సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ సీఐడీ చంద్రబాబుపై ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. అసైన్డ్ భూముల కుంభకోణంలో చంద్రబాబుపై ఛార్జ్‌షీట్ దాఖలు చేసినట్లు సోమవారం వెల్లడించింది. రూ.4400 కోట్ల అసైన్డ్ భూముల కుంభకోణం జరిగినట్టు సీఐడీ నిర్ధారించింది. చంద్రబాబు.. అసైన్డ్ భూముల స్కాంలో ప్రధాన ముద్దాయి. చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణ ముద్దాయిగా ఛార్జ్‌షీట్‌లో సీఐడీ పేర్కొంది. 1100 ఎకరాల అసైన్డ్ భూముల కుంభకోణం జరిగినట్టు సీఐడీ తెలిపింది.
అమరావతి రాజధానిలో భారీ భూదోపిడీ, క్యాపిటల్ సిటీ ప్లాన్‌తో చంద్రబాబు అండ్ కో భూ దోపిడికి పాల్పడినటట్లు సీఐడీ నిర్ధారించింది. చంద్రబాబు, ఆయన బినామీలు అసైన్డ్ భూములు కాజేసినట్టు సీఐడీ గుర్తించింది.రికార్డులను ట్యాంపరింగ్ చేసి అసైన్డ్ భూముల స్కాం చేసినట్టు సీఐడీ నిర్ధారణ చేసింది. చంద్రబాబు, నారాయణతో పాటుమాజీ తహసీల్దార్ సుధీర్ బాబు, రామక్రిష్ణ హౌసింగ్ లిమిటెడ్ ఎండీ అంజనీ కుమార్ ముద్దాయిలుగా సీఐడీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment