
సాక్షి, విజయవాడ: మార్గదర్శి చిట్‌ఫండ్స్ అవకతవకలకు సంబంధించి దర్యాప్తు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. చిట్ ఫండ్ నిధుల మళ్లింపు.. అక్రమాల ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న ఏపీ సీఐడీ మంగళవారం ఓ కీలక ప్రకటన చేసింది. మార్గదర్శి లో రూ. కోటి పైన నగదు డిపాజిట్ చేసిన ఖాతాదారులకు నోటీసులు జారీ చేసినట్లు ఒక ప్రెస్‌నోట్‌లో తెలిపింది.
ఆర్బీఐ, సీబీడీటీ నిబంధనల ప్రకారం నోటీస్ లు జారీ చేసినట్లు ఏపీ సీఐడీ సదరు నోట్‌లో పేర్కొంది. ఈ మేరకు మార్గదర్శి లో రూ. కోటి పైన నగదు లావాదేవీల వివరాలు తెలపాలని పేర్కొంది. ఆర్థిక నేరాల, మనీ లాండరింగ్ నివారణకు RBI, CBDT తీసుకొచ్చిన నిబంధనల మేరకే ఈ నోటీసులు జారీ చేసినట్లు ఏపీ సీఐడీ స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: ఇదేందయ్యా ఇది.. రామోజీ రాసిందే రసీదు!
గత విచారణ సందర్భంగా రామోజీరావు(ఫైల్‌ఫోటో)
మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సంబంధించిన ఆర్థిక మోసం కేసులపై కొనసాగుతున్న విచారణలో. ఇప్పటికే సంస్థ ఎండీ, డైరెక్టర్లను ఏపీ సీఐడీ పలుమార్లు విచారించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు నోటీసులు అందుకున్న బాధిత చందాదారులందరూ విచారణకు పూర్తిగా సహకరించాలని AP CID కోరుతోంది.
ఇదీ చదవండి: మార్గదర్శి దర్యాప్తుపైనా ఈనాడు తప్పుడు రాతలే!
Comments
Please login to add a commentAdd a comment