
గుంటూరు: ఎప్పుడూ సాక్షి మీడియాపై నోరు పారేసుకునే నారా లోకేష్..మరోసారి తన దురుసు ప్రవర్తనను ప్రదర్శించారు. పదే పదే సాక్షి మీడియాపై తప్పుడు ఆరోపణలు చేయడం పరిపాటిగా మార్చుకున్న నారా లోకేష్.. మళ్లీ అక్కసును ప్రదర్శించాడు.
రెండో రోజు సీఐడీ విచారణకు హాజరైన నారా లోకేష్.. విచారణ అనంతరం సాక్షి మీడియాపై అసహనం ప్రదర్శించాడు. సాక్షి మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక రెచ్చిపోయాడు లోకేష్. అరుపులు, కేకలతో సాక్షి మీడియా ప్రతినిధులపై దాడికి దిగాడు. ప్రశ్నలు అడిగితే సాక్షి మీడియా పెట్టుబడులు అంటూ అక్కర్లేని అసంబద్ధ ప్రేలాపనలు చేశాడు లోకేష్. వాలంటీర్లను సాక్షి పేపర్ కొనాలంటూ జీవో ఇచ్చారని తప్పుడు ఆరోపణలకు దిగాడు లోకేష్,.
Comments
Please login to add a commentAdd a comment