devlopment
-
జీవీఎంసీ పరిధిలో పార్కుల అభివృద్ధి
-
పారిశ్రామికాభిరుద్దిపై సీఎం జగన్ దూరదృష్టితో ఆలోచన చేస్తున్నారు : గౌతమ్ రెడ్డి
-
అభివృద్ధికి ప్రతిపాదనలు
విజయవాడ : జక్కంపూడి కాలనీలో కేటాయించిన ప్లాట్లలో అభివృద్ధి పనులకు అదనంగా రూ.7కోట్లకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ బాబు.ఎ పేర్కొన్నారు. ఆయా పనులు చేపట్టేందుకు వీలుగా, భవిష్యత్తులో నిర్వహణ బాధ్యతలను చేపట్టే దిశలో భాగంగా జక్కంపూడి కాలనీని వీఎంసీకు అప్పగిస్తామన్నారు. స్థానిక జక్కంపూడి ప్రాంతంలో మంగళవారం 157 నుంచి 184 వరకు గల సర్వేనెంబర్లలో భూములను, అక్కడ నిర్మించిన రోడ్లను, ఇతర పనులను క్షేత్రస్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలోని బృందం కాలనీ ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ జక్కంపూడి పరిధి భూములలో కేటాయించిన ఇళ్ల స్థలాల అభివృద్ధి కోసం ప్రభుత్వం గతంలలో రూ.25 కోట్లు మంజూరు చేసిందని, రూ. 21.61కోట్లతో వివిధ పనులను విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా చేపట్టామన్నారు. కార్పొరేషన్ వద్ద ఉన్న రూ. 3.39కోట్లకు అదనంగా మరో రూ. 7కోట్లు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నామని ఆయన తెలిపారు. రిజిస్ట్రేషన్ల పునరుద్ధరణ జక్కంపూడి ప్రాంతంలో రిజిస్ట్రేషన్లు నిలుపుదల చేసిన సర్వే నెంబర్లలో 157,161 నుంచి 170 (162 సర్వేనెంబరు మినహా) 175 నుంచి 181, 182పి, 183, 184 నెంబర్లలో భూములకు రిజిస్ట్రేషన్లను అనుమతులు ఇచ్చామని స»Œ కలెక్టర్ డాక్టర్ జి. సృజన తెలిపారు. జక్కంపూడి రైతులకు సంబంధించి 7 ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ,711 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియకు అడ్డంకులు తొలగాయని ఆమె తెలిపారు. మున్సిపల్ కమిషనర్ జి.వీరపాండియన్, డిప్యూటీ మేయర్ గోగుల వెంకటరమణ, ఎంఎంసీ చైర్మన్ జె.గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
పర్యాటకాభివృద్ధికే అమరావతి షాపింగ్ ఫెస్టివల్
మంత్రులు దేవినేని ఉమా, ప్రత్తిపాటి పుల్లారావు విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలకు ప్రతిబింబంగా రాష్ట్రాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అమరావతి షాపింగ్ ఫెస్టివల్–2016 నాంది పలుకుతుందని మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు ఆకాంక్షించారు. నగరంలో కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అమరావతి షాపింగ్ ఫెస్టివల్ –2016 వెబ్‌సైట్‌ను మంత్రులు అధికారికంగా ప్రారంభించారు. అనంతరం జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ మార్కెట్ వర్గాలను రాష్ట్రం వైపు దృష్టిసారించేలాగా నూతన వ్యవస్థకు నాంది ప్రస్తావనగా స్వరాజ్యమైదానంలో అమరావతి షాపింగ్ ఫెస్టివల్‌ను పెద్ద ఎత్తున నిర్వహిస్తామన్నారు. వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ ఈ నెల 6వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఫెస్టివల్లో పాల్గొంటారని చెప్పారు. ఈ నెల 29వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ ఫెస్టివల్లో వివిధ ఉత్పత్తులను డిస్కౌంట్ స్కేల్ విధానంలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఫెస్టివల్లో ఉత్పత్తిదారులు, షాపింగ్ నిర్వాహకులు, ప్రముఖ షాపింగ్ మాళ్ల నిర్వాహకులు భాగస్వామ్యులయ్యేలా జిల్లా యంత్రాంగం ద్వారా చర్యలు తీసుకుంటామన్నారు. ఫెస్టివల్లో పాల్గొనేందుకు ఇప్పటికే జూవెలరీ, ఫర్నిచర్, రెడీమెడ్ తదితర సంస్థలు, షాపుల నిర్వాహకులు ముందుకు వచ్చారని తెలిపారు. కలెక్టర్ బాబు.ఎ మాట్లాడుతూ వ్యాపారులు షాపుల నిర్వహణకు కొద్దిమొత్తంలో రుసుం చెల్లించి తమ ఉత్పత్తులకు అద్భుత ప్రచారం పొందొచ్చని సూచించారు. ఇకపై వార్షిక వేడుకగా అమరావతి ఫెస్టివల్ నిలుస్తుందని, ఆ దిశగా కార్యచరణ రూపొందించామని పేర్కొన్నారు. ఈ వేడుకలను పురస్కరించుకుని జరిగే రూ.1000 కొనుగోలుపై బహుమతులు అందిస్తామని, ఫెస్టివల్ జరిగే అన్ని రోజులూ లక్కీడ్రా తీస్తామని తెలిపారు. కార్నివాల్ ర్యాలీ ప్రారంభిం ఫెస్టివల్ ప్రారంభంలో భాగంగా తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద మంత్రులు కార్నివాల్ ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ బందరు రోడ్డులో బెంజిస్కరిల్ వరకు సాగింది. మున్సిపల్ కమిషనర్ వీరపాండియన్, సబ్‌కలెక్టర్ డాక్టర్ సృజన తదితరులు పాల్గొన్నారు. -
పర్యాటక కేంద్రంగా హంసలదీవి
ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి కోడూరు : పవిత్ర సాగర సంగమ ప్రాంతాన్ని దర్శించడం పూర్వజన్మ సుకృతమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేరొన్నారు. హంసలదీవి సంగమ క్షేత్రంలో సీఎం గురువారం పర్యటించారు. ఆయన మాట్లాడుతూ పుష్కరాల్లో మాత్రమే దేవతలు–పుష్కరడు కలుస్తారని, కాని సాగర సంగమం వద్ద సంవత్సర కాలం పాటు పుష్కరుడు దేవతలతో కలిసి ఉండడం ఎంతో ప్రాశస్త్యం సంతరించుకుందని అన్నారు. హంసలదీవి క్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. 1977 ఉప్పెనలో వేలాది మంది మరణించినా, వేణుగోపాలుడి ఆలయంలోకి మాత్రం నీరు వెళ్లలేదంటే ఈ క్షేత్రం ఎంత మహిమాన్వితమైనదో అర్థం చేసుకోవచ్చని సీఎం అన్నారు. కృష్ణమ్మ పాదాలు ఎంతో శుభసూచికం.. దేశంలో మరెక్కడ లేని విధంగా కృష్ణమ్మ పాదాలు సాగరసంగమ క్షేత్రంలో ఉండడం ఎంతో శుభసూచికమని చంద్రబాబు అన్నారు. కృష్ణానదిపై నిర్మిస్తున్న ‘ఉల్లిపాలెం–భవానీపురం’ వారధి నిర్మాణంతో తీరప్రాంతాలు ఎంతో అభివృద్ధి చెందుతాయని చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ జలాన్ని కాపాడుకుంటే జలం మనల్ని కాపాడుతుందని, దీనిని దృష్టిలో పెట్టుకొని పుష్కరాలను ప్రభుత్వం పెద్ద పండుగలా నిర్వహిస్తుందని అన్నారు. సంగమం వద్ద పూజలు.. సాగర సంగమం వద్ద చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నదీమ తల్లికి ప్రత్యేక హారతులిచ్చారు. అనంతరం కృష్ణవేణమ్మ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఆయన వెంట ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, బీసీ సంక్షేమశాఖ మంత్రి కొల్లు రవీంద్ర, బందరు పార్లమెంట్ సభ్యుడు కొనగళ్ల నారాయణరావు, కలెక్టర్ బాబు ఏ, ఎస్పీ విజయకుమార్ ఉన్నారు. -
విశ్వ బ్రాహ్మణుల అభివృద్ధికి కృషి
రెంటచింతల: దశాబ్దాలుగా నిరాదరణకు గురైన విశ్వబ్రాహ్మణుల అభివృద్ధికి కృషి చేస్తానని రాష్ట్ర విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్ చైర్మన్ సింహాద్రి కనకాచారి అన్నారు. సోమవారం ఆయన విశ్వబ్రాహ్మణుల సమావేశంలో మాట్లాడుతూ 5 వృత్తులతో జీవితాలను కొనసాగించేది ఒక్క విశ్వబ్రాహ్మణులేనని, వారు ఉమ్మడి రాష్ట్రంలో 60 లక్షల మంది ఉండగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లో 25 లక్షల నుంచి 30 లక్షల మంది ఉన్నారన్నారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో వెనుకబాటుకు గురైన విశ్వబ్రాహ్మణులకు 2015–16లో రూ. 19 కోట్లను, 2016–17కిగానూ రూ. 22 కోట్లను ప్రభుత్వం కేటాయిందన్నారు. సొసైటీగా ఏర్పడితే విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకుని తమ కుటుంబాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. కృష్ణానది పుష్కరాలలో భాగంగా సత్రశాలలో పుణ్యస్నానాలు ఆచరించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. జిల్లా అధ్యక్షులు కొమరిగిరి కోటేశ్వరరావు, ఉపాధ్యక్షులు చిలకపాటి బ్రహ్మయ్య పాల్గొన్నారు. -
తిరుమల తరహాలో దుర్గగుడి అభివృద్ధి
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోనే దుర్గగుడిని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్ పేర్కొన్నారు. దేవాదాయ శాఖ పరిపాలనా భవనంలో బుధవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మహామండపాన్ని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. మహామండపంలో అందుబాటులో ఉన్నా.. కెనాల్ రోడ్డులో క్యూలైన్లు ఏర్పాటు చేయడంపై ప్రశ్నించగా, పుష్కరాల్లో రోజూ రెండు లక్షల మంది దుర్గమ్మ దర్శనానికి వచ్చే అవకాశం ఉందని, మహామండపంలోని క్యూ కాంప్లెక్స్ అందుకు తగినది కాదని సమాధానమిచ్చారు. మహామండపంలో అత్యాధునికమైన మరో రెండు లిప్టులను ఏర్పాటుచేస్తున్నామని చెప్పారు. దుర్గగుడి అభివృద్ధి, మాస్టర్ ప్లాన్‌లో భాగంగా తొలగించిన ఇళ్లకు రూ.30 కోట్ల డిపాజిట్లను తీశామని, మరో రూ.35 కోట్లను తీసేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించిందన్నారు. -
మల్లీశ్వరి ఘాట్‌ను మరిచారా?
విజయవాడ(భవానీపురం) : మల్లీశ్వరి ఘాట్‌లో పనులు నత్తనడకన సాగుతున్నాయి. గట్టు వెనుక ప్రాంతంలో అనాదిగా ఉన్నవి రెండు ఘాట్లే. అవి భవానీ, మల్లీశ్వరి ఘాట్లు. మల్లీశ్వరి ఘాట్‌ను గతంలో పున్నమి ఘాట్‌గా కూడా పిలిచేవారు. అయితే కృష్ణా పుష్కరాల సందర్భంగా పర్యాటక శాఖకు చెందిన హరిత బరంపార్క్(పున్నమి హోటల్)లో ఏర్పాటుచేస్తున్న పుష్కర ‡ఘాట్‌కు పున్నమి ఘాట్‌గా నామకరణం చేశారు. గతంలో ఎప్పుడూ ఇక్కడ ఘాట్ ఏర్పాటుచేయలేదు. వీఐపీల కోసం ఏర్పాటుచేస్తున్న ఈ ఘాట్‌కు మల్లీశ్వరి ఘాట్‌ను కలుపుతూ మొత్తాన్ని పున్నమి ఘాట్‌గా అధికారులు నిర్ణయించారు. అయితే బరంపార్క్‌లోని పున్నమి ఘాట్ పనులే పూర్తికాలేదు. మరోవైపు మల్లీశ్వరి ఘాట్‌ను పూర్తిగా నిర్లక్ష్యంచేశారు. ప్రజాప్రతినిధులు పున్నమి ఘాట్‌పైనే దృష్టిపెట్టారు. ఈ ఘాట్‌ను పట్టించుకోలేదు. అన్నీ అడ్డంకులే.. మల్లీశ్వరి ఘాట్ పనులు పూర్తికాకపోవడానికి ఇక్కడ అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. ఈ ప్రాంతంలోని అన్ని ఘాట్ల పనులకు అవసరమైన ఇసుకను ఇక్కడి నుంచే రవాణా చేస్తున్నారు. ఇక్కడ ఏర్పాటుచేసిన కాంక్రీట్ ప్లాంట్ నుంచే అన్ని ఘాట్లకు కాంక్రీట్ సరఫరా అవుతుంది. ఇక్కడి నుంచి ఇతర ఘాట్లకు ఇసుక, కాంక్రీట్ తీసుకువెళ్లేందుకు లారీలు, టిప్పర్లు రాకపోకలతో ఘాట్ మొత్తం అధ్వానంగా మారింది. కరకట్ట రహదారి నుంచి ఈ ఘాట్‌కు వచ్చే దారి కూడా ఇప్పటివరకు నిర్మించలేదు. ఘాట్‌కు వచ్చే మార్గం పక్కనే పర్యాటక శాఖకు చెందిన హౌస్ బోట్లు తయారుచేస్తున్నారు. 30 శాతం పనులే ఈ ఘట్లో కేవలం 30 శాతం పనులే పూర్తయ్యాయి. మిగిలిన 70 శాతం పనులు పుష్కరాలలోపు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. షీట్æఫైలింగ్, దానికిపైన మెట్లు, దానిపైన కాంక్రీట్ ప్లాట్‌ఫాం ఏర్పాటు చేయలేదు. షీట్‌ఫైలింగ్ కోసం తీసిన గోతులు అలాగే ఉన్నాయి. మట్టి తవ్వకాలు, ఐరన్ బుట్టల తయారీ పనులు జరుగుతూనే ఉన్నాయి. పున్నమిఘాట్‌కు ఈ ఘాట్‌కు మధ్యలోనే పిండప్రదాన షెడ్లు నిర్మించారు. పున్నమి ఘాట్ వీఐపీలకే పరిమితమైతే ఈ ఘాట్‌లో సాధారణ భక్తులు స్నానాలు చేసే అవకాశం ఉండేది. పుష్కరాల ప్రారంభ సమయానికి ఈ ఘాట్‌లోకి భక్తులను అనుమతించే అవకాశాలు కనిపించడం లేదు. -
హద్దురాళ్లు సరే.. మరి అభివృద్ధి?
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న నేలపాడు రైతులు ప్లాట్ల రిజిస్ట్రేషన్ వేగవంతం చేయాలని డిమాండ్ అభివృద్ధి పనులు చేయకుండా కేవలం పొలాల్లో రాళ్లుపాతి కాగితాలపై ప్లాట్లు ఇస్తే మాకు ఉపయోగం ఏమిటని నేలపాడు రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇదే క్రమంలో దొండపాడు గ్రామానికి చెందిన రైతులు చాలాకాలం నుంచి ఈనాం భూముల ప్యాకేజీ వ్యవహారం పెండింగ్‌లో ఉందని, అది తేల్చకుండా హడావిడిగా ప్లాట్లు పంపిణీ చేయవద్దని అంటున్నారు. తుళ్ళూరు: తుళ్లూరు సీఆర్డీఏ కార్యాలయం వద్ద జూన్ 25న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేలపాడు రైతులకు 1,418 ఎకరాలకు ప్లాట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. లాటరీ పద్ధతిలో కంప్యూటర్ ద్వారా 824 మంది రైతులకు ప్లాట్లు పంపిణీ చేశారు. ఎంపిక చేసిన రైతులకు 1,147 రెసిడెన్సియల్ ప్లాట్లను సీఎం లాటరీ ద్వారా పంపిణీ చేయగా, మంత్రులు పత్తిపాటిపుల్లారావు, నారాయణ 769 కమర్షియల్ ప్లాట్లకు లాటరీ తీశారు. ఇదే క్రమంలో మరో 55 మంది రైతులకు విల్లాలు కూడా లాటరీ ద్వారా తీసి పంపిణీ చేశారు. అయితే ల్యాండ్ పూలింగ్‌లో భూములు ఇచ్చిన రైతులకు ఐదు రకాలుగా అభివృద్ధి చేసి ప్రభుత్వం ప్లాట్లు ఇస్తుందని చెప్పిన విషయాన్ని రైతులు గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు కేవలం పొలాల్లో రాళ్లు మాత్రమే వేసిందని, ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండా కేవలం పేపర్లపై ప్లాట్లు ఇవ్వడం వల్ల రైతులను ఒరిగిందేమీ లేదని అంటున్నారు. భూములు అమ్ముకునేందుకు వీలు లేకుండా చేశారని, భూములకు ధరలు వచ్చే పరిస్థితి కూడా కనిపించడంలేదని రైతులు అంటున్నారు. తమ ప్లాట్లకు ధర రావాలంటే ముందుగా ప్రభుత్వం చెప్పినట్టు రహదారులు, తాగునీరు, విద్యుత్, గ్యాస్, డ్రెయినేజీ వంటి పనులు నిర్వహించాలని ఈసందర్భంగా రైతులు కోరుతున్నారు. ఇదేక్రమంలో రైతులకు ప్లాట్లు రిజిస్టర్ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పేపర్లపై కాకుండా క్షేత్రస్థాయిలో ప్లాట్ల పంపిణీ జరగాలని, ఈమేరకు సీఆర్డీఏ అధికారులు చర్యలు వేగవంతం చేయాలని నేలపాడు రైతులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా దొండపాడులో కూడా ప్లాట్లు పంపిణీ చేసేందుకు సీఆర్డీఏ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. 271.70 ఎకరాలు భూమి ఉండగా 260 మంది రైతులు 265.66 ఎకరాలకు 9.3 అనుమతి పత్రాలు అందజేశారు. వీరిలో 194 మంది రైతులకు 234.31 ఎకరాలకు 9.14 ఒప్పందపత్రాలు అందజేశారు. రైతులు మాత్రం ఈనాం భూములు వ్యవహారం, దాని ప్యాకేజీపై అధికారులు స్పష్టత ఇచ్చిన తర్వాత మాత్రమే అందరికీ ప్లాట్లు పంపిణీ చేయాలని కోరుతున్నట్టు చెబుతున్నారు. రైతుల మనోభావాలకు అనుగుణంగా సీఆర్డీఏ అధికారులు నడుచుకోవాలని దొండపాడు రైతులు కోరుతున్నారు.