సాక్షి, విజయవాడ: ఫైబర్ నెట్ స్కామ్‌లో నిందితుల ఆస్తుల అటాచ్‌మెంట్‌కు ఏపీసీఐడీకి రాష్ట్ర హోంశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఫైబర్ నెట్ స్కామ్‌లో ఏ1గా చంద్రబాబు, ఏ2గా వేమూరి హరికృష్ణ ప్రసాద్, ఏ4గా టెరా సాఫ్ట్ ఎండీ, ఏ5గా తుమ్మల గోపిచంద్ ఉన్నారు. మొత్తం రూ. 17.75 కోట్ల విలువైన ఆస్తుల అటాచ్‌మెంట్‌కు సీఐడీకి అనుమతి లభించింది.
ఫైబర్ నెట్ స్కామ్‌లో నిందితులు వేమూరి హరికృష్ణ ప్రసాద్ ఆస్తుల అటాచ్‌మెంట్‌కు సీఐడీకి అనుమతి వచ్చింది. మరో నిందితుడు తుమ్మల గోపిచంద్, తుమ్మల పవన దేవి, తుమ్మల బాపయ్య చౌదరి ఆస్తుల అటాచ్‌మెంట్‌కు కూడా ఏపీ సీఐడీకి అనుమతి లభించింది. నిందితుల ఆస్తుల అటాచ్‌మెంట్‌కు సంబంధించి సీఐడీ.. ఏసీబీ కోర్టు అనుమతి కోరనుంది.
చదవండి: Fibernet Scam Case: ఫైబర్‌నెట్ స్కామ్ కేసు.. సీఐడీ చార్జ్‌షీట్‌లో ఏ-1గా చంద్రబాబు
Comments
Please login to add a commentAdd a comment