Live: చంద్రబాబు కేసు లైవ్‌ అప్‌డేట్స్‌.. Click & Refresh | Chandrababu Naidu Remand And Hearings In The Skill Scam Case, Live Updates And Latest News In Telugu - Sakshi
Sakshi News home page

Live: చంద్రబాబు కేసు లైవ్‌ అప్‌డేట్స్‌.. Click & Refresh

Published Wed, Oct 11 2023 6:48 AM | Last Updated on Wed, Oct 11 2023 7:44 PM

Chandrababu Arrest Remand Scams Oct 11 Updates - Sakshi

LIVE : Chandrababu Arrest, Remand, Cases, Scams And Ground updates

7:01PM, అక్టోబర్‌ 11, 2023
►మళ్లీ ఢిల్లీకి నారా లోకేష్‌
►గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయల్దేరిన నారా లోకేష్

6:25 PM, అక్టోబర్‌ 11, 2023
మళ్లీ ఢిల్లీకి లోకేష్‌

► విజయవాడ నుంచి ఢిల్లీకి  నారా లోకేష్
► ఎల్లుండి సుప్రీం కోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ
► పిటిషన్ అంశాలపై న్యాయవాదులతో మాట్లాడతానన్న లోకేష్

6:20 PM, అక్టోబర్‌ 11, 2023
మొన్న దోమలు, నిన్న వేడినీళ్లు, నేడు ఉక్కపోత

► పెరిగిపోతున్న చంద్రబాబు డిమాండ్‌లు
► చంద్రబాబు రాజమండ్రి జైలులో ఇబ్బందిపడుతున్నారు : లోకేష్‌
► ఉష్ణోగ్రతలు పెరిగాయి..రాజమండ్రిలో ఉక్కపోత ఎక్కువ ఉంది : లోకేష్‌
► వేడి వల్ల చంద్రబాబు డీ హైడ్రేషన్ అవుతోంది : : లోకేష్‌
► మాజీ సిఎంగా చంద్రబాబుకు జైల్లో క్లాస్ ఏ సౌకర్యాలు ఇవ్వాలి
► చంద్రబాబుకు అందాల్సిన క్లాస్ ఏ సౌకర్యాలు ఇవ్వాలి : లోకేష్‌

6:15 PM, అక్టోబర్‌ 11, 2023
రింగ్‌ మాయ.. ఆవుల ముందస్తు బెయిల్‌ 17న విచారణ

► ఆవుల మునిశంకర్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా
► తదుపరి విచారణను ఈ నెల 17 కు వాయిదా వేసిన ఏపీ హైకోర్టు
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన మాజీ మంత్రి నారాయణ బావమరిది ఆవుల మునిశంకర్

6:15 PM, అక్టోబర్‌ 11, 2023
PT వారంటుపై రేపు విచారణ

► ఫైబర్ నెట్ పీటీ వారెంట్ పిటిషన్ పై ఏసీబీ కోర్టు విచారణ రేపటికి వాయిదా
► ఏసీబీ కోర్టులో ఫైబర్ నెట్ కుంభకోణంపై స్పెషల్ పీపీ వివేకానంద వాదనలు
► ఫైబర్ నెట్ కుంభకోణంలో చంద్రబాబే ప్రధాన ముద్దాయి
► ఫైబర్ నెట్ స్కాం లో రూ. 115 కోట్ల నిధులు గోల్ మాల్ అయ్యాయని సిట్ దర్యాప్తులో తేలింది
► సిట్ దర్యాప్తు లో చంద్రబాబు పాత్ర బయటపడడంతో కేసు నమోదు
► ఫైబర్ నెట్ స్కాం లో చంద్రబాబు పాత్రను గుర్తించిన తర్వాతే FIR లో చేర్చాం
► టెర్రా సాఫ్ట్ కి అక్రమ మార్గంలో టెండర్లు ఖరారు చేయడానికి అక్రమాలకు పాల్పడ్డారు
► టెర్రా సాఫ్ట్ కోసం నిబంధనలకు విరుద్ధంగా టెండర్ గడువును వారం రోజులు పొడిగించారు
► ఫైబర్ నెట్ స్కాం లో మనీ ల్యాండరింగ్ జరిగినట్లు ఈడీ గుర్తించింది
► చంద్రబాబు సీఎం హోదాను అడ్డుపెట్టుకొని అక్రమాలకు పాల్పడినట్లు ఆధారాలున్నాయి  :

6:05 PM, అక్టోబర్‌ 11, 2023
లోకేషా, జవాబులు చెప్పలేక సాక్షిపై రంకెలా?

► రెండోరోజు ముగిసిన లోకేష్ సిఐడి విచారణ
► ఆరు గంటలపాటు సిఐడి అధికారులు విచారించారు
► ఇవాళ నా ముందు ఒక డాక్యుమెంట్ పెట్టారు
► భువనేశ్వరి ఐటీ రిటర్న్‌లకు సంబంధించి డాక్యుమెంట్ పెట్టారు
► లింగమనేని రమేష్ కు రెంటల్ అడ్వాన్స్ రూ.27 లక్షలు కట్టారని చెప్పారు
► రెంటల్ అడ్వాన్స్ కు సంబంధించి ఐటీ రిటర్న్‌ల్లో లేదని చెప్పారు
► ఐటీ రిటర్న్‌లకు సంబంధించి ఆడిటర్ ను అడగాలని చెప్పా
► ఇంట్లో ఉండి అద్దె చెల్లిస్తే క్విడ్‌ప్రోకో ఎలా అవుతుంది
► ఐఆర్ఆర్‌కు సంబంధించి నాలుగైదు ప్రశ్నలు అడిగారు
► నా శాఖకు సంబంధించి పలు ప్రశ్నలు పదేపదే అడిగారు
► ఈ కేసులో మరోసారి ఏమైనా లేఖ ఇస్తారా అని అడిగా
► హెరిటేజ్ కొనుగోలు చేసిన 9 ఎకరాలు గూగుల్ ఎర్త్‌లో చూపించారు
► ఐఆర్ఆర్ లో నాకు, కుటుంబసభ్యులకు ఎలాంటి పాత్ర లేదు
► పదేళ్లుగా కుటుంబసభ్యుల ఆస్తుల ప్రజల ముందుంచుతున్నా
► ఒక కంపెనీలో షేర్లు కొన్నందుకు కంపెనీ నిర్ణయాలపై నన్ను ప్రశ్నించారు
► నాకు టిసీఎస్ సహా అనేక కంపెనీల్లో షేర్లు ఉన్నాయి
► సాక్షి మీడియా సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసేందుకు లోకేష్‌ ప్రయత్నం
► సాక్షి మీడియా : లింగమనేని ఇల్లు మీకెందుకు ఇచ్చారు?
► లోకేష్‌  : 2019 తర్వాత మేం రూ.27 లక్షల అద్దె చెల్లించాం
► సాక్షి మీడియా : మరి 2014-19 మధ్య కాలంలో అద్దె ఎందుకు చెల్లించలేదు?
► సమాధానం చెప్పకుండా సబ్జెక్ట్‌ మార్చిన లోకేష్‌
(ఈ ఇంటిని లింగమనేని ప్రభుత్వానికి ఇచ్చారని గతంలో ప్రకటించిన చంద్రబాబు)
► సాక్షి మీడియా : మీ పాదయాత్రలో అత్యంత క్లోజ్‌గా కనిపించిన కిలారు రాజేష్‌ నోటీసులు ఇవ్వగానే అమెరికా ఎందుకు పారిపోయారు?
► లోకేష్‌  : నాకు తెలియని ప్రశ్నలు నన్నెలా అడుగుతారు? చంద్రబాబును అక్రమంగా జైల్లో పెట్టారు
► సాక్షి మీడియా : రిమాండ్‌ ఇచ్చింది కోర్టులు అయితే.. ప్రభుత్వం జైల్లో పెట్టిందని ఎలా చెబుతారు?
సమాధానం చెప్పలేక సాక్షి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన లోకేష్‌ 

5:05 PM, అక్టోబర్‌ 11, 2023
ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుని కూడా విచారించాల్సి ఉంది: స్పెషల్ పిపి వివేకానంద
► ఫైబర్ నెట్ కుంభకోణంలో చంద్రబాబు ప్రదాన ముద్దాయిగా ఏసీబీ కోర్టులో సీఐడీ దాఖలు చేసిన  పిటి వారెంట్ పై వాదనలు వినిపించిన స్పెషల్ పిపి వివేకానంద
► ఫైబర్ నెట్ కుంభకోణంలో రూ. 115 కోట్ల నిధుల‌గోల్ మాల్ అయ్యాయని సిట్ దర్యాప్తులో తేలింది
► 2021 లోనే ఫైబర్ నెట్ కుంభకోణంపై 19 మందిపై సీఐడీ కేసు నమోదు చేసింది
► సిట్ దర్యాప్తులో చంద్రబాబు పాత్ర బయటపడడంతో ఆయనపైనా కేసు నమోదు
► ఎ-1 ముద్దాయిగా వేమూరి హరిప్రసాద్, మాజీ ఎండి సాంబశివరావు ఏ-2గా, చంద్రబాబు ఏ-25గా ఎఫ్ఐఆర్ నమోదు అయింది
► ఫైబర్‌నెట్ కుంభకోణంలో చంద్రబాబు పాత్రని గుర్తించిన తర్వాతే ఎఫ్‌ఐఆర్‌లో చేర్చాం
► టెర్రా సాఫ్ట్‌కి అక్రమ మార్గంలో టెండర్లు ఖరారు చేయడానికి అక్రమాలకి పాల్పడ్డారు
► టెర్రా సాఫ్ట్ కోసం నిబంధనలకి విరుద్దంగా టెండర్ గడువుని వారం రోజులు పొడిగించారు
► బ్లాక్ లిస్ట్ లో ఉన్న టెర్రా సాఫ్ట్‌కి టెండర్ దక్కేలా అక్రమాలకి పాల్పడ్డారు
► ఫైబర్ నెట్ లో ఫేజు-1 లో 320 కోట్లకి టెండర్లు పిలిస్తే 115 కోట్ల అవినీతి జరిగింది
► టెర్రా సాప్ట్ కి టెండర్లు కట్టబెట్టేందుకు నిబంధనలు పక్కన పెట్టారు
► సివిల్ సప్లైస్ శాఖకి నాసిరకం ఇ- పోస్ మిషన్లు పంపిణీ చేసినందుకు టెర్రా సాఫ్ట్ ని బ్లాక్ లిస్ట్ లో పెట్టారు
► బ్లాక్ లిస్ట్‌లో ఉన్న టెర్రా సాఫ్ట్ ని రెండు నెలలు కూడా పూర్తి కాకుండానే బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించారు
► నిబంధనలకి విరుద్దంగా అప్పటి సివిల్ సప్లైస్ డైరక్టర్ రవిబాబు టెర్రా సాఫ్ట్ ని బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించారు
► టెర్రా సాఫ్ట్‌ని బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించాలని చంద్రబాబు ఒత్తిడి తెచ్చారు
► టెర్రా సాఫ్ట్‌కి టెండర్లు కట్టబెట్టేందుకు పలు అక్రమాలకు పాల్పడ్డారు
► టెర్రా సాఫ్ట్‌తో కన్సార్టియంలో భాగమైన హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ కంపెనీ
► టెండర్లు దక్కించుకున్న తర్వాత టెర్రా సాఫ్ట్ నుంచి హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ కంపెనీని నిబంధనలకి విరుద్దంగా బయటకి పంపించారు
► తమని మోసం చేసి నిబంధనలకి విరుద్దంగా మరొక కంపెనీ నుంచి రూ. 115 కోట్ల నాసిరకం మెటీరియల్‌ని టెర్రా సాఫ్ట్ కొనుగోలు చేసి ఫైబర్ నెట్ కి సరఫరా చేసినట్లు వాంగ్మూలమిచ్చిన హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్
► ఇప్పటికే హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ అనీల్ జైన్ స్టేట్‌మెంట్‌ రికార్డు చేసిన సీఐడీ
► ఈ కేసులో చంద్రబాబుని కూడా విచారించాల్సి ఉంది
► చంద్రబాబు సీఎం హోదాని అడ్డుపెట్టుకుని అక్రమాలకి పాల్పడినట్లు ఆధారాలున్నాయి
► ఫైబర్ నెట్ కేసులో పిటి వారెంట్ అనుమతించండి

4:10 PM, అక్టోబర్‌ 11, 2023
చంద్రబాబు పిటిషన్‌ డిస్మిస్‌
► చంద్రబాబు లాయర్లు వేసిన రైట్ టు ఆడియెన్స్ పిటిషన్ డిస్మిస్
► రైట్ టు ఆడియెన్స్ పిటిషన్ ను డిస్మిస్ చేసిన ఏసీబీ కోర్టు
► చంద్రబాబుపై పెండింగ్ లో ఉన్న పీటీ వారెంట్ల పై విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు
► హైకోర్టు ఆదేశాలు, జరిగిన పరిణామాలను జడ్జికి వివరించిన ఇరుపక్షాల లాయర్లు
► కేసు వివరాలు, ఎంత మందిని అరెస్ట్ చేశామన్న విషయాన్నీ జడ్జికి వివరించిన సీఐడీ లాయర్ వివేకా

3:10 PM, అక్టోబర్‌ 11, 2023
తప్పు చేయలేదని కాకుండా అరెస్ట్‌ గురించి వాదిస్తారా? : చంద్రబాబు తీరుపై సజ్జల విమర్శలు
► చంద్రబాబు అరెస్టు అయి నెల దాటింది
► రెండు పక్షాల వాదనలు విన్న తర్వాత స్కాం ఆధారాలు ఉన్నాయని కోర్టు నమ్మి రిమాండ్ వేసింది
► చంద్రబాబును ప్రోటోకాల్ ప్రకారం అరెస్టు చేయలేదనే ఆయన లాయర్లు, ఆ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు
► అంతేతప్ప నేరం జరగలేదని ఒక్క ఆధారం కూడా చూపించలేక పోయారు
► రూ.3,300 కోట్ల ప్రాజెక్టు అని క్యాబినెట్ ఆమోదం పొంది, జీవోలలో మొత్తం మార్చేశారు
► అసలు రూ.3వేల కోట్ల ప్రాజెక్టు వస్తే రూల్స్ ప్రకారం ఏందుకు వ్యవహరించలేదు?
► ఫైనాన్స్ విభాగం కూడా ఇందులో తప్పులు ఉన్నాయని చెప్పినా వినిపించుకోలేదు
► దీనిపై ఎలాంటి స్టడీ చేయకుండా డబ్బు ఎలా రిలీజ్ చేశారు?
► ఆ ప్రాజెక్టుతో సంబంధం లేదని సీమెన్స్ కూడా చెప్పారు?
► ఈ ప్రాజెక్టు మొత్తం కుట్రపూరితంగా జరిగిందనేందుకు అనేక సాక్ష్యాలు ఉన్నాయి
► ఇవన్నీ చూశాకనే చంద్రబాబును అరెస్టు చేశారు
► సుదీర్ఘ విచారణ జరిగాకనే ఈడీ కూడా కొందరిని అరెస్టులు చేసింది
► అన్ని వేళ్లూ చంద్రబాబు పైనే చూపిస్తున్నాయి
► కోర్టుకు సీఐడీ ఆధారాలు చూపించటం వలనే రిమాండ్ కు పంపింది
► విచారణ జరిగితే అన్ని వాస్తవాలు బయటకు వస్తాయని కప్పిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు
► పెండ్యాల శ్రీనివాస్, కిలారి రాజేష్ ల ద్వారా చంద్రబాబుకు డబ్బు ఎలా చేరిందో ఆధారాలు దొరికాయి
► అందుకే కొందరిని దేశం దాటించారు
► ఈ కుట్రలో పాత్రధారి, సూత్రధారి చంద్రబాబే
► ఈ విషయాల గురించి మాట్లాడకుండా 17A గురించి కోర్టులో వాదిస్తున్నారు
► రెండు ఎకరాల నుండి లక్షల కోట్లకు ఎలా ఎదిగిందీ అందరికీ తెలుసు
► కానీ టెక్నికల్ ఆధారాలు చూపించి కేసుల నుండి జారుకునేవారు
► ఐతే స్కిల్ స్కాం కేసులో పక్కా ఆధారాలు దొరికాయి
► ప్రజాకోర్టులో కూడా చంద్రబాబు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి
► ప్రజలు కూడా చంద్రబాబు మోసాలపై నిలదీయాలి
► టీడీపీ నేతలు కూడా బయటకు వచ్చి మాట్లాడాలంటే సిగ్గు పడుతున్నారు
► లోకేష్ కూడా ఢిల్లీ వెళ్లి కూర్చుంటారు
► రాజధాని పేరుతో వేల ఎకరాల భూములను కూడా అలాగే కొట్టేశారు
► రైతులను, ప్రజలను నిలువునా మోసం చేశారు
► ఆయన మనమడికి కూడా లక్షల కోట్ల ఆస్తిని సిద్ధం చేయాలని ప్లాన్ వేశారు
► రింగ్ రోడ్డు స్కాంలో కూడా ఇలాంటి కుట్రే చేశారు
► వ్యవస్థలను మేనేజ్ చేయగలమనే ధీమాతో ఢిల్లీ నుండి కిందివరకు వ్యవహరిస్తున్నారు
► జైల్లో ఉండి కూడా బాబు రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారనటం పెద్ద జోక్
► టిడిపి లీడర్లు ఇలాంటి దిగజారిన స్టేట్‌మెంట్లు ఇచ్చి జుగుప్స కలిగిస్తున్నారు
► లోకేష్ ఢిల్లీలో ఉంటే ఒక్క జాతీయ పార్టీ ఐనా సానుభూతి చూపిందా?
► అడ్డంగా దొరికిన దొంగకి ఎవరు సపోర్టు చేస్తారు?
► రాజమండ్రి జైల్లో చంద్రబాబుకు మంచి భద్రత ఉంది

3:02 PM, అక్టోబర్‌ 11, 2023
చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ
► చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో వాదనలు
► ఇన్నర్‌ రింగ్‌రోడ్డు, అంగళ్లు కేసుల్లో విచారణకు చంద్రబాబు సహకరిస్తాడని చెప్పిన బాబు లాయర్లు
► చంద్రబాబును అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న దమ్మాలపాటి
► సీఐడీ, హోంశాఖతో మాట్లాడి చెప్పాలని ప్రభుత్వ న్యాయవాదులను కోరిన కోర్టు
► ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో సోమవారం వరకు చంద్రబాబును అరెస్ట్‌ చేయొద్దన్న కోర్టు
► అంగళ్లు కేసుల్లో రేపటి వరకు చంద్రబాబును అరెస్ట్‌ చేయొద్దన్న కోర్టు
► ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో పీటీ వారెంట్, పోలీస్ కస్టడీ పై ఎలాంటి ఆదేశాలు ఇవ్వొద్దని ఏసీబీ కోర్టుకు హైకోర్టు ఆదేశాలు

3:00 PM, అక్టోబర్‌ 11, 2023
మన వాళ్లు బ్రీఫ్‌డ్‌ మీ.. బాబును వెంటాడుతున్న పాపాలు
► సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు
► చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని 2017లో సుప్రీంకోర్టులో ఎమ్మెల్యే ఆళ్ల పిటిషన్
► ఓటుకు నోటు కేసు సీబీఐకి బదిలీ చేయాలని మరో పిటిషన్
► తమ లాయర్‌ లూథ్రా అందుబాటులో లేరని చెప్పిన చంద్రబాబు లాయర్
► విచారణ 4 వారాలు వాయిదా వేయాలని కోరిన బాబు లాయర్‌
► అభ్యంతరం వ్యక్తం చేసిన ఆళ్ల రామకృష్ణా రెడ్డి తరఫు న్యాయవాది
► త్వరలోనే విచారణ తేదీని ఖరారు చేస్తామన్న సుప్రీంకోర్టు

2:55 PM, అక్టోబర్‌ 11, 2023
తప్పు చేసి.. రాజకీయ కక్ష అంటారా? : సజ్జల
► చంద్రబాబు అరెస్ట్ పై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు
► స్కిల్ స్కామ్ లో చంద్రబాబు సాక్ష్యాధారాలతోనే అరెస్టు అయ్యారు
► చంద్రబాబు అరెస్టు లో కక్ష సాధింపు ఎక్కడ ఉంది ?
► నేరం జరగలేదని చంద్రబాబు నిరూపించగలరా ?
► రూ. 300 కోట్లకు పైగా ప్రజాధనాన్ని చంద్రబాబు దుర్వినియోగం చేశారు
► ఊరు, పేరు లేకుండా అగ్రిమెంట్ తయారు చేసుకున్నారు
► సీమెన్స్ సైతం మాకు సంబంధం లేదని చెప్పింది
► ఫేక్ ఇన్వాయిస్ లతో నిధులు పక్కదారి పట్టించారు
► నిందితుల్లో ఇద్దరు విదేశాలకు పారిపోయారు
► ఈ స్కామ్ కు సూత్రధారి, లబ్ధిదారు చంద్రబాబే  : సజ్జల

2:50 PM, అక్టోబర్‌ 11, 2023
ఏపి హైకోర్టుకు కొత్త జడ్జిల నియామకం
► ఏపి హైకోర్టుకు నలుగురు కొత్త జడ్జిలను నియమించిన సుప్రీంకోర్టు
► జడ్జిలుగా సీనియర్ న్యాయవాదులు హరినాథ్ , కిరణ్మయి, సుమిత్, విజయ్‌లు
► ఉత్తర్వులు జారీ చేసిన సుప్రీంకోర్టు కొలీజియం

2:40 PM, అక్టోబర్‌ 11, 2023
హైకోర్టులో ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసు
► ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పై వాదనలు
► ఏసిబీ కోర్టులో పీటీ వారెంట్ పెండింగ్ లో ఉందన్న ఏజీ శ్రీరామ్
► ఈ దశలో చంద్రబాబుకు మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వొద్దన్న ఏజీ శ్రీరామ్
► ఈ కేసులో చంద్రబాబును అరెస్టు చూపించే అవకాశం ఉందన్న బాబు తరపు లాయర్‌ దమ్మాలపాటి శ్రీనివాస్
► చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరిన దమ్మాలపాటి శ్రీనివాస్

2:10 PM, అక్టోబర్‌ 11, 2023
ఢిల్లీ: చంద్రబాబు ఓటుకు కోట్లు కేసు విచారణ వాయిదా
►సీనియర్‌ లాయర్‌ సిద్ధార్థ్‌ లూథ్రా అందుబాటులో లేరు
►4 వారాలు వాయిదా వేయాలని కోరిన బాబు తరపు న్యాయవాది
►విచారణ తేదీని ఖరారు చేస్తామన్న ధర్మాసనం

2:01 PM, అక్టోబర్‌ 11, 2023
కాసేపట్లో చంద్రబాబు పిటీ వారెంట్లపై ఏసీబీ కోర్టులో విచారణ
►ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌, ఫైబర్‌ నెట్‌ కుంభకోణాలపై సీఐడీ వేసిన వారెంట్లపై వాదనలు విననున్న ఏసీబీ కోర్టు

1:49 PM, అక్టోబర్‌ 11, 2023
ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్న ఏజీ శ్రీరామ్‌
►చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై హైకోర్టులో విచారణ
►ఐఆర్‌ఆర్‌, అంగళ్లు కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ పిటిషన్లు
►ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్‌పై తీర్పు పెండింగ్‌లో ఉంది: ఏజీ
►కాబట్టి మధ్యంతర బెయిల్‌ ఇవొద్దు
►మధ్యాహ్నం 2.15కి వాదనలు వింటానన్న ధర్మాసనం

12:35 PM, అక్టోబర్‌ 11, 2023
చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ 
►రింగ్‌రోడ్డు, అంగళ్లు కేసుల్లో విచారణకు సహకరిస్తామన్న చంద్రబాబు న్యాయవాదులు
►చంద్రబాబును అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న దమ్మాలపాటి
►సీఐడీ, హోంశాఖతో మాట్లాడి చెప్పాలని ప్రభుత్వ న్యాయవాదులను కోరిన కోర్టు
►పిటిషన్లపై మధ్యాహ్నం విచారణ చేపడతామన్న హైకోర్టు

12:33 PM, అక్టోబర్‌ 11, 2023
సెలవులో రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్‌
►రేపటి నుంచి 4 రోజులు సెలవు తీసుకోనున్న రాహుల్
►ఇంఛార్జ్ సూపరింటెండెంట్‌గా డిప్యూటీ సూపరింటెండెంట్ రాజ్‌కుమార్‌కు బాధ్యతలు

11:45 AM, అక్టోబర్‌ 11, 2023
లోకేష్‌కు సీఐడీ ప్రశ్నలు
►రెండో రోజు కొనసాగుతున్న నారా లోకేష్‌ సీఐడీ విచారణ
►మంత్రి వర్గ ఉప సంఘం నిర్ణయాలపై సీఐడీ వరుస ప్రశ్నలు
►ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌ మార్పుకి ఒత్తిడి చేశారా లేదా?
►మీరు మంత్రి అవ్వగానే మంత్రి వర్గ ఉప సంఘంలో ఎందుకు చేర్చారు?
►మంత్రి వర్గ ఉప సంఘంలో ఇతర సభ్యులను ఒత్తిడి చేశారా కదా..?
►హెరిటేజ్‌, లింగమనేని, నారాయణ భూములకు లబ్ధి చేసేలా అలైన్‌మెంట్‌ ఎందుకు మార్చారు?
►ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు భూసేకరణ పరిహారాన్ని భారీగా పెంచడంలో మీ పాత్ర ఉంది కదా?
►భూ సేకరణ వ్యయాన్ని 210 కోట్లు అదనంగా ఎందుకు పెంచారు?
►లింగమనేని రమేష్‌ మీకు ఎందుకు ఇల్లు ఉచితంగా ఇచ్చారు
►లింగమనేనికి మేలు చేసినందుకే మీకు ఇంటిని క్విడ్‌ ప్రోకోలో ఇచ్చారు కదా?
►ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కాంట్రాక్ట్‌ వ్యయాన్ని అదనంగా పెంచేందుకు సిఫార్స్‌ చేశారా?

11:45 AM, అక్టోబర్‌ 11, 2023
చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై హైకోర్టులో విచారణ
►ఇన్నర్‌ రింగ్‌రోడ్డు, అంగళ్లు కేసులో మధ్యాహ్నం 12 గంటల తర్వాత వాదనలు వింటామన్న హైకోర్టు

11:19 AM, అక్టోబర్‌ 11, 2023
ఐఆర్‌ఆర్‌ కేసులో సీఐడీ విచారణకు నారాయణ అల్లుడు పునీత్‌
►ఐఆర్‌ఆర్‌లో నారా లోకేష్‌, పునీత్‌ మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు సీఐడీ గుర్తింపు
►ఐఆర్‌ఆర్‌ కేసులో విచారణకు హాజరుకావాలని ఈ నెల 6న సీఐడీ నోటీసులు

10:10 AM, అక్టోబర్‌ 11, 2023
రెండో రోజు విచారణకు లోకేశ్‌
►నారా లోకేశ్‌ను రెండో రోజు విచారిస్తున్న ఏపీ సీఐడీ 
►సిట్‌ కార్యాలయంలో నారా లోకేశ్‌. 
►ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో ఏ14గా నారా లోకేశ్‌. 
►తొలిరోజు నారా లోకేశ్‌ పొంతనలేని సమాధానాలు. 
►సీఐడీ విచారణకు హాజరైన మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్‌

09:58 AM, అక్టోబర్‌ 11, 2023
చంద్రబాబు పై సీఐడీ పీటీ వారెంట్ల పై నేడు విచారణ
►నేడు విచారించనున్న విజయవాడ ఏసీబీ కోర్టు
►విచారణ అనంతరం ఆర్డర్  ఇవ్వనున్న న్యాయమూర్తి
►ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్ కేసుల్లో పీటీ వారెంట్లు

09:56 AM, అక్టోబర్‌ 11, 2023
మాజీమంత్రి నారాయణ బంధువు ముందస్తు బెయిల్ పిటిషన్
►మునీశంకర్ బెయిల్‌పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ
►IRR కేసులో నిందితుడిగా చేరుస్తూ సీఐడీ పిటిషన్

09:50 AM, అక్టోబర్‌ 11, 2023
సిట్‌ కార్యాలయానికి బయల్దేరిన నారా లోకేష్‌
►రెండో రోజు లోకేష్‌ను ప్రశ్నించనున్న సీఐడీ
►ఐఆర్ఆర్ కేసులో లోకేష్‌ను విచారించనున్న అధికారులు
►నిన్న ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు విచారించిన సీఐడీ
►నిన్న లోకేష్‌కు 30 ప్రశ్నలు వేసిన సీఐడీ అధికారులు
►హెరిటేజ్‌లో డైరెక్టర్‌గా ఉన్న సమంయలో లోకేష్ తీసుకున్న నిర్ణయాలపై ప్రశ్నించిన సీఐడీ
►నేడు లోకేష్‌తో పాటు విచారణకు మాజీమంత్రి నారాయణ అల్లుడు, లోకేష్, పునీత్‌ను వేర్వేరుగా విచారించనున్న సీఐడీ

09:14 AM, అక్టోబర్‌ 11, 2023
జైల్లో ఆరోగ్యంగానే ఉన్న చంద్రబాబు
►రాజమండ్రి సెంట్రల్ జైల్లో 32వ రోజు రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు
►చంద్రబాబు పూర్తిస్థాయిలో జైల్లో భద్రత
►చంద్రబాబు స్వల్ప అస్వస్థత గురయ్యారని డీహైడ్రైజేషన్ లోనయ్యారని పచ్చ మీడియా హడావిడి
►ఎండ ఎక్కువగా ఉండటంతో ఇబ్బందిగా ఉందని వైద్యాధికారికి చెప్పిన చంద్రబాబు 
►దాంతో చంద్రబాబుకు మూడుసార్లు వైద్య పరీక్షలు జరిపిన జైలు అధికారులు
►ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని స్పష్టం చేసిన అధికారులు

08:13 AM, అక్టోబర్‌ 11, 2023
చంద్రబాబు పిటి వారెంట్లపై ఏసీబీ కోర్టులో నేడు విచారణ
►ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్ కుంభకోణాలపై సీఐడీ వేసిన పిటి వారెంట్లపై వాదనలు విననున్న ఏసీబీ కోర్టు
►ని‌న్న ఏసీబీ న్యాయమూర్తి సెలవు కావడంతో విచారణ నేటి మధ్యాహ్నానికి వాయిదా
►రైట్ టు ఆడియన్స్ పిటీషన్ ప్రకారం తమ వాదనలు వినాలని పట్టుబట్టిన చంద్రబాబు న్యాయవాదులు
►పిటి వారెంట్లలో రైట్ టు ఆడియన్స్ పిటీషన్ వర్తించదంటున్న సీఐడీ తరపు న్యాయవాదులు
►రైట్ టు ఆడియన్స్ పిటీషన్ వర్తిస్తుందా లేదా అనేది నిర్ణయించనున్న కోర్టు
►నేటి మధ్యాహ్నం 2.30 గంటల ప్రారంభం కానున్న వాదనలు
►చంద్రబాబు బెయిల్ పిటీషన్ తిరస్కరించిన‌ ఏసీబీ కోర్టు
►కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున చంద్రబాబుకి బెయిల్ ఇవ్వద్దని వాదనలు వినిపించిన సీఐడి న్యాయవాదులు
►చంద్రబాబు సాక్షులని ప్రభావితం చేస్తున్నారని వాదనలు వినిపించిన ఏఏజీ పొన్నవోలు
►సీఐడీ తరపు న్యాయవాదుల వాదనలతో ఏకీభవిస్తూ చంద్రబాబు బెయిల్ పిటీషన్ తిరస్కరించిన ఏసీబీ కోర్టు

07:31 AM, అక్టోబర్‌ 11, 2023
అత్యవసర విచారణ కుదరదు
►సాధారణ పద్ధతిలోనే ఆ పిటిషన్లను విచారణ చేస్తాం
►ఐఆర్‌ఆర్, అంగళ్లు కేసుల్లో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై  హైకోర్టు.. నేడు విచారణ  
►నారాయణ, ఆయన బావ మరిది పిటిషన్లపై నేడు విచారణ

07:13 AM, అక్టోబర్‌ 11, 2023
సీఐడీ విచారణకు చంద్రబాబు సహకరించాలి:  మంత్రి తానేటి వనిత
►అప్పుడే నిజాలు బయటకు వస్తాయి
►కేసుల్లో తీవ్రత ఉంది కాబట్టే బెయిల్‌ రావడం లేదు
►కుటుంబ సభ్యు­లు, టీడీపీ నేతలు.. బాబు తప్పు చేయలేదని చెప్పలేకపోతున్నారు
►చంద్రబాబును మోయడం తప్ప పవన్‌ కళ్యాణ్‌కు మరే ఎజెండా లేదు

07:04 AM, అక్టోబర్‌ 11, 2023
అన్నిటా బాబు బాటలోనే..
►అవినీతికి పాల్పడటంలోనే కాదు.. సీఐడీ దర్యాప్తునకు సహకరించని లోకేష్‌
►మొండికేయడంలో తండ్రి చంద్రబాబు బాటనే అనుసరించిన లోకేశ్‌
►విచారణను తప్పించుకునేందుకు బెడిసికొట్టిన యత్నాలు
►అనివార్యంగా లోకేశ్‌ సీఐడీ ఎదుట హాజరు
►సీఐడీ అధికారులు ఏ ప్రశ్న అడిగినా తనకు తెలీదనే సమాధానం

06:57 AM, అక్టోబర్‌ 11, 2023
తెలుగు యువత నాయకుల అత్యుత్సాహం
►సీఐడీ సిట్‌ కార్యాలయం గోడలు దూకేందుకు ప్రయత్నం
►అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదం 
►ఏడుగురిని పోలీస్‌స్టేషన్‌కు తరలించిన పోలీసులు  

06:47 AM, అక్టోబర్‌ 11, 2023
తత్తరపాటు.. బిత్తర చూపులు! 
►ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అక్రమాలపై సీఐడీ 
►విచారణలో లోకేశ్‌ తడబాటు.. అసహనం
►అబ్బే నాకేం తెలీదు... మరి ఈ సంతకాలు మీవే కదా?
►ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అక్రమాలపై ప్రశ్నించిన అధికారులు
►హెరిటేజ్‌ భూముల కొనుగోలు దందాపై ప్రశ్నల వర్షం
►సంతకాలతో సహా ఆధారాలను చూపిస్తూ సూటిగా ప్రశ్నలు
►కలవరపాటుతో న్యాయవాదులతో చినబాబు మంతనాలు
►ఆరు గంటల పాటు విచారణ.. నేడు మరోసారి విచారణ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement