తల్లిదండ్రులు ఇద్దరూ ఉన్నత స్థానాల్లో ఉన్నారు.. కొడుకు ఇంజినీరింగ్ చదువుతున్నాడు.. కూతురును కూడా అలాగే ఉన్నత చదువు చదవాలంటూ బలవంతం పెట్టారు. తల్లిదండ్రుల మాట కాదనలేక రెండుసార్లు అందుకోసం ప్రయత్నించి విఫలమైంది. ఆ తరువాత కూడా తనకు ఇష్టంలేని చదువులోనే జాయిన్ అయింది. తనకు ఉన్న జ్ఞానం కంటే ఎక్కువ చదవలేనంటూ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన విశాఖలో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. కేశబోయిన శోభనాద్రి వాణిజ్యపన్నుల శాఖలో సహాయ కమిషనర్, భార్య ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిలో వైద్యురాలు. వారి కూతురు శ్వేత(19) బీఏ చదవాలని అనుకుంది. కానీ, తల్లిదండ్రులు మాత్రం ఆమెను ఐఐటీ చదవించాలని ఆశించారు. వారి కోరిక మేరకు శ్వేత రెండుసార్లు ఐఐటీ జేఈఈ ఎంట్రన్స్ రాసినా ఎంపిక కాలేదు. దీంతో ఒత్తిడికి గురై మానసికంగా కుంగిపోయింది.కుమార్తె స్థితిని గమనించి శోభనాద్రి ఆమెకు హైదరాబాద్‌లో ఓ సైకాలజిస్ట్ వద్ద రెండేళ్లపాటు చికిత్స అందించారు. ఆ తరువాత కూడా కూతురు కోరిక మేరకు బీఏలో కాకుండా విశాఖలోని ఒక కళాశాలలో బ్యాచ్‌లర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్(బీబీఎం)లో జాయిన్ చేశారు. ప్రస్తుతం బీబీఎం ఫస్ట్‌ఇయర్ చదువుతోంది. శనివారం అమ్మమ్మ పక్కన పడుకున్న శ్వేత.. అర్ధరాత్రి లేచి సూసైడ్ నోట్‌రాసింది. తర్వాత సోదరుడు పడుకున్న గది నుంచి బాల్కనీలోకి వచ్చి అక్కడ నుంచి కిందికి దూకింది. శబ్దానికి మేల్కొన్న వాచ్‌మెన్ వెంటనే శోభనాద్రికి తెలిపారు. అప్పటికే ఆమె మృతిచెందింది. మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Published Mon, Jan 20 2014 6:43 PM | Last Updated on Wed, Mar 20 2024 5:15 PM
Advertisement
Advertisement
Advertisement