- వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి
అధికార పార్టీ నేతలు బరితెగించారు...
Published Tue, May 2 2017 12:25 AM | Last Updated on Tue, Oct 2 2018 6:46 PM
కోరుకొండ(రాజానగరం) :
ప్రభుత్వ అనుమతి లేకుండా అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు చెరువుల్లో మట్టిని తవ్వి యథేచ్ఛగా అమ్ముకుంటున్నారని వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆరోపించారు. సోమవారం కోరుకొండ మండలం పశ్చిమగానుగూడెం గ్రామంలో గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమానికి ఆమె విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ.. కోరుకొండ మండలంలోని పలుగ్రామాల్లోని చెరువుల్లో పొక్లెయిన్లు పెట్టి మట్టిని తవ్వి లారీలు, ట్రాక్టర్లపై పోసి ఇటుకబట్టీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్ముకుంటూ సొమ్ముచేసుకుంటున్నా ప్రభుత్వాధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. చెరువుల్లో మట్టిని తవ్వడమే కాకుండా, ప్రభుత్వానికి చెందిన కొండలను కూడా డొల్ల చేస్తున్నారని, కాలువల్లో ఉన్న ఇసుకను విక్రయిస్తున్నారన్నారు. ప్రజాసంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి ధనార్జనే ధ్యేయంగా అధికార పార్టీ నాయకులు పనిచేస్తున్నారన్నారు. నీరు – చెట్టు పథకంలో అవినీతి చోటుచేసుకుంటోందన్నారు. ఇప్పటికైనా అధికారులు అధికార పార్టీ నేతలు అనధికారికంగా చేస్తున్న మట్టి, కంకర, ఇసుక తవ్వకాలను అరికట్టకపోతే వైఎస్సార్ సీపీ ఆందోళన చేస్తుందని జక్కంపూడి విజయలక్ష్మి హెచ్చరించారు.
Advertisement
Advertisement