అభివృద్ధికి ప్రతిపాదనలు
అభివృద్ధికి ప్రతిపాదనలు
Published Tue, Oct 4 2016 11:17 PM | Last Updated on Thu, Mar 21 2019 8:22 PM
విజయవాడ :
జక్కంపూడి కాలనీలో కేటాయించిన ప్లాట్లలో అభివృద్ధి పనులకు అదనంగా రూ.7కోట్లకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ బాబు.ఎ పేర్కొన్నారు. ఆయా పనులు చేపట్టేందుకు వీలుగా, భవిష్యత్తులో నిర్వహణ బాధ్యతలను చేపట్టే దిశలో భాగంగా జక్కంపూడి కాలనీని వీఎంసీకు అప్పగిస్తామన్నారు. స్థానిక జక్కంపూడి ప్రాంతంలో మంగళవారం 157 నుంచి 184 వరకు గల సర్వేనెంబర్లలో భూములను, అక్కడ నిర్మించిన రోడ్లను, ఇతర పనులను క్షేత్రస్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలోని బృందం కాలనీ ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ జక్కంపూడి పరిధి భూములలో కేటాయించిన ఇళ్ల స్థలాల అభివృద్ధి కోసం ప్రభుత్వం గతంలలో రూ.25 కోట్లు మంజూరు చేసిందని, రూ. 21.61కోట్లతో వివిధ పనులను విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా చేపట్టామన్నారు. కార్పొరేషన్ వద్ద ఉన్న రూ. 3.39కోట్లకు అదనంగా మరో రూ. 7కోట్లు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నామని ఆయన తెలిపారు.
రిజిస్ట్రేషన్ల పునరుద్ధరణ
జక్కంపూడి ప్రాంతంలో రిజిస్ట్రేషన్లు నిలుపుదల చేసిన సర్వే నెంబర్లలో 157,161 నుంచి 170 (162 సర్వేనెంబరు మినహా) 175 నుంచి 181, 182పి, 183, 184 నెంబర్లలో భూములకు రిజిస్ట్రేషన్లను అనుమతులు ఇచ్చామని స»Œ కలెక్టర్ డాక్టర్ జి. సృజన తెలిపారు. జక్కంపూడి రైతులకు సంబంధించి 7 ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ,711 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియకు అడ్డంకులు తొలగాయని ఆమె తెలిపారు. మున్సిపల్ కమిషనర్ జి.వీరపాండియన్, డిప్యూటీ మేయర్ గోగుల వెంకటరమణ, ఎంఎంసీ చైర్మన్ జె.గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Advertisement