ఎంపీటీసీ భర్తను నాటు తుపాకీతో బెదిరించిన పరిటాల వర్గీయుడు
దేహశుద్ధి చేసిన గ్రామస్తులు
సాక్షి టాస్క్‌ఫోర్స్: ‘మేము అధికారంలో ఉన్నాం.. మేం ఏం చెప్పినా జరుగుతుంది’ అంటూ శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండల టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అండ చూసుకుని రోజూ మండలంలోని ఏదో ఒక గ్రామంలో అలజడి సృష్టిస్తున్నారు.
మంగళవారం కుంటిమద్ది ఎంపీటీసీ సభ్యురాలు ఉమాదేవి భర్త కేశవను పరిటాల అనుచరుడు గంగాధర్ నాటు తుపాకీ, కత్తితో బెదిరించాడు. తమకు అడ్డొస్తే చంపేస్తామంటూ వీరంగం సృష్టించాడు. అతని తీరుతో విసుగు చెందిన గ్రామస్తులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఇతను గతంలోనూ పెనుకొండ, ధర్మవరం తదితర ప్రాంతాల్లో బెదిరింపులకు పాల్పడిన ఘటనలు ఉన్నాయి.
ఆధిపత్యం కోసం అలజడులు
స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలోని తొమ్మిది పంచాయతీలకు గాను ఏడుచోట్ల వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు సర్పంచులుగా ఎన్నికయ్యారు. తొమ్మిది ఎంపీటీసీ స్థానాలనూ వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది.
దీన్ని జీరి్ణంచుకోలేని పరిటాల కుటుంబం సొంత మండలంలో ఆధిపత్యం కోసం గ్రామాల్లో గొడవలకు ఆజ్యం పోస్తోంది. ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామమైన కుంటిమద్దిలో అలజడి సృష్టించే క్రమంలోనే పరిటాల అనుచరుడు గంగాధర్ ఎంపీటీసీ భర్తను తుపాకీతో బెదిరించాడని స్థానికులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment