
సాధారణంగా హీరోహీరోయిన్లు ఎవరైనా సరే ఒక్క ఫ్లాట్ లేదా బంగ్లా కొంటే దాని రేటు ఎంత? అనే విషయాలు వైరల్ అవుతుంటాయి. అలాంటిది బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ ఒకేసారి ఏకంగా ఆరు ఫ్లాట్స్ కొనుగోలు చేశాడు. దీంతో అందరూ అవాక్కవుతున్నారు. అయితా ఒక్కసారే అన్ని కొనేయాల్సిన అవసరమేంటి? ఇంతకీ వీటి రేట్ ఎంత అనేది చూద్దాం.
(ఇదీ చదవండి: ప్రభాస్ వల్లే ఇలా మారిపోయాను: దీపికా పదుకొణె)
బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన అభిషేక్.. కెరీర్ ప్రారంభంలో ఒకటి రెండు హిట్స్ కొట్టాడు. మంచి నటుడు అనిపించుకున్నాడు. కానీ మరీ సూపర్ స్టార్ రేంజుకి వెళ్లలేకపోయాడు. హీరోయిన్ ఐశ్వర్య రాయ్‌ని పెళ్లి చేసుకున్న తర్వాత అడపాదడపా సినిమాలు చేస్తూ వ్యాపారాల్లో ఎక్కువగా కాన్సట్రేట్ చేస్తూ వస్తున్నాడు. కబడ్డీ ప్రీమియర్ లీగ్‌లోనూ ఇతడికి ఓ జట్టు ఉంది.
ఇక తాజాగా ముంబైలోని బొరివాలి సబ్బరన్ ప్రాంతంలో ప్రముఖ రియల్ ఎస్టేట్‌కి సంబంధించిన అపార్ట్‌మెంట్‌లో ఆరు ఫ్లాట్స్ కొనుగోలు చేశాడు. ఇవన్నీ కూడా 57వ అంతస్థులో ఉన్నాయి. ఇందులో రెండు ఫ్లాట్స్ ధర చెరో రూ.79 లక్షలు కాగా.. మిగిలిన నాలుగు కూడా తలో ఫ్లాట్ రూ.3.5 కోట్లు విలువ చేసేవి. మొత్తంగా చూసుకుంటే అభిషేక్ బచ్చన్ వీటి కోసం రూ.15 కోట్లు ఖర్చు చేశాడు. గత నెల 28నే కొనుగోలు పూర్తవగా, 29న రిజిస్ట్రేషన్ పూర్తయిందని తెలుస్తోంది.
(ఇదీ చదవండి: Amitabh Bachchan: కల్కిలాంటి సినిమా నేనిప్పటివరకూ చేయలేదు)
Comments
Please login to add a commentAdd a comment