
సాక్షి, సిటీబ్యూరో: మల్లారెడ్డి మహిళా కళాశాల వేదికగా ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సింగర్లు సందడి చేశారు. ఈ నెల ఫ్రెండ్‌షిప్ డే నేపథ్యంలో బుధవారం నిర్వహించిన వేడుకల్లో యువగాయకులు తమ స్వరాలతో అలరించారు. ధూమ్ ధామ్ దోస్తాన్ విత్ యువర్ ఐడల్స్ పేరుతో జరిగిన ఈ కార్యక్రమంలో సింగర్లు అనిరుధ్, కేశవ్, కీర్తన–కీర్తి, నజీర్ పాటలతో ఆకట్టుకున్నారు. మ్యూజిక్ కన్సర్ట్‌ను తలపించిన ఈ కార్యక్రమం ఫ్రెండ్‌షిప్ బ్యాండ్‌లు, ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సింగర్లతో సెల్ఫీలతో ఆహ్లాదంగా సాగింది.
Comments
Please login to add a commentAdd a comment