
తమకు నచ్చిన ప్రముఖులను అనుకరిస్తూ సొంతంగా వీడియోలను తయారు చేయటాన్ని ‘డబ్‌స్మాష్ ’అంటారు. ఇప్పుడు ఆ పేరుతో ఓ సినిమా రూపొందింది. ఈ సినిమా కోసం తెలుగు చిత్ర పరిశ్రమలోని లెజెండ్స్‌పై తీసిన పాటను సినీ నిర్మాతలు రాజ్ కందుకూరి, దామోదర ప్రసాద్, రామ సత్యనారాయణలు విడుదల చేశారు. చిత్రనిర్మాత ఓంకార లక్ష్మీ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో మా అన్నయ్య నటించినందుకు హ్యాపీగా ఉంది. ‘హ్యాపీడేస్’ తరహాలో ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు.‘‘తెలుగు సినిమా లెజెండ్స్‌పై మా సినిమాలో పాట ఉండటం అదృష్టంగా భావిస్తున్నాను.’’ అన్నారు దర్శకుడు కేశవ్ దేవర్. ‘‘ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాను’’ అన్నారు పవన్. ‘‘మా చిత్రం విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు హీరోయిన్ సుప్రజ.
Comments
Please login to add a commentAdd a comment