దేవినేని ఉమకు షాకిచ్చిన జక్కంపూడి‌ గ్రామస్తులు‌.. | Jakkampudi And Shabad Villagers Fires On Devineni Uma | Sakshi
Sakshi News home page

తోకముడిచి జారుకున్న మాజీ మంత్రి దేవినేని

Published Tue, Nov 3 2020 3:19 PM | Last Updated on Tue, Nov 3 2020 4:59 PM

Jakkampudi And Shabad Villagers Fires On Devineni Uma - Sakshi

సాక్షి, విజయవాడ: మాజీ మంత్రి దేవినేని ఉమకు జక్కంపూడి - షాబాద్‌ గ్రామస్తులు షాకిచ్చారు. ఎప్పటిలానే మాజీ మంత్రి ఉమ తనదైన శైలిలో నలుగురిని వెంటేసుకొని గత ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేపట్టి అసంపూర్తిగా ఉన్న ఇళ్ల వద్ద ఆందోళనకు సిద్ధమయ్యారు. దీంతో గ్రామస్తులు అక్కడకు చేరుకొని మాజీ మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తుల ఎదురుతిరిగి ప్రశ్నించడంతో దేవినేని ఉమ, అతని అనుచరులు అక్కడ నుంచి మెల్లగా జారుకున్నారు.   (ఏబీ వెంకటేశ్వరరావు కేసులో కీలక పరిణామం)

ఈ సందర్భంగా గ్రామస్తులు.. మా పేదల దగ్గర నుండి భూములు తీసుకున్న మీరు మాకు ఇళ్లు ఇవ్వకుండా ఎక్కడో విజయవాడలో ఉండే వాళ్ళకు ఎందుకు ఇచ్చారు..?. మాకు న్యాయం చేస్తామని చెప్పి మాటిచ్చి భూములు తీసుకుని మమ్మల్ని మోసం చేశారంటూ స్థానికులు ఎదురుతిరగి ప్రశ్నించడంతో మాజీ మంత్రి అక్కడ నుండి తోకముడిచి పారిపోయారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement