plats
-
ఒకేసారి ఆరు ఫ్లాట్స్ కొనేసిన స్టార్ హీరో.. రేటు ఎంతో తెలుసా?
సాధారణంగా హీరోహీరోయిన్లు ఎవరైనా సరే ఒక్క ఫ్లాట్ లేదా బంగ్లా కొంటే దాని రేటు ఎంత? అనే విషయాలు వైరల్ అవుతుంటాయి. అలాంటిది బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ ఒకేసారి ఏకంగా ఆరు ఫ్లాట్స్ కొనుగోలు చేశాడు. దీంతో అందరూ అవాక్కవుతున్నారు. అయితా ఒక్కసారే అన్ని కొనేయాల్సిన అవసరమేంటి? ఇంతకీ వీటి రేట్ ఎంత అనేది చూద్దాం.(ఇదీ చదవండి: ప్రభాస్ వల్లే ఇలా మారిపోయాను: దీపికా పదుకొణె)బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన అభిషేక్.. కెరీర్ ప్రారంభంలో ఒకటి రెండు హిట్స్ కొట్టాడు. మంచి నటుడు అనిపించుకున్నాడు. కానీ మరీ సూపర్ స్టార్ రేంజుకి వెళ్లలేకపోయాడు. హీరోయిన్ ఐశ్వర్య రాయ్‌ని పెళ్లి చేసుకున్న తర్వాత అడపాదడపా సినిమాలు చేస్తూ వ్యాపారాల్లో ఎక్కువగా కాన్సట్రేట్ చేస్తూ వస్తున్నాడు. కబడ్డీ ప్రీమియర్ లీగ్‌లోనూ ఇతడికి ఓ జట్టు ఉంది.ఇక తాజాగా ముంబైలోని బొరివాలి సబ్బరన్ ప్రాంతంలో ప్రముఖ రియల్ ఎస్టేట్‌కి సంబంధించిన అపార్ట్మెంట్లో ఆరు ఫ్లాట్స్ కొనుగోలు చేశాడు. ఇవన్నీ కూడా 57వ అంతస్థులో ఉన్నాయి. ఇందులో రెండు ఫ్లాట్స్ ధర చెరో రూ.79 లక్షలు కాగా.. మిగిలిన నాలుగు కూడా తలో ఫ్లాట్ రూ.3.5 కోట్లు విలువ చేసేవి. మొత్తంగా చూసుకుంటే అభిషేక్ బచ్చన్ వీటి కోసం రూ.15 కోట్లు ఖర్చు చేశాడు. గత నెల 28నే కొనుగోలు పూర్తవగా, 29న రిజిస్ట్రేషన్ పూర్తయిందని తెలుస్తోంది.(ఇదీ చదవండి: Amitabh Bachchan: కల్కిలాంటి సినిమా నేనిప్పటివరకూ చేయలేదు) -
'బుద్ధి'.. గడ్డి తినడం కాదు!..గడ్డిప్లేట్లోనే తిందాం!
బుద్ధి గడ్డి తినడం కాదిది. బుద్ధిగా గడ్డి ప్లేట్లో తినడం. పర్యావరణ పరిరక్షణ పట్ల బుద్ధి వచ్చిన తర్వాత చేసే పని. దీనికి పెట్టిన అందమైన పేరే బయో డిగ్రేడబుల్ టేబుల్ వేర్. కేరళకు చెందిన రిషభ్, రోషన్ సోదరుల ప్రయోగం ఇది. సముద్రాన్ని కూడా వదలని కాలుష్యం నుంచి తీసుకున్న నిర్ణయం. వీళ్లు ప్లేట్ల తయారీకి వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగిస్తున్నారు. వేడుకల సందర్భంగా ఇప్పుడు ఉపయోస్తున్న ఫైబర్, పాలిథిన్ పొర ఉన్న పేపర్ ప్లేట్లలో భోజనం చేసి బయట పారేసినప్పుడు చెత్త కుండీల దగ్గర చేరిన కుక్కలు, ఆవులు, ఇతర జంతువులు ఆ ప్లేట్లలో మిగిలిపోయిన ఆహారంతోపాటు ప్లేట్లను కూడా నమిలి మింగేస్తుంటాయి. దాంతో అవి అనారోగ్యాల బారిన పడుతుంటాయి. ఫైబర్ బదులు బయో డీగ్రేడబుల్ ప్లేట్ వాడినట్లయితే... మూగజీవులు మనం పారేసిన మిగులు ఆహారంతోపాటు ప్లేట్‌ని తిన్నప్పటికీ వాటి ఆరోగ్యానికి ఎటువంటి హానీ కలగదు. ఈ ప్లేట్లను నానబెట్టి ఎరువుగా మార్చుకుని పంటకు వాడుకోవచ్చు. ఏమీ చేయకుండా వదిలేసినా కూడా ఈ మెటీరియల్ మట్టిలో కలిసిపోయి ఆ మట్టి జవజీవాలను పెంచుతుంది. గడ్డి కంచం ఇలా పుట్టింది! అసలీ గడ్డి ప్లేట్ ఆలోచన ఎలా వచ్చిందంటే... రిషభ్‌కి సర్ఫింగ్ ఇష్టం. కేరళ, కోవళమ్, అరేబియా సముద్రంలో సర్ఫింగ్ చేసేవాడు. సముద్రపు అలలను తప్పించుకుంటూ బోర్డు మీద పెడలింగ్ చేయడం అత్యంత సాహసంతో కూడిన ఆట. ప్రాక్టీస్‌లో ఉన్నప్పుడు రిషభ్ తలకు, దేహానికి పాలిథిన్ పేపర్, ప్లాస్టిక్ వస్తువులు తగులుతుండేవి. ఒక్కోసారి పాలిథిన్ షీట్ వచ్చి కాళ్లకు చుట్టుకునేది. ఇలాంటిదే మరో సంఘటన ఈ సోదరులిద్దరికీ ఆఫ్రికాలోని ఉగాండా దేశంలో ఎదురైంది. అక్కడి పర్వత శిఖరాల మీదకు ట్రెకింగ్ చేస్తున్నప్పుడు ఎటు చూసినా ప్లాస్టిక్ కాలుష్యమే. ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడం కంటే పాలిథిన్ వ్యర్థాలను తప్పించుకుంటూ అడుగులు వేయడంతోనే ట్రెకింగ్ పూర్తయింది. ఈ సమస్య ఒక్క కేరళనే కాదు, ప్రపంచం అంతటినీ వేధిస్తోందనిపింంది. పర్యావరణం ఎదురుగా భూతంలా నిలిన ఈ సవాల్‌కు జవాబు వెతికే ప్రయత్నంలో వీరికి వచి్చన ఆలోచన ఈ బయో డీగ్రేడబుల్ టేబుల్‌వేర్. క్వాడ్రాట్ పేరుతో మొదలు పెట్టిన ఈ ప్రయోగంలో ప్లేట్ తయారీకి తవుడు, పొట్టు, గడ్డి ఉపయోగించారు. ఇరవై నెలల నిరంతర పరశోధన, ప్రయోగాలతో ఒక రపం వచ్చింది. వేడుకల్లో ఉపయోగించే పేపర్ ప్లేట్, అల్యమినియం ఫాయిల్ అద్దుకున్న ప్లేట్, ఫైబర్ ప్లేట్ల స్థానాన్ని భర్తీ చేయగలుగుతుందా అనే పరీక్షలన్నింటినీ ఈ బయోడీగ్రేడబుల్ ప్లేట్ పాసయింది. ఇలా చేస్తున్నారు! పంట పొలాల నుంచి గడ్డిని, రైస్ మిల్లుల నుంచి తవుడు, పొట్టు సేకరించి శుభ్రం చేసిన తర్వాత హీటర్‌లో వేడి చేసి, మెత్తగా పొడి చేసి ప్లేట్, కప్పు, స్పన్ ఆకారంలో ఉన్న మౌల్డ్ ఆధారంగా రపం తెస్తారు. ఈ ప్లేట్లు భోజనం చేసే లోపు నానిపోతాయేమో అనే సందేహం కలుగుతుంది. పులుపు, రసం, మజ్జిగతో హాయిగా భోజనం చేయవచ్చని, నీటిలో నానబెట్టిన తర్వాత అరగంట సేపటి వరకు వాటి షేప్ మారదని చెప్పారు. అలాగే కప్పులు మరింత దృఢంగా 70 నిమిషాల సేపు ద్రవాలను నిలిపి ఉంచుతాయి. ఒకసారి తయారైన ఈ టేబుల్ వేర్ని ఏడాది పాటు నిల్వ ఉంచుకోవచ్చు. బయో డీగ్రేడబుల్ ప్లేట్లో ఆహారపదార్థాలు విదేశాలకెళ్తున్నాయి! ఢిల్లీ, ముంబయి, బెంగళరు నగరాలతోపాటు అండవన్ నికోబార్ దీవులు, మిజోరాం, నాగాలాండ్ రాష్ట్రాలు ఈ ప్రత్యామ్నాయాన్ని ఆదరిస్తున్నాయి. అంతేకాదు, యూఎస్, యూకే, కెనడా, మెక్సికోలు కూడా ఈ బయోడీ గ్రేడబుల్ టేబుల్ వేర్‌కు స్వాగతం పలికాయి. నెలకు ప్లేట్లు, కప్పులు, స్ట్రాలు, స్పన్లు అన్నీ కలిపి పాతిక వేలు అమ్ముడవుతున్నాయని చెప్పారు రిషభ్, రోహన్‌లు. పొట్ట ఉబ్బిపోతుంది! జంతువులు మనం తినే ఆహారం వైపు చూస్తున్నాయంటే వాటికి వాటి ఆహారం దొరకడం లేదని అర్థం. వీధికుక్కలతోపాటు ఆవులు మరికొన్ని జంతువులు ఓ దశాబ్దకాలంగా జీర్ణవ్యవస్థ సమస్యలతో మరణిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ప్లాస్టిక్ వ్యర్థాలే. ప్లాస్టిక్ వ్యర్థాలను వరుసగా నెలరోజుల పాటు తిన్నాయంటే వాటి పెద్దపొట్టలో పదహారు నుంచి పద్దెనిమిది కిలోల ప్లాస్టిక్ పేరుకుంటుంది. ఐదారు కిలోలు చేరినప్పటి నుంచి వాటికి ఇబ్బందులు మొదలవుతాయి. గ్యాస్‌తో కడుపు ఉబ్బిపోతుంది. అక్యూట్ బ్లోటింగ్‌తో కొద్ది రోజుల్లోనే మరణిస్తాయి. ఎవరి పెంపకంలో లేని జంతువులకు ఈ ప్రమాదం ఎక్కువ. పరిస్థితి ఎంత దయనీయమంటే... ఆవులు నెమరు వేసుకునే ప్రక్రియలో ఆహారాన్ని తిరిగి నోట్లోకి తెచ్చుకున్నప్పుడు ఫైబర్, ప్లాస్టిక్ వ్యర్థాలు ముక్కలు ముక్కలుగా బయటపడుతుంటాయి. బయటపడడం కొంతలో కొంత నయం. పాలిథిన్ కవర్లు లోపల చుట్టచుట్టుకుని పోతే వాటంతట అవి బయటకు రాలేవు. ఆపరేషన్ చేయడమే మార్గం. ఈ జంతువులకు వైద్యం చేసి ప్రాణాలు కాపాడాలన్నా కూడా ప్లాస్టిక్ పెద్ద పొట్టలో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం. అవి విసర్జక వ్యవస్థలోకి వెళ్లాయంటే ఇక ఏమీ చేయలేం. మరణాన్ని ఆపలేం. – డాక్టర్ మల్లేశ్ పాటిల్, అసిస్టెంట్ డైరెక్టర్, యానిమల్ హజ్బెండరీ, ఆంధ్రప్రదేశ్ (చదవండి: ఆ సమోసాల అమ్మే వ్యక్తి..ఓ గొప్ప జీవిత పాఠాన్ని నేర్పాడు!) -
అభివృద్ధికి ప్రతిపాదనలు
విజయవాడ : జక్కంపూడి కాలనీలో కేటాయించిన ప్లాట్లలో అభివృద్ధి పనులకు అదనంగా రూ.7కోట్లకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ బాబు.ఎ పేర్కొన్నారు. ఆయా పనులు చేపట్టేందుకు వీలుగా, భవిష్యత్తులో నిర్వహణ బాధ్యతలను చేపట్టే దిశలో భాగంగా జక్కంపూడి కాలనీని వీఎంసీకు అప్పగిస్తామన్నారు. స్థానిక జక్కంపూడి ప్రాంతంలో మంగళవారం 157 నుంచి 184 వరకు గల సర్వేనెంబర్లలో భూములను, అక్కడ నిర్మించిన రోడ్లను, ఇతర పనులను క్షేత్రస్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలోని బృందం కాలనీ ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ జక్కంపూడి పరిధి భూములలో కేటాయించిన ఇళ్ల స్థలాల అభివృద్ధి కోసం ప్రభుత్వం గతంలలో రూ.25 కోట్లు మంజూరు చేసిందని, రూ. 21.61కోట్లతో వివిధ పనులను విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా చేపట్టామన్నారు. కార్పొరేషన్ వద్ద ఉన్న రూ. 3.39కోట్లకు అదనంగా మరో రూ. 7కోట్లు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నామని ఆయన తెలిపారు. రిజిస్ట్రేషన్ల పునరుద్ధరణ జక్కంపూడి ప్రాంతంలో రిజిస్ట్రేషన్లు నిలుపుదల చేసిన సర్వే నెంబర్లలో 157,161 నుంచి 170 (162 సర్వేనెంబరు మినహా) 175 నుంచి 181, 182పి, 183, 184 నెంబర్లలో భూములకు రిజిస్ట్రేషన్లను అనుమతులు ఇచ్చామని స»Œ కలెక్టర్ డాక్టర్ జి. సృజన తెలిపారు. జక్కంపూడి రైతులకు సంబంధించి 7 ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ,711 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియకు అడ్డంకులు తొలగాయని ఆమె తెలిపారు. మున్సిపల్ కమిషనర్ జి.వీరపాండియన్, డిప్యూటీ మేయర్ గోగుల వెంకటరమణ, ఎంఎంసీ చైర్మన్ జె.గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
రాజధాని రైతుకు టోపీ !
ప్లాట్ల పంపిణీపై మాట తప్పిన ప్రభుత్వం పచ్చతమ్ముళ్లకు కోరుకున్న చోట .. చిన్న, సన్న కారు కర్షకులకు వేరే చోట నేడు శాఖమూరు రైతులకు ప్లాట్లు పంపిణీ లాటరీ పద్ధతిలో ఎంపిక చేయనున్న సీఆర్డీఏ తుళ్లూరు కార్యాలయం వద్ద భారీ ఏర్పాట్లు సాక్షి, అమరావతి బ్యూరో : వడ్డించేవాడు మనవాడైతే... కడ బంతిలో కూర్చున్నా పంచభక్ష పరమాన్నాలు అందుతాయన్న నానుడికి శాఖమూరులో ప్లాట్ల పంపిణీ నిదర్శనం కానుంది. రాజధాని నిర్మాణం కోసం భూములు వదులుకున్న రైతులకు పరిహారం కింద ప్లాట్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఏ గ్రామంలో అయితే భూములు తీసుకు న్నారో... అదే ఊరు పొలిమేరల్లో ప్లాట్లు ఇస్తామని పాలకులు హామీ ఇచ్చారు. అయితే ఇచ్చిన మాటను తుంగలో తొక్కి స్థానిక రైతులు కొందరికి ఇతర గ్రామాల సరిహద్దుల్లో ప్లాట్లు ఇవ్వనున్నారు. అందులో తుళ్లూరు మండలం శాఖమూరు గ్రామం ఒకటి. రాజధాని నిర్మాణం కోసం శాఖమూరు గ్రామానికి చెందిన 1572 మంది రైతులు సుమారు 1500 ఎకరాలను వదులుకున్నారు. వీరందరికి నివాసయోగ్యమైనవి 1841, వాణిజ్య పరమైనవి 1208 ప్లాట్లు బుధవారం తుళ్లూరు సీఆర్డీఏ కార్యాలయం వద్ద లాటరీ పద్ధతిలో పంపిణీ చేస్తున్నారు. పాలకులు ఆదేశాల మేరకు, వారు సూచించిన విధంగా ప్లాట్ల పంపిణీ నిర్వహిస్తున్నట్లు ఓ అధికారి స్పష్టం చేశారు. టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు, ఇంకా సర్కారుకు అనుకూలంగా ఉన్న మోతుబరి రైతులు సుమారు 30 మందికి పైగా శాఖమూరు పొలిమేరల్లోనే ప్లాట్లు కేటాయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇక శాఖమూరులో మిగిలిన చిన్న, సన్న కారు రైతులకు నెక్కల్లు, పెదపరిమి గ్రామాల పొలిమేరల్లో ప్లాట్లు కట్టబెట్టడానికి రంగం సిద్ధం చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. శాఖమూరు పొలిమేరల్లో ఇస్తున్న ప్లాట్లు విలువైనవని, నెక్కల్లు, పెదపరిమి గ్రామ సరిహద్దుల్లో కేటాయిస్తున్న ప్లాట్లకు పెద్దగా విలువ ఉండదని రైతులే చెబుతున్నారు. రైతుల వేదన అరణ్యరోదనేనా? బంగారంలాంటి పంట పొలాలను వదులుకున్న రైతులకు న్యాయం చేస్తామన్న ప్రభుత్వ పెద్దల మాటలు నీటి మూటలేనని కొన్ని గంటల్లో తేలిపోనుంది. భూములు వదులుకున్న రైతులకు ఇచ్చే ప్లాట్లకు సంబంధించి అభ్యంతరాలు ఉంటే చెప్పండి, పరిష్కరిస్తామని చెపుతూ సీఆర్డీఏ అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు పర్యాయాలు చేపట్టిన అవగాహన సదస్సులు రసాభాసగా మారాయి. కొందరికి నెక్కల్లు, మరికొందరికి పెదపరిమి గ్రామంలో ప్లాట్లు కేటాయిస్తుండడంపై మండిపడుతున్నారు. అంతకు ముందు రైతులు పలుమార్లు అధికారులను కలిసి విన్నవించారు. ఇవేమీ పట్టించుకోని ప్రభుత్వ పెద్దలు వారు అనుకున్నట్లు ప్లాట్ల పంపిణీకి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇక రైతుల్లో వ్యతిరేకతను దష్టిలో ఉంచుకుని మంగళవారం రాత్రి ముసాయిదాలో కొద్దిగా మార్పులు చేపట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ప్లాట్లన్నీ తుళ్లూరు రెవెన్యూ పరిధిలోనే ఇస్తున్నామని చెప్పుకోవడానికి ఈ మార్పు చేసినట్టు తెలుస్తోంది. అయితే అవి ఆ గ్రామాల్లో కాకుండా సరిహద్దుల్లో ఇస్తుండడం గమనార్హం. వాణిజ్య ప్లాట్లు కొన్ని ఉప్పలపాడు చెరువులో, మరికొన్ని తుళ్లూరు–నేలపాడు మధ్య, ఎక్కువగా పెదపరిమి మార్గంలో కేటాయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్లాట్ల పంపిణీ కార్యక్రమం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎవ్వరూ ఎదురు తిరిగి మాట్లాడకుండా ఉండాలని రైతులకు రాత్రంతా కౌన్సెలింగ్ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఒకవేళ కార్యక్రమంలో ఎవరైనా నోరెత్తితే వారిపై అక్రమ కేసులు బనాయించాలని కూడా పెద్దల నుంచి పోలీసులకు ఆదేశాలు అందినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే ప్లాట్లు తీసుకోకుంటే మీకే నష్టమని పాలకులు కొందరు మంగళవారం రాత్రికే రైతులకు సంకేతాలు పంపారు. తీసుకోనివారికి ప్లాటు విలువ కట్టి ఆ మొత్తాన్ని వారి బ్యాంక్ ఖాతాలో జమచేయడానికి సిద్ధంకావటం గమనార్హం. -
ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు ఉద్యమం
– తిరుపతి సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద రేణిగుంట వాసులు ధర్నా తిరుపతి మంగళం : ఏళ్ల తరబడి రేణిగుంటలో నివాసముంటున్నా తలదాచుకోవడానికి గూడు లేదని రేణిగుంట వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు ఉద్యమాలు ఆగవని వారు హెచ్చరించారు. ఇంటిస్థల పోరాట కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం రేణిగుంట నుంచి పాదయాత్రగా తిరుపతి సబ్‌కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని ధర్నా నిర్వహించారు. సీపీఎం మండల కార్యదర్శి వెంకటరమణ మాట్లాడుతూ రేణిగుంటలో సుమారు 1,500 మంది పేదలు ఇళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రేణిగుంట మండలంలో వందల ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయని, అందులో పేదలకు ఇంటి స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే అనేక సార్లు ఇంటి స్థలాలపై ధర్నాలు, నిరాహార దీక్షలు చేపట్టినా ప్రభుత్వంలో ఎలాంటి చలనం రాలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పేదల పట్ల ప్రభుత్వానికి ఇంత చిన్నచూపా..? అని మండిపడ్డారు. సంబంధిత అధికారులు స్పందించి రేణిగుంటలోని పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. -
‘స్వగృహ’లో సిద్ధమవుతున్న ప్లాట్లు
సర్వే చేస్తున్న ఇంజినీర్లు 200 గజాలతో 402 ప్లాట్లకు ప్రణాళిక తిమ్మాపూర్: మధ్య తరగతి ప్రజల సొంతింటి కల నెరవేర్చేందకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన రాజీవ్ స్వగృహలో వ్యక్తిగత ప్లాట్ల ప్రక్రియ వేగవంతమవుతోంది. 2007లో రామకృష్ణకాలనీలో రాజీవ్ స్వగృహ కింద ఇళ్లు నిర్మించి ఇవ్వాలని అప్పటి ప్రభుత్వం మొదట నిర్ణయించినా మధ్యలోనే ఆగిపోయింది. అనంతరం జరిగిన పరిణామాల దృష్ట్యా ఇళ్ల స్థానంలో ప్లాట్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఆ నిర్ణయం తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ రెండేళ్లకు కార్యరూపం దాలుస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీంతో కరీంనగర్ జిల్లా కేంద్రానికి సమీపంలోని తిమ్మాపూర్ మండలం రామకృష ్ణకాలనీలో రాజీవ్ స్వగృహ స్థలంలో ప్లాట్లు సిద్ధమవుతున్నాయి. మూడు రోజులుగా ప్లాట్ల హద్దులు ఏర్పాటుకు సర్వే జరుగుతోంది. పలు చోట్ల హద్దు రాళ్లు ఏర్పాటు చేశారు. 90ఎకరాలు, 402ప్లాట్లు రాజీవ్ స్వగృహ పథకం కింద రామకృష్ణకాలనీలో అప్పటి ప్రభుత్వం 90ఎకరాలు సేకరించింది. అందులో 24 ఎకరాల భూమి కోర్టు పరిధిలో ఉంది. 2007లో రాజీవ్ స్వగృహ ఇళ్ల కోసం 7344 మంది రూ.5వేల చొప్పున డీడీలు చెల్లించారు. అయితే అందులో ఇళ్ల నిర్మాణం సాధ్యం కాకపోవడంతో మధ్యలోనే పనులు ఆపేశారు. కోర్టులో ఉన్న స్థలం, నిర్మాణాలు చేపట్టిన స్థలాలను వదిలి, మిగతా స్థలంలో 402 ప్లాట్లు చేయడానికి అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఒక్కో ప్లాట్‌ను 200 గజాలుగా నిర్ణయించారు. గజానికి రూ.3వేల చొప్పున ప్లాట్‌కు రూ.6లక్షలు ధర నిర్ణయించారు. మూడు రోజులుగా ఇంజినీర్లు ప్లాట్ల ప్రక్రియ మొదలు పెట్టగా.. పలు ప్లాట్లు సిద్ధమయ్యాయి. ప్లాట్ల మధ్య 30ఫీట్లు, 40ఫీట్ల రోడ్లను ఏర్పాటు చేస్తున్నారు. అయితే 7344 మంది దరఖాస్తుదారులున్నా.. వారిలో 402 మందికే డ్రా ద్వారా ప్లాట్ల కేటాయింపు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. -
రాజీవ్ స్వగృహ ప్లాట్లు
90ఎకరాల్లో ఖాళీ స్థలాల్లోనే ప్లాట్లు 7344 దరఖాస్తులు.. 402 ప్లాట్లు ఒక్కో ప్లాటు 200 గజాలు దరఖాస్తుదారులకే అవకాశం తిమ్మాపూర్ : మధ్య తరగతి ప్రజల సొంతింటి కల నెరవేర్చేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి 2007లో ప్రవేశపెట్టిన పథకం రాజీవ్ స్వగృహ. ఇందులో భాగంగా తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీలో అంగారిక పేరుతో గృహ నిర్మాణాలు చేపట్టగా అర్ధాంతరంగా ఆగిపోయాయి. ప్రస్తుతం ఈ స్థలంలో ప్లాట్లు చేసి విక్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంగారిక ప్రాజెక్టులో గేటెడ్ కమ్యూనిటీతో అన్ని హంగులతో ఇండిపెండెంట్ ఇల్లు, ప్లాట్లు తక్కువ ధరలకే అందిస్తామని రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ప్రకటించింది. 2007లో దరఖాస్తులు ఆహ్వానించగా 7344 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుదారుల నుంచి రూ.5వేల చొప్పున డిపాజిట్ స్వీకరించారు. కాంట్రాక్టర్ పనులు ఇళ్ల నిర్మాణ పనులు మెుదలు పెట్టారు. వైఎస్సార్ మరణం తర్వాత సకాలంలో బిల్లులు రాకపోవడంతో పనులను పునాదుల్లోనే నిలిపేశారు. దీంతో దాదాపు ఆరేళ్ల నుంచి ఈ ప్రాజెక్టు పెండింగ్‌లో పడింది. దరఖాస్తుదారుల సొమ్ము సుమారు రూ.4కోట్లు స్వగృహ కార్పొరేషన్ వద్దనే ఉంది. తర్వాత 2014 ఫిబ్రవరిలో 90ఎకరాల స్థలంలో ప్లాట్లు చేసి విక్రయించాలని అధికారులు నిర్ణయించారు. ఒక్కో ప్లాటు ధరను నిర్ణయించి అందులో 25శాతం డిపాజిట్ ఫిబ్రవరి 14లోగా చెల్లించాలని కోరారు. దీంతో దరఖాస్తుదారులు తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలంటూ ఆందోళనకు దిగారు. తమకు నమ్మకం కలిగించకుంటే డిపాజిట్ ఎలా చెల్లిస్తామని ప్రశ్నించారు. సుమారు వంద మంది దరఖాస్తుదారులు తమ రూ.5వేల డిపాజిట్ సొమ్మును వాపస్ తీసుకున్నారు. మిగిలిన వారు తమకు న్యాయం చేయాలంటూ కోర్టును ఆశ్రయించారు. స్థలం చదును పనులు షురూ... తాజాగా రాజీవ్ స్వగృహ స్థలంలో ప్లాట్లు చేసి దరఖాస్తుదారులకే విక్రయించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు స్థలం చదును చేసే పననులు చేపట్టారు. 90 ఎకరాల స్థలంలో కోర్టులో ఉన్న 24 ఎకరాలు, నిర్మాణాలు చేపట్టిన స్థలాలు కాకుండా ఖాళీగా ఉన్న స్థలాల్లో 402 ప్లాట్లు చేయాలని నిర్ణయించారు. గజానికి రూ.3వేల ధరను నిర్ణయించి 200 గజాల కొలతలతో రూ.6లక్షలకు ఒక ప్లాట్‌ని విక్రయించేందుకు సిద్ధమవుతున్నారు. 7344 దరఖాస్తులను డ్రా తీసి 402 మందిని ఎంపిక చేస్తామని, అదనంగా 200 మందికి డ్రా తీసి వారిని రిజర్వులో ఉంచుతామని పేర్కొంటున్నారు. 402 మందిలో ఎవరు వద్దన్నా మిగతా 200 మంది నుంచి అవకాశం కల్పిస్తామని చెబుతున్నారు. ఇప్పటికే నిర్మాణాలు ప్రారంభించి వదిలేసిన వాటికి మరో ధర నిర్ణయించి విక్రయించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. వీటిపై వారం రోజుల్లో నిర్ణయం తీసుకుని తుది ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం. కాగా కోర్టు కేసులో ఉన్న స్థలంపై తీర్పు వచ్చేదాకా ప్లాట్ల పనులను అడ్డుకుంటామని బాధితుల్లో కొందరు హెచ్చరిస్తున్నారు. -
బెజవాడ లాయర్లకు అమరావతిలో ఇళ్లస్థలాలు!
విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం బెజవాడ బార్ అసోసియేషన్‌పై అమితమైన ప్రేమచూపింది. నూతన రాజధానిలో నిర్మించే జస్టిస్ సిటీలో బెజవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదులకు ఇళ్ల స్థలాలు ఇవ్వనుంది. ఈ మేరకు గురువారం బెజవాడ బార్ అసోసియేషన్‌లో సభ్యులుగా ఉన్న న్యాయవాదులకు మొబైల్ మెసేజ్‌లు వచ్చాయి. అమరావతి నగరంలో జస్టిస్ సిటీ ఏర్పాటు చేసేందుకు సీఆర్డిఏ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఆ తర్వాత సింగపూర్ బృందం ఇచ్చిన మాస్టర్‌ప్లాన్‌లో జస్టిస్ సిటీని చేర్చారు. జస్టిస్ సిటీలో హైకోర్టు న్యాయమూర్తులకు నివాస గృహలు, న్యాయశాఖ సిబ్బందికి క్వార్టర్లు, ఇంకా స్థలాలు మిగిలితే హైకోర్టులో ప్రాక్టీస్ చేసే న్యాయవాదులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని గతంలో ప్రకటించారు. ఇటీవల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా అమరావతి నగరం శంకుస్థాపన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. సీఆర్డీఏ అధికారులు మాస్టర్ ప్లాన్ గురించి వివరించి జస్టిస్ సిటీలో నిర్మించనున్న కట్టడాల వివరాలను వెల్లడించారు. బెజవాడ బార్ అసోసియేషన్‌లో 2,300 మంది న్యాయవాదులు ఉన్నారు. ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా అమరావతిలో బెజవాడ బార్ న్యాయవాదులకు ఇళ్ల స్థలాలు కేటాయించనున్నారు. ఆసక్తిగల సభ్యులు తమ దరఖాస్తులను బార్ అసోసియేషన్‌లో తమ పేర్లు నమోదు చేయించుకోవాల్సిందిగా బార్ కార్యాలయం సూచించింది వాస్తవానికి గుంటూరు జిల్లాలో అమరావతి నగరం నిర్మితమవుతోంది. అయితే గుంటూరు బార్ అసోసియేషన్ న్యాయవాదులను కనీసం పట్టించుకోకుండా విజయవాడకే ప్రాధాన్యం ఇవ్వడంపై మిగిలిన బార్ అసోసియేషన్లలో తీవ్ర వ్యతిరేక వ్యక్తం అవుతోంది. విశాఖపట్నం, కర్నూలు జిల్లాల న్యాయవాదులు హైకోర్టు లేదా హైకోర్టు బెంచ్ డిమాండ్‌తో సుదీర్ఘ కాలం పోరాడారు. ఇలా రాష్ట్రంలో అనేక జిల్లాల్లో న్యాయవాదులను పట్టించుకోకుండా కేవలం ఒక బార్ అసోసియేషన్‌పై ప్రేమ చూపడం న్యాయవాదుల్లో చర్చగా మారింది.