ఫైబర్‌నెట్‌ స్కామ్‌ కేసు.. సీఐడీ చార్జ్‌షీట్‌లో ఏ-1గా చంద్రబాబు | AP CID FIles Chargesheet On Fibernet Scam Case Naming Chandrababu Naidu As A1, Details Inside - Sakshi
Sakshi News home page

Fibernet Scam Case: ఫైబర్‌నెట్‌ స్కామ్‌ కేసు.. సీఐడీ చార్జ్‌షీట్‌లో ఏ-1గా చంద్రబాబు

Published Fri, Feb 16 2024 9:52 PM | Last Updated on Sat, Feb 17 2024 8:34 AM

CID FIles Chargesheet On Fibernet Case - Sakshi

అమరావతి: ఏపీ ఫైబర్‌నెట్‌ స్కామ్‌ కేసులో సీఐడీ చార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. ఈ మేరకు ఏసీబీ కోర్టులో చార్జ్‌షీట్‌ దాఖలు చేసింది సీఐడీ. ఈ చార్జ్‌షీట్‌లో ఏ-1గా చంద్రబాబు, ఏ-2గా వేమూరి హరికృష్ణ, ఏ-3గా కోగంటి సాంబశివరావులను పేర్కొంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి దోపిడీ పర్వంలో ఫైబర్‌నెట్‌ కుంభకోణం ఒకటి. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన ఫైబర్‌ నెట్‌ ప్రాజెక్టులో పచ్చ ముఠా అడ్డగోలు అవినీతికి పాల్పడింది. 

మొత్తం రూ.2 వేల కోట్ల ఈ ప్రాజెక్టు కింద మొదటి దశలో రూ.333 కోట్ల విలువైన పనుల్లో అక్రమాలను సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) బట్టబయలు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు, లోకేశ్‌కు సన్నిహితుడైన వేమూరి హరికృష్ణకు చెందిన “టెరా సాఫ్ట్‌’ కంపెనీకి టెండర్లు కట్టబెట్టారని నిగ్గు తేల్చింది. ఈ మేరకు సీఐడీ.. ఏసీబీ కోర్టులో చార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. 

ఇదీ చదవండి: ఫైబర్‌నెట్‌లోనూ బాబు మార్కు అవినీతి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement