ఢిల్లీ: ఐఆర్‌ఆర్(ఇన్నర్ రింగ్ రోడ్) భూకుంభకోణం కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై నేడు(సోమవారం) సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై.. జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. బాబు దర్యాప్తుకు సహకరించకపోతే బెయిల్ రద్దుకు తమను ఆశ్రయించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ దశలో జోక్యం చేసుకునేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది.
కాగా ఇన్నర్ రింగ్ భూ కుంభకోణం, ఉచిత ఇసుక, మద్యం విధానాల్లో అక్రమాలపై సీఐడీ నమోదు చేసిన కేసుల్లో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. అలాగే మద్యం కేసులో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, ఎక్సైజ్ శాఖ అప్పటి కమిషనర్ శ్రీ నరేష్ లకు కూడా ముందస్తు బెయిల్ ఇచ్చింది. ఈ సందర్భంగా హైకోర్టు పలు షరతులు విధించింది. కాగా, ఈ బెయిల్‌ను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.
ఏపీ ప్రభుత్వ పిటిషన్‌లో ముఖ్యమైన అంశాలు
- జి టు జి పేరుతో నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టులు కట్టబెట్టారు
- ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ లో అక్రమంగా మార్పులు చేశారు
- తమ భూములకు అనుకూలంగా రోడ్డు మార్పులు చేశారు
- దీనికి ప్రతిఫలంగా పెద్ద ఎత్తున ముడుపులు అందుకున్నారు
- ఈ కుంభకోణానికి ముఖ్య సూత్రధారి చంద్రబాబు, నాటి మున్సిపల్ మంత్రి నారాయణ
- తమకు ముడుపులు ఇచ్చిన వారిని దుబాయ్, అమెరికాకు పారిపోయేలా సహకరించారు.
- ముందస్తు బెయిల్ వల్ల కేసు దర్యాప్తుపై ప్రభావం చూపుతున్నారు.
- నోటీసులు అందుకున్న నిందితులు ఇప్పటికే కొంతమంది పరారయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment