ఘనంగా జక్కంపూడి జయంతి వేడుకలు | jakkampudi birthday celebrations in east godavari distirict | Sakshi
Sakshi News home page

ఘనంగా జక్కంపూడి జయంతి వేడుకలు

Published Thu, Aug 6 2015 3:34 PM | Last Updated on Sun, Sep 3 2017 6:55 AM

jakkampudi birthday celebrations in east godavari distirict

కొరుకొండ: తూర్పుగోదావరి జిల్లా కొరుకొండ మండల కేంద్రంలో గురువారం మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్‌రావు జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మెగా హెల్త్‌క్యాంప్‌ను వైఎస్సార్ సీపీ శాసనసభా పక్ష ఉపనేత జ్యోతుల నెహ్రు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ డెల్టా భూములకు విడతల వారిగా నీరందించడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.

డెల్టాకు విడతల వారిగా నీటిని అందించే విధానం గతంలో ఎన్నడూ లేదని గుర్తుచేశారు. ఈ విధానంతో దిగువ ప్రాంత భూములకు సకాలంలో నీరందడం లేదని పేర్కొన్నారు. ఈ విధానాన్ని తక్షణమే ప్రభుత్వం సవరించాలని జ్యోతుల నెహ్రు సూచించారు. ఈ కార్యక్రమంలో జక్కంపూడి విజయలక్ష్మీ, జక్కంపూడి రాజా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement