విచారించే పరిధి ఉంటుంది. ► CID లాయర్ ముకుల్ రోహత్గీ : ఒక వేళ బాబు లాయర్ సాల్వే చెబుతున్నట్టుగా అవినీతి నిరోధక చట్టాన్ని తొలగిస్తే ఏమవుతుంది? CPC 1973 (2 of 1974) ఏం చెబుతుందంటే, ఒక ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఏ కేసులోనయినా.. సెక్షన్ 3లో పేర్కొన్న నేరంతో పాటు ఇతర అభియోగాలుంటే వాటిని కూడా ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి పరిశీలించవచ్చని చెబుతోంది. ► జస్టిస్ త్రివేదీ : ఒక వేళ బాబు లాయర్ సాల్వే చెబుతున్నట్టుగా అవినీతి నిరోధక చట్టాన్ని తొలగిస్తే సెక్షన్ 4(3) కూడా వర్తించదు కదా ► CID లాయర్ ముకుల్ రోహత్గీ : సుప్రీంకోర్టు ఈ విషయంలో స్పష్టత ఇచ్చింది. ఎప్పుడయితే వేర్వేరు అభియోగాలు ఒకే కేసులో ఉన్నాయో.. అప్పుడు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కచ్చితంగా ఆ కేసును పరిశీలించవచ్చు. అలాంటి కేసుల్లో అది అవినీతి నిరోధక చట్టం సెక్షన్ లేకున్నా.. ఆ కేసును ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి పరిశీలించవచ్చు. 12:00 PM, అక్టోబర్ 10, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు CID తరపు వాదనలు ప్రారంభం ► CID లాయర్ ముకుల్ రోహత్గీ : అవినీతి నిరోధక చట్టానికి లోబడి ఈ కేసు నమోదయింది. పైగా ఈ కేసులో ఎలాంటి రాజకీయ కక్ష లేదు, 2021లో FIR నమోదయింది. 2023లో లభించిన సాక్ష్యాధారాల మేరకు చంద్రబాబును ఈ కేసులో నిందితుడిగా చేర్చారు. ► CID లాయర్ ముకుల్ రోహత్గీ : చంద్రబాబు నాయుడు ఎంత బలమైన వ్యక్తి అంటే.. అలా అరెస్ట్ అయ్యారో లేదో.. ఇలా వెంటనే క్వాష్ పిటిషన్‌ను (కేసునే పూర్తిగా కొట్టేయాలన్న సెక్షన్ 482 కింద స్పెషల్ లీవ్ పిటిషన్)ను ముందుకు తెచ్చారు. కేవలం రెండే రెండు రోజుల్లో క్వాష్ పిటిషన్ హైకోర్టు ముందుకొచ్చింది. అంటే ఈ కేసులో నిందితుడి ఉద్దేశ్యాలను కోర్టు అర్థం చేసుకోవాలి. ► CID లాయర్ ముకుల్ రోహత్గీ : చంద్రబాబు నాయుడు వేసిన క్వాష్ పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తిరస్కరించింది. ఈ కేసులో న్యాయస్థానం ఏం చెప్పిందంటే.. అవినీతి నిరోధక చట్టం, 1988 కింద నమోదయిన కేసుకు సెక్షన్ 17a లోబడి ఉండదని స్పష్టం చేసింది. 11:45 AM, అక్టోబర్ 10, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు ► బాబు లాయర్ సాల్వే : మేం CID దాఖలు చేసిన FIRను సవాలు చేస్తున్నాం. ► జస్టిస్ త్రివేదీ : అసలు FIR ప్రకారం ఏ ఏ నేరాలున్నాయి? ► బాబు లాయర్ సాల్వే : ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు దురుద్దేశపూర్వకంగా కుట్రకు పాల్పడి ప్రయోజనం పొందాడన్నది ప్రధాన అభియోగం. ► బాబు లాయర్ సాల్వే : చంద్రబాబుపై ఏ ఏ అభియోగాలు ఉన్నాయంటే.. ► IPC S 120B (criminal conspiracy) ► Sec 420 (cheating and dishonestly inducing delivery of property), ► Sec 465 (forgery) ► PC Act Sec12 (punishment for abetment of offences) ► Sec 13 (criminal misconduct by a public servant) ► సాల్వే : ఇందులో అవినీతి నిరోధక చట్టాన్ని తీసేసి చూడలేం. కేసును పూర్తిగా దాని ఆధారంగానే నిర్మించారు PC చట్టాన్ని తీసేస్తే ఈ కేసులో ప్రత్యేక కోర్టు ఏం చేయలేదు. ఒక వేళ PC చట్టాన్ని తొలగిస్తే మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచాల్సి ఉంటుంది ► జస్టిస్ బోస్ : ఇవన్నీ మేజిస్ట్రేట్ ముందు విచారణ జరగాల్సిన అభియోగాలనే.? ► బాబు లాయర్ సాల్వే : నా మిత్రుడు లూథ్రా చెప్పేదాని బట్టి ఇవన్నీ మేజిస్ట్రేట్ పరిధిలోని కేసులే ► బాబు లాయర్ లూథ్రా : మధ్యప్రదేశ్‌లో కొందరు సెషన్స్ కోర్టుకు వెళ్తారు, కానీ ► జస్టిస్ త్రివేదీ : దేశమంతటా అన్ని రాష్ట్రాల్లో ఒకేలా ఉంటుంది, మేజిస్ట్రేట్ పరిధిలోనే ఉంటుంది ► బాబు లాయర్ సాల్వే : ఇంతటితో మా వాదనలు ముగిస్తున్నాం 11:35AM, అక్టోబర్ 10, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు : అభ్యంతరాల మధ్య సాల్వే వాదనలు ► బాబు లాయర్ సాల్వే : 2011లో వచ్చి దవీందర్ పాల్ సింగ్ భుల్లర్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే.. అసలు అరెస్ట్ విషయంలోనే సరైన విధానం అనుసరించనప్పుడు, కేసు దర్యాప్తు ఆరంభ సమయంలోనే సరైన పద్ధతి అనుసరించకుండా ఉన్నప్పుడు.. ఆ కేసును మూలాల్లోంచి తొలగించాలని తీర్పు ఇచ్చింది. అంటే కేసును కొట్టేయాలన్న మూల సిద్ధాంతాన్ని ఈ కేసుకు కూడా అమలు చేయాలన్నది నేను బలంగా చెబుతున్న పాయింట్ ► బాబు లాయర్ సాల్వే : ఒకే వ్యక్తి మీద వేర్వేరు అభియోగాలు మోపడం, దాని ప్రభావం ఏంటన్న దానిపై నా దగ్గర మూడు కేసులున్నాయి. ఒక కేసును మీ ముందుంచుతున్నాను. 2019లో వచ్చిన ఎభా అర్జున్ జడేజా కేసు. ► ఎభా అర్జున్ జడేజా కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది ? : సరైన అనుమతి లేకుండా ప్రారంభించే దర్యాప్తులో FIR నమోదు చేయకూడదని TADA కేసుల సందర్భంగా సుప్రీంకోర్టు చెప్పింది. హత్య, అత్యాచారం, స్మగ్లింగ్, నార్కోటిక్స్, పోక్సో యాక్ట్ వంటి సీరియస్ అభియోగాలున్న కేసులను TADA కేసు కారణంగా దర్యాప్తు వాయిదా వేయకూడదు 11:25AM, అక్టోబర్ 10, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు : అభ్యంతరాల మధ్య సాల్వే వాదనలు ► బాబు లాయర్ సాల్వే : ఇటీవల రాజ్యాంగంలోని ఆర్టికల్ 20(1)కు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను చూడండి. క్రిమినల్ కేసుల విచారణలో ప్రొసీజిరల్ మార్పులకు సంబంధించి (పాత తేదీల) గతం నుంచే అమలును ఆర్టికల్ 20(1) అడ్డుకోలేదని అయిదుగురు జడ్జిల సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. దీనికి సంబంధించి హైకోర్టులు ఏం చెబుతున్నాయో చెబుతాను. ► జస్టిస్ బోస్ : ఒకసారి సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పిన విషయంలోనే.. మళ్లీ హైకోర్టు కేసును ఉదహరించనవసరం లేదు. ► బాబు లాయర్ సాల్వే : అయితే రిమాండ్ విషయంలో ముందస్తు అనుమతి అంటే గవర్నర్ అనుమతి కావాల్సిందే అన్న విషయాన్ని మీ ముందుకు తెస్తున్నాను. చంద్రబాబు ప్రజా ప్రతినిధి కాబట్టి, CID ముందుగా గవర్నర్ అనుమతి తీసుకుని ఉండాల్సింది. ఇది స్పష్టం చేయడమే నా ఉద్దేశ్యం. 11:15AM, అక్టోబర్ 10, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు : అభ్యంతరాల మధ్య సాల్వే వాదనలు ► బాబు లాయర్ సాల్వే : 1988లో రూపొందిన అవినీతి నిరోధక చట్టాన్ని పరిశీలిస్తే.. దర్యాప్తు అధికారికి ఎలాంటి హక్కులు లేవని చెబుతుంది. దర్యాప్తు అనేది కేవలం ఒక విధి మాత్రమే తప్ప హక్కు కాదని చట్టం చెబుతుంది. 11:10AM, అక్టోబర్ 10, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు : అభ్యంతరాల మధ్య కొనసాగుతున్న సాల్వే వాదనలు ► జస్టిస్ బోస్ : ఈ కేసులో లంచ్‌కు ముందే వాదనలు ముగిస్తాం. తర్వాత రెగ్యులర్ కేసులను పరిశీలిస్తాం ► బాబు లాయర్ సాల్వే : 2019లో రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో యశ్వంత్ సిన్హాపై దాఖలైన కేసులో జస్టిస్ KM జోసెఫ్ ఇచ్చిన తీర్పును చూడండి. (జస్టిస్ KM జోసెఫ్ ఇచ్చిన తీర్పు ఏంటంటే.. రఫేల్ యుద్ధ విమానాల కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దర్యాప్తు సంస్థ అయిన CBIని ఆపలేదు. అయితే 17a ప్రకారం దర్యాప్తు సంస్థ ముందస్తు అనుమతులు తీసుకోవాలి) (సుప్రీంకోర్టు ముందు సాల్వే ఉంచిన రఫేల్ కేసు డాక్యుమెంట్) 11:00AM, అక్టోబర్ 10, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు : అభ్యంతరాల మధ్య కొనసాగుతున్న సాల్వే వాదనలు ► బాబు లాయర్ సాల్వే : ముందస్తు అనుమతి లేకుండా దర్యాప్తు అధికారి చర్యలకు దిగరాదని చట్టం చెబుతోంది. CID ముందు అనుమతి తీసుకున్న తర్వాతే దర్యాప్తు చేయాల్సింది. ►నిన్న కూడా కోర్టు ముందు సెక్షన్ 17a సవరణ గురించి వాదనల్లో తెలిపాను. ఇది దుర్వినియోగం కాకూడదన్న ఉద్దేశ్యంతోనే సవరణ తీసుకొచ్చారు. దీని వల్ల అవినీతి నిరోధక చట్టం మరింత బలోపేతం అవుతుందని భావిస్తున్నాం ►నేరాలు బయటపడ్డాయని కాదు. CID ఇప్పుడు కొత్తగా అనుమతి తీసుకుని ఆపై విచారణను పునఃప్రారంభించాలి. (కేసు విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు, కింది విండోలో వాదనలు వినిపిస్తున్న హరీష్ సాల్వే) 10:45AM, అక్టోబర్ 10, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు - విచారణ పద్ధతిపై వేర్వేరు వాదనలు ► జస్టిస్ బోస్ : ఇంకా ఎంత సేపు తీసుకుంటారు సాల్వే ► బాబు లాయర్ సాల్వే : ఇంకా గంట సేపు కావాలి ► CID లాయర్ రోహత్గీ : మూడు రోజులుగా వెయిట్ చేస్తున్నాం. ఇంకా ఎంత సేపు జస్టిస్? ఇది పూర్తిగా బేస్ లేని కేసు, అసలు ఇప్పటికే కొట్టేయాల్సిన కేసు, నోటీసులు లేకుండా ఎలా అవకాశమిస్తారు? మీరు గంట అవకాశం ఇవ్వాలనుకుంటే గంట తర్వాతే వస్తా. ► జస్టిస్ బోస్ : సెక్షన్ 136A కింద నోటీసులు ఇవ్వలేదు, - హైకోర్టులో దాఖలు చేసిన పత్రాల ఆధారంగా వాదనలు జరుగుతున్నప్పుడు కొత్త డాక్యుమెంట్లు అవసరం లేదు ► బాబు లాయర్ సాల్వే : ఇదొక క్రిమినల్ కేసు, ఇందులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయనవసరం లేదు, రికార్డులు అన్నీ ఉన్నాయి ► CID లాయర్ రోహత్గీ : ఇప్పటివరకు కోర్టు అనుసరిస్తున్న పద్ధతిని ఫాలో అయ్యేలా చూడండి. మొత్తం న్యాయశాస్త్రాన్నే తిరిగి రాస్తానంటే.. మళ్లీ మేం మొదటి నుంచి రావాలి ► జస్టిస్ త్రివేదీ (సాల్వేను ఉద్దేశించి) : ఇదొక ప్రొసీజర్ అయిప్పుడు దీని కింద ఏవైనా హక్కులుంటాయా? ► బాబు లాయర్ సాల్వే : మీరు అవకాశం ఇవ్వండి, నేను రిఫరెన్స్ తీర్పులు మీ ముందుంచుతాను. నిందితుడికి రక్షణ కల్పించిన కేసులు ఉదహరిస్తాను 10:35AM, అక్టోబర్ 10, 2023 సుప్రీంకోర్టులో మొదలైన వాదనలు ► సుప్రీంకోర్టులో మొదలయిన విచారణ ► కేసులో వాదనలు వింటున్న జస్టిస్ బేలా త్రివేదీ, జస్టిస్ అనిరుధ్ బోస్ ► చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్‌పై బెంచ్ ముందుకు ఇరుపక్షాల లాయర్లు ► నిన్న చంద్రబాబు లాయర్ హరీష్ సాల్వే వాదనలు ► ఇవ్వాళ బెంచ్ ముందు వాదనలు వినిపించనున్న CID లాయర్ ముకుల్ రోహత్గీ 10:15AM, అక్టోబర్ 10, 2023 ►సిట్ కార్యాలయంలో నారా లోకేష్ ► ఐఆర్ఆర్ కేసులో లోకేష్‌ను విచారిస్తున్న సీఐడీ ►లోకేష్‌ను ప్రశ్నిస్తున్న విచారణాధికారి జయరామ్‌రాజు బృందం 10:00AM, అక్టోబర్ 10, 2023 ►కాసేపట్లో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ ►సీఐడీ తరఫున వాదనలు వినిపించనున్న సుప్రీంకోర్టు న్యాయవాది ముకుల్ రోహిత్గీ 9:58AM, అక్టోబర్ 10, 2023 ►సిట్ కార్యాలయానికి చేరుకున్న నారా లోకేష్ ►కాసేపట్లో లోకేష్‌ను ప్రశ్నించనున్న సీఐడీ 9:40AM, అక్టోబర్ 10, 2023 ►సీఐడీ కార్యాలయానికి బయల్దేరిన నారా లోకేష్ ►ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సీఐడీ విచారణకు లోకేష్ ►సాయంత్రం ఐదు గంటల వరకూ లోకేష్‌ను విచారించనున్న సీఐడీ ►తాడేపల్లి సిట్ కార్యాలయంలో విచారణ 8:50 AM, అక్టోబర్ 10, 2023 జైలులో 31వ రోజు రిమాండ్ ఖైదీగా చంద్రబాబు.. ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో 31వ రోజు రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు. ►యథావిధిగా చంద్రబాబుకు కొనసాగుతున్న భద్రత. ►చంద్రబాబు ఆరోగ్య రీత్యా జైలు ఆవరణలో నిరంతరం అందుబాటులో ఉన్న ప్రత్యేక వైద్య నిపుణుల బృందం. ►హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ల కొట్టివేతతో టీడీపీ వర్గాల్లో నైరాశ్యం. ►సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్‌పైనే ఆశలు పెట్టుకున్న టీడీపీ నేతలు ►లోకేశ్ నేడు సీఐడీ ఎదుట హాజరు కానుండటంపై ఎల్లో శ్రేణుల్లో టెన్షన్ 08:06AM, అక్టోబర్ 10, 2023 ►న్యాయ నిపుణులు: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు చాలా సీరియస్. ఈ కేసులో బాబుకి శిక్ష పడే అవకాశం ఉంది. ►అవును.. అక్కడ పుర చేత్తో తండ్రీ కొడుకులు ఇచ్చి, అవతల అత్తా, కోడళ్ళు కుడి చేత్తో తీసుకున్నారు. ►ఇక్కడ తమ ఇంటి కంపెనీకి లాభం వచ్చేట్టు కేబినేట్ నిర్ణయాలు తీసుకున్నారు. ►ఇది ఖచ్చితంగా తండ్రీ కొడుకులకి మాత్రమే కాదు, భువనేశ్వరి, బ్రహ్మణి కూడా ఇరుక్కున్నట్టే. 07:58AM, అక్టోబర్ 10, 2023 ►ఇన్నర్ రింగ్ రోడ్(ఐఆర్ఆర్) కేసులో పునీత్ అనే వ్యక్తికీ ఏపీ సీఐడీ నోటీసులు ►ఈ నెల 11 న విచారణకు రావాలని సీఐడీ నోటీసులు ►సీఐడీ నోటీసులను క్వాష్ చేయాలని ఏపీ హైకోర్టులో పునీత్ పిటిషన్ ►నేడు విచారణ చేయనున్న ఏపీ హైకోర్టు 07:57AM, అక్టోబర్ 10, 2023 టీడీపీ నేత నారాయణకు మరో షాక్ ►ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో అయన భార్య, బావమరదులు ►ఏ - 15గా పొంగూరి రమాదేవి ►ఏ -16గా రావూరి సాంబశివరావు ►ఏ - 17 గా ఆవుల మునిశంకర్ ►ఏసీబీ కోర్టులో సీఐడీ ప్రత్యేక మెమో ముందు ముందు దీపావలీ, దసరా పండుగలన్నీ వీళ్లకే.. 😄😄#YSRCPITWING#KhaidiNo7691 pic.twitter.com/046QDCP2nu — YSRCP IT WING Official (@ysrcpitwingoff) October 10, 2023 7:00 AM, అక్టోబర్ 10, 2023 నేడు చంద్రబాబు కేసుపై సుప్రీంకోర్టులో విచారణ.. ►చంద్రబాబు పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ ►నేడు వాదనలు వినిపించనున్న సీఐడీ. ► చంద్రబాబు కేసుపై నిన్న సుదీర్ఘ వాదనలు ► దాదాపు రెండున్నర గంటల పాటు వాదనలు వినిపించిన చంద్రబాబు తరపు న్యాయవాది హరీష్ సాల్వే ► నేడు CID, ఏపీ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించనున్న సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీ 6:50 AM, అక్టోబర్ 10, 2023 నేడు సిట్ విచారణకు నారా లోకేశ్.. ►ఢిల్లీ నుంచి ఏపీకి టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బాబు ►కోర్టు ఉత్తర్వులు ప్రకారం.. ఈరోజు ఉదయం సీఐడీ సిట్ విచారణకు హాజరు ►తాడేపల్లి సమీపంలోని పాతూరు రోడ్డులో ఉన్న సిట్ కార్యాలయంలో విచారణ ►మంగళవారం ఉ.10 నుంచి సా.5 గంటల వరకు లోకేశ్ విచారణ ►మధ్యాహ్నం గంటపాటు భోజన విరామం ఇవ్వాలని సీఐడీకి కోర్టు ఆదేశం ►సీఐడీ నోటీసుల్లోని పలు అంశాలపై ఈనెల 4న కోర్టును ఆశ్రయించిన లోకేష్ ►సీఐడీకి పలు స్పష్టమైన ఆదేశాలు జారీచేసిన హైకోర్టు ►విచారణ సమయంలో లోకేష్‌తో పాటు న్యాయవాదిని అనుమతించాలని ఆదేశం ►ఫలానా దస్త్రాలతో రావాలని పిటిషనర్‌ను ఒత్తిడి చేయవద్దన్న న్యాయస్థానం ►చంద్రబాబు అరెస్ట్ తర్వాత.. న్యాయ నిపుణులతో చర్చ పేరిట ఢిల్లీకి వెళ్లిన వైనం ►ఇన్నర్ రింగ్‌రోడ్ కేసులో ఏ14గా నారా లోకేష్ ►ఢిల్లీ వెళ్లి మరీ నోటీసులు ఇచ్చిన సీఐడీ పోలీసులు ► విచారణకు సహకరించాల్సిందేనని స్పష్టం చేసిన ఏపీ హైకోర్టు. చంద్రబాబు అరెస్ట్‌పై తొలిసారి స్పందించిన సీఎం జగన్ ► చంద్రబాబు అనే వ్యక్తి ప్రజల్లో ఉన్నా, జైల్లో ఉన్నా పెద్ద తేడా ఏమీ పడదు ► ఆయనకు విశ్వసనీయత లేదు, రాదు. ఎక్కడున్నా ఆయనకు విశ్వసనీయత లేదు. అలాంటి ఆయన ఎక్కడున్నా ఒక్కటే. ► చంద్రబాబును చూసినప్పుడు, ఆయన పార్టీని చూసినప్పుడు పేదవాడికి, ప్రజలకు గుర్తుకు వచ్చేది ఒక్కటే, మోసాలు, వెన్నుపోట్లు, అబద్ధాలు, వంచనలు. ► చంద్రబాబు నాయుడ్ని ఎవ్వరూ కూడా కక్షసాధింపుతో అరెస్టు చేయలేదు. ఆయనమీద నాకు ఎలాంటి కక్ష లేదు. కక్షసాధించి ఆయన్ను ఎవ్వరూ అరెస్ట్ చేయలేదు ► నేను భారతదేశంలో లేనప్పుడు, లండన్‌లో ఉన్నప్పుడు చంద్రబాబును పోలీసులు అరెస్టు చేశారు. ► కక్షసాధింపే నిజమనుకుంటే.. కేంద్రంలో బీజేపీ ఉంది, దత్తపుత్రుడు బీజేపీతోనే ఉన్నానని ఇప్పటికీ అంటున్నాడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలితోపాటు, సగం టీడీపీ నాయకులు బీజేపీలోనే ఉన్నారు. ► కేంద్రంలోని ఇన్‌కంటాక్స్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ చేసి ఆయన అవినీతిని గమనించి నోటీసులిచ్చాయి, దోషులను అరెస్టు చేసింది ► చంద్రబాబుకు నేరుగా ఇన్‌కంట్యాక్స్ నోటీసులు కూడా ఇచ్చారు. ► మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మోడీగారు బాబుపై అవినీతి ఆరోపణలు కూడా చేశారు. పోలవరంను చంద్రబాబు ఏటీఎంలా మార్చారని ప్రధాని స్వయంగా చెప్పారు. ► రాష్ట్రంలో సీబీఐని, ఐటీని, ఈడీని అడుగు పెట్టనివ్వనని గతంలో చంద్రబాబు పర్మిషన్కూడా విత్‌డ్రా చేశాడు. ► ఆనాటికే అవినీతిపరుడని స్పష్టంగా రూఢి అయిన ఈ వ్యక్తిపైన విచారణ చేయకూడదట ► విచారించిన తర్వాత రిమాండుకు పంపినా ఒక చంద్రబాబును గాని, వీరప్పన్గాని ఎవ్వరూ కూడా పట్టించి ఇవ్వడానికి వీల్లేదని ఎల్లోమీడియా, ఎల్లో గజదొంగల ముఠా వాదనలు వినిపిస్తున్నాయి. ► ఇలాంటి వ్యవస్థలతో మనం యుద్ధంచేస్తున్నాం. నిన్న సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు వివరాలు.. ► హరీష్ సాల్వే : ఒక ప్రజా ప్రతినిధి సైకిల్ దొంగతనం చేస్తే.. దానికి అవినీతి నిరోధక చట్టం వర్తించదు. అంటే జరిగిన అక్రమం తనకు కేటాయించిన విధులకు సంబంధించినదయి ఉండాలి ► జస్టిస్ బోస్ : మీ వాదన ప్రకారం ఈ సెక్షన్ పైపైన వర్తిస్తుందని అనుకోవాలి ► హరీష్ సాల్వే :: అంటే అధికారిక నిర్ణయాలకు సంబంధించినవి కాబట్టి.. ► జస్టిస్ బోస్ : ఇందులో పరిపాలనపరమైన అంశాలున్నాయి. కేసులో అభియోగాలను పరిశీలిస్తే.. 10 శాతం అడ్వాన్స్ నిధులను ముందే విడుదల చేశారు ► హరీష్ సాల్వే :నేను కేసు లోతుల్లోకి వెళ్లడం లేదు. అయినా ఈ కేసులో నిందితులందరికీ ఇప్పటికే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయినా మేం 17Aపైనే ఎందుకు వాదిస్తున్నామంటే అరెస్ట్ చేసిన విధానం సరికాదని. పార్లమెంటులో చట్టం తెచ్చిన ఉద్దేశ్యమేంటంటే.. ఈ సవరణ తర్వాత జరిగిన కేసులకు 17A SOP వర్తించాలని. 3:45 PM, అక్టోబర్ 9, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు ► హరీష్ సాల్వే : కానీ ఈ కేసులో పోలీసు అధికారి తన బాధ్యతలో భాగంగా తన పై అధికారి ముందస్తు అనుమతి తీసుకోవాలి. ► జస్టిస్ త్రివేదీ : సెక్షన్ 6A DSPE act (ఢిల్లి స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్)కు సంబంధించి సుప్రీంకోర్టు ధర్మాసనం ఉత్వర్వులను చూడండి. ఆ కేసులో అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఏం చెప్పిందో చూడండి. అది సరిగ్గా 17A సవరణ తరహాలోనే ఉంది కదా. ► సెక్షన్ 6A DSPE act (ఢిల్లి స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్) కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే : 2014కు ముందు నమోదయిన అవినీతి, అక్రమాల కేసుల్లో ప్రజా ప్రతినిధులకు ఎలాంటి మినహాయింపు ఉండదు. ఇది సరిగ్గా 17Aకు సంబంధం ఉన్న కేసే. 3:25 PM, అక్టోబర్ 9, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు ►హరీష్ సాల్వే :ఈ కేసులో చంద్రబాబు పేరును సెప్టెంబర్ 8, 2023న చేర్చారు. ఒకప్పుడు 37వ నిందితుడిగా ఉన్న చంద్రబాబును మొదటి నిందితుడిగా చేర్చామని తెలిపారు. దర్యాప్తు అధికారి చెప్పిన దాని ప్రకారం A37 (చంద్రబాబు) సూచనల మేరకు A36 (నిందితుడి సంఖ్య 36) నేరానికి పాల్పడ్డారు. కాబట్టి ఇది అవినీతి నిరోధక చట్టం కిందికి వర్తిస్తుందని చెప్పారు. అప్పుడే గవర్నర్ దగ్గరకు వెళ్లి అనుమతి తీసుకోవాల్సింది. ► జస్టిస్ త్రివేదీ : 17A సవరణను ఎలాగైనా చూడవచ్చు. 17A సవరణ కంటే ముందు జరిగిన నేరాల సంగతేంటీ? ఒక్కో సవరణ వచ్చినప్పుడల్లా కొత్తగా కొందరిని దీని పరిధిలోకి తెస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అసలు ఈ కేసులో 17A సవరణ వర్తిస్తుందా? ► జస్టిస్ బోస్ : 17A అనేది కేవలం నేరం జరిగిన తేదీకి వర్తిస్తుంది కానీ, నిందితులకు కాదు కదా. ► హరీష్ సాల్వే : 17A అనేది నేరం జరిగిన తేదీని బట్టి పరిగణించవద్దని కోరుతున్నాను. ఈ చట్టం ఉద్దేశ్యం ఏంటంటే, దర్యాప్తు పేరిట ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టకూడదన్నది. ► జస్టిస్ త్రివేదీ : 17A సవరణ అన్న చట్టాన్ని మనం అవినీతి నిరోధక చట్టం ఉద్దేశ్యంలో చూడాలి. దాని ప్రకారం ప్రజా ప్రతినిధులు అక్రమాలకు పాల్పడకూడదని. అంతే తప్ప.. చట్టంలోని ప్రధాన ఉద్దేశ్యాన్ని పక్కనబెట్టి ఒక వ్యక్తికి మేలు జరిగేలా ఈ చట్టాన్ని విశ్లేషించుకోవద్దు. అది మొత్తం లక్ష్యాన్నే దెబ్బతీస్తుంది. 3:25 PM, అక్టోబర్ 9, 2023 విజయవాడ: చంద్రబాబు కేసులో ACB కోర్టు కీలక నిర్ణయం ► చంద్రబాబు పెట్టుకున్న బెయిల్ పిటిషన్ కొట్టేసిన కోర్టు ► CID వేసిన కస్టడీ పిటిషన్ తిరస్కరించిన న్యాయస్థానం 3:15 PM, అక్టోబర్ 9, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు ► హరీష్ సాల్వే : కేంద్రం ఈ చట్టాన్ని ఎందుకోసం తెచ్చిందో గుర్తు చేసుకోవాలి. 17A అమలు ఎలా ఉండాలన్నదానిపై కొన్ని మార్గదర్శకత్వ నిర్దేశకాలను కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 3, 2021న రాష్ట్రాలకు పంపింది. ఏ స్థాయి నాయకుల విషయంలో ఎవరి అనుమతి తీసుకోవాలన్న విషయంలో స్పష్టత ఇచ్చింది. దాన్ని బట్టి ఎలాంటి దర్యాప్తు జరగాలన్నా ముందస్తు అనుమతి కావాలి. ► జస్టిస్ త్రివేదీ : ఈ SOP అన్నది మూడేళ్ల కిందనే 17a సవరణ తెచ్చినప్పుడు ప్రకటించింది. SOP ప్రకటించకముందు సంగతేంటీ? అయినా Regime Revenge (పదవీ మారగానే రాజకీయ కక్ష చూపించడం) అని ఎవరన్నారు? ► హరీష్ సాల్వే: మా స్నేహితుడు రాజీవ్ ధావన్ ఈ పదాన్ని ఉపయోగించారు. కేంద్రం తెచ్చిన SOP కోర్టు ముందు నిలబడకపోవచ్చు. కానీ ఆ చట్టం వెనకున్న పరమార్థాన్ని మెరుగ్గా అర్థం చేసుకోడానికి ఉపయోగపడవచ్చు. 2:50 PM, అక్టోబర్ 9, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు ► హరీష్ సాల్వే : ఈ కేసులో హైకోర్టు ఏం చెప్పిందంటే.. 2015-16 మధ్య కాలంలో జరిగిన నేరానికి సంబంధించిన అభియోగాలున్నాయి కాబట్టి, దర్యాప్తు జరిగిన తేదీని పట్టించుకోమని చెప్పింది. అందుకే ఆ డాక్యుమెంట్‌ను హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదు. న్యాయశాస్త్రంలో ఉన్న విషయాన్ని రెండు రకాలుగా అన్వయించుకోవచ్చు. కానీ నిర్దారణ అయిన విషయాలను అనుమానించలేరు. రిమాండ్ విధించిన ఆర్డర్లో చంద్రబాబు పాత్రను 2021లో జరిగిన ప్రాథమిక దర్యాప్తు ద్వారా నిర్దారించామని కోర్టుకు CID తెలిపింది. 17A సవరణ కూడా సరిగ్గా ఇలాంటి కేసుల కోసమే తీసుకొచ్చారు. 2:35 PM, అక్టోబర్ 9, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు ► హరీష్ సాల్వే: ఈ కేసులో ఫిర్యాదును చూస్తే.. సీమెన్స్, డిజైన్‌టెక్, ఇతరుల పేర్లున్నాయి తప్ప పిటిషనర్ పేరు లేదు. పైగా ఈ కేసులో ప్రాథమిక దర్యాప్తు 2021 తర్వాత జరిగిందని భావించాలి. అందువల్ల 17A సవరణ ఈ కేసుకు వర్తిస్తుంది. ► జస్టిస్ బోస్ : ఈ కేసులో రెండు విషయాలు పరిశీలిస్తున్నాం. ఒకటి, హైకోర్టు ముందు CID దాఖలు చేసిన డాక్యుమెంట్. జులై 5,2018న దర్యాప్తు ప్రారంభమయిందని చెప్పే డాక్యుమెంట్. రెండో అంశం.. హైకోర్టు ముందు వాదన వినిపించడానికి మీరు అవకాశం కోల్పోయారా? అన్న విషయాలను. వీటిని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటాం. ► హరీష్ సాల్వే : ఇప్పుడు మీరు మళ్లీ హైకోర్టుకు వెళ్లి వాదన వినిపించమంటే మేం నష్టపోతాం. హైకోర్టు కచ్చితంగా సెక్షన్ 17A సవరణ దీనికి వర్తించదంటారు. ఒక డాక్యుమెంట్ కారణంగా తీర్పు మారకూడదు. నేను మీకు ఈ డాక్యుమెంట్ గురించి ఎందుకు చెప్పానంటే.. దీని వల్లే CID వారు దర్యాప్తును 2018కంటే ముందు ప్రారంభించామంటున్నారు ► హరీష్ సాల్వే : హైకోర్టు ఏమంటుందంటే, ప్యారా 15 ప్రకారం నేరం 2015-16 మధ్య జరిగిందని చెబుతుంది. వారి దృష్టిలో దర్యాప్తు తేదీకి ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే ఏపీ హైకోర్టు అసలు డాక్యుమెంట్నే పరిగణనలోకి తీసుకోలేదు 2:20 PM, అక్టోబర్ 9, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు ► జస్టిస్ త్రివేదీ : ఈ కేసులో మీ వాదనంతా దేని మీద ఉందంటే.., వాదనల తర్వాత డాక్యుమెంట్ సమర్పించారని మీరు చెబుతున్నారు. అంటే అసలేం వినకుండానే కేసు కొట్టేస్తారా? ► CID తరపున సీనియర్ లాయర్ నిరంజన్ రెడ్డి : ఈ కేసులో వాదనల తర్వాత డాక్యుమెంట్లు సమర్పించామని సాల్వే చేస్తోన్న వాదన సరికాదు. కేసు రిమాండ్‌లోనే ఈ విషయం అంతా ఉంది ► బాబు తరపున సీనియర్ లాయర్ సాల్వే : ఏ కేసులోనయినా హైకోర్టు ఏం భావనలో ఉంటుందంటే.. ఆ రిమాండ్ 17A సవరణకు లోబడి ఉంటుందని అనుకుంటుంది. 2021లో జరిగిన ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా దర్యాప్తు ప్రారంభమయింది. ► జస్టిస్ బోస్ : ఈ కేసులో దర్యాప్తు ఎప్పుడు ప్రారంభమయింది? ► బాబు తరపున సీనియర్ లాయర్ సాల్వే: సెప్టెంబర్ 7, 2021 ► జస్టిస్ బోస్ : దేని ఆధారంగా ఆ విషయం చెబుతున్నారు? ► బాబు తరపున సీనియర్ లాయర్ సాల్వే: డిజైన్ టెక్ పన్ను ఎగ్గొట్టిందని GST (గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్) డిపార్ట్మెంట్ పసిగట్టింది. అంతే తప్ప దీనికి పిటిషనర్‌కు సంబంధం లేదు. ► జస్టిస్ త్రివేదీ : డిజైన్ టెక్ ఒప్పందం ఎవరితో కుదుర్చుకున్నారు? ► బాబు తరపున సీనియర్ లాయర్ సాల్వే: నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో 2:14 PM, అక్టోబర్ 9, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు ► బాబు లాయర్ సాల్వే : 17A సవరణ మీద వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు హైకోర్టులు వేర్వేరు పద్ధతులు అనుసరిస్తున్నాయి. కొన్ని కోర్టులు నేరం జరిగిన తేదీ అంటున్నాయి. మరికొన్ని FIR నమోదయిన తేదీ అంటున్నాయి ► ఇది అవినీతి నిరోధక చట్టానికి వర్తిస్తుందా లేదా అని న్యాయస్థానం ప్రశ్నించింది ► దీనిపై ప్రత్యేక న్యాయస్థానంలో ఇచ్చిన ఆదేశాలను మీ ముందుంచుతున్నాం ► సెక్షన్ 17A సవరణ వర్తిస్తుందని విజ్ఞప్తి చేస్తున్నాం ► పంకజ్ బన్సల్ కేసులో కోర్టు ఏం చెప్పిందంటే.. అరెస్ట్ సక్రమం కానప్పుడు రిమాండ్ రిపోర్ట్ చెల్లదని న్యాయస్థానం చెప్పింది : సాల్వే ► వాదనల తర్వాత CID వారు డాక్యుమెంట్ సమర్పించారు -
మార్గదర్శి అవకతవకలు.. సీఐడీ కీలక ప్రకటన
సాక్షి, విజయవాడ: మార్గదర్శి చిట్‌ఫండ్స్ అవకతవకలకు సంబంధించి దర్యాప్తు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. చిట్ ఫండ్ నిధుల మళ్లింపు.. అక్రమాల ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న ఏపీ సీఐడీ మంగళవారం ఓ కీలక ప్రకటన చేసింది. మార్గదర్శి లో రూ. కోటి పైన నగదు డిపాజిట్ చేసిన ఖాతాదారులకు నోటీసులు జారీ చేసినట్లు ఒక ప్రెస్‌నోట్‌లో తెలిపింది. ఆర్బీఐ, సీబీడీటీ నిబంధనల ప్రకారం నోటీస్ లు జారీ చేసినట్లు ఏపీ సీఐడీ సదరు నోట్లో పేర్కొంది. ఈ మేరకు మార్గదర్శి లో రూ. కోటి పైన నగదు లావాదేవీల వివరాలు తెలపాలని పేర్కొంది. ఆర్థిక నేరాల, మనీ లాండరింగ్ నివారణకు RBI, CBDT తీసుకొచ్చిన నిబంధనల మేరకే ఈ నోటీసులు జారీ చేసినట్లు ఏపీ సీఐడీ స్పష్టం చేసింది. ఇదీ చదవండి: ఇదేందయ్యా ఇది.. రామోజీ రాసిందే రసీదు! గత విచారణ సందర్భంగా రామోజీరావు(ఫైల్‌ఫోటో) మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సంబంధించిన ఆర్థిక మోసం కేసులపై కొనసాగుతున్న విచారణలో. ఇప్పటికే సంస్థ ఎండీ, డైరెక్టర్లను ఏపీ సీఐడీ పలుమార్లు విచారించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు నోటీసులు అందుకున్న బాధిత చందాదారులందరూ విచారణకు పూర్తిగా సహకరించాలని AP CID కోరుతోంది. ఇదీ చదవండి: మార్గదర్శి దర్యాప్తుపైనా ఈనాడు తప్పుడు రాతలే! -
గంటా అనుచరుడు దొరబాబు ఇంట్లో సీఐడీ సోదాలు
విశాఖపట్నం: అమరావతి అసైన్డ్ భూముల కుంభకోణంలో అరెస్టయిన ఏయూ దూరవిద్య కేంద్రం అసిస్టెంట్ ప్రొఫెసర్ (కాంట్రాక్ట్) కె.దొరబాబు ఇంట్లో సీఐడీ పోలీసులు బుధవారం తనిఖీలు చేసినట్లు తెలిసింది. ఈ కేసులో ఇప్పటికే సీఐడీ పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. టీడీపీ హయాంలో గంటాకు అనుచరునిగా ఉంటూ అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో దొరబాబు పాత్ర ఉండటంతో సీఐడీ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఏయూ దూరవిద్య కేంద్రంలో ఆయన గదిని ఏయూ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఏయూ దూరవిద్య కేంద్రం అధికారులు సీజ్ చేశారు. నారాయణకు మధ్యంతర ముందస్తు బెయిల్ సాక్షి, అమరావతి: అమరావతి రాజధాని ముసుగులో దళిత, బలహీనవర్గాల రైతులకు చెందిన 1,100 ఎకరాల అసైన్డ్, లంక భూములను కాజేసిన వ్యవహారంపై సీఐడీ నమోదు చేసిన కేసులో టీడీపీ మాజీ మంత్రి పొంగూరు నారాయణకు హైకోర్టు బుధవారం మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 14 నుంచి డిసెంబర్ 14 వరకు మూడు నెలలు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ మూడు నెలలూ నారాయణను అరెస్ట్ చేయవద్దని సీఐడీని ఆదేశించింది. తుది విచారణను డిసెంబర్ 15కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. సీఐడీ 2020లో నమోదు చేసిన ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ నారాయణ దాఖలు చేసిన వ్యాజ్యంపై కోర్టు బుధవారం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. రాజధానికి సంబంధించిన మరో కేసులో హైకోర్టు పిటిషనర్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేసి, చికిత్సకు అమెరికా వెళ్లేందుకు అనుమతి ఇచ్చిందన్నారు. ఈ వాదనను ఏఏజీ తోసిపుచ్చారు. పిటిషనర్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదై ఉన్నందున, ఈ పిటిషన్‌కు విచారణార్హత లేదని చెప్పారు. ప్రయాణానికి ఒక్క రోజు ముందు పిటిషన్ దాఖలు చేశారని తెలిపారు. వాదనలు విన్న కోర్టు నారాయణకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. (క్లిక్ చేయండి: నారాయణ స్వాహా.. బంధుగణంతో ‘అసైన్డ్’ మేత) -
అడ్డంగా దొరికిన అశోక్‌బాబు
సాక్షి, అమరావతి: తప్పుడు విద్యార్హతతో ప్రభుత్వాన్ని మోసగించిన టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. పదోన్నతి కోసం తన సర్వీస్ రిజిస్టర్‌ను ట్యాంపర్ చేయడమే కాకుండా, ఏకంగా ఉస్మానియా యూనివర్సిటీ పేరుతో ఫేక్ బి.కాం సర్టిఫికెట్ సమర్పించి ప్రభుత్వాన్ని బురిడీ కొట్టించారు. దీనిపై కేసు పెండింగులో ఉన్నాసరే నిబంధనలకు విరుద్ధంగా స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు. తనపై కేసులు పెండింగులో లేవని పేర్కొంటూ ఎమ్మెల్సీగా తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారు. తప్పుడు సర్టిఫికెట్తో పదోన్నతి పొందడమే కాకుండా సహచర ఉద్యోగుల పదోన్నతి అవకాశాలకూ గండి కొట్టారు. లోకాయుక్త ఆదేశాలతో అశోక్‌బాబుపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసిన సీఐడీ విభాగం.. కీలక ఆధారాలు సేకరించి, ఈ కేసులో కీలక పురోగతి సాధించింది. అర్థం కాని విధంగా సర్వీస్ రిజిస్టర్లో మార్పులు ఇంటర్మీడియట్ విద్యార్హతతో వాణిజ్య పన్నుల శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా చేరిన అశోక్‌బాబు.. డి.కాం(డిప్లమో ఇన్ కంప్యూటర్స్) చేసి, సీనియర్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందారు. కాగా వాణిజ్య పన్నుల శాఖ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఉన్నతోద్యోగం పొందాలంటే డిగ్రీ కనీస అర్హత ఉండాలి. దాంతో తన సర్వీస్ రిజిస్టర్‌లోని ‘డి.కాం’ ను కాస్త ‘బి.కాం’గా మార్చివేసి ట్యాంపరింగ్‌కు పాల్పడ్డారు. తర్వాత పదోన్నతి పొంది వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కార్యాలయంలో విధుల్లో చేరారు. కాగా, ఆయన విద్యార్హతపై ఫిర్యాదులు రావడంతో సర్వీస్ రిజిస్టర్లో విద్యార్హత కాలమ్‌లో పేర్కొన్న సమాచారాన్ని అడ్డదిడ్డంగా కొట్టివేశారు. అందులో పేర్కొంది ఏమిటన్నది తెలియకుండా చేశారు. పొరపాటు అయితే ఫేక్ సర్టిఫికెట్ ఎందుకు? పదోన్నతి కోసం తన విద్యార్హత బి.కాంగా పేర్కొన్న అశోక్‌బాబు అంతటితో ఆగలేదు. ఏకంగా ఉస్మానియా యూనివర్సిటీ పేరుతో ఓ ఫేక్ బి.కాం సర్టిఫికెట్‌ను సృష్టించి సమర్పించినట్టు తెలుస్తోంది. తాను బి.కాం చేసినట్టుగా అఫిడవిట్ కూడా సమర్పించారు. సీఐడీ దర్యాప్తులో ఈ అంశం తాజాగా వెలుగులోకి వచ్చినట్టు సమాచారం. దాంతో ఈ కేసులో సీఐడీ అధికారులు కీలక ఆధారం సేకరించినట్టే. తనపై సీఐడీ కేసు నమోదు చేయగానే తాను ఇంటర్మీడియట్ మాత్రమే చదివానని, తన సర్వీస్ రిజిస్టర్లో టైపింగ్ పొరపాటుతో బి.కాం అని పడినట్టు అశోక్‌బాబు వాదిస్తూ వచ్చారు. మరి టైపింగ్ పొరపాటే అయి ఉంటే.. ఉస్మానియా యూనివర్సిటీ పేరుతో ఫేక్ సర్టిఫికెట్ ఎందుకు సమర్పించాల్సి వచ్చిందన్న ప్రశ్న తలెత్తుతోంది. అంటే అశోక్‌బాబు ఉద్దేశ పూర్వకంగానే ఫేక్ సర్టిఫికెట్తో ప్రభుత్వాన్ని మోసం చేశారన్నది స్పష్టమవుతోంది. ఎమ్మెల్సీ నామినేషన్లోనూ తప్పుడు సమాచారం టీడీపీ ప్రభుత్వ హయాంలో అశోక్‌బాబుపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోలేదు. పైగా ఆయన్ను టీడీపీ తరఫున ఎమ్మెల్సీ చేశారు. అందుకోసం హడావుడిగా ఆయనకు స్వచ్ఛంద పదవీ విరమణకు అనుమతి ఇచ్చారు. పెండింగు కేసులు ఉండగా, స్వచ్ఛంద పదవీ విరమణకు అవకాశం ఇవ్వకూడదన్న నిబంధనను టీడీపీ ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే విస్మరించింది. ఇక ఎమ్మెల్సీగా నామినేషన్ వేసే సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్లోనూ తప్పుడు సమాచారమే ఇచ్చారు. తనపై ఎలాంటి కేసులు పెండింగులో లేవని పేర్కొన్నారు. అయితే లోకాయుక్త ఆదేశాలతో అశోక్‌బాబుపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టిన సీఐడీ కీలక ఆధారాలు సేకరించింది. సర్వీస్ రిజిస్టర్లో ట్యాంపరింగ్, ఉస్మానియా విశ్వవిద్యాలయం పేరుతో నకిలీ సర్టిఫికెట్, నిబంధనలకు విరుద్ధంగా స్వచ్ఛంద పదవీ విరమణ, ఎమ్మెల్సీగా నామినేషన్ కోసం సమర్పించిన అఫిడవిట్లో తప్పుడు సమాచారం.. ఇలా వీటన్నింటికీ సంబంధించిన పూర్తి ఆధారాలు సేకరించింది. వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో రికార్డులను పరిశీలించి అశోక్‌బాబు సమర్పించిన ఫేక్ సర్టిఫికెట్‌కు సంబంధించిన కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. ఆయన సర్వీస్ రిజిస్టర్లో ట్యాంపరింగ్ చేసినట్టు కూడా ఆధారాలు లభించాయి. అనంతరమే అశోక్‌బాబును అరెస్టు చేసి గుంటూరులోని ప్రాంతీయ సీఐడీ కార్యాలయానికి తరలించింది. ఈ కేసుపై ఆయన్ను సీఐడీ అధికారులు శుక్రవారం వివిధ కోణాల్లో విచారించినట్టు తెలుస్తోంది. తప్పుడు నివేదిక ఇచ్చిన వారినీ కేసులో చేర్చాలి టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబును అరెస్టు చేయడం హర్షనీయమని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ఎన్జీవోల సంఘం–1 అధ్యక్షుడు బి.మెహర్ కుమార్ అన్నారు. ఆయన నేరాన్ని పూర్తి సాక్ష్యాధారాలతో రుజువు చేసి తగిన శిక్ష పడేలా చూడాలని శుక్రవారం ఆయన ఓ ప్రకటనలో కోరారు. ప్రభుత్వాన్ని మోసం చేసిన అశోక్‌బాబును సమర్థించిన ముగ్గురు ఉన్నతాధికారులపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన టీడీపీ ఎమ్మెల్సీగా నామినేషన్ వేసేందుకు వీలుగా హడావిడిగా తప్పుడు నివేదిక ఇచ్చిన వారిని కూడా కేసులో చేర్చాలన్నారు. అశోక్‌బాబుతో కుమ్మక్కై ప్రభుత్వాన్ని మోసం చేసిన అప్పటి విచారణ అధికారి పుల్లయ్య, సంయుక్త కమిషనర్ కిరణ్‌కుమార్‌లపై కూడా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సిండికేట్ రింగ్ మాస్టర్ అశోక్ బాబు టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబు రాష్ట్రంలో పలువురు అవినీతి ఉన్నతాధికారుల అక్రమాలకు వత్తాసు పలికే సిండికేట్‌ను నిర్వహించారని విజయవాడలోని సనత్ నగర్‌కు చెందిన షేక్ నజియా బేగం విమర్శించారు. ప్రధానంగా ఏసీబీ దాడుల్లో దొరికిన ఉన్నతాధికారుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ద్వారా ఆ కేసులను నీరుగార్చారని చెప్పారు. 2016లో ఆదాయానికి మించి ఆస్తులు కలిగిన వాణిజ్య పన్నుల శాఖ సంయుక్త కమిషనర్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా అశోక్‌బాబే రక్షించారన్నారు. ఏసీబీ కేసు విచారణ కూడా ముందుకు సాగకుండా చేయడంతోపాటు కనీసం శాఖా పరమైన విచారణ జరగకుండా అడ్డుకున్నారని చెప్పారు. దీనిపై తాము పూర్తి ఆధారాలతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. అశోక్‌బాబు, సంయుక్త కమిషనర్ అవినీతికి వత్తాసు సహకరించిన ఓ ఐఏఎస్ అధికారికి విజయవాడలో కోట్లాది రూపాయల విలువైన ఇంటిని బహూకరించారని ఆమె చెప్పారు. అశోక్‌బాబు సిండికేట్‌లోని అవినీతి అధికారులపై కూడా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేయాలని ఆమె కోరారు. గుంటూరులో టీడీపీ హైడ్రామా పాత గుంటూరు/విజయవాడ లీగల్ : సీఐడీ అధికారులు అరెస్టు చేసిన ఎమ్మెల్సీ అశోక్‌బాబును కలిసేందుకు వచ్చిన టీడీపీ నాయకులను లోపలికి అనుమతించక పోవడంతో ధర్నాకు దిగి హైడ్రామాకు తెరలేపారు. సీఐడీ అధికారులు కావాలనే ఎమ్మెల్సీ అశోక్ బాబుపై అక్రమ కేసులు పెట్టారని శుక్రవారం హంగామా సృష్టించారు. ఈ సందర్భంగా టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ.. అశోక్ బాబును అర్ధరాత్రి అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆరోపించారు. ఎంపీ రఘరామ కృష్ణంరాజును కొట్టినట్లు అశోక్ బాబుని సైతం కొట్టాలని చూస్తున్నారన్నారు. తప్పు చేయలేదు కనుక ముందస్తు బెయిల్ తీసుకోలేదని చెప్పారు. ఏపీలో రాక్షస పాలన సాగుతోందని, ప్రజల కోసం పోరాడుతున్న తమపై ఎన్ని దాడులు చేసినా భయపడమని అన్నారు. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ ప్రభుత్వం కనుసన్నల్లో సీఐడీ అధికారులు పని చేస్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో దేవినేని ఉమతో పాటు టీడీపీ నేతలు రావిపాటి సాయికృష్ణ, మన్నవ మోహనకృష్ణ, అబ్బూరు మల్లి తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్, తెనాలి శ్రావణ్‌కుమార్‌లు కొద్దిసేపు హడావుడి చేసి వెళ్లిపోయారు. కాగా, నిషేధాజ్ఞలు ఉల్లంఘించి ధర్నా చేసిన 60 మందిపై సెక్షన్ 151 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం గుంటూరు జీజీహెచ్‌లో అశోక్‌బాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత విజయవాడ కోర్టుకు తరలించారు. బెయిల్ మంజూరు ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబు తప్పుడు పత్రాలు సృష్టించి పదోన్నతి పొందినట్లుగా నిర్ధారణ కావడంతో సీఐడీ పోలీసులు 10వ తేదీ రాత్రి ఆయన్ను అరెస్టు చేశారు. శుక్రవారం సాయంత్రం విజయవాడ మూడవ అదనపు చీప్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఇన్చార్జ్ జడ్జి ఎదుట హాజరు పరిచారు. రాత్రి వరకు ఇరు పక్షాల వాదనల అనంతరం న్యాయమూర్తి.. అశోక్‌బాబుకు బెయిల్ మంజూరు చేశారు. ఇదిలా ఉండగా అంతకు ముందు తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ శుక్రవారం లంచ్ మోషన్ రూపంలో అశోక్‌బాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన జస్టిస్ దొనడి రమేశ్ ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశించారు. ఈ వ్యాజ్యంలో లోకాయుక్త వాదన కూడా వినేందుకు ప్రతివాదిగా చేర్చాలని అశోక్‌బాబు తరఫు న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లును ఆదేశిస్తూ ఈ నెల 14వ తేదీకి విచారణ వాయిదా వేశారు. -
చంద్రబాబుకు ఏపీ సీఐడీ నోటీసులు
సాక్షి, అమరావతి: అమరావతి భూ కుంభకోణం కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి వెళ్లి దీనికి సంబంధించిన నోటీసులను అందజేశారు. 41 కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రాసెస్ (సీఆర్పీసీ) కింద నోటీసులు ఇచ్చారు. ఇదే కేసులో మాజీ మంత్రి నారాయణకు కూడా సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23న విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అమరావతి భూ కుంభకోణం వ్యవహారంలో ఇప్పటికే ఐపీసీ సెక్షన్లు 120 బీ, 166, 167, 217, ప్రొహిబిషన్ ఆఫ్ అసైన్డ్ ల్యాండ్స్ అలినేషన్ యాక్ట్ 1977, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద కేసులు నమోదు అయ్యాయి. సుమారు 500 ఎకరాల అసైన్డ్ భూముల బదలాయింపుకు సంబంధించి చంద్రబాబుపై అధికారులు కేసు నమోదు చేశారు. కేబినెట్ ఆమోదం లేకుండానే ఈ భూములను ల్యాండ్‌పూలింగ్‌లో చేర్చడానికి జీవో ఇచ్చారని ప్రధాన అభియోగం మోపారు సీఐడీ అధికారులు. వాస్తవంగా దళితులకు కేటాయించిన ఈ భూములను రాజధాని ప్రకటనకు ముందు కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఈ అసైన్డ్ భూముల కొనుగోళ్లను వన్‌టైమ్ సెటిల్మెంట్లో క్రమబద్దీకరణ చేయడానికి అనుమతించారు. ఈ క్రమంలో అధికారుల అభ్యంతరాలను, సూచనలను పట్టించుకోకుండా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నాడనే ఆరోపణలు వచ్చాయి. రాజధాని అసైన్డ్ భూముల విషయంలో జరిగిన అక్రమాలు, అవకతవకలు అన్నీ ఇన్నీకావు. దళితులు, నిరుపేదలు దారుణంగా మోసపోయారు, అన్యాయం అయిపోయారు. అధికారపార్టీనేతల లాఘవానికి వీళ్లు బలైపోయారు. ఒక పథకం ప్రకారం చవకగా తమ భూములను అమ్ముకునేలా చేశారు. రాజధాని ప్రాంతంలో అసైన్ఢ్ భూములకు ఎలాంటి ప్లాట్లు రావని ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేశారు. అసైన్డ్ భూములు అమ్మేయాలంటూ బెదిరింపులకు దిగారు. బలవంతంగా వాటిని కొనుగోలుచేశారు. దీనికోసం సబ్రిజిస్ట్రార్లపై అధికారపార్టీ నాయకులు విపరీతంగా ఒత్తిడి తీసుకు వచ్చారు. తర్వాత ఈ భూములను భూ సమీకరణలో తీసుకోవడానికి, తీసుకున్నవాటికి ప్రతిఫలంగా ప్లాట్లు ఇవ్వడానికి అనుకూలంగా జీఓలు జారీచేశారు. ఇలా అసైన్డ్భూములను కొనుగోలుచేసి, వాటిని ల్యాండ్ పూలింగ్‌కు ఇచ్చిన వారిలో ఒకే సామాజిక వర్గానికి చెందినవారే ఎక్కువగా ఉండటం విశేషం. అసైన్డ్భూములను తక్కువకు కొనుగోలుచేసి రాజధానిలో ప్లాట్లు పొందిన వారిలో ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితులైనవారు ఉన్నట్టు రికార్డుల్లో వెలుగుచూసింది. నారాలోకేష్ సన్నిహితుడు కొల్లి శివారం 47.39 ఎకరాలను ఇలా కొని దానికి ప్రతిఫలంగా ప్లాట్లు పొందారు. నారాలోకేష్ సన్నిహితుడు గుమ్మడి సురేష్ 42.925 ఎకరాల అసైన్డ్ ల్యాండ్‌ను చేజిక్కించుకున్నారు. నారాలోకేష్ వద్ద ఉండే మరో వ్యక్తి బలుసు శ్రీనివాసరావు 14.07 ఎకరాలను అసైన్డ్ దారులనుంచి తక్కువకే లాక్కున్నారు. మొత్తంగా 338. 887 ఎకరాల అసైన్డ్ భూములను ఈ రకంగా తక్కువకే కొనుగోలు చేసి ప్రతిఫలంగా రాజధాని ప్రాంతంలో ప్లాట్లు పొంది ఆర్థికంగా లబ్ధి పొందారు. చదవండి: అమరావతి భూకుంభకోణం: ‘గ్యాగ్’ ఎత్తివేత గత సర్కారు నుంచి భూములు తీసుకున్నారు.. -
'కరోనా' మాటున హ్యాకింగ్ 'కాటు'
సాక్షి, అమరావతి: ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా మాటున సైబర్ కేటుగాళ్లు హ్యాకింగ్ కాటు వేస్తున్నారు. కరోనాను అడ్డుపెట్టుకుని ప్రపంచంలోని పలు దేశాల్లో, మన దేశంలో కార్పొరేట్ సంస్థల డేటా చోరీకి పాల్పడుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒకసారి, మార్చి 15 నుంచి 19 తేదీ వరకు మరోసారి పెద్ద ఎత్తున సైబర్ ఎటాక్స్ జరిగినట్టు అంతర్జాతీయ స్థాయిలో సైబర్ సెక్యూరిటీ సర్వీసెస్ అందించే ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ (పీడబ్ల్యూసీ) సైబర్ సెక్యూరిటీ టీమ్ పరిశీలనలో తేలినట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సీఐడీ విభాగం అప్రమత్తమైంది. ఏపీలో అప్రమత్తంగా ఉన్నాం.. సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు ఆసక్తికర అంశాలను ఎరవేసి ఉచ్చులోకి లాగే ప్రయత్నాలు చేస్తారు. అలాంటి మోసాలపై టెక్నాలజీని వాడుతున్న వారంతా అప్రమత్తంగా ఉండాలి. కరోనా గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ఇదే విషయాన్ని సాకుగా తీసుకుని దేశంలో కొద్ది రోజులుగా ఈ తరహా మోసాలు జరుగుతున్నట్టు గుర్తించాం. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. సైబర్ ఎటాక్స్ తీరును అప్రమత్తంగానే గమనిస్తున్నాం. సంస్థల డేటా హ్యాకింగ్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అనధికార లింక్‌ల విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎలా జరుగుతోంది? - కరోనా వ్యాప్తి నేపథ్యంలో అనేక కార్పొరేట్ కంపెనీలు, సంస్థలు తమ ఉద్యోగులను ఇంటి నుంచే విధులు (వర్క్ ఫ్రం హోం) నిర్వహించేలా వెసులుబాటు కల్పించడాన్ని సైబర్ నేరగాళ్లు అవకాశంగా మలుచుకున్నారు. - కరోనా వైరస్ గురించిన ఆసక్తికర విషయాలు అందించే సాకుతో ఈ మెయిల్స్, యాడ్స్, వెబ్సైట్ లింక్‌లు, అప్లికేషన్ (యాప్స్) పేరుతో అనేక మందిని వలలోకి లాగుతున్నారు. ఆయా లింక్‌లను ఆసక్తిగా క్లిక్ చేయగానే కంపెనీ, సంస్థ, వ్యక్తిగత డేటా (సమాచారం) చోరీకి గురవుతోంది. - ‘కోవిడ్ లాక్’ యాప్ పేరుతో పంపిస్తున్న లింక్‌ను క్లిక్ చేయగానే సాఫ్ట్‌వేర్‌ను హ్యాక్ చేసి కంప్యూటర్లను బాŠల్క్ చేస్తున్నారు. ఆన్లైన్ ద్వారా డబ్బులు చెల్లిస్తేనే కంప్యూటర్ తిరిగి పనిచేస్తుందని సైబర్ నేరగాళ్లు డిమాండ్ చేస్తున్నట్టు గుర్తించారు. - ఇండియాలోనూ ఇదే తరహాలో యజోరాల్ట్ అనే లింక్ ద్వారా మాల్వేర్తో కంప్యూటర్లోకి చొరబడి డేటాను హ్యాక్ చేస్తున్నారు. తద్వారా సంస్థలు, వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసి ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారు. యజోరాల్ట్ అనే మాల్వేర్ మూడేళ్ల నుంచి ఇండియాలో ఉన్నప్పటికీ తాజాగా కోవిడ్–19కి సంబంధించిన యాప్‌లకు లింక్ చేసి మోసాలను తీవ్రతరం చేశారు. -
విభజనకు సీఐడీ కార్యాలయం రెడీ
ప్రస్తుత డీజీపీ కార్యాలయంలోకి తెలంగాణ సీఐడీ విభాగం ఏసీ గార్డ్స్‌లోని సైబర్ క్రైమ్ భవనంలోకి ఏపీ సీఐడీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలీసు శాఖలో విభజన ప్రక్రియ జోరందుకుంది. రాష్ట్రంలో కీలకమైన నేర దర్యాప్తు సంస్థ (సీఐడీ)ను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు విభజించే పని వేగవంతమైంది. అలాగే రెండు రాష్ట్రాలకు అధికారులు, సిబ్బంది, రికార్డుల విభజనకు అవసరమైన చర్యలను ఆ విభాగం అధిపతి టి.కృష్ణప్రసాద్ సోమవారం పూర్తి చేశారు. రాష్ట్ర పోలీస్ హెడ్‌క్వార్టర్స్ విభజనకు సంబంధించి ఇప్పటికే ఉన్నత స్థాయిలో నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ సీఐడీ కార్యాలయంగా ప్రస్తుత డీజీపీ కార్యాలయంలోని మూడో అంతస్తును నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ సీఐడీ హెడ్‌క్వార్టర్స్‌ను ప్రస్తుతం ఏసీ గార్డ్స్‌లోని సీఐడీ సైబర్‌క్రైమ్‌తోపాటు మరికొన్ని విభాగాలు కొనసాగుతున్న భవనంలో ఏర్పాటు చేయనున్నారు. అయితే ఈ భవనం చిన్నగా ఉండటంతో దాని సమీపంలోనే మరో భవనాన్ని తాత్కాలికంగా తీసుకోవాలని నిర్ణయించారు. మరోవైపు మౌలికసదుపాయాలు, రికార్డులు, కంప్యూటర్లు, టేబుళ్లు, కుర్చీలతో పాటు అధికారులు, సిబ్బందిని కూడా పంపిణీ చేసే ప్రక్రియకు కృష్ణప్రసాద్ తుది మెరుగులు దిద్దారు. వీటిని ఆమోదానికి డీజీపీ ద్వారా గవర్నర్ నరసింహన్‌కు పంపినట్టు తెలిసింది.