మరో రెండు ఫ్లోర్లకు పెంచండి | comunity hall opened by chandrababu naidu... | Sakshi
Sakshi News home page

మరో రెండు ఫ్లోర్లకు పెంచండి

Published Wed, Nov 9 2016 11:39 PM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM

మరో రెండు ఫ్లోర్లకు పెంచండి - Sakshi

మరో రెండు ఫ్లోర్లకు పెంచండి

జక్కంపూడి కాలనీ  (విజయవాడ రూరల్‌) : విజయవాడ రూరల్‌ మండలం జక్కంపూడి హౌసింగ్‌ కాలనీలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీహాల్‌ను మరో రెండు ఫ్లోర్లకు పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. రూ.2 కోట్ల 20 లక్షలతో నిర్మించిన కమ్యూనిటీహాల్‌ను బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. అధునాతన బిల్డింగ్‌ను ఈ కాలనీలో నిర్మించడం êగుందని, దీనిని మరో రెండు ఫ్లోర్లకు పెంచాలని ఇంజినీరింగ్‌ అధికారులకు సూచించారు. అదనంగా నిర్మించే రెండు ఫ్లోర్లలో కాలనీలోని మహిళలకు టైలరింగ్, ఎంబ్రాయిడరీ, అద్దకం సంబంధిత శిక్షణను ఇప్పించాలని సూచించారు. అద్దెపై వచ్చే ఆదాయంతో కమ్యూనిటీహాల్‌ నిర్వహణ చేపట్టాలన్నారు. భూకంపాల తాకిడిని తట్టుకొనేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కమ్యూనిటీహాల్‌ నిర్మించామని ముఖ్యమంత్రికి ఇంజినీరింగ్‌ అధికారులు వివరించారు. అక్కడ కుట్టుమిషన్‌ శిక్షణతో ఉపాధి పొందుతున్న మహిళలతో ముఖ్యమంత్రి మాట్లాడారు. అనంతరం ఆధునిక వసతులతో నిర్మించిన జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను ప్రారంభించారు. ఇక్కడ జూనియర్‌ కాలేజీని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు, మున్సిపల్‌ శాఖ మంత్రి పి.నారాయణ, ఎంపీ కేశినేని నాని, మేయర్‌ కోనేరు శ్రీధర్, గొల్లపూడి సర్పంచ్‌ సాధనాల వెంకటేశ్వరమ్మ, జక్కంపూడి సర్పంచ్‌ కొమ్ము రవి, ఎంపీపీ వడ్లమూడి జగన్‌మోహనరావు, జిల్లా కలెక్టర్‌ బాబుఏ, మున్సిపల్‌ కమిషనర్‌ జి.వీరపాండియన్, సబ్‌ కలెక్టర్‌ సృజన తదితరులు పాల్గొన్నారు.
ఎరుకల కులస్తులను గుర్తించండి
విజయవాడ (రామవరప్పాడు) : ఎరుకల కులస్తులను ప్రభుత్వం గుర్తించి వారి అభ్యున్నతికి సహకరించాలని నేషనల్‌ ట్రైబల్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు మానుపాటి నవీన్‌ కోరారు. నగరంలోని సీఎం క్యాంప్‌ కార్యాలయం లో బుధవారం నేషనల్‌ ట్రైబల్‌ ఫెడరేషన్‌ తెలంగాణ , ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షులు వినోద్‌కుమార్, మానుపాటి నవీన్‌లు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి  వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ ఎరుకల కులస్తుల జీవనాధారమైన పందుల పెంపకానికి ప్రభుత్వం సహకరించి పిగ్గరీస్‌ బోర్డు ఏర్పాటు చేయాలని, గిరిజనులకు నామినేటెడ్‌ పదవులు ఇప్పించాలని కోరామన్నారు. నేషనల్‌ ట్రైబల్‌ ఫెడరేషన్‌ ఉమ్మడి రాష్ట్రాల ట్రెజరర్‌ కుంభ ఉదయ్‌ కుమార్‌ ఏకలవ్వ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement