LIVE : Chandrababu Arrest, Remand, Cases, Scams And Ground updates
08:34 PM, అక్టోబర్ 9, 2023
గన్నవరం బయల్దేరిన నారా లోకేష్
►ఢిల్లీ నుంచి మళ్లీ ఏపీకి టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బాబు
► ఢిల్లీ విమానాశ్రయం నుండి గన్నవరం పయనం
►లోకేష్‌కి వీడ్కోలు పలికిన టీడీపీ ఎంపీలు
►కోర్టు ఉత్తర్వులు ప్రకారం.. రేపు ఉదయం సిట్ విచారణకు హాజరు
► మంగళవారం ఉ.10 నుంచి సా.5 గంటల వరకు లోకేశ్ విచారణ
► చంద్రబాబు అరెస్ట్ తర్వాత.. న్యాయ నిపుణులతో చర్చ పేరిట ఢిల్లీకి వెళ్లిన వైనం
►ఇన్నర్ రింగ్‌రోడ్ కేసులో ఏ14గా నారా లోకేష్
►ఢిల్లీ వెళ్లి మరీ నోటీసులు ఇచ్చిన సీఐడీ పోలీసులు
► విచారణకు సహకరించాల్సిందేనని స్పష్టం చేసిన ఏపీ హైకోర్టు
5:35 PM, అక్టోబర్ 9, 2023
చంద్రబాబు అరెస్ట్‌పై తొలిసారి స్పందించిన సీఎం జగన్
► చంద్రబాబు అనే వ్యక్తి ప్రజల్లో ఉన్నా, జైల్లో ఉన్నా పెద్ద తేడా ఏమీ పడదు
► ఆయనకు విశ్వసనీయత లేదు, రాదు. ఎక్కడున్నా ఆయనకు విశ్వసనీయత లేదు. అలాంటి ఆయన ఎక్కడున్నా ఒక్కటే.
► చంద్రబాబును చూసినప్పుడు, ఆయన పార్టీని చూసినప్పుడు పేదవాడికి, ప్రజలకు గుర్తుకు వచ్చేది ఒక్కటే, మోసాలు, వెన్నుపోట్లు, అబద్ధాలు, వంచనలు.
► చంద్రబాబు నాయుడ్ని ఎవ్వరూ కూడా కక్షసాధింపుతో అరెస్టు చేయలేదు. ఆయనమీద నాకు ఎలాంటి కక్ష లేదు. కక్షసాధించి ఆయన్ను ఎవ్వరూ అరెస్ట్ చేయలేదు
► నేను భారతదేశంలో లేనప్పుడు, లండన్‌లో ఉన్నప్పుడు చంద్రబాబును పోలీసులు అరెస్టు చేశారు.
► కక్షసాధింపే నిజమనుకుంటే.. కేంద్రంలో బీజేపీ ఉంది, దత్తపుత్రుడు బీజేపీతోనే ఉన్నానని ఇప్పటికీ అంటున్నాడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలితోపాటు, సగం టీడీపీ నాయకులు బీజేపీలోనే ఉన్నారు.
► కేంద్రంలోని ఇన్‌కంటాక్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ చేసి ఆయన అవినీతిని గమనించి నోటీసులిచ్చాయి, దోషులను అరెస్టు చేసింది
► చంద్రబాబుకు నేరుగా ఇన్‌కంట్యాక్స్ నోటీసులు కూడా ఇచ్చారు.
► మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మోడీగారు బాబుపై అవినీతి ఆరోపణలు కూడా చేశారు. పోలవరంను చంద్రబాబు ఏటీఎంలా మార్చారని ప్రధాని స్వయంగా చెప్పారు.
► రాష్ట్రంలో సీబీఐని, ఐటీని, ఈడీని అడుగు పెట్టనివ్వనని గతంలో చంద్రబాబు పర్మిషన్‌కూడా విత్‌డ్రా చేశాడు.
► ఆనాటికే అవినీతిపరుడని స్పష్టంగా రూఢి అయిన ఈ వ్యక్తిపైన విచారణ చేయకూడదట
► విచారించిన తర్వాత రిమాండుకు పంపినా ఒక చంద్రబాబును గాని, వీరప్పన్‌గాని ఎవ్వరూ కూడా పట్టించి ఇవ్వడానికి వీల్లేదని ఎల్లోమీడియా, ఎల్లో గజదొంగల ముఠా వాదనలు వినిపిస్తున్నాయి.
► ఇలాంటి వ్యవస్థలతో మనం యుద్ధంచేస్తున్నాం.
ప్రజామోదం లేని చంద్రబాబు జనంలో ఉన్నా జైల్లో ఉన్నా ఒక్కటే. ఆయన రాజకీయ జీవితం మొత్తం మోసం, వెన్నుపోటు, అబద్ధాలే ఉంటాయి.
— YSR Congress Party (@YSRCParty) October 9, 2023
- సీఎం వైయస్ జగన్#GajaDongaChandrababu#SkilledCriminalCBNInJail #KhaidiNo7691 #CorruptBabuNaidu pic.twitter.com/TqkEIaLJSe
5:25 PM, అక్టోబర్ 9, 2023
దోచుకోవడం, పంచుకోవడం.. ఇవే చంద్రబాబు నమ్మిన సిద్ధాంతం : సీఎం జగన్
► ఏపీలో ప్రతిపక్షాలు అన్నీ కూడా పొత్తుల కోసం వెంపర్లాడుతున్నాయి
► వారు ఎంతమంది కలిసినా… రెండు సున్నాలు కలిసినా, నాలుగు సున్నాలు కలిసినా.. సున్నాయే.
► ఎన్ని సున్నాలు కలిసిన వచ్చేది పెద్ద సున్నాయే.
► ఒకరైతే రాజకీయాల్లోకి వచ్చి 15 సంవత్సరాలు అయింది. చంద్రబాబును మోయడమే ఆయన పని.
► ప్రతి నియోజకవర్గానికి కనీసం ఒక అభ్యర్థి లేడు. ప్రతి గ్రామంలో జెండా మోసే కార్యకర్తా లేరు
► చంద్రబాబు దోచుకున్న దాంట్లో ఈయన పార్టనర్. మోసాలు చేయడంలో పార్టనర్.
► బిస్కట్ వేసినట్టు, చాక్లెట్ వేసినట్టు. సంపాదించిన సొమ్ములో భాగం పంచడం..
► ఇంత ఈనాడుకు, ఇంత టీవీ5 కు, ఇంత ఆంధ్రజ్యోతికి, ఇంత దత్తపుత్రుడికి
► దోచుకోవడం.. పంచుకోవడం.. ఇదే వీరికి తెలిసింది
► చంద్రబాబును సమర్థించామంటే.. .ఈ రాష్ట్రంలో పేద సామాజిక వర్గాలన్నింటినీ కూడా వ్యతిరేకించడమే అన్న విషయాన్ని ప్రజలకు చెప్పాలి.
► చంద్రబాబును సమర్థించడమంటే.. పేదవాళ్లకు వ్యతిరేకంగా ఉండటమే.
► చంద్రబాబును సమర్థించడమంటే.. పెత్తందారీ వ్యవస్థను, నయా జమీందారీ వ్యవస్థను సమర్థించడమే.
► చంద్రబాబును సమర్థించడమంటే.. పేదవర్గాల పిల్లలకు ఇంగ్లిషు మీడియం అందకుండా వ్యతికేకించడమే.
► చంద్రబాబును సమర్థించడమంటే.. డెమోగ్రఫిక్ ఇన్ బ్యాలెన్స్ అంటూ వారు ఏకంగా కోర్టుల్లో వేసిన దావాలను సమర్థించడమే.
► చంద్రబాబును సమర్థించడమంటే.. కొన్ని వర్గాలు ఎప్పటికీ పేదలుగా, కూలీలుగా మిగిలివాలని సమర్థించినట్టే.
► ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా? బీసీల తోకలు కత్తిరిస్తానన్న పెత్తందారీ భావజాలాన్ని సమర్థించడమే.
బాబుని సమర్ధించడం అంటే పేద వర్గాల పిల్లలకు ఇంగ్లీష్ మీడియం అందకుండా చేయడమే.. పేదలకు ఇళ్ల స్థలాలను వ్యతిరేకించడమే... ఇటువంటి పచ్చముఠా దుర్మార్గాలను ప్రజలకు మనం వివరించాలి.
— YSR Congress Party (@YSRCParty) October 9, 2023
- సీఎం వైయస్ జగన్#JaganannaOnceMore pic.twitter.com/cUOCGMWYiz
4:45 PM, అక్టోబర్ 9, 2023
బాబు కస్టడీ కోరుతూ హైకోర్టును ఆశ్రయించనున్న CID
► విజయవాడలో మాట్లాడిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివేకానంద
► హైకోర్టులో చంద్రబాబు వేసిన 3 బెయిల్ పిటీషన్ లు కొట్టేశారు
► ACB కోర్టు బెయిల్, కస్టడీ పిటిషన్‌లను కోర్టు డిస్మిస్ చేసింది
► ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్ కేసులపై వాదనలు జరుగుతున్నాయి
► రైట్ ఆఫ్ ఆడియన్స్ పిటిషన్ చంద్రబాబు తరపున వేశారు
► కోర్టులో న్యాయమూర్తి కూడా వారి వాదనలు విన్నారు
► రేపు మధ్యాహ్నం న్యాయమూర్తి దీనిపై ఆదేశాలు జారీ చేస్తారు
► చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలంటూ హైకోర్టుకు వెళ్లే ఆలోచన చేస్తున్నాం
4:35 PM, అక్టోబర్ 9, 2023
ACB కోర్టులో PT వారెంట్లపై రేపు వాదనలు
► ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ కేసులో ఏసీబీ కోర్టులో విచారణ వాయిదా
► రైట్ ఆఫ్ ఆడియన్స్ పిటిషన్ పై నిర్ణయం తీసుకోవాలని పట్టుబట్టిన బాబు తరపు లాయర్లు
► ఫైబర్ నెట్, IRR కేసుల్లో చంద్రబాబు పై పెండింగులో ఉన్న పీటీ వారెంట్లు
► పీటీ వారెంట్ల పై వాదనలు అవసరం లేదని కోర్టును కోరిన CID న్యాయవాది వివేకా
► కోర్టు నిర్ణయం తీసుకుంటే చాలని తెలిపిన CID న్యాయవాది వివేకా
► పీటీ వారెంట్లపై వాదనలు వినిపిస్తామన్న చంద్రబాబు లాయర్లు పోసాని, గింజుపల్లి
► పీటీ వారెంట్లు, కస్టడీ పిటిషన్లపై విచారణను రేపటికి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు
4:05 PM, అక్టోబర్ 9, 2023
సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు రేపటికి వాయిదా
► చంద్రబాబు కేసుపై ఇవ్వాళ సుదీర్ఘ వాదనలు
► దాదాపు రెండున్నర గంటల పాటు వాదనలు వినిపించిన చంద్రబాబు తరపు న్యాయవాది హరీష్ సాల్వే
► రేపు CID, ఏపీ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించనున్న సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీ
3:55 PM, అక్టోబర్ 9, 2023
సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు
► హరీష్ సాల్వే : ఒక ప్రజా ప్రతినిధి సైకిల్ దొంగతనం చేస్తే.. దానికి అవినీతి నిరోధక చట్టం వర్తించదు. అంటే జరిగిన అక్రమం తనకు కేటాయించిన విధులకు సంబంధించినదయి ఉండాలి
► జస్టిస్ బోస్ : మీ వాదన ప్రకారం ఈ సెక్షన్ పైపైన వర్తిస్తుందని అనుకోవాలి
► హరీష్ సాల్వే : అంటే అధికారిక నిర్ణయాలకు సంబంధించినవి కాబట్టి..
► జస్టిస్ బోస్ : ఇందులో పరిపాలనపరమైన అంశాలున్నాయి. కేసులో అభియోగాలను పరిశీలిస్తే.. 10 శాతం అడ్వాన్స్ నిధులను ముందే విడుదల చేశారు
► హరీష్ సాల్వే : నేను కేసు లోతుల్లోకి వెళ్లడం లేదు. అయినా ఈ కేసులో నిందితులందరికీ ఇప్పటికే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయినా మేం 17Aపైనే ఎందుకు వాదిస్తున్నామంటే అరెస్ట్ చేసిన విధానం సరికాదని. పార్లమెంటులో చట్టం తెచ్చిన ఉద్దేశ్యమేంటంటే.. ఈ సవరణ తర్వాత జరిగిన కేసులకు 17A SOP వర్తించాలని.
3:45 PM, అక్టోబర్ 9, 2023
సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు
► హరీష్ సాల్వే : కానీ ఈ కేసులో పోలీసు అధికారి తన బాధ్యతలో భాగంగా తన పై అధికారి ముందస్తు అనుమతి తీసుకోవాలి.
► జస్టిస్ త్రివేదీ : సెక్షన్ 6A DSPE act (ఢిల్లి స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్)కు సంబంధించి సుప్రీంకోర్టు ధర్మాసనం ఉత్వర్వులను చూడండి. ఆ కేసులో అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఏం చెప్పిందో చూడండి. అది సరిగ్గా 17A సవరణ తరహాలోనే ఉంది కదా.
► సెక్షన్ 6A DSPE act (ఢిల్లి స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్) కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే : 2014కు ముందు నమోదయిన అవినీతి, అక్రమాల కేసుల్లో ప్రజా ప్రతినిధులకు ఎలాంటి మినహాయింపు ఉండదు. ఇది సరిగ్గా 17Aకు సంబంధం ఉన్న కేసే.
3:25 PM, అక్టోబర్ 9, 2023
సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు
► హరీష్ సాల్వే : ఈ కేసులో చంద్రబాబు పేరును సెప్టెంబర్ 8, 2023న చేర్చారు. ఒకప్పుడు 37వ నిందితుడిగా ఉన్న చంద్రబాబును మొదటి నిందితుడిగా చేర్చామని తెలిపారు. దర్యాప్తు అధికారి చెప్పిన దాని ప్రకారం A37 (చంద్రబాబు) సూచనల మేరకు A36 (నిందితుడి సంఖ్య 36) నేరానికి పాల్పడ్డారు. కాబట్టి ఇది అవినీతి నిరోధక చట్టం కిందికి వర్తిస్తుందని చెప్పారు. అప్పుడే గవర్నర్ దగ్గరకు వెళ్లి అనుమతి తీసుకోవాల్సింది.
► జస్టిస్ త్రివేదీ : 17A సవరణను ఎలాగైనా చూడవచ్చు. 17A సవరణ కంటే ముందు జరిగిన నేరాల సంగతేంటీ? ఒక్కో సవరణ వచ్చినప్పుడల్లా కొత్తగా కొందరిని దీని పరిధిలోకి తెస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అసలు ఈ కేసులో 17A సవరణ వర్తిస్తుందా?
► జస్టిస్ బోసు : 17A అనేది కేవలం నేరం జరిగిన తేదీకి వర్తిస్తుంది కానీ, నిందితులకు కాదు కదా.
► హరీష్ సాల్వే : 17A అనేది నేరం జరిగిన తేదీని బట్టి పరిగణించవద్దని కోరుతున్నాను. ఈ చట్టం ఉద్దేశ్యం ఏంటంటే, దర్యాప్తు పేరిట ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టకూడదన్నది.
► జస్టిస్ త్రివేదీ : 17A సవరణ అన్న చట్టాన్ని మనం అవినీతి నిరోధక చట్టం ఉద్దేశ్యంలో చూడాలి. దాని ప్రకారం ప్రజా ప్రతినిధులు అక్రమాలకు పాల్పడకూడదని. అంతే తప్ప.. చట్టంలోని ప్రధాన ఉద్దేశ్యాన్ని పక్కనబెట్టి ఒక వ్యక్తికి మేలు జరిగేలా ఈ చట్టాన్ని విశ్లేషించుకోవద్దు. అది మొత్తం లక్ష్యాన్నే దెబ్బతీస్తుంది.
3:25 PM, అక్టోబర్ 9, 2023
విజయవాడ: చంద్రబాబు కేసులో ACB కోర్టు కీలక నిర్ణయం
► చంద్రబాబు పెట్టుకున్న బెయిల్ పిటిషన్ కొట్టేసిన కోర్టు
► CID వేసిన కస్టడీ పిటిషన్ తిరస్కరించిన న్యాయస్థానం
3:15 PM, అక్టోబర్ 9, 2023
సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు
► హరీష్ సాల్వే : కేంద్రం ఈ చట్టాన్ని ఎందుకోసం తెచ్చిందో గుర్తు చేసుకోవాలి. 17A అమలు ఎలా ఉండాలన్నదానిపై కొన్ని మార్గదర్శకత్వ నిర్దేశకాలను కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 3, 2021న రాష్ట్రాలకు పంపింది. ఏ స్థాయి నాయకుల విషయంలో ఎవరి అనుమతి తీసుకోవాలన్న విషయంలో స్పష్టత ఇచ్చింది. దాన్ని బట్టి ఎలాంటి దర్యాప్తు జరగాలన్నా ముందస్తు అనుమతి కావాలి.
► జస్టిస్ త్రివేదీ : ఈ SOP అన్నది మూడేళ్ల కిందనే 17a సవరణ తెచ్చినప్పుడు ప్రకటించింది. SOP ప్రకటించకముందు సంగతేంటీ? అయినా Regime Revenge (పదవీ మారగానే రాజకీయ కక్ష చూపించడం) అని ఎవరన్నారు?
► హరీష్ సాల్వే : మా స్నేహితుడు రాజీవ్ ధావన్ ఈ పదాన్ని ఉపయోగించారు. కేంద్రం తెచ్చిన SOP కోర్టు ముందు నిలబడకపోవచ్చు. కానీ ఆ చట్టం వెనకున్న పరమార్థాన్ని మెరుగ్గా అర్థం చేసుకోడానికి ఉపయోగపడవచ్చు.
2:50 PM, అక్టోబర్ 9, 2023
సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు
► హరీష్ సాల్వే : ఈ కేసులో హైకోర్టు ఏం చెప్పిందంటే.. 2015-16 మధ్య కాలంలో జరిగిన నేరానికి సంబంధించిన అభియోగాలున్నాయి కాబట్టి, దర్యాప్తు జరిగిన తేదీని పట్టించుకోమని చెప్పింది. అందుకే ఆ డాక్యుమెంట్‌ను హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదు. న్యాయశాస్త్రంలో ఉన్న విషయాన్ని రెండు రకాలుగా అన్వయించుకోవచ్చు. కానీ నిర్దారణ అయిన విషయాలను అనుమానించలేరు. రిమాండ్ విధించిన ఆర్డర్‌లో చంద్రబాబు పాత్రను 2021లో జరిగిన ప్రాథమిక దర్యాప్తు ద్వారా నిర్దారించామని కోర్టుకు CID తెలిపింది. 17A సవరణ కూడా సరిగ్గా ఇలాంటి కేసుల కోసమే తీసుకొచ్చారు.
2:35 PM, అక్టోబర్ 9, 2023
సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు
► హరీష్ సాల్వే : ఈ కేసులో ఫిర్యాదును చూస్తే.. సీమెన్స్, డిజైన్‌టెక్, ఇతరుల పేర్లున్నాయి తప్ప పిటిషనర్ పేరు లేదు. పైగా ఈ కేసులో ప్రాథమిక దర్యాప్తు 2021 తర్వాత జరిగిందని భావించాలి. అందువల్ల 17A సవరణ ఈ కేసుకు వర్తిస్తుంది.
► జస్టిస్ బోసు : ఈ కేసులో రెండు విషయాలు పరిశీలిస్తున్నాం. ఒకటి, హైకోర్టు ముందు CID దాఖలు చేసిన డాక్యుమెంట్. జులై 5,2018న దర్యాప్తు ప్రారంభమయిందని చెప్పే డాక్యుమెంట్. రెండో అంశం.. హైకోర్టు ముందు వాదన వినిపించడానికి మీరు అవకాశం కోల్పోయారా? అన్న విషయాలను. వీటిని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటాం.
► హరీష్ సాల్వే : ఇప్పుడు మీరు మళ్లీ హైకోర్టుకు వెళ్లి వాదన వినిపించమంటే మేం నష్టపోతాం. హైకోర్టు కచ్చితంగా సెక్షన్ 17A సవరణ దీనికి వర్తించదంటారు. ఒక డాక్యుమెంట్ కారణంగా తీర్పు మారకూడదు. నేను మీకు ఈ డాక్యుమెంట్ గురించి ఎందుకు చెప్పానంటే.. దీని వల్లే CID వారు దర్యాప్తును 2018కంటే ముందు ప్రారంభించామంటున్నారు
► హరీష్ సాల్వే : హైకోర్టు ఏమంటుందంటే, ప్యారా 15 ప్రకారం నేరం 2015-16 మధ్య జరిగిందని చెబుతుంది. వారి దృష్టిలో దర్యాప్తు తేదీకి ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే ఏపీ హైకోర్టు అసలు డాక్యుమెంట్‌నే పరిగణనలోకి తీసుకోలేదు
2:20 PM, అక్టోబర్ 9, 2023
సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు
► జస్టిస్ త్రివేదీ : ఈ కేసులో మీ వాదనంతా దేని మీద ఉందంటే.., వాదనల తర్వాత డాక్యుమెంట్ సమర్పించారని మీరు చెబుతున్నారు. అంటే అసలేం వినకుండానే కేసు కొట్టేస్తారా?
► CID తరపున సీనియర్ లాయర్ నిరంజన్ రెడ్డి : ఈ కేసులో వాదనల తర్వాత డాక్యుమెంట్లు సమర్పించామని సాల్వే చేస్తోన్న వాదన సరికాదు. కేసు రిమాండ్‌లోనే ఈ విషయం అంతా ఉంది
► బాబు తరపున సీనియర్ లాయర్ సాల్వే : ఏ కేసులోనయినా హైకోర్టు ఏం భావనలో ఉంటుందంటే.. ఆ రిమాండ్ 17A సవరణకు లోబడి ఉంటుందని అనుకుంటుంది. 2021లో జరిగిన ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా దర్యాప్తు ప్రారంభమయింది.
► జస్టిస్ బోస్ : ఈ కేసులో దర్యాప్తు ఎప్పుడు ప్రారంభమయింది?
► బాబు తరపున సీనియర్ లాయర్ సాల్వే: సెప్టెంబర్ 7, 2021
► జస్టిస్ బోస్ : దేని ఆధారంగా ఆ విషయం చెబుతున్నారు?
► బాబు తరపున సీనియర్ లాయర్ సాల్వే: డిజైన్ టెక్ పన్ను ఎగ్గొట్టిందని GST (గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్) డిపార్ట్‌మెంట్ పసిగట్టింది. అంతే తప్ప దీనికి పిటిషనర్‌కు సంబంధం లేదు.
► జస్టిస్ త్రివేదీ : డిజైన్ టెక్ ఒప్పందం ఎవరితో కుదుర్చుకున్నారు?
► బాబు తరపున సీనియర్ లాయర్ సాల్వే: నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో
2:14 PM, అక్టోబర్ 9, 2023
సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు
► బాబు లాయర్ సాల్వే : 17A సవరణ మీద వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు హైకోర్టులు వేర్వేరు పద్ధతులు అనుసరిస్తున్నాయి. కొన్ని కోర్టులు నేరం జరిగిన తేదీ అంటున్నాయి. మరికొన్ని FIR నమోదయిన తేదీ అంటున్నాయి
► ఇది అవినీతి నిరోధక చట్టానికి వర్తిస్తుందా లేదా అని న్యాయస్థానం ప్రశ్నించింది
► దీనిపై ప్రత్యేక న్యాయస్థానంలో ఇచ్చిన ఆదేశాలను మీ ముందుంచుతున్నాం
► సెక్షన్ 17A సవరణ వర్తిస్తుందని విజ్ఞప్తి చేస్తున్నాం
► పంకజ్ బన్సల్ కేసులో కోర్టు ఏం చెప్పిందంటే.. అరెస్ట్ సక్రమం కానప్పుడు రిమాండ్ రిపోర్ట్ చెల్లదని న్యాయస్థానం చెప్పింది : సాల్వే
► వాదనల తర్వాత CID వారు డాక్యుమెంట్ సమర్పించారు
2:10 PM, అక్టోబర్ 9, 2023
సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు
► ప్రారంభం అయిన విచారణ
► బెంచ్ మీదకు న్యాయమూర్తులు
► వాదనలు ప్రారంభించిన హరీష్ సాల్వే
1:45 PM, అక్టోబర్ 9, 2023
ఇన్నర్ రింగ్ రోడ్డులో కీలక పరిణామం
► ఇన్నర్ రింగ్ రోడ్ కుంభకోణంలో నిందితులుగా మరో నలుగురి పేర్లు చేరుస్తూ ACB కోర్టులో మెమో దాఖలు చేసిన సిఐడి
► క్రైం నంబర్ 16/2021 గా ఇప్పటికే FIR నమోదు
► సెక్షన్లు 120(b), 409, 420,166,167,34,35,37,218 IPC మరియు 13(2), 13(1) ఆఫ్ PC యాక్ట్ గా కేసు నమోదు
► ప్రమీల ( నారాయణ కళాశాల ఉద్యోగి ధనంజయ్ భార్య)
► రమాదేవి( మాజీ మంత్రి నారాయణ)
► ఆవుల మణి శంకర్( నారాయణ బంధువు)
► రాపూరి సాంబశివరావు( రమాదేవి బంధువు)
► పై పేర్లు కేసులో చేర్చాలని మెమో దాఖలు చేసిన CID
12:54 PM, అక్టోబర్ 9, 2023
సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు మ.2గంటలకు వాయిదా
► బాబు లాయర్ సాల్వే : కానీ 2018కు ముందు దర్యాప్తు జరిగిందన్న డాక్యుమెంట్ ప్రభుత్వం సమర్పించలేదు. రిమాండ్ విధించిన ACB కోర్టు ముందు కూడా సమర్పించలేదు
► జస్టిస్ త్రివేదీ : మీరు ACB కోర్టు విధించిన రిమాండ్‌ను సవాలు చేస్తున్నారా?
► బాబు లాయర్ సాల్వే : అవును, ACB కోర్టు రిమాండ్‌ను సవాలు చేస్తున్నాం. CID సమర్పించిన డాక్యుమెంట్ ద్వారానే దర్యాప్తు మొదలయిందని చెప్పి ఉంటే, లేదా దాని ద్వారానే FIR నమోదయిందని ఉంటే ఈ డాక్యుమెంట్ కోర్టు పరిగణనలోకి తీసుకోవాలి. ఇదే విషయంపై కేంద్ర ప్రభుత్వం ఒక SOP (Standarad operating procedure) విడుదల చేసింది. కచ్చితంగా అనుమతి తీసుకోవాలని ఆ SOP చెబుతోంది.
► జస్టిస్ త్రివేదీ & జస్టిస్ బోస్ : సరే ఆ విషయం లంచ్ తర్వాత పరిశీలిస్తాం, కేసు మధ్యాహ్నం 2గంటలకు పరిశీలిస్తాం
12:44 PM, అక్టోబర్ 9, 2023
సుప్రీంకోర్టులో చంద్రబాబు స్కిల్ స్కాం కేసు
► బాబు లాయర్ సాల్వే : సెప్టెంబర్ 19న పిటిషన్ దాఖలు చేశాం, 2021లో FIR నమోదయిందని పేర్కొన్నాం
► ఈ కేసులో సెక్షన్ 17a సవరణ వర్తిస్తుందని చెప్పాం, 1959 SCR 191 ప్రకారం ఈ కేసుకు ఇది వర్తిస్తుంది
► జస్టిస్ త్రివేదీ : కానీ ఈ కేసులో దర్యాప్తు 2018కి ముందే (అంటే 17A సవరణకు ముందే) మొదలయిందని రోహత్గీ చెప్పారు కదా
(సుప్రీంకోర్టు : బెంచ్ జస్టిస్ త్రివేదీ, జస్టిస్ బోస్ బెంచ్ ముందు CID తరపున రోహత్గీ, చంద్రబాబు తరపున హరీష్ సాల్వే, సిద్ధార్థ్ లూథ్రా, మనుషేక్ సింగ్ సింఘ్వీ)
12:39 PM, అక్టోబర్ 9, 2023
సుప్రీంకోర్టులో మొదలైన వాదనలు
► స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో పునః ప్రారంభమైన వాదనలు
► CID తరపున సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహత్గీ
► చంద్రబాబు తరపున హరీష్ సాల్వేతో పాటు అభిషేక్ మనుసింఘ్వి, సిద్ధార్థలూథ్రా
► జస్టిస్ త్రివేదీ : గత విచారణ సందర్భంగా సాల్వే వర్చువల్‌గా హజరయ్యారు. హఠాత్తుగా కేసు విచారణకు సంబంధించిన వర్చువల్ లింకు నుంచి ఎలాంటి అనుమతి లేకుండా తప్పుకున్నారు
► బాబు లాయర్ సాల్వే : దానికి నా క్షమాపణలు, మిగతా లాయర్లు ఉన్నారు కదా అని నేను తప్పుకున్నాను
► జస్టిస్ త్రివేదీ : అదెలా కుదురుతుంది? జస్టిస్ బోసు కూడా అదే అనుకున్నారు
12:36 PM, అక్టోబర్ 9, 2023
సుప్రీంకోర్టులో ఇప్పటివరకు ఏం జరిగింది? చంద్రబాబు తరపున ఏం విజ్ఞప్తి చేశారు? కోర్టు ఏమని చెప్పింది?
► స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై అక్టోబర్ 3, 2023న విచారణ జరిపిన సుప్రీంకోర్టు
► బాబు నేరం చేశారా? లేదా? అనే వాదనల జోలికెళ్లని ఆయన లాయర్లు
► గవర్నరు అనుమతి లేకుండా చంద్రబాబును అరెస్టు చేయకూడదని వాదన
► అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ ప్రకారం అనుమతి తప్పనిసరి
► కాబట్టి ఈ అరెస్టు చెల్లదు.. కేసును క్వాష్ చేయండంటూ బాబు లాయర్ల వాదనలు
► బాబు తరఫున వాదించిన హరీష్ సాల్వే, సిద్దార్థ లూథ్రా, అభిషేక్ సింఘ్వీ
► ఎంతమంది సీనియర్లు బాబు తరఫున వాదిస్తారని అడిగిన ధర్మాసనం
► 2018 జులైలో అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17(ఏ)కు సవరణ
► ఆ తర్వాత జరిగిన నేరాలకే 17ఏ వర్తిస్తుందన్న సీఐడీ న్యాయవాది రోహత్గీ
► స్కిల్ కుంభకోణం 2015–16 మధ్య జరిగిందని వెల్లడి
► విచారణ కూడా 2018కి ముందే ప్రారంభమయిందని వివరణ
► మరి 17ఏ ఎలా వర్తిస్తుందని బాబు లాయర్లను ప్రశ్నించిన కోర్టు
► దీనికి సంబంధించిన పత్రాలను సమర్పించాలని సీఐడీకి ఆదేశం
(చదవండి : అక్టోబర్ 3న సుప్రీంకోర్టు ఏం చెప్పింది.. పూర్తి కథనం)
12:35 PM, అక్టోబర్ 9, 2023
కాసేపట్లో సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు కీలక విచారణ
► స్కిల్ స్కామ్ కేసులో తనపై దాఖలైన FIRను కొట్టివేయాలని పిటిషన్
► విచారణ చేయనున్న జస్టిస్ అనిరుద్ బోస్ , జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం
► అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17A సవరణ తనకు వర్తిస్తుందని బాబు పిటిషన్
► గవర్నర్ అనుమతి లేకుండా తనను అరెస్టు చేయడం చట్ట విరుద్ధమని వాదనలు
► అవినీతి నిరోధక చట్ట 17A సవరణ రాకముందే, స్కిల్ స్కాంలో దర్యాప్తు ప్రారంభమైందని ప్రభుత్వ వాదన
► చంద్రబాబు కేసుకు 17A వర్తించదని ప్రభుత్వ వాదన
11:55AM, అక్టోబర్ 9, 2023
విజయవాడ ACB కోర్టులో కీలక అంశాలు
► లంచ్ తర్వాత చంద్రబాబు బెయిల్ , కస్టడీ పిటిషన్లపై తీర్పు
► లంచ్ తర్వాత రెండు PT వారెంట్లపై విచారణ
► ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్ పిటి వారెంట్లపై లంచ్ అనంతరం ఇరుపక్షాల వాదనలు విననున్న ACB కోర్టు
► PT వారంట్ అంటే Prisoner in Transit
► అంటే ఇప్పటికే ఒక కేసులో అరెస్టయి జైల్లో ఉన్న నిందితుడిని మరో కేసులోనూ విచారణ చేపట్టేందుకు వీలుగా వేసే వారంట్
11:25AM, అక్టోబర్ 9, 2023
ఏ కేసులో చంద్రబాబు పరిస్థితి ఏంటీ?
► స్కిల్ డెవలప్‌మెంట్‌లో అక్రమాల కేసు :
►కోర్టు రిమాండ్ విధించడంతో జైల్లో ఉన్న చంద్రబాబు
►నేడు సుప్రీంకోర్టు ముందు చంద్రబాబు వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్
►విజయవాడ ACB కోర్టులో CID వేసిన కస్టడీ పిటిషన్‌పై ముగిసిన వాదనలు
►విజయవాడ ACB కోర్టులో చంద్రబాబు వేసిన బెయిల్ పిటిషన్‌పై ముగిసిన వాదనలు
►ఈ మధ్యాహ్నం కస్టడీ, బెయిల్‌పై ACB కోర్టు ఆదేశాలిచ్చే అవకాశం
► అంగళ్లు అల్లర్లు కేసు :
►చంద్రబాబు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు
► ఇన్నర్ రింగ్ రోడ్డు పేరిట అక్రమాలకు పాల్పడిన కేసు :
►చంద్రబాబు బెయిల్ పిటిషన్ తిరస్కరించిన హైకోర్టు
► ఫైబర్‌గ్రిడ్ పేరుతో అక్రమాలకు పాల్పడిన కేసు :
►అరెస్ట్ చేస్తారన్న ఉద్దేశ్యంతో చంద్రబాబు వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరించిన హైకోర్టు
► చంద్రబాబును కస్టడీకి కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన సీఐడీ
11:05AM, అక్టోబర్ 9, 2023
కిం కర్తవ్యం.?
► కాసేపట్లో సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ
► విచారించనున్న జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం
► సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో లాయర్లతో లోకేష్ సమావేశం
► చంద్రబాబు తరఫున మరోసారి నేరుగా రంగంలోకి హేమాహేమీలు
► ఇవ్వాళ కోర్టుకు నేరుగా హరీష్ సాల్వే వస్తాడని టిడిపి వర్గాల ప్రచారం
► ఇప్పటివరకు వర్చువల్‌గా మాత్రమే విచారణకు హాజరయిన సాల్వే
► హరీష్ సాల్వేతో పాటు అభిషేక్ మనుసింఘ్వి, సిద్ధార్థలూథ్రా
10:55AM, అక్టోబర్ 9, 2023
పార్టీని తాకట్టు పెట్టేందుకు రెడీ.!
►ఢిల్లీలో పార్టీతో వ్యాపారం చేస్తోన్న చినబాబు : ఎంపీ విజయసాయిరెడ్డి
►పార్టీని విలీనం చేస్తా, కాపాడాలంటూ ఆఫర్లు
మరో పదేళ్ల దాకా విముక్తి దొరకని డజనుకు పైగా స్కాముల నుంచి బయట పడేస్తే తమ పార్టీని బిజెపిలో విలీనం చేస్తానని ఎల్లో మీడియా ముఖ్యుల ద్వారా కాళ్ల బేరానికి వెళ్లినట్టు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 6 లక్షల కోట్లు పోగేశాడు. అనుభవించింది లేదు. బయటికొస్తే చాలు, బలుసాకు…
— Vijayasai Reddy V (@VSReddy_MP) October 9, 2023
10:43AM, అక్టోబర్ 9, 2023
బాబు బెయిల్ పిటిషన్ తిరస్కృతి
►చంద్రబాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ
►చంద్రబాబు వేసిన బెయిల్ పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు
►ఫైబర్‌నెట్ కేసులో ముందస్తు బెయిల్ తిరస్కరణ
►ఇన్నర్‌రింగ్ రోడ్, అంగళ్లు కేసుల్లో బెయిల్ పిటిషన్లు కొట్టివేత
(చదవండి : అంగళ్లు అల్లర్ల కేసు పూర్వపరాలేంటీ?)
(చదవండి : ఇన్నర్ రింగ్ రోడ్డు పేరిట బాబు సృష్టించిన మాయా ప్రపంచమేంటీ?)9:43 AM, అక్టోబర్ 9, 2023
యువగళం సంగతేంటీ? భువనేశ్వరీ బస్సు యాత్ర ఎటు పోయింది?
►చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీ నేతల పడరాని పాట్లు
►చివరకు.. చంద్రబాబు భార్య భువనేశ్వరి బస్సు యాత్ర చేపడతారని ప్రకటన
►తనకు అంతగా రాజకీయాలు తెలియవని చెప్పినా భువనేశ్వరిని బలవంతంగా ఒప్పించిన సీనియర్లు
►ఈ నెల 5న కుప్పం నుంచి యాత్ర ప్రారంభిస్తారని ఎల్లో మీడియాలో కథనాలు
►మేలుకో తెలుగోడా అనే పేరు కూడా ఖరారు చేసినట్టు ప్రచారం
►ఢిల్లీ నుంచి లోకేష్ రాగానే మారిన సీను
►తాను ఢిల్లీలో ఉంటూ అమ్మ ప్రజల్లో తిరిగితే తన పరిస్థితి ఏంటని చినబాబు సీరియస్
►సుప్రీంకోర్టులో ఏదో ఒకటి తెలిసే వరకు ఆగాలని లోకేష్ సూచించినట్టు పార్టీలో ప్రచారం
►యువగళం ఇప్పుడు తిరిగి ప్రారంభించేకంటే.. ఇంకొన్నాళ్లు ఆగే ఉద్దేశ్యంలో లోకేష్
►ఎన్నికలకు ఎలాగూ ఆరు నెలలు ఉంది కదా ఇప్పుడే తొందరెందుకు అన్నట్టుగా టిడిపి తీరు
►రాజకీయాలకు బ్రాహ్మణీ, భువనేశ్వరీ దూరంగా ఉంటారని మొన్న రాజమండ్రిలో ప్రకటించిన లోకేష్
►ఎన్టీఆర్ కూతురే అయినా భువనేశ్వరీ ఇంతవరకు బయటకు రాలేదని సమర్థించుకున్న లోకేష్
9:30 AM, అక్టోబర్ 9, 2023
జైలు వద్ద నిరంతర భద్రత..
►రాజమండ్రి సెంట్రల్ జైల్లో 30వ రోజు రిమాండ్ ఖైదీగా చంద్రబాబు
►విస్తృతమైన భద్రత ఏర్పాట్ల మధ్య జైల్లో రిమాండ్ ఖైదీగా చంద్రబాబు
►జైలు బయట 300 మంది పోలీసులతో నిరంతర భద్రత
►ప్రత్యేకంగా సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ
►చంద్రబాబు కోసం జైలు ఆవరణలో నిరంతరం సన్నద్ధంగా ప్రత్యేక వైద్య బృందం
9:15 AM, అక్టోబర్ 9, 2023
చంద్రబాబుకు విజయసాయి కౌంటర్..
చంద్రబాబు కోసం దేశంలోని టాప్ 10 లాయర్లు, వారిలో నలుగురు బ్యాటరీ ఆఫ్ అడ్వొకేట్స్‌తో మూడు కోర్టుల్లో అనేక వ్యాజ్యాలు నడుపుతున్నారు.
చట్టం అందరికీ ఒకటి కాదా?
చంద్రబాబు గారి కోసం దేశంలోని టాప్ 10 లాయర్లలో నలుగురు, వారి బ్యాటరీ ఆఫ్ అడ్వొకేట్స్ తో మూడు కోర్టుల్లో అనేక వ్యాజ్యాలు నడుపుతున్నారు. అన్యాయంగా ఎలా అరెస్టు చేశారు? చిన్నపాటి స్కాంకు ప్రపంచస్థాయి నాయకుడిని లోపల వేస్తారా? అంటూ సామాజికవర్గ ప్రముఖులు ఆర్తనాదాలు చేస్తున్నారు. చట్టం…
— Vijayasai Reddy V (@VSReddy_MP) October 9, 2023
9:00 AM, అక్టోబర్ 9, 2023
వాడకమంటే చంద్రబాబుదే..
►సినిమా వాళ్లనే వాడుకోవడంలో చంద్రబాబు దిట్ట
►అవసరం తీరాక కరివేపాకులా తీసిపడేస్తాడు.
మీరే చూడండి @ncbn సినిమా వాళ్ళని ఎలా వాడుకుంటాడు
— YSRCP IT WING Official (@ysrcpitwingoff) October 8, 2023
తరవాత కరివేపాకు లా పాడేస్తాడు అనే దానికి @PawanKalyan మినహాయింపు కాదు
చిరంజీవి సభలకు ఎక్కువ జనం వస్తున్నారు అని విలేకరి అడిగితే
మా బావమరిది కొడుకు @tarak9999 కి అంతకంటే 3రెట్లు జనాలు వస్తున్నారు అన్నాడు..తర్వాత కరివేపాకులా!😔 pic.twitter.com/FCSpT2KU8D
7:30 AM, అక్టోబర్ 9, 2023
జైలులో నేటికి నెల..
►చంద్రబాబు జైలుకి వెళ్లి నేటికి 30 రోజులు
►రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా చంద్రబాబు
►చంద్రబాబు ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు వైద్యుల పర్యవేక్షణ
►ఇంటి నుంచే చంద్రబాబు మందులు, భోజనం
7:10 AM, అక్టోబర్ 9, 2023
5 కేసుల్లో నేడు తీర్పు వచ్చే అవకాశం, క్వాష్ పిటిషన్‌పై సుప్రీంలో విచారణ
►1. బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టు తీర్పు
►2. సీఐడీ కస్టడీ పిటిషన్-ఏసీబీ కోర్టు తీర్పు
►3. అంగళ్లు కేసులో బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు తీర్పు
►4.ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు తీర్పు
►5. ఫైబర్ నెట్ కేసులో బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు తీర్పు
►టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌కు నెల రోజులు - గత నెల 9న నంద్యాలలో చంద్రబాబు అరెస్ట్
7:00 AM, అక్టోబర్ 9, 2023
అందరి దృష్టి కోర్టుల వైపే
►టీడీపీ అధినేత చంద్రబాబుకి సంబంధించిన కేసుల్లో సోమవారం కీలకం కానుంది.
►దిగువ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు చంద్రబాబు దాఖలు చేసిన పలు పిటిషన్లపై విచారణలు, తీర్పులు వెలువడనున్నాయి.
►స్కిల్ స్కాంకు సంబంధించి సుప్రీంకోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ జరుగనుంది.
►ఇదే కేసులో తనకు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు పిటిషన్‌పై ఏసీబీ కోర్టు తీర్పు వెల్లడించనుంది.
►పోలీసు కస్టడీకి కోరుతూ సీఐడీ వేసిన పిటిషన్‌పై సైతం ఏసీబీ కోర్టు తగిన ఉత్తర్వులు జారీచేయనుంది.
►రెండు పిటిషన్లపై శుక్రవారం ఏసీబీ కోర్టులో వాదనలు ముగిసిన విషయం తెలిసిందే.
6:55AM, అక్టోబర్ 9, 2023
ఐటమ్ 59గా చంద్రబాబు పిటిషన్..
►జస్టిస్ అనిరుద్దాబోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ
►ఆరవ నంబర్ కోర్టులో ఐటమ్ 59గా ఈ పిటిషన్‌ను జాబితాలో చేర్చారు.
►గత విచారణ సందర్భంగా హైకోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లను అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం
6:50 AM, అక్టోబర్ 9, 2023
హైకోర్టులో కూడా నేడు తీర్పులు..
►హైకోర్టులోనూ చంద్రబాబుకు సంబంధించిన మూడు బెయిలు పిటిషన్లపై నేడు తీర్పులు వెల్లడికానున్నాయి.
►రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు, ఫైబర్ నెట్ కేసుల్లో బెయిలు కోసం చంద్రబాబు వేర్వేరు పిటిషన్లు దాఖు
►ఈ కేసులో వాదనలు ముగియడంతో హైకోర్టు తీర్పులను రిజర్వు చేసింది.
►ఈ మూడు పిటిషన్లలో న్యాయమూర్తి సోమవారం నిర్ణయం వెల్లడించనున్నారు.
6:30 AM, అక్టోబర్ 9, 2023
బాబు పై ఎన్ని కేసులు? ఎన్ని స్టేలు?
►దేశ రాజకీయాల్లో స్టేBNగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు
►1997లో రెడ్యానాయక్ మీ అక్రమాస్తులపై కేసు వేస్తే స్టే
►1998లో వైఎస్సార్ గారు హైకోర్టులో దావా వేస్తే స్టే
►1999లో షబ్బీర్ అలీ, 1999లో డీఎల్ రవీంద్రారెడ్డి వేసిన దావాల్లో స్టే.
►1999, 2000, 2001 వైఎస్సార్ గారు తిరిగి దావా వేస్తే స్టే.
►2003లో కృష్ణకుమార్ గౌడ్ కేసు వేస్తే స్టే
►2003లో కన్నా లక్ష్మీనారాయణ వేసిన కేసు ఏంటంటే పాపపు సొమ్ముతో చంద్రబాబు హెరిటేజ్ పెట్టాడని దావా వేస్తే స్టే
►2004లో కన్నా మళ్లీ కేసు వేస్తే స్టే.
►2004లో పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి చంద్రబాబుపై రెండు కేసులు
►ఒకటి అక్రమాస్తులు, రెండు భూదోపిడీ.. దాంట్లోనూ స్టే
►2005లో బాబు అక్రమాస్తులపై లక్ష్మీపార్వతి హైకోర్టులో కేసు వేస్తే స్టే
►2005 శ్రీహరి, అశోక్ అనే ఏపీ పౌరులు కేసు వేస్తే స్టే
►2011లో బి.ఎల్లారెడ్డి అనే వ్యక్తి చంద్రబాబుపై కేసు వేస్తే స్టే
►విచారణలు జరగకుండా ఈ స్టేల బాగోతం ఎందుకు? : YSRCP
6:20 AM, అక్టోబర్ 9, 2023
పత్తా లేని చంద్రబాబు పర్సనల్ సెక్రటరీ పెండ్యాల’
► పక్కా ప్లాన్ తో పరారీలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాసరావు చౌదరీ
►ప్రస్తుతం ప్రణాళికా శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్న పెండ్యాల శ్రీనివాసరావు చౌదరీ
►స్కిల్ కుంభకోణం కేసుతో పాటు ఐటీ నోటీసుల్లో పెండ్యాల శ్రీనివాసరావు పేరు
►విచారణ నిమిత్తం సీఐడీ గతంలో ఆయనకు నోటీసులు కూడా జారీ
►అయితే, ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా అమెరికాకు పారిపోయిన పెండ్యాల
►శుక్రవారంలోగా రాష్ట్రానికి తిరిగి రావాల్సిందిగా ఈమెయిల్ ద్వారా నోటీసు పంపిన ప్రభుత్వం
►చంద్రబాబు చేసిన అక్రమ దందాల లెక్కలన్నీ పెండ్యాల హ్యండిల్ చేసినట్టు ఆధారాలు
►ఇన్ కం టాక్స్ డిపార్ట్ మెంట్ కూడా నోటీసులు ఇచ్చింది పెండ్యాలకే
►పెండ్యాల దగ్గర స్వాధీనం చేసుకున్న ఆధారాలను బట్టి చంద్రబాబు సృష్టించిన బ్లాక్ మనీ రూ.2వేల కోట్లు
►లెక్కలు లేని రూ.2వేల కోట్లకు సంబంధించిన వివరాలివ్వాలని చంద్రబాబును అడిగిన ఐటీ
Comments
Please login to add a commentAdd a comment