Oct 10th 2023 : చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌ | Supreme Court Hearing On Chandrababu Case Live Updates | Sakshi
Sakshi News home page

Oct 10th 2023 : చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

Published Tue, Oct 10 2023 7:32 AM | Last Updated on Wed, Oct 11 2023 2:39 PM

Supreme Court Hearing On Chandrababu Case Live Updates - Sakshi

LIVE : Chandrababu Arrest, Remand, Cases, Scams And Ground updates

07:31PM, అక్టోబర్‌ 10, 2023
చంద్రబాబు పాపాలు పండాయి
►కేసు క్లోజ్ చేసుకోవాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నాడు
►టెక్నికల్‌ అంశాలతో చంద్రబాబుకి రిలీఫ్ రాదు
►మేం అధికారంలోకి వచ్చిన ఆర్నెల్లలోనే చంద్రబాబును జైల్లో పెట్టలేదు 
►చంద్రబాబు ఏరకమైన దోపిడీకి శ్రీకారం చుట్టాడో అన్ని డాక్యుమెంట్లు పరిశీలించాం 
►చంద్రబాబు ప్రమేయం ఉందని తేలాకే అరెస్టు చేశారు 
►చంద్రబాబు దోపిడీని కూడా కోర్టులు నమ్మాయి 
►ముందస్తు బెయిల్స్ , క్వాష్ పిటిషన్ వేస్తే కోర్టులు కొట్టేశాయి 
►అవినీతి , తప్పు చేయలేదని చంద్రబాబు ఎక్కడా చెప్పడం లేదు 
►17ఏ  ప్రకారం తనను అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి తీసుకోవాలనే అంటున్నాడు 
►కోట్లు తీసుకునే చంద్రబాబు ఢిల్లీ లాయర్లు కూడా అదే చెబుతున్నారు 
►చంద్రబాబు తన జీవితంలో 18 కేసుల్లో స్టేలు తెచ్చుకున్నాడు 
►కేవలం టెక్నికల్ అంశాలను బేస్ చేసుకుని స్టేలు తెచ్చుకుంటాడు 
►2016లోనే స్కిల్ స్కామ్ మీద సీఐడీ వాళ్లు ఎఫ్ఐఆర్ వేశారు 
►ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు ఆపుకుంటూ వచ్చాడు 
►చంద్రబాబు రెండెకరాలతో రాజకీయ జీవితం ప్రారంభించాడు 
►హెరిటేజ్ లో 2 శాతం షేర్లు అమ్మితే 400 కోట్లు వస్తాయని భువనేశ్వరి చెబుతున్నారు 
►హెరిటేజ్ ఆస్తుల విలువ 20 వేల కోట్లని భువనేశ్వరి స్వయంగా ప్రజలకు చెప్పారు 
►ఒక్క హెరిటేజ్ లో 20 వేల కోట్లు వైట్ మనీ ఐతే ... 70 వేల కోట్లు బ్లాక్ మార్కెట్ ఉంటుంది 
►చంద్రబాబుకు కొండాపూర్ , మాదాపూర్ , అమరావతి , సింగపూర్ , దుబాయ్ లో లక్షల కోట్ల రూపాయల ఆస్తులున్నాయి 
► వినేవాడుంటే చంద్రబాబు హరికథ ఇంగ్లీష్ లో చెబుతాడు
►ఈ రాష్ట్రంలో అత్యంత అవినీతి పరుడు చంద్రబాబు 
►రెండెకరాల పొలం నుంచి లక్షల కోట్లు సంపాదించిన వ్యక్తి చంద్రబాబు 
►చంద్రబాబు పాపాలు పండాయి.. ఇప్పుడు బయట పడ్డాయి 
►తన 14 ఏళ్ల పరిపాలన చూసి ఓటేయమని చెప్పే దమ్ము చంద్రబాబుకు ఉందా 
►నేను మంచి చేశానని నమ్మితేనే ఓటేయమని అడిగే దమ్మున్న నాయకుడు జగన్ మోహన్ రెడ్డి 
:::మాజీ మంత్రి,కొడాలి నాని కామెంట్స్‌

07:03PM, అక్టోబర్‌ 10, 2023
సీఎం జగన్‌ ప్రకటించినా.. ఏడుపే: YSRCP
►చంద్రబాబుపై తనకి ఎలాంటి కక్ష లేదన్న సీఎం వైఎస్‌ జగన్
►బహిరంగంగా ప్రకటించినా  టీడీపీ ఏడుపు 
►2019లో చిత్తుగా ఓడిన తర్వాత టీడీపీ, బాబు అంపశయ్యపైకి
► ఎల్లో మీడియా కష్టపడి జాకీలేసి లేపే ప్రయత్నం చేసినా.. అవినీతి బయటపడి మరింత పాతాళంలోకి
►నిజంగా బాబుపై కక్ష సాధించాలనుకుంటే..? అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగేళ్లు ఎదురుచూడాలా..?
► మీ బాబు నిప్పు.. తుప్పు అని ఎగిరెగిరి పడుతున్నారు కదా..?
► మరి.. క్వాష్ పిటీషన్లు వేసి పరువు తీసుకోవడం ఎందుకు?
► నిజాయతీగా విచారణ ఎదుర్కోవచ్చు కదా

06:45PM, అక్టోబర్‌ 10, 2023
రేపు హైకోర్టు ముందుకు ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసు

► ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసును లంచ్‌మోషన్‌లో స్వీకరించాలని కోరిన బాబు లాయర్లు
► బాబు బెయిల్ పై వాదనలు వినాలని కోరిన చంద్రబాబు లాయర్లు
► రేపు రెగ్యులర్ కోర్టులో విచారిస్తామన్న హైకోర్టు
► ఇదే కేసులో మాజీ మంత్రి నారాయణకు సీఐడీ నోటీసులపై విచారణ రేపటికి వాయిదా
► సీఐడీ విచారణలో తన ఆరోగ్య కారణాలను పరిగణనలోకి తీసుకోవాలని నారాయణ పిటిషన్

(చదవండి : బాబు సృష్టించిన మాయా ప్రపంచం, కరకట్ట రీఅలైన్‌మెంట్‌ పేరిట ఏం జరిగింది?)

06:15PM, అక్టోబర్‌ 10, 2023
నారాయణ అల్లుడికి హైకోర్టులో దక్కని ఊరట

► ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్‌ పిటిషన్
► సీఐడీ నోటీసులను సస్పెండ్ చేయాలని కోరిన పునీత్
► పునీత్ పిటిషన్ ను డిస్మిస్ చేసిన ఏపీ హైకోర్టు
► సీఐడీ విచారణకు సహకరించాలన్న హైకోర్టు
► న్యాయవాదుల సమక్షంలో విచారించాలని ఆదేశం
► ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పునీత్‌ను ప్రశ్నించనున్న దర్యాప్తు అధికారులు

06:25PM, అక్టోబర్‌ 10, 2023
తప్పు చేయలేదన్న వాదన కాదు, అరెస్ట్‌ గురించి బాబు బాధ : అంబటి

► చంద్రబాబు చట్టం నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తున్నారు : మంత్రి అంబటి
► చంద్రబాబు స్కాం చేయలేదని చెప్పలేకపోతున్నారు
► దొంగలు దొరికిపోయారని ప్రజలకు తెలిసిపోయింది
► టెక్నికల్ అంశాలపైనే చంద్రబాబు లాయర్లు
► వాదనలు వినిపిస్తున్నారు తప్పు....నేరం చేయలేదని చెప్పడం లేదు
► చట్టంలో లొసుగులున్నాయా అని చంద్రబాబు వెతుకులాట
► గతంలో అనేకసార్లు విచారణల నుంచి చంద్రబాబు తప్పించుకున్నారు
► సీఐడీ అన్ని ఆధారాలతోనే చంద్రబాబు అరెస్ట్ చేసింది
► దొంగ అన్ని సార్లు తప్పించుకోలేడని బాబు విషయంలో రుజువైంది
► ఇన్ని రోజులు లోకేష్ ఢిల్లీ ఓపెన్ జైలులో ఉన్నారు
► పురంధేశ్వరి బంధుత్వ ప్రేమతో ఆరాటపడుతున్నారు
► పురంధేశ్వరి తన మరిదిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు
► చంద్రబాబును కాపాడేందుకు పురంధేశ్వరి ఢిల్లీ వెళ్లారు
► మంత్రి రోజా బండారు వ్యాఖ్యలను పురంధేశ్వరి ఖండించలేదు
► చంద్రబాబును పార్టీని కాపాడేందుకే పవన్ రాజకీయాలు
► కాపుల ఓట్లను చంద్రబాబుకు అమ్మేందుకు పవన్ పార్టీ పెట్టారు
► అది జనసేన కాదు బాబు సేన అని ప్రజలు గమనించారు

06:05PM, అక్టోబర్‌ 10, 2023
జైల్లో ముగిసిన ములాఖత్‌

► రాజమండ్రి సెంట్రల్‌ జైలు :చంద్రబాబుతో ముగిసిన ములాఖత్
► చంద్రబాబును కలిసిన భువనేశ్వరి, బ్రాహ్మణి, పయ్యావుల కేశవ్‌
► ముందు కుటుంబసభ్యులతో మాట్లాడిన చంద్రబాబు
► అనంతరం పయ్యావుల కేశవ్‌తో చంద్రబాబు మంతనాలు
► ఇవ్వాళ సుప్రీంకోర్టులో జరిగిన కేసు పరిణామాలపై చర్చించినట్టు సమాచారం
► జనసేనతో పొత్తు పెట్టుకుంటే పర్యవసనాలపై చర్చ
► ఇటీవల బహిరంగ సభలో తెలుగుదేశం బలహీనపడిందని ప్రకటన చేసిన పవన్‌ కళ్యాణ్‌

06:00 PM, అక్టోబర్‌ 10, 2023
లోకేష్‌కు ఎందుకంత ఉలుకు : మంత్రి ఆదిమూలపు
► అన్ని ఆధారాలతోనే చంద్రబాబు పై సీఐడీ కేసు పెట్టింది
► కేసులకు భయపడుతున్న లోకేష్ ఇప్పటివరకు ఢిల్లీ వెళ్లి కూర్చున్నాడు
► 20 మంది లాయర్లను పక్కనపెట్టుకుని బెయిల్ కోసం ప్రార్థనలు చేస్తున్నాడు
► IRR, ఫైబర్ నెట్ స్కామ్ లో లోకేష్ పాత్ర స్పష్టం : మంత్రి ఆదిమూలపు

05:55PM, అక్టోబర్‌ 10, 2023
పవన్ కల్యాణ్ కు వైరల్ ఫీవర్
► జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌కు జ్వరం
► రేపు జరగాల్సిన జనసేన విస్తృతస్థాయి సమావేశం వాయిదా
► పవన్ కు వైరల్ ఫీవర్ వచ్చిందంటూ భేటీ వాయిదా వేసిన జనసేన
► రేపటి ఎజెండాలో క్షేత్ర స్థాయిలో టీడీపీతో కలిసి వెళ్లే అంశంపై జరగాల్సిన చర్చ
► పార్టీ నేతలకు దిశా నిర్ధేశం చేయాల్సిన పవన్‌ కళ్యాణ్‌
► త్వరలో మరో తేదీ ప్రకటిస్తామన్న జనసేన నేతలు

05:35PM, అక్టోబర్‌ 10, 2023
మళ్లీ రేపు రమ్మన్నారు : లోకేష్‌

► సీఐడీ అధికారులు నాకు సంబంధం లేని ప్రశ్నలు అడిగారు : లోకేష్
► నన్ను 50 ప్రశ్నలు అడిగారు, లేని ఇన్నర్ రింగ్ రోడ్డుపై ప్రశ్నించారు
► నాకు ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధం లేదు
► గూగుల్‌లో దొరికే సమాచారంపై నన్ను ప్రశ్నించారు
► మళ్లీ రేపు ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని చెప్పారు
► సీఐడీ ఒక్క ఆధారం కూడా చూపించకుండా విచారించారు
► వాళ్లు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చా

04:15PM, అక్టోబర్‌ 10, 2023
నాకేం తెలియదు: నారా లోకేష్‌
సీఐడీ విచారణలో నీళ్లు నములుతున్న నారా లోకేష్‌
అధికారులు అడిగిన ప్రతీ ప్రశ్నకు తెలియదనే సమాధానం
హెరిటేజ్‌ బోర్డు మీటింగ్‌ నిర్ణయాలపై లోకేష్‌ను ప్రశ్నించిన సీఐడీ
హేరిటేజ్‌ నిర్ణయాలు తనకు తెలియదని లోకేష్‌ సమాధానం
లోకేష్‌ హాజరై స్వయంగా సంతకాలు పెట్టిన డాక్యుమెంట్లు చూపించిన సీఐడీ
ఖంగుతిని తన లాయర్ల లాయర్ల వద్దకు వెళ్లి ఏం చెప్పాలో తెలుసుకున్న లోకేష్‌
హెరిటేజ్‌ భూములు ఆ ప్రాంతంలోనే ఎందుకు కొన్నారని సీఐడీ ప్రశ్న
పొంతన లేని సమాధానం చెప్పిన లోకేష్‌
విచారణలో మాటిమాటికి లాయర్ల దగ్గరికి వెళ్లి వస్తున్న లోకేష్‌

03:53PM, అక్టోబర్‌ 10, 2023
చంద్రబాబుతో ములాఖత్‌ కోసం..
చంద్రబాబుతో మలాఖత్ కోసం రాజమండ్రి సెంట్రల్ జైలుకు కుటుంబ సభ్యులు
భువనేశ్వరి, బ్రాహ్మణిలతో పాటు సీనియర్‌ నేత పయ్యావుల కేశవ్
► 45 నిమిషాల పాటు కొనసాగనున్న ములాఖత్

02:40PM, అక్టోబర్‌ 10, 2023
నారాయణ అల్లుడికి హైకోర్టులో ఎదురుదెబ్బ
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్‌కు సీఐడీ నోటీసులు
హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పునీత్
సీఐడీ నోటీసులను సస్పెండ్ చేయాలని పునీత్ పిటిషన్‌
పునీత్‌ పిటిషన్‌ను డిస్పోజ్‌ చేసి.. న్యాయవాదితో కలిసి రేపు విచారణకు హాజరు కావాలని ఆదేశించిన హైకోర్టు

02:29PM, అక్టోబర్‌ 10, 2023
లంచ్‌ తర్వాత ప్రారంభమైన లోకేష్‌ విచారణ
ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో నారా లోకేష్‌ను ప్రశ్నిస్తున్న సీఐడీ
ఏ14గా నారా లోకేష్‌ పేరును చేర్చిన సీఐడీ
ఉదయం మూడు గంటలపాటు విచారించిన సీఐడీ
ఆన్‌లైన్‌మెంట్‌ మార్పులో ముందస్తు సమాచారంపై లోకేష్‌కు ప్రశ్నలు
హెరిటేజ్‌ భూముల కొనుగోలుపైనా ప్రశ్నలు
భోజన విరామం తర్వాత తిరిగి ప్రారంభమైన విచారణ

02:08PM, అక్టోబర్‌ 10, 2023
సుప్రీంకోర్టు : శుక్రవారం మిగతా వాదనలు

చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై విచారణ శుక్రవారానికి వాయిదా
చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై సాల్వే మరో గంట వాదనలు
అనంతరం కౌంటర్‌ వాదనలు వినిపించిన CID లాయర్‌ ముకుల్‌ రోహత్గీ

1:30 PM, అక్టోబర్‌ 10, 2023
జైల్లో చంద్రబాబును కలవనున్న కుటుంబ సభ్యులు
రాజమండ్రి సెంట్రల్‌ జైల్‌కు కుటుంబ సభ్యులు
మధ్యాహ్నం మూడున్నరకు చంద్రబాబుతో ములాఖత్
బాబును కలవనున్న భువనేశ్వరి, బ్రాహ్మణి
కుటుంబ సభ్యులతో పాటు తెలుగుదేశం నేత పయ్యావుల కేశవ్

1:15 PM, అక్టోబర్‌ 10, 2023
చంద్రబాబు కేసులో ఏం జరగవచ్చు? : నిపుణులు ఏమంటున్నారు?
ఇరు వర్గాల వాదన భిన్నంగా ఉన్నాయి
FIR కొట్టేయడానికి ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఎలాంటి ఆస్కారం లేదు
అయితే అవినీతి నిరోధక చట్టంపై విస్తృతంగా పరిశీలన జరపాల్సి రావొచ్చు
అవసరమయితే ఈ ఒక్క విషయంలో (17a) కేసును విస్తృత ధర్మాసనానికి నివేదించవచ్చు.!

1:15 PM, అక్టోబర్‌ 10, 2023
విజయవాడ :  ACB కోర్టులో బాబు కేసులు వాయిదా
ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్ కేసులలో పిటి వారెంట్లపై విచారణ
రేపటికి వాయిదా వేసిన ACB కోర్టు

1:10 PM, అక్టోబర్‌ 10, 2023

గుంటూరు జిల్లా :  CID కార్యాలయంలో లోకేష్‌ విచారణ
సీఐడీ కార్యాలయంలో  లోకేష్‌ను ప్రశ్నించిన అధికారులు
మధ్యాహ్నం ఒంటిగంటకు నారా లోకేష్‌కు లంచ్ బ్రేక్
గంట పాటు లంచ్ బ్రేక్
లోకేష్‌కు ఇంటి నుంచి భోజనం తెచ్చిన వ్యక్తిగత సిబ్బంది

1:06 PM, అక్టోబర్‌ 10, 2023
సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు

► CID లాయర్‌ ముకుల్‌ రోహత్గీ : అసలు ప్రజాధనం దుర్వినియోగం చేసిన ఇలాంటి కేసుల్లో ఎలాంటి రక్షణ లేదని సెక్షన్లు చెబుతున్నాయి
► జస్టిస్‌ బోస్‌ : వాదనలకు ఇంకా ఎంత సేపు కావాలి?
► CID లాయర్‌ ముకుల్‌ రోహత్గీ : ఒక గంట సరిపోతుంది
► జస్టిస్‌ బోస్‌ : అయితే మిగతా వాదనలు శుక్రవారం 2గంటలకు వింటాం
► బాబు లాయర్‌ లూథ్రా : దయచేసి  ఈ కేసులో వాదనలను ఇవ్వాళ ముగించండి
► జస్టిస్‌ బోస్‌ : ముందే చెప్పాం కదా. మిగతా చాలా కేసులున్నాయి
► CID లాయర్‌ ముకుల్‌ రోహత్గీ : ఒకవేళ ఇవ్వాళ సాధ్యం కాదు అనుకుంటే శుక్రవారం వాదనలు వినిపిస్తాం.
► బాబు లాయర్‌ లూథ్రా : గురువారానికి కేసు వాయిదా వేయండి
► CID లాయర్‌ ముకుల్‌ రోహత్గీ : శుక్రవారం లేదా సోమవారం
► బాబు లాయర్‌ లూథ్రా : మా లాయర్‌ సాల్వే మరో కేసులో వాదనలు వినిపించేందుకు వెళ్లాడు. ఆయన్ను అడిగి మీకు మధ్యాహ్నం 2గంటలకు చెబుతాను.
► జస్టిస్‌ బోస్‌ : సరే

కోర్టుకు లంచ్‌ బ్రేక్‌

1:05 PM, అక్టోబర్‌ 10, 2023
సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు

► CID లాయర్‌ ముకుల్‌ రోహత్గీ : సెక్షన్‌ 6 ఏం చెబుతుందంటే..
► జస్టిస్‌ త్రివేదీ : విచారణ అవసరం లేదంటుంది కదా.!
► CID లాయర్‌ ముకుల్‌ రోహత్గీ : అది నిజం లార్డ్‌షిప్‌. కానీ ఇక్కడ ముఖ్యమైన అంశమేమంటే FIR నమోదు అయిందా అన్నది.!

1:02 PM, అక్టోబర్‌ 10, 2023
సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు

► CID లాయర్‌ ముకుల్‌ రోహత్గీ : CrPC సెక్షన్‌ 468 ఏం చెబుతుందంటే.. ఒక వేళ ఒక కేసులో అభియోగాలు మూడేళ్ల జైలు శిక్ష కంటే మించినది అయితే అలాంటి కేసుల్లో దర్యాప్తుకు ఎలాంటి పరిధి ఉండదని స్పష్టంగా పేర్కొంది. ఇలాంటి కేసుల్లో దర్యాప్తు జరపవచ్చని, ఛార్జ్‌షీట్‌ నమోదు చేయవచ్చని చెబుతోంది.

1:00 PM, అక్టోబర్‌ 10, 2023
సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు

► జస్టిస్‌ త్రివేదీ : మీరు ఇంతకు ముందు చెప్పినట్టు సెక్షన్‌ 13(1)(c) మరియు సెక్షన్‌ 13(1)(d)లు 2018 సవరణలో తొలగించారు కదా.

► CID లాయర్‌ ముకుల్‌ రోహత్గీ : కళ్ల ముందు కనిపిస్తున్న ఏ నేరంలోనయినా FIR నమోదు చేయకుండా ఏ చట్టం అడ్డంకులు చెప్పలేదు. ఆ సెక్షన్‌ తొలగించామన్నది దానికి హేతువు కాలేదు.

► జస్టిస్‌ త్రివేదీ : ఈ విషయంలో మరింత విస్తృతంగా వాదనలు చెప్పండి

► CID లాయర్‌ ముకుల్‌ రోహత్గీ : రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 20(1) ఏం చెప్పిందంటే.. ఒక వ్యక్తి నేరం చేశాడన్న విషయం చాలా ఆలస్యంగా తెలిసిందనుకోండి. చట్టం ఏం చెబుతుందంటే.. కేసు నమోదు చేయమని.! కొన్ని పరిధులు ఉండొచ్చేమో కానీ అడ్డంకులు మాత్రం లేవు. '


(CID లాయర్‌ రోహత్గీ కోర్టు ముందుంచిన డాక్యుమెంట్‌)

12:55 PM, అక్టోబర్‌ 10, 2023
సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు

► CID లాయర్‌ ముకుల్‌ రోహత్గీ : అసలు చంద్రబాబు కేసులో మెరిట్స్‌లోకి క్వాష్‌ పిటిషన్‌ సమయంలో వెళ్లవచ్చా? అలా వెళ్లకూడదని కోర్టును కోరుతున్నాను.
ఒక దర్యాప్తు అధికారి అధికారిక విధులేంటీ?
దర్యాప్తు సంస్థ ముందు ఎలాంటి మార్గదర్శకాలున్నాయి?
దర్యాప్తు అధికారి ఏం నిర్ణయాలు తీసుకున్నారు?
ఈ ప్రశ్నలన్నింటికీ నిర్ణయించాల్సింది తన ముందున్న సాక్ష్యాధారాలను బట్టి మాత్రమే. ఇది మౌఖికంగా జరిగే వాదనలను బట్టి కాదు. దర్యాప్తు అధికారి దగ్గర ఏ ఏ సాక్ష్యాధారాలున్నాయన్న బట్టి మాత్రమే కోర్టు నిర్ణయం తీసుకోవాలి.

జస్టిస్‌ త్రివేదీ : ఒక వేళ చట్ట సవరణ జరిగిన తర్వాత అసలు ఆ సెక్షన్‌ను సవరణలో తొలగించిన తర్వాత.. అదే సెక్షన్‌ కింద FIR నమోదు చేయవచ్చా?

► CID లాయర్‌ ముకుల్‌ రోహత్గీ : కచ్చితంగా. దానికి వెసులుబాటు ఉంది. దానికొక పరిధి ఉంది. నేరం ఎప్పుడు జరిగిందన్న సమయం పక్కనబెడితే... FIR నమోదు చేయవచ్చు.

12:45 PM, అక్టోబర్‌ 10, 2023
సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు

► CID లాయర్‌ ముకుల్‌ రోహత్గీ : కేవలం 17a సవరణను అడ్డుపెట్టుకుని ఏమైనా చేయవచ్చా? తప్పు చేసిన ప్రతీ ఒక్కరు 17aను బూచిగా చూపించి ముందస్తు అనుమతి తీసుకురమ్మంటే ఎలా? అసలు ఇదే విధానం అన్ని కేసుల్లో అమలయితే అవినీతి కేసుల్లో దర్యాప్తు చేసేందుకు ఏ అధికారి అయినా ముందుకొస్తాడా? అసలు మన దేశ పార్లమెంట్‌ విధానమే అవినీతి రహిత దేశం కదా. ఇందులో భాగంగానే చట్టాలు, సవరణలు వచ్చాయి కదా.!

► CID లాయర్‌ ముకుల్‌ రోహత్గీ : అవినీతికి పాల్పడే వారికి సెక్షన్‌ 17a  అండగా ఉండరాదు, ఉండకూడదు.

జస్టిస్‌ బోస్‌ : 17a సవరణలో తెచ్చిన ముందస్తు అనుమతి అన్నది పాత తేదీల్లో జరిగే నేరాలకు వర్తిస్తుందా?

CID లాయర్‌ ముకుల్‌ రోహత్గీ : ఎట్టి పరిస్థితుల్లో వర్తించదు. 17a ఉంది కదా అని పారాచ్యూట్‌తో గతంలోకి  ప్రయాణం చేయగలమా?

12:35 PM, అక్టోబర్‌ 10, 2023
సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు

CID లాయర్‌ ముకుల్‌ రోహత్గీ : ఒక చట్ట సవరణను ఎప్పుడు చేయాలి? అది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందన్నది పార్లమెంట్‌కు ఉన్న అధికారం. కానీ ఈ కేసులో ముందునుంచే వర్తిస్తుందని పార్లమెంట్‌ తెచ్చిన సవరణలో లేదు.

CID లాయర్‌ ముకుల్‌ రోహత్గీ : ఈ అంశానికి సంబంధించి ఒక కీలక విషయం అర్థం చేసుకోవాలి. కొన్ని సెక్షన్లను 2018లో తొలగించారు. అయితే నేరం 2018కి ముందే జరిగి ఉంటే మాత్రం.. తొలగించిన సెక్షన్లు కూడా వర్తిస్తాయి. అందువల్ల 2018 కంటే ముందు జరిగిన ఈ నేరంలో సెక్షన్‌ 17a వర్తించడానికి అవకాశమే లేదు. చంద్రబాబుపై ఈ కేసులో సెక్షన్‌ 13(1), (c), (d) కింద అభియోగాలున్నాయి

జస్టిస్‌ త్రివేదీ : ఆ సెక్షన్లను తొలగించారు కదా.

CID లాయర్‌ ముకుల్‌ రోహత్గీ : సరిగ్గా ఆ పాయింట్‌నే మీ ముందుకు తీసుకొస్తున్నాను. సెక్షన్‌ 482 ఈ సవాళ్లను నిర్ణయించలేదు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు, చేసిన పనుల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి అంతులేని నష్టం వాటిల్లింది. జరిగిన అక్రమాల వల్ల ఖజానా నష్టపోయింది.

జస్టిస్‌ త్రివేదీ : ఏ సమయంలో దర్యాప్తు సంస్థ ఈ విషయాలను కనుగొంది?

CID లాయర్‌ ముకుల్‌ రోహత్గీ : దర్యాప్తు జరుగుతున్న కొద్దీ కొత్త విషయాలు తెరపైకి వచ్చాయి. ఇంత పెద్ద స్థాయిలో అవినీతి జరిగినపుడు.. ఈ కేసును ఆదిలోనే కొట్టేయాలన్న ఆలోచనే సరికాదు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17a ఏం చెబుతుందంటే.. ముందస్తు అనుమతి లేకుండా కూడా దర్యాప్తు చేపట్టేందుకు కొన్ని మినహాయింపులు ఇచ్చింది.


(సుప్రీంకోర్టు బెంచ్‌ ముందు CID లాయర్‌ రోహత్గీ ఉంచిన డాక్యుమెంట్‌)

12:25 PM, అక్టోబర్‌ 10, 2023
సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు

CID లాయర్‌ ముకుల్‌ రోహత్గీ : ఈ చట్ట సవరణ 2018లో జరిగింది. 17a అనేది  ఇందులో కేవలం ఒక భాగం మాత్రమే. 2018కు ముందు జరిగిన నేరాలన్నింటిలో 2018 కంటే ముందున్న చట్టానికి లోబడి (17a సవరణకు ముందు) దర్యాప్తు జరుగుతాయి.

CID లాయర్‌ ముకుల్‌ రోహత్గీ : 2018 తర్వాత జరిగిన నేరాల్లో మాత్రమే 17a సవరణకు లోబడి దర్యాప్తు జరుగుతుంది. ఈ కేసును పరిశీలిస్తే.. నేరం 2018కు ముందు జరిగింది, అంటే పాత చట్టం ప్రకారమే దర్యాప్తు జరగాలి, అలాగే జరిగింది కూడా.

CID లాయర్‌ ముకుల్‌ రోహత్గీ : మీకు స్పష్టత ఇవ్వడానికి ఒక ఉదాహరణ ఇస్తాను. ఒక వ్యక్తి మరొకరిని కొట్టాడనుకుందాం. కొట్టిన వ్యక్తిపై సెక్షన్‌ 323 కింద కేసు నమోదవుతుంది. ఒక వేళ ఏదైనా కారణంతో సెక్షన్‌ 323 కొట్టేసినంత మాత్రాన.. అ వ్యక్తి మీద ఉన్న అభియోగాలు ఎటూ పోవు. ఆ వ్యక్తి చట్టానికి లోబడి శిక్ష అనుభవించాల్సిందే. కొత్తగా సెక్షన్లలో వచ్చిన సవరణ ఎలాంటి మార్పు తెచ్చిందన్నది కేవలం ప్రయోజనం దృష్ట్యా పరిశీలించాలి కానీ.. సవరణ వచ్చింది కదా అని కేసు పూర్తిగా కొట్టేయాలంటే ఎలా?

(చదవండి : చంద్రబాబు స్క్వాష్‌ పిటిషన్‌ను తిరస్కరిస్తూ హైకోర్టు ఏం చెప్పిందంటే..)


(సుప్రీంకోర్టు ముందు CID తరపు లాయర్‌ రోహత్గీ వాదనలు (Right window))

12:15 PM, అక్టోబర్‌ 10, 2023
సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు

CID లాయర్‌ ముకుల్‌ రోహత్గీ : ఒక కేసులో అవినీతి నిరోధక చట్టం, PC actను తొలగిస్తే.. మిగతా అభియోగాలన్నీ కేవలం IPC కిందకు వస్తే ఏమవుతుందన్న దానిపై ఇదే కోర్టు నేరుగా ఓ జడ్జిమెంట్‌ ఇచ్చింది. దాన్ని మీ ముందుంచుతున్నాను.

A శ్రీనివాసరెడ్డి (2023) కేసులో సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఏం చెప్పిందంటే :  ప్రత్యేక కోర్టుకు ప్రత్యేక సందర్భాల్లో ప్రత్యేక అధికారాలుంటాయి. అవినీతి నిరోధక చట్టం లేకున్నా.. ప్రత్యేక కోర్టులు IPC కింద నమోదయిన అభియోగాలపై కేసు విచారణ చేపట్టవచ్చు.

CID లాయర్‌ ముకుల్‌ రోహత్గీ : ఈ కేసులో ఒక వేళ అవినీతి నిరోధక చట్టం, PC actను తొలగించినా.. మిగతా అభియోగాలపై దర్యాప్తు జరపవచ్చు

జస్టిస్‌ త్రివేదీ : ఈ కేసులో బాబు లాయర్‌ సాల్వే ఏం చెబుతున్నారంటే.. కేసులో అవినీతి నిరోధక చట్టం కింద ఉన్న అభియోగాలను తొలగిస్తే.. సెక్షన్‌ 4(3) కింద నమోదు చేసిన అభియోగాలకు అర్హత లేదంటున్నారు? అప్పుడు ప్రత్యేక కోర్టు పరిధి ఏంటీ? ఆ కోర్టు జారీ చేసిన ఉత్తర్వుల సంగతేంటీ?

CID లాయర్‌ ముకుల్‌ రోహత్గీ : ఒక కేసులో సెక్షన్‌ 420 కింద అభియోగాలుంటే.. వాటిని తొలగించలేం. ఈ కేసులో అవినీతి నిరోధక చట్టం PC act ను తొలగించలేం.

జస్టిస్‌ త్రివేదీ : అది కేవలం ఒక పరిశీలన మాత్రమే

12:08 PM, అక్టోబర్‌ 10, 2023
సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు

CID లాయర్‌ ముకుల్‌ రోహత్గీ : ఒక కేసులో అవినీతి నిరోధక చట్టం, PC act తో పాటు ఇండియన్‌ పెనల్‌ కోడ్‌,IPC సెక్షన్లు ఉంటే ఏం చేయాలి? చేసిన నేరం, మోపబడిన అభియోగాలు రెండు సెక్షన్లకు వర్తిస్తే ఏం చేయాలి? ప్రత్యేక కోర్టులో (ACB కోర్టు) ఉన్న న్యాయమూర్తికి ఈ రెండు కేసులను విచారించే పరిధి ఉంటుంది.

CID లాయర్‌ ముకుల్‌ రోహత్గీ : ఒక వేళ బాబు లాయర్‌ సాల్వే చెబుతున్నట్టుగా అవినీతి నిరోధక చట్టాన్ని తొలగిస్తే ఏమవుతుంది? CPC 1973 (2 of 1974) ఏం చెబుతుందంటే, ఒక ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఏ కేసులోనయినా.. సెక్షన్‌ 3లో పేర్కొన్న నేరంతో పాటు ఇతర అభియోగాలుంటే వాటిని కూడా ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి పరిశీలించవచ్చని చెబుతోంది.

జస్టిస్‌ త్రివేదీ : ఒక వేళ బాబు లాయర్‌ సాల్వే చెబుతున్నట్టుగా అవినీతి నిరోధక చట్టాన్ని తొలగిస్తే సెక్షన్‌ 4(3) కూడా వర్తించదు కదా

► CID లాయర్‌ ముకుల్‌ రోహత్గీ : సుప్రీంకోర్టు ఈ విషయంలో స్పష్టత ఇచ్చింది. ఎప్పుడయితే వేర్వేరు అభియోగాలు ఒకే కేసులో ఉన్నాయో.. అప్పుడు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కచ్చితంగా ఆ కేసును పరిశీలించవచ్చు. అలాంటి కేసుల్లో అది అవినీతి నిరోధక చట్టం సెక్షన్‌ లేకున్నా.. ఆ కేసును ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి పరిశీలించవచ్చు.

12:00 PM, అక్టోబర్‌ 10, 2023
సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు
CID తరపు వాదనలు ప్రారంభం

CID లాయర్‌ ముకుల్‌ రోహత్గీ : అవినీతి నిరోధక చట్టానికి లోబడి ఈ కేసు నమోదయింది. పైగా ఈ కేసులో ఎలాంటి రాజకీయ కక్ష లేదు, 2021లో FIR నమోదయింది. 2023లో లభించిన సాక్ష్యాధారాల మేరకు చంద్రబాబును ఈ కేసులో నిందితుడిగా చేర్చారు.

CID లాయర్‌ ముకుల్‌ రోహత్గీ : చంద్రబాబు నాయుడు ఎంత బలమైన వ్యక్తి అంటే.. అలా అరెస్ట్‌ అయ్యారో లేదో.. ఇలా వెంటనే క్వాష్‌ పిటిషన్‌ను (కేసునే పూర్తిగా కొట్టేయాలన్న సెక్షన్‌ 482 కింద స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌)ను  ముందుకు తెచ్చారు. కేవలం రెండే రెండు రోజుల్లో క్వాష్‌ పిటిషన్‌ హైకోర్టు ముందుకొచ్చింది. అంటే ఈ కేసులో నిందితుడి ఉద్దేశ్యాలను కోర్టు అర్థం చేసుకోవాలి.

CID లాయర్‌ ముకుల్‌ రోహత్గీ : చంద్రబాబు నాయుడు వేసిన క్వాష్‌ పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తిరస్కరించింది. ఈ కేసులో న్యాయస్థానం ఏం చెప్పిందంటే.. అవినీతి నిరోధక చట్టం, 1988 కింద నమోదయిన కేసుకు సెక్షన్‌ 17a లోబడి ఉండదని స్పష్టం చేసింది.

11:45 AM, అక్టోబర్‌ 10, 2023
సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు

బాబు లాయర్‌ సాల్వే : మేం CID దాఖలు చేసిన FIRను సవాలు చేస్తున్నాం.
జస్టిస్‌ త్రివేదీ : అసలు FIR ప్రకారం ఏ ఏ నేరాలున్నాయి?
బాబు లాయర్‌ సాల్వే : ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు దురుద్దేశపూర్వకంగా కుట్రకు పాల్పడి ప్రయోజనం పొందాడన్నది ప్రధాన అభియోగం.
బాబు లాయర్‌ సాల్వే : చంద్రబాబుపై ఏ ఏ అభియోగాలు ఉన్నాయంటే..
IPC S 120B (criminal conspiracy)
Sec 420 (cheating and dishonestly inducing delivery of property),
Sec 465 (forgery)
PC Act Sec12 (punishment for abetment of offences)
Sec 13 (criminal misconduct by a public servant)
సాల్వే : ఇందులో అవినీతి నిరోధక చట్టాన్ని తీసేసి చూడలేం. కేసును పూర్తిగా దాని ఆధారంగానే నిర్మించారు
PC చట్టాన్ని తీసేస్తే ఈ కేసులో ప్రత్యేక కోర్టు ఏం చేయలేదు. ఒక వేళ PC చట్టాన్ని తొలగిస్తే మేజిస్ట్రేట్‌ ముందు హాజరు పరచాల్సి ఉంటుంది
జస్టిస్‌ బోస్‌ : ఇవన్నీ మేజిస్ట్రేట్‌ ముందు విచారణ జరగాల్సిన అభియోగాలనే.?
బాబు లాయర్‌ సాల్వే : నా మిత్రుడు లూథ్రా చెప్పేదాని బట్టి ఇవన్నీ మేజిస్ట్రేట్‌ పరిధిలోని కేసులే
బాబు లాయర్‌ లూథ్రా : మధ్యప్రదేశ్‌లో కొందరు సెషన్స్‌ కోర్టుకు వెళ్తారు, కానీ
జస్టిస్‌ త్రివేదీ : దేశమంతటా అన్ని రాష్ట్రాల్లో ఒకేలా ఉంటుంది, మేజిస్ట్రేట్‌ పరిధిలోనే ఉంటుంది
బాబు లాయర్‌ సాల్వే : ఇంతటితో మా వాదనలు ముగిస్తున్నాం

11:35AM, అక్టోబర్‌ 10, 2023
సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు : అభ్యంతరాల మధ్య సాల్వే వాదనలు

బాబు లాయర్‌ సాల్వే : 2011లో వచ్చి దవీందర్‌ పాల్‌ సింగ్‌ భుల్లర్‌ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే.. అసలు అరెస్ట్‌ విషయంలోనే సరైన విధానం అనుసరించనప్పుడు, కేసు దర్యాప్తు ఆరంభ సమయంలోనే సరైన పద్ధతి అనుసరించకుండా ఉన్నప్పుడు..  ఆ కేసును మూలాల్లోంచి తొలగించాలని తీర్పు ఇచ్చింది. అంటే కేసును కొట్టేయాలన్న మూల సిద్ధాంతాన్ని ఈ కేసుకు కూడా అమలు చేయాలన్నది నేను బలంగా చెబుతున్న పాయింట్‌

బాబు లాయర్‌ సాల్వే : ఒకే వ్యక్తి మీద వేర్వేరు అభియోగాలు మోపడం, దాని ప్రభావం ఏంటన్న దానిపై నా దగ్గర మూడు కేసులున్నాయి. ఒక కేసును మీ ముందుంచుతున్నాను. 2019లో వచ్చిన ఎభా అర్జున్‌ జడేజా కేసు.
► ఎభా అర్జున్‌ జడేజా కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది ? : సరైన అనుమతి లేకుండా ప్రారంభించే దర్యాప్తులో FIR నమోదు చేయకూడదని TADA కేసుల సందర్భంగా సుప్రీంకోర్టు చెప్పింది. హత్య, అత్యాచారం, స్మగ్లింగ్‌, నార్కోటిక్స్‌, పోక్సో యాక్ట్‌ వంటి సీరియస్‌ అభియోగాలున్న కేసులను TADA కేసు కారణంగా దర్యాప్తు వాయిదా వేయకూడదు

11:25AM, అక్టోబర్‌ 10, 2023
సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు : అభ్యంతరాల మధ్య సాల్వే వాదనలు

బాబు లాయర్‌ సాల్వే : ఇటీవల రాజ్యాంగంలోని  ఆర్టికల్‌ 20(1)కు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను చూడండి. క్రిమినల్‌ కేసుల విచారణలో ప్రొసీజిరల్‌ మార్పులకు సంబంధించి (పాత తేదీల) గతం నుంచే అమలును ఆర్టికల్‌ 20(1) అడ్డుకోలేదని అయిదుగురు జడ్జిల సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. దీనికి సంబంధించి హైకోర్టులు ఏం చెబుతున్నాయో చెబుతాను.
జస్టిస్‌ బోస్‌ : ఒకసారి సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పిన విషయంలోనే.. మళ్లీ హైకోర్టు కేసును ఉదహరించనవసరం లేదు.
బాబు లాయర్‌ సాల్వే : అయితే రిమాండ్‌ విషయంలో ముందస్తు అనుమతి అంటే గవర్నర్‌ అనుమతి కావాల్సిందే అన్న విషయాన్ని మీ ముందుకు తెస్తున్నాను. చంద్రబాబు ప్రజా ప్రతినిధి కాబట్టి, CID ముందుగా గవర్నర్‌ అనుమతి తీసుకుని ఉండాల్సింది. ఇది స్పష్టం చేయడమే నా ఉద్దేశ్యం.

11:15AM, అక్టోబర్‌ 10, 2023
సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు : అభ్యంతరాల మధ్య సాల్వే వాదనలు

బాబు లాయర్‌ సాల్వే : 1988లో రూపొందిన అవినీతి నిరోధక చట్టాన్ని పరిశీలిస్తే.. దర్యాప్తు అధికారికి ఎలాంటి హక్కులు లేవని చెబుతుంది. దర్యాప్తు అనేది కేవలం ఒక విధి మాత్రమే తప్ప హక్కు కాదని చట్టం చెబుతుంది.

11:10AM, అక్టోబర్‌ 10, 2023
సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు : అభ్యంతరాల మధ్య కొనసాగుతున్న సాల్వే వాదనలు

జస్టిస్‌ బోస్‌ : ఈ కేసులో లంచ్‌కు ముందే వాదనలు ముగిస్తాం. తర్వాత రెగ్యులర్‌ కేసులను పరిశీలిస్తాం
బాబు లాయర్‌ సాల్వే : 2019లో రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో యశ్వంత్‌ సిన్హాపై దాఖలైన కేసులో జస్టిస్‌ KM జోసెఫ్‌ ఇచ్చిన తీర్పును చూడండి.

(జస్టిస్‌ KM జోసెఫ్‌ ఇచ్చిన తీర్పు ఏంటంటే.. రఫేల్‌ యుద్ధ విమానాల కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దర్యాప్తు సంస్థ అయిన CBIని ఆపలేదు. అయితే 17a ప్రకారం దర్యాప్తు సంస్థ ముందస్తు అనుమతులు తీసుకోవాలి)


(సుప్రీంకోర్టు ముందు సాల్వే ఉంచిన రఫేల్‌ కేసు డాక్యుమెంట్‌)

11:00AM, అక్టోబర్‌ 10, 2023

సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు : అభ్యంతరాల మధ్య కొనసాగుతున్న సాల్వే వాదనలు

బాబు లాయర్‌ సాల్వే : ముందస్తు అనుమతి లేకుండా దర్యాప్తు అధికారి చర్యలకు దిగరాదని చట్టం చెబుతోంది. CID ముందు అనుమతి తీసుకున్న తర్వాతే దర్యాప్తు చేయాల్సింది.
►నిన్న కూడా కోర్టు ముందు సెక్షన్‌ 17a సవరణ గురించి వాదనల్లో తెలిపాను. ఇది దుర్వినియోగం కాకూడదన్న ఉద్దేశ్యంతోనే సవరణ తీసుకొచ్చారు. దీని వల్ల అవినీతి నిరోధక చట్టం మరింత బలోపేతం అవుతుందని భావిస్తున్నాం
►నేరాలు బయటపడ్డాయని కాదు. CID ఇప్పుడు కొత్తగా అనుమతి తీసుకుని ఆపై విచారణను పునఃప్రారంభించాలి.


(కేసు విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు, కింది విండోలో వాదనలు వినిపిస్తున్న హరీష్‌ సాల్వే)

10:45AM, అక్టోబర్‌ 10, 2023
సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు - విచారణ పద్ధతిపై వేర్వేరు వాదనలు

జస్టిస్‌ బోస్‌ : ఇంకా ఎంత సేపు తీసుకుంటారు సాల్వే
బాబు లాయర్ సాల్వే : ఇంకా గంట సేపు కావాలి
CID లాయర్ రోహత్గీ : మూడు రోజులుగా వెయిట్‌ చేస్తున్నాం. ఇంకా ఎంత సేపు జస్టిస్‌? ఇది పూర్తిగా బేస్‌ లేని కేసు, అసలు ఇప్పటికే కొట్టేయాల్సిన కేసు, నోటీసులు లేకుండా ఎలా అవకాశమిస్తారు? మీరు గంట అవకాశం ఇవ్వాలనుకుంటే గంట తర్వాతే వస్తా.
జస్టిస్‌ బోస్‌ : సెక్షన్‌ 136A కింద నోటీసులు ఇవ్వలేదు, - హైకోర్టులో దాఖలు చేసిన పత్రాల ఆధారంగా వాదనలు జరుగుతున్నప్పుడు కొత్త డాక్యుమెంట్లు అవసరం లేదు
బాబు లాయర్ సాల్వే : ఇదొక క్రిమినల్‌ కేసు, ఇందులో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయనవసరం లేదు, రికార్డులు అన్నీ ఉన్నాయి
CID లాయర్ రోహత్గీ : ఇప్పటివరకు కోర్టు అనుసరిస్తున్న పద్ధతిని ఫాలో అయ్యేలా చూడండి. మొత్తం న్యాయశాస్త్రాన్నే తిరిగి రాస్తానంటే.. మళ్లీ మేం మొదటి నుంచి రావాలి
జస్టిస్‌ త్రివేదీ (సాల్వేను ఉద్దేశించి) : ఇదొక ప్రొసీజర్‌ అయిప్పుడు దీని కింద ఏవైనా హక్కులుంటాయా?
బాబు లాయర్ సాల్వే : మీరు అవకాశం ఇవ్వండి, నేను రిఫరెన్స్‌ తీర్పులు మీ ముందుంచుతాను. నిందితుడికి రక్షణ కల్పించిన కేసులు ఉదహరిస్తాను

10:35AM, అక్టోబర్‌ 10, 2023
సుప్రీంకోర్టులో మొదలైన వాదనలు

► సుప్రీంకోర్టులో మొదలయిన విచారణ
► కేసులో వాదనలు వింటున్న జస్టిస్‌ బేలా త్రివేదీ, జస్టిస్‌ అనిరుధ్‌ బోస్‌
► చంద్రబాబు స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌పై బెంచ్‌ ముందుకు ఇరుపక్షాల లాయర్లు
► నిన్న చంద్రబాబు లాయర్‌ హరీష్‌ సాల్వే వాదనలు
► ఇవ్వాళ బెంచ్‌ ముందు వాదనలు వినిపించనున్న CID లాయర్‌ ముకుల్‌ రోహత్గీ

10:15AM, అక్టోబర్‌ 10, 2023
►సిట్‌ కార్యాలయంలో నారా లోకేష్‌
► ఐఆర్‌ఆర్‌ కేసులో లోకేష్‌ను విచారిస్తున్న సీఐడీ
►లోకేష్‌ను ప్రశ్నిస్తున్న విచారణాధికారి జయరామ్‌రాజు బృందం

10:00AM, అక్టోబర్‌ 10, 2023
►కాసేపట్లో చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ
►సీఐడీ తరఫున వాదనలు వినిపించనున్న సుప్రీంకోర్టు న్యాయవాది ముకుల్‌ రోహిత్గీ

9:58AM, అక్టోబర్‌ 10, 2023
►సిట్‌ కార్యాలయానికి చేరుకున్న నారా లోకేష్‌
►కాసేపట్లో లోకేష్‌ను ప్రశ్నించనున్న సీఐడీ

9:40AM, అక్టోబర్‌ 10, 2023
►సీఐడీ కార్యాలయానికి బయల్దేరిన నారా లోకేష్‌
►ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కేసులో సీఐడీ విచారణకు లోకేష్‌
►సాయంత్రం ఐదు గంటల వరకూ లోకేష్‌ను విచారించనున్న సీఐడీ
►తాడేపల్లి సిట్ కార్యాలయంలో విచారణ

8:50 AM, అక్టోబర్‌ 10, 2023
జైలులో 31వ రోజు రిమాండ్‌ ఖైదీగా చంద్రబాబు..
►రాజమండ్రి సెంట్రల్ జైల్లో 31వ రోజు రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు. 
►యథావిధిగా చంద్రబాబుకు కొనసాగుతున్న భద్రత. 
►చంద్రబాబు ఆరోగ్య రీత్యా జైలు ఆవరణలో నిరంతరం అందుబాటులో ఉన్న ప్రత్యేక వైద్య నిపుణుల బృందం. 
►హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ల కొట్టివేతతో టీడీపీ వర్గాల్లో నైరాశ్యం. 
►సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్‌పైనే ఆశలు పెట్టుకున్న టీడీపీ నేతలు
►లోకేశ్‌ నేడు సీఐడీ ఎదుట హాజరు కానుండటంపై ఎల్లో శ్రేణుల్లో టెన్షన్‌


08:06AM, అక్టోబర్‌ 10, 2023
►న్యాయ నిపుణులు: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు చాలా సీరియస్. ఈ కేసులో బాబుకి శిక్ష పడే అవకాశం ఉంది.
►అవును.. అక్కడ పుర చేత్తో తండ్రీ కొడుకులు ఇచ్చి, అవతల అత్తా, కోడళ్ళు కుడి చేత్తో తీసుకున్నారు. 
►ఇక్కడ తమ ఇంటి కంపెనీకి లాభం వచ్చేట్టు కేబినేట్ నిర్ణయాలు తీసుకున్నారు.
►ఇది ఖచ్చితంగా తండ్రీ కొడుకులకి మాత్రమే కాదు, భువనేశ్వరి, బ్రహ్మణి కూడా ఇరుక్కున్నట్టే.

07:58AM, అక్టోబర్‌ 10, 2023
►ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌(ఐఆర్‌ఆర్‌) కేసులో పునీత్ అనే వ్యక్తికీ ఏపీ సీఐడీ నోటీసులు
►ఈ నెల 11 న విచారణకు రావాలని సీఐడీ నోటీసులు
►సీఐడీ నోటీసులను క్వాష్ చేయాలని ఏపీ హైకోర్టులో పునీత్ పిటిషన్
►నేడు విచారణ చేయనున్న ఏపీ హైకోర్టు

07:57AM, అక్టోబర్‌ 10, 2023
టీడీపీ నేత నారాయణకు మరో షాక్ 
►ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో అయన భార్య, బావమరదులు
►ఏ - 15గా పొంగూరి రమాదేవి
►ఏ -16గా రావూరి సాంబశివరావు
►ఏ - 17 గా ఆవుల మునిశంకర్
►ఏసీబీ కోర్టులో సీఐడీ ప్రత్యేక మెమో

7:00 AM, అక్టోబర్‌ 10, 2023
నేడు చంద్రబాబు కేసుపై సుప్రీంకోర్టులో విచారణ..
►చంద్రబాబు పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ 
►నేడు వాదనలు వినిపించనున్న సీఐడీ.
► చంద్రబాబు కేసుపై నిన్న సుదీర్ఘ వాదనలు
► దాదాపు రెండున్నర గంటల పాటు వాదనలు వినిపించిన చంద్రబాబు తరపు న్యాయవాది హరీష్‌ సాల్వే
► నేడు CID, ఏపీ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించనున్న సీనియర్ లాయర్‌ ముకుల్‌ రోహత్గీ

6:50 AM, అక్టోబర్‌ 10, 2023
నేడు సిట్‌ విచారణకు నారా లోకేశ్‌..
►ఢిల్లీ నుంచి ఏపీకి టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ బాబు 
►కోర్టు ఉత్తర్వులు ప్రకారం.. ఈరోజు ఉదయం సీఐడీ సిట్ విచారణకు హాజరు
►తాడేపల్లి సమీపంలోని పాతూరు రోడ్డులో ఉన్న సిట్ కార్యాలయంలో విచారణ
►మంగళవారం ఉ.10 నుంచి సా.5 గంటల వరకు లోకేశ్ విచారణ
►మధ్యాహ్నం గంటపాటు భోజన విరామం ఇవ్వాలని సీఐడీకి కోర్టు ఆదేశం
►సీఐడీ నోటీసుల్లోని పలు అంశాలపై ఈనెల 4న కోర్టును ఆశ్రయించిన లోకేష్
►సీఐడీకి పలు స్పష్టమైన ఆదేశాలు జారీచేసిన హైకోర్టు
►విచారణ సమయంలో లోకేష్‌తో పాటు న్యాయవాదిని అనుమతించాలని ఆదేశం
►ఫలానా దస్త్రాలతో రావాలని పిటిషనర్‌ను ఒత్తిడి చేయవద్దన్న న్యాయస్థానం
►చంద్రబాబు అరెస్ట్‌ తర్వాత.. న్యాయ నిపుణులతో చర్చ పేరిట ఢిల్లీకి వెళ్లిన వైనం
►ఇన్నర్‌ రింగ్‌రోడ్‌ కేసులో ఏ14గా నారా లోకేష్‌
►ఢిల్లీ వెళ్లి మరీ నోటీసులు ఇచ్చిన సీఐడీ పోలీసులు
► విచారణకు సహకరించాల్సిందేనని స్పష్టం చేసిన ఏపీ హైకోర్టు.

చంద్రబాబు అరెస్ట్‌పై తొలిసారి స్పందించిన సీఎం జగన్‌
► చంద్రబాబు అనే వ్యక్తి ప్రజల్లో ఉన్నా, జైల్లో ఉన్నా పెద్ద తేడా ఏమీ పడదు
► ఆయనకు విశ్వసనీయత లేదు, రాదు. ఎక్కడున్నా ఆయనకు విశ్వసనీయత లేదు. అలాంటి ఆయన ఎక్కడున్నా ఒక్కటే.
► చంద్రబాబును చూసినప్పుడు, ఆయన పార్టీని చూసినప్పుడు పేదవాడికి, ప్రజలకు గుర్తుకు వచ్చేది ఒక్కటే, మోసాలు, వెన్నుపోట్లు, అబద్ధాలు, వంచనలు.
► చంద్రబాబు నాయుడ్ని ఎవ్వరూ కూడా కక్షసాధింపుతో అరెస్టు చేయలేదు. ఆయనమీద నాకు ఎలాంటి కక్ష లేదు. కక్షసాధించి ఆయన్ను ఎవ్వరూ అరెస్ట్‌ చేయలేదు
► నేను భారతదేశంలో లేనప్పుడు, లండన్‌లో ఉన్నప్పుడు చంద్రబాబును పోలీసులు అరెస్టు చేశారు.
► కక్షసాధింపే నిజమనుకుంటే.. కేంద్రంలో బీజేపీ ఉంది, దత్తపుత్రుడు బీజేపీతోనే ఉన్నానని ఇప్పటికీ అంటున్నాడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలితోపాటు, సగం టీడీపీ నాయకులు బీజేపీలోనే ఉన్నారు.
► కేంద్రంలోని ఇన్‌కంటాక్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ విచారణ చేసి ఆయన అవినీతిని గమనించి నోటీసులిచ్చాయి, దోషులను అరెస్టు చేసింది
► చంద్రబాబుకు నేరుగా ఇన్‌కంట్యాక్స్ నోటీసులు కూడా ఇచ్చారు.
► మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మోడీగారు బాబుపై అవినీతి ఆరోపణలు కూడా చేశారు. పోలవరంను చంద్రబాబు ఏటీఎంలా మార్చారని ప్రధాని స్వయంగా చెప్పారు.
► రాష్ట్రంలో సీబీఐని, ఐటీని, ఈడీని అడుగు పెట్టనివ్వనని గతంలో చంద్రబాబు పర్మిషన్‌కూడా విత్‌డ్రా చేశాడు.
► ఆనాటికే అవినీతిపరుడని స్పష్టంగా రూఢి అయిన ఈ వ్యక్తిపైన విచారణ చేయకూడదట
► విచారించిన తర్వాత రిమాండుకు పంపినా ఒక చంద్రబాబును గాని, వీరప్పన్‌గాని ఎవ్వరూ కూడా పట్టించి ఇవ్వడానికి వీల్లేదని ఎల్లోమీడియా, ఎల్లో గజదొంగల ముఠా వాదనలు వినిపిస్తున్నాయి.
► ఇలాంటి వ్యవస్థలతో మనం యుద్ధంచేస్తున్నాం.

నిన్న సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు వివరాలు..
హరీష్‌ సాల్వే : ఒక ప్రజా ప్రతినిధి సైకిల్‌ దొంగతనం చేస్తే.. దానికి అవినీతి నిరోధక చట్టం వర్తించదు. అంటే జరిగిన అక్రమం తనకు కేటాయించిన విధులకు సంబంధించినదయి ఉండాలి

► జస్టిస్‌ బోస్‌ :  మీ వాదన ప్రకారం ఈ సెక్షన్‌ పైపైన వర్తిస్తుందని అనుకోవాలి

హరీష్‌ సాల్వే :: అంటే అధికారిక నిర్ణయాలకు సంబంధించినవి కాబట్టి..

► జస్టిస్‌ బోస్‌ : ఇందులో పరిపాలనపరమైన అంశాలున్నాయి. కేసులో అభియోగాలను పరిశీలిస్తే.. 10 శాతం అడ్వాన్స్‌ నిధులను ముందే విడుదల చేశారు

హరీష్‌ సాల్వే :నేను కేసు లోతుల్లోకి వెళ్లడం లేదు. అయినా ఈ కేసులో నిందితులందరికీ ఇప్పటికే కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అయినా మేం 17Aపైనే ఎందుకు వాదిస్తున్నామంటే అరెస్ట్‌ చేసిన విధానం సరికాదని. పార్లమెంటులో చట్టం తెచ్చిన ఉద్దేశ్యమేంటంటే.. ఈ సవరణ తర్వాత జరిగిన కేసులకు 17A SOP వర్తించాలని.

3:45 PM, అక్టోబర్‌ 9, 2023
సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు
హరీష్‌ సాల్వే : కానీ ఈ కేసులో పోలీసు అధికారి తన బాధ్యతలో భాగంగా తన పై అధికారి ముందస్తు అనుమతి తీసుకోవాలి.

జస్టిస్‌ త్రివేదీ : సెక్షన్‌ 6A DSPE act (ఢిల్లి స్పెషల్‌ పోలీస్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌)కు సంబంధించి సుప్రీంకోర్టు ధర్మాసనం ఉత్వర్వులను చూడండి. ఆ కేసులో అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఏం చెప్పిందో చూడండి. అది సరిగ్గా 17A సవరణ తరహాలోనే ఉంది కదా.

► సెక్షన్‌ 6A DSPE act (ఢిల్లి స్పెషల్‌ పోలీస్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌) కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే : 2014కు ముందు నమోదయిన అవినీతి, అక్రమాల కేసుల్లో ప్రజా ప్రతినిధులకు ఎలాంటి మినహాయింపు ఉండదు. ఇది సరిగ్గా 17Aకు సంబంధం ఉన్న కేసే.

3:25 PM, అక్టోబర్‌ 9, 2023
సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు
హరీష్‌ సాల్వే :ఈ కేసులో చంద్రబాబు పేరును సెప్టెంబర్‌ 8, 2023న చేర్చారు. ఒకప్పుడు 37వ నిందితుడిగా ఉన్న చంద్రబాబును మొదటి నిందితుడిగా చేర్చామని తెలిపారు. దర్యాప్తు అధికారి చెప్పిన దాని ప్రకారం A37 (చంద్రబాబు) సూచనల మేరకు  A36 (నిందితుడి సంఖ్య 36) నేరానికి పాల్పడ్డారు. కాబట్టి ఇది అవినీతి నిరోధక చట్టం కిందికి వర్తిస్తుందని చెప్పారు. అప్పుడే గవర్నర్‌ దగ్గరకు వెళ్లి అనుమతి తీసుకోవాల్సింది.

 జస్టిస్‌ త్రివేదీ : 17A సవరణను ఎలాగైనా చూడవచ్చు. 17A సవరణ కంటే ముందు జరిగిన నేరాల సంగతేంటీ? ఒక్కో సవరణ వచ్చినప్పుడల్లా కొత్తగా కొందరిని దీని పరిధిలోకి తెస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అసలు ఈ కేసులో 17A సవరణ వర్తిస్తుందా?
 

► జస్టిస్‌ బోస్‌ :  17A అనేది కేవలం నేరం జరిగిన తేదీకి వర్తిస్తుంది కానీ, నిందితులకు కాదు కదా.

► హరీష్‌ సాల్వే : 17A అనేది నేరం జరిగిన తేదీని బట్టి పరిగణించవద్దని కోరుతున్నాను. ఈ చట్టం ఉద్దేశ్యం ఏంటంటే, దర్యాప్తు పేరిట ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టకూడదన్నది.

► జస్టిస్‌ త్రివేదీ : 17A సవరణ అన్న చట్టాన్ని మనం అవినీతి నిరోధక చట్టం ఉద్దేశ్యంలో చూడాలి. దాని ప్రకారం ప్రజా ప్రతినిధులు అక్రమాలకు పాల్పడకూడదని. అంతే తప్ప.. చట్టంలోని ప్రధాన ఉద్దేశ్యాన్ని పక్కనబెట్టి ఒక వ్యక్తికి మేలు జరిగేలా ఈ చట్టాన్ని విశ్లేషించుకోవద్దు. అది మొత్తం లక్ష్యాన్నే దెబ్బతీస్తుంది.

3:25 PM, అక్టోబర్‌ 9, 2023
విజయవాడ: చంద్రబాబు కేసులో ACB కోర్టు కీలక నిర్ణయం
► చంద్రబాబు పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌ కొట్టేసిన కోర్టు
► CID వేసిన కస్టడీ పిటిషన్‌ తిరస్కరించిన న్యాయస్థానం

3:15 PM, అక్టోబర్‌ 9, 2023
సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు
► హరీష్‌ సాల్వే : కేంద్రం ఈ చట్టాన్ని ఎందుకోసం తెచ్చిందో గుర్తు చేసుకోవాలి. 17A అమలు ఎలా ఉండాలన్నదానిపై కొన్ని మార్గదర్శకత్వ నిర్దేశకాలను కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్‌ 3, 2021న రాష్ట్రాలకు పంపింది. ఏ స్థాయి నాయకుల విషయంలో ఎవరి అనుమతి తీసుకోవాలన్న విషయంలో స్పష్టత ఇచ్చింది. దాన్ని బట్టి ఎలాంటి దర్యాప్తు జరగాలన్నా ముందస్తు అనుమతి కావాలి.

 జస్టిస్‌ త్రివేదీ : ఈ SOP అన్నది మూడేళ్ల కిందనే 17a సవరణ తెచ్చినప్పుడు ప్రకటించింది. SOP ప్రకటించకముందు సంగతేంటీ? అయినా Regime Revenge (పదవీ మారగానే రాజకీయ కక్ష చూపించడం) అని ఎవరన్నారు?
 

► హరీష్‌ సాల్వే: మా స్నేహితుడు రాజీవ్‌ ధావన్‌ ఈ పదాన్ని ఉపయోగించారు. కేంద్రం తెచ్చిన SOP కోర్టు ముందు నిలబడకపోవచ్చు. కానీ ఆ చట్టం వెనకున్న పరమార్థాన్ని మెరుగ్గా అర్థం చేసుకోడానికి ఉపయోగపడవచ్చు.

2:50 PM, అక్టోబర్‌ 9, 2023
సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు
► హరీష్‌ సాల్వే : ఈ కేసులో హైకోర్టు ఏం చెప్పిందంటే.. 2015-16 మధ్య కాలంలో జరిగిన నేరానికి సంబంధించిన అభియోగాలున్నాయి కాబట్టి, దర్యాప్తు జరిగిన తేదీని పట్టించుకోమని చెప్పింది. అందుకే ఆ డాక్యుమెంట్‌ను హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదు. న్యాయశాస్త్రంలో ఉన్న విషయాన్ని రెండు రకాలుగా అన్వయించుకోవచ్చు. కానీ నిర్దారణ అయిన విషయాలను అనుమానించలేరు. రిమాండ్‌ విధించిన ఆర్డర్‌లో చంద్రబాబు పాత్రను 2021లో జరిగిన ప్రాథమిక దర్యాప్తు ద్వారా నిర్దారించామని కోర్టుకు CID తెలిపింది. 17A సవరణ కూడా సరిగ్గా ఇలాంటి కేసుల కోసమే తీసుకొచ్చారు.

2:35 PM, అక్టోబర్‌ 9, 2023
సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు
► హరీష్‌ సాల్వే: ఈ కేసులో ఫిర్యాదును చూస్తే.. సీమెన్స్‌, డిజైన్‌టెక్‌, ఇతరుల పేర్లున్నాయి తప్ప పిటిషనర్‌ పేరు లేదు. పైగా ఈ కేసులో ప్రాథమిక దర్యాప్తు 2021 తర్వాత జరిగిందని భావించాలి. అందువల్ల 17A సవరణ ఈ కేసుకు వర్తిస్తుంది.

► జస్టిస్‌ బోస్‌ :  ఈ కేసులో రెండు విషయాలు పరిశీలిస్తున్నాం. ఒకటి, హైకోర్టు ముందు CID దాఖలు చేసిన డాక్యుమెంట్‌. జులై 5,2018న దర్యాప్తు ప్రారంభమయిందని చెప్పే డాక్యుమెంట్‌. రెండో అంశం.. హైకోర్టు ముందు వాదన వినిపించడానికి మీరు అవకాశం కోల్పోయారా? అన్న విషయాలను. వీటిని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటాం.

► హరీష్‌ సాల్వే : ఇప్పుడు మీరు మళ్లీ హైకోర్టుకు వెళ్లి వాదన వినిపించమంటే మేం నష్టపోతాం. హైకోర్టు కచ్చితంగా సెక్షన్‌ 17A సవరణ దీనికి వర్తించదంటారు. ఒక డాక్యుమెంట్‌ కారణంగా తీర్పు మారకూడదు. నేను మీకు ఈ డాక్యుమెంట్‌ గురించి ఎందుకు చెప్పానంటే.. దీని వల్లే CID వారు దర్యాప్తును 2018కంటే ముందు ప్రారంభించామంటున్నారు

► హరీష్‌ సాల్వే : హైకోర్టు ఏమంటుందంటే, ప్యారా 15 ప్రకారం నేరం 2015-16 మధ్య జరిగిందని చెబుతుంది. వారి దృష్టిలో దర్యాప్తు తేదీకి ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే ఏపీ హైకోర్టు అసలు డాక్యుమెంట్‌నే పరిగణనలోకి తీసుకోలేదు

2:20 PM, అక్టోబర్‌ 9, 2023
సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు
 జస్టిస్‌ త్రివేదీ : ఈ కేసులో మీ వాదనంతా దేని మీద ఉందంటే.., వాదనల తర్వాత డాక్యుమెంట్‌ సమర్పించారని మీరు చెబుతున్నారు. అంటే అసలేం వినకుండానే కేసు కొట్టేస్తారా?
 

► CID తరపున సీనియర్‌ లాయర్‌ నిరంజన్‌ రెడ్డి : ఈ కేసులో వాదనల తర్వాత డాక్యుమెంట్లు సమర్పించామని సాల్వే చేస్తోన్న వాదన సరికాదు. కేసు రిమాండ్‌లోనే ఈ విషయం అంతా ఉంది
 

► బాబు తరపున సీనియర్‌ లాయర్ సాల్వే : ఏ కేసులోనయినా హైకోర్టు ఏం భావనలో ఉంటుందంటే.. ఆ రిమాండ్‌ 17A సవరణకు లోబడి ఉంటుందని అనుకుంటుంది. 2021లో జరిగిన ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా దర్యాప్తు ప్రారంభమయింది.
 

► జస్టిస్‌ బోస్‌ :  ఈ కేసులో దర్యాప్తు ఎప్పుడు ప్రారంభమయింది?
► బాబు తరపున సీనియర్‌ లాయర్ సాల్వే: సెప్టెంబర్‌ 7, 2021
► జస్టిస్‌ బోస్‌ :  దేని ఆధారంగా ఆ విషయం చెబుతున్నారు?

► బాబు తరపున సీనియర్‌ లాయర్ సాల్వే: డిజైన్‌ టెక్‌ పన్ను ఎగ్గొట్టిందని GST (గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ టాక్స్‌) డిపార్ట్‌మెంట్‌ పసిగట్టింది. అంతే తప్ప దీనికి పిటిషనర్‌కు సంబంధం లేదు.
► జస్టిస్‌ త్రివేదీ : డిజైన్‌ టెక్‌ ఒప్పందం ఎవరితో కుదుర్చుకున్నారు?
► బాబు తరపున సీనియర్‌ లాయర్ సాల్వే: నాటి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో

2:14 PM, అక్టోబర్‌ 9, 2023
సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు
► బాబు లాయర్‌ సాల్వే : 17A సవరణ మీద వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు హైకోర్టులు వేర్వేరు పద్ధతులు అనుసరిస్తున్నాయి. కొన్ని కోర్టులు  నేరం జరిగిన తేదీ అంటున్నాయి. మరికొన్ని FIR నమోదయిన తేదీ అంటున్నాయి
► ఇది అవినీతి నిరోధక చట్టానికి వర్తిస్తుందా లేదా అని న్యాయస్థానం ప్రశ్నించింది
► దీనిపై ప్రత్యేక న్యాయస్థానంలో ఇచ్చిన ఆదేశాలను మీ ముందుంచుతున్నాం
► సెక్షన్‌ 17A సవరణ వర్తిస్తుందని విజ్ఞప్తి చేస్తున్నాం
► పంకజ్‌ బన్సల్‌ కేసులో కోర్టు ఏం చెప్పిందంటే.. అరెస్ట్‌ సక్రమం కానప్పుడు రిమాండ్‌ రిపోర్ట్‌ చెల్లదని న్యాయస్థానం చెప్పింది : సాల్వే
► వాదనల తర్వాత CID వారు డాక్యుమెంట్‌ సమర్పించారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement