comunity hall
-
మరో రెండు ఫ్లోర్లకు పెంచండి
జక్కంపూడి కాలనీ (విజయవాడ రూరల్) : విజయవాడ రూరల్ మండలం జక్కంపూడి హౌసింగ్ కాలనీలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీహాల్‌ను మరో రెండు ఫ్లోర్లకు పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. రూ.2 కోట్ల 20 లక్షలతో నిర్మించిన కమ్యూనిటీహాల్‌ను బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. అధునాతన బిల్డింగ్‌ను ఈ కాలనీలో నిర్మించడం êగుందని, దీనిని మరో రెండు ఫ్లోర్లకు పెంచాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. అదనంగా నిర్మించే రెండు ఫ్లోర్లలో కాలనీలోని మహిళలకు టైలరింగ్, ఎంబ్రాయిడరీ, అద్దకం సంబంధిత శిక్షణను ఇప్పించాలని సూచించారు. అద్దెపై వచ్చే ఆదాయంతో కమ్యూనిటీహాల్ నిర్వహణ చేపట్టాలన్నారు. భూకంపాల తాకిడిని తట్టుకొనేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కమ్యూనిటీహాల్ నిర్మించామని ముఖ్యమంత్రికి ఇంజినీరింగ్ అధికారులు వివరించారు. అక్కడ కుట్టుమిషన్ శిక్షణతో ఉపాధి పొందుతున్న మహిళలతో ముఖ్యమంత్రి మాట్లాడారు. అనంతరం ఆధునిక వసతులతో నిర్మించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ప్రారంభించారు. ఇక్కడ జూనియర్ కాలేజీని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు, మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ, ఎంపీ కేశినేని నాని, మేయర్ కోనేరు శ్రీధర్, గొల్లపూడి సర్పంచ్ సాధనాల వెంకటేశ్వరమ్మ, జక్కంపూడి సర్పంచ్ కొమ్ము రవి, ఎంపీపీ వడ్లమూడి జగన్మోహనరావు, జిల్లా కలెక్టర్ బాబుఏ, మున్సిపల్ కమిషనర్ జి.వీరపాండియన్, సబ్ కలెక్టర్ సృజన తదితరులు పాల్గొన్నారు. ఎరుకల కులస్తులను గుర్తించండి విజయవాడ (రామవరప్పాడు) : ఎరుకల కులస్తులను ప్రభుత్వం గుర్తించి వారి అభ్యున్నతికి సహకరించాలని నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మానుపాటి నవీన్ కోరారు. నగరంలోని సీఎం క్యాంప్ కార్యాలయం లో బుధవారం నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు వినోద్‌కుమార్, మానుపాటి నవీన్‌లు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ ఎరుకల కులస్తుల జీవనాధారమైన పందుల పెంపకానికి ప్రభుత్వం సహకరించి పిగ్గరీస్ బోర్డు ఏర్పాటు చేయాలని, గిరిజనులకు నామినేటెడ్ పదవులు ఇప్పించాలని కోరామన్నారు. నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ ఉమ్మడి రాష్ట్రాల ట్రెజరర్ కుంభ ఉదయ్ కుమార్ ఏకలవ్వ పాల్గొన్నారు. -
బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన
శోభనాద్రిపురం (రామన్నపేట) : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్.అంబేద్కర్ స్ఫూర్తితోనే రాష్ట్రప్రభుత్వం కొత్తజిల్లాలను ఏర్పాటు చేస్తుందని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మండలంలోని శోభనాద్రిపురంలో ఏర్పాటుచేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆదివారం ఆవిష్కరించారు. రూ. 5లక్షల ఎంపీల్యాడ్స్ నిధులతో నిర్మించనున్న బీసీ కమ్యూనిటీహాలు నిర్మాణానికి శంకుస్థాపనచేసి, సీడీపీ నిధులతో వేసిన బోరుమోటారును ప్రారంభించారు. అనంతరం అంబేద్కర్ సొసైటీ కార్యాలయ ఆవరణలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్–3 ప్రకారమే తెలంగాణరాష్ట్రం ఏర్పడిందని గుర్తుచేశారు. కంచి ముత్తయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో దళితసేన రాష్ట్ర అధ్యక్షుడు జేబీ.రాజు, ఎస్సీ వెల్పేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్పీఆర్ మల్లేష్‌కుమార్, ఎంపీపీలు కక్కిరేణి ఎల్లమ్మ, రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, సర్పంచ్ బొడిగె చంద్రకళ, నార్మాక్స్డైరెక్టర్ గంగుల కృష్ణారెడ్డి, ముక్కాముల దుర్గయ్య, కంచి శంకరయ్య, విగ్రహదాత గౌరీకృష్ణ, శిల్పి బోదాసు వెంకటరమణ, బందెల రాములు, ఆహ్వాన కమిటీసభ్యులు కంచి మల్లేశం, కంచి యాదయ్య, మధుసూదన్, రాములు, శంకర్, రమేష్, సురేష్, దశరథ, స్వామి, మధు, సుమన్, పొడిచేటి ఎల్లప్ప, సుమన్, ప్రవీన్, సురేందర్ పాల్గొన్నారు.