బాధితుల ఆందోళన
సత్యనారాయణపురం : జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకం కింద నిర్మించిన ఇళ్లు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి ఓ వ్యక్తి పేదల నుంచి భారీగా డబ్బులు దండుకున్నాడు. ఒక్కొక్కరి వద్ద నుంచి ఇల్లు ఇప్పిస్తానని చెప్పి లక్ష రూపాయలు చొప్పున వసూలు చేసి పరారయ్యాడు. తాడేపల్లికి చెందిన షేక్ జిలాని జక్కంపూడిలో నిర్మించిన ఇళ్లు ఇప్పిస్తానని సుమారు వంద మంది వద్ద నగదు వసూలు చేసినట్లు తెలిసింది. ఆరు నెలలుగా అతను తప్పించుకొని తిరుగుతూ తాడేపల్లి నుంచి గుడివాడకు మకాం మార్చాడు. ఈనేపధ్యంలో గురువారం రాత్రి సుమారు 15 మంది బాధితులు సత్యనారాయణపురం పోలీస్టేషన్‌లో అతడిపై ఫిర్యాదు చేశారు. పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిసింది.
డబ్బులు ఇప్పించండి
పూర్ణానందంపేట: జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకంలో ఇళ్లు ఇప్పిస్తామంటు డబ్బులు వసూలు చేసిన జిలాని నుంచి తమ డబ్బులు తిరిగి ఇప్పించాలని బాధితులు డిమాండ్ చేశారు. మోసగించిన దళారులను రక్షించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిలానీని పోలీసులు అరెస్టు చేశారన్న విషయం తెలుసుకున్న బాధితులు పోలీస్‌స్టేషన్‌వద్దకు చేరుకుని తమ డబ్బులు ఇప్పించాలని ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు బాధితులు ఏప్రాంతంలో ఉంటారో అక్కడ ఫిర్యాదు చేయమనడంతో గురువారం రాత్రి పోలీస్ కమిషనరేట్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ పోలీసులు వారిని లోనికి అనుమతించకపోవడంతో తమకు న్యాయం చేయాలని కమిషనరేట్ వద్ద ఆందోళన చేశారు. పోలీసు అధికారులు వారికి నచ్చచెప్పి పంపించారు.
ఇళ్లు ఇప్పిస్తామని పరారీ
Published Fri, Oct 2 2015 1:02 AM | Last Updated on Sun, Sep 3 2017 10:18 AM
Advertisement
Advertisement