తిరుమల తరహాలో దుర్గగుడి అభివృద్ధి
తిరుమల తరహాలో దుర్గగుడి అభివృద్ధి
Published Wed, Aug 10 2016 10:10 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM
విజయవాడ (ఇంద్రకీలాద్రి) :
తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోనే దుర్గగుడిని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్‌వీ ప్రసాద్ పేర్కొన్నారు. దేవాదాయ శాఖ పరిపాలనా భవనంలో బుధవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మహామండపాన్ని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. మహామండపంలో అందుబాటులో ఉన్నా.. కెనాల్ రోడ్డులో క్యూలైన్లు ఏర్పాటు చేయడంపై ప్రశ్నించగా, పుష్కరాల్లో రోజూ రెండు లక్షల మంది దుర్గమ్మ దర్శనానికి వచ్చే అవకాశం ఉందని, మహామండపంలోని క్యూ కాంప్లెక్స్ అందుకు తగినది కాదని సమాధానమిచ్చారు. మహామండపంలో అత్యాధునికమైన మరో రెండు లిప్టులను ఏర్పాటుచేస్తున్నామని చెప్పారు. దుర్గగుడి అభివృద్ధి, మాస్టర్ ప్లాన్‌లో భాగంగా తొలగించిన ఇళ్లకు రూ.30 కోట్ల డిపాజిట్లను తీశామని, మరో రూ.35 కోట్లను తీసేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించిందన్నారు.
Advertisement