నచ్చింది... అందుకే ముందుకొచ్చా | Dil Raju presents Yakub Ali's Vellipomake | Sakshi
Sakshi News home page

నచ్చింది... అందుకే ముందుకొచ్చా

Published Mon, Oct 3 2016 12:54 AM | Last Updated on Mon, Sep 4 2017 3:55 PM

నచ్చింది... అందుకే ముందుకొచ్చా

నచ్చింది... అందుకే ముందుకొచ్చా

ఒక అబ్బాయి.. ఇద్దరు అమ్మాయిల మధ్య జరిగే ఫీల్ గుడ్ ప్రేమకథా చిత్రం ‘వెళ్లిపోమాకే’. యాకూబ్ అలీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ‘‘పెద్ద చిత్రాల్లో ‘బాహుబలి’, చిన్న చిత్రాల్లో ‘పెళ్లి చూపులు’ ఘన విజయం సాధించి తెలుగు సినిమా గమనం మారుతోందని నిరూపించాయి.  ఫీల్‌గుడ్ ప్రేమ కథను దర్శకుడు చక్కగా తెరకెక్కించాడు. నటీనటులు కొత్తవారైనా అనుభవం ఉన్నవారిలా నటించారు. ఈ చిత్రం నాకు నచ్చడంతో మరింత మంది ప్రేక్షకులకు దగ్గరయ్యేలా తీసుకెళ్లాలని మా బ్యానర్‌లో విడుదల చేస్తున్నా.
 
  హీరో విశ్వక్ సేన్ నటన బాగుంది. కొత్త టీమ్ కలిసి సరికొత్తగా చేసిన ప్రయత్నమిది. మంచి కథతో వస్తున్న ఇలాంటి వారిని ప్రోత్సహిస్తే ఈ తరహా చిత్రాలు మరిన్ని వస్తాయి’’ అని పేర్కొన్నారు. ‘‘రెండున్నరేళ్ల కిందట ప్రారంభించిన ఈ సినిమా ఇప్పటికి పూర్తయింది. యువతరంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది. మా చిత్రం నచ్చి, విడుదల చేసేందుకు ‘దిల్’ రాజుగారు ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు. హీరో విశ్వక్  సేన్, సంగీత దర్శకుడు ప్రశాంత్ విహారి తదితర చిత్రబృందం పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement