ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరంలో హైదరాబాద్‌కు చెందిన ఒక మహిళ, ఆమె కుమారుడు అనుమానాస్పదంగా మృతి చెందారు.
హైదరాబాద్: ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో హైదరాబాద్‌కు చెందిన ఒక మహిళ, ఆమె కుమారుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. హైదరాబాద్‌కు చెందిన సుప్రజకు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన వ్యక్తితో 2006లో వివాహమైంది. ఏడాది క్రితం సుప్రజ ఆస్ట్రేలియా వెళ్లింది.
దంపతులు ఇద్దరూ అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. వీరికి ఒక కుమారుడు (ఆరు నెలలు) ఉన్నాడు. రెండు రోజుల క్రితం సుప్రజ, ఆమె కుమారుడు మృతి చెందారు. ఆమె మృతిపై కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.