
సాక్షి, సిటీబ్యూరో: ఎన్నికల బదిలీలు జోరందుకున్నాయి. వీటి ప్రభావం రాజధానిలోని మూడు కమిషనరేట్ల పరిధిలో భారీగానే ఉంది. గడిచిన మూడు రోజుల్లో జారీ అయిన ఉత్తర్వుల ప్రకారం పలువురు ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైల బదిలీలు, పదోన్నతులు చోటు చేసుకున్నాయి. ఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్నతాధికారులు వీటిని చేపడుతున్నారు. ఈ అంతర్ కమిషనరేట్ బదిలీలకు అనుబంధంగా కొన్ని అంతర్గత బదిలీలు చేయాల్సి ఉండటంతో ఆయా కమిషనర్లు కసరత్తు ముమ్మరం చేశారు. ఒకటిరెండు రోజుల్లో దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నాయి.
♦ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన 16 డీఎస్పీ (ఏసీపీ) బదిలీల్లో మూడు కమిషనరేట్లకు చెందిన పోస్టులు ఐదు ఉన్నాయి. ఇక్కడి వారు ఇద్దరు బయటకు వెళ్తుండగా... బయట నుంచి ఇద్దరు వస్తున్నారు. ఓ అధికారి మాత్రం సైబరాబాద్ నుంచి రాచకొండకు మారుతున్నారు.
♦ మలక్‌పేట ఏసీపీ కె.నర్సింగ్‌రావు కాగజ్‌నగర్‌కు వెళ్తుండగా నిజామాబాద్ ఏసీపీ ఎం.సుదర్శన్ మలక్‌పేటకు వస్తున్నారు. ట్రాన్స్‌కోలో ఉన్న ఎం.చంద్రశేఖర్ కూకట్‌పల్లి ట్రాఫిక్‌కు, సైబరాబాద్‌లో ఉన్న పి.శ్రీనివాసులు ఎల్బీనగర్ ట్రాఫిక్‌కు బదిలీ అయ్యారు. నగరంలో ఉన్న ఎస్.మహేశ్వర్ దేవరకొండ డీఎస్పీగా వెళ్తున్నారు.
భారీగా ఇన్‌స్పెక్టర్ల బదిలీ
రాజధానిలోని మూడు కమిషనరేట్లలో భారీగా ఇన్‌స్పెక్టర్ల ‘మార్పిడి’ జరిగింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండల్లో పని చేస్తూ ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువు ముగిసిన అధికారుల్ని ఆయా కమిషనరేట్ల నుంచి బయటకు పంపించారు. కొత్తగా మరికొందరికి అక్కడకు బదిలీ చేశారు. ఈ మేరకు వెస్ట్‌జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. ఇలా బదిలీ అయిన వారిలో అనేక మంది స్టేషన్ హౌస్ ఆఫీసర్లు (ఎస్‌హెచ్‌ఓ) సైతం ఉన్నారు. ఆయా కమిషనరేట్లకు వచ్చిన వారికి పోస్టింగ్స్ ఇవ్వాల్సి ఉంది. దీంతో అధికారులు అందుకు సంబంధించిన కసరత్తులు ప్రారంభించారు. జోన్ పరిథిలో మొత్తం 82 మంది బదిలీలు జరిగాయి. ఈ నేపథ్యంలో సిటీ నుంచి 17 మంది బయటకు వెళ్తుండగా కొత్తగా 42 మంది వస్తున్నారు. అలానే సైబరాబాద్ నుంచి 21 మంది వెళ్తుండగా 20 మంది వస్తున్నారు. రాచకొండలో ఈ సంఖ్యలు 9, 3గా ఉన్నాయి. ఇటీవల పలువురు 1995 బ్యాచ్ ఇన్‌స్పెక్టర్లకు ఏసీపీలు పదోన్నతులు వచ్చాయి. దీనికి కొనసాగింపుగా 2009 బ్యాచ్‌కు చెందిన 53 మంది సబ్–ఇన్‌స్పెక్టర్లకు (ఎస్సై) ఇన్‌స్పెక్టర్లుగా పదోన్నతులు ఇచ్చారు. వీరిలో సిటీకి చెందిన వారు 21 మంది, సైబరాబాద్‌కు చెందిన వారు తొమ్మిది మంది, రాచకొండకు చెందిన వారు ఆరుగురు ఉన్నారు. వీరికీ త్వరలో పోస్టింగ్స్ ఇవ్వనున్నారు.
ఇన్‌స్పెక్టర్ల బదిలీల్లో కీలకమైనవి:షాహినాయత్‌గంజ్–ఎం.రవీందర్‌రెడ్డి, సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్–కె.మధుమోహన్‌రెడ్డి, మార్కెట్–ఎం.మట్టయ్య, కార్ఖానా–బి.జానయ్య, ఫలక్‌నుమ–పి.యాదగిరి, శాలిబండ–ఎన్.లింగయ్య, కంచన్‌బాగ్–ఎన్.శంకర్, గాంధీనగర్–ఆర్.శ్రీనివాస్, మాదన్నపేట్–డి.నగేష్, లంగర్‌హౌస్–సి.అంజయ్య, సుల్తాన్‌బజార్–పి.శివశంకర్‌రావు, చందానగర్–ఎన్.తిరుపతిరావు, బాచుపల్లి–కె.బాలకృష్ణారెడ్డి, మేడ్చెల్–ఎస్.వెంకట్‌రెడ్డి, శామీర్‌పేట్– డి.భాస్కర్‌రెడ్డి, అల్వాల్–వి.శ్రీకాంత్‌గౌడ్, మాదాపూర్–ఎన్.కళింగ్‌రావు, మియాపూర్–సీహెచ్ హరిచంద్రారెడ్డి, జీడిమెట్ల సీహెచ్ శంకర్‌రెడ్డి, బాలానగర్ ఎస్‌ఓటీ–పి.శంకర్‌యాదవ్.
♦ వీరితో పాటు అనేక మంది ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్లు సైతం ఉన్నారు. ఈ స్థానాల్లో కొత్త అధికారుల్ని నియమించాల్సి ఉంది.
పదోన్నతి పొందిన ఎస్సైలు:
♦ సిటీలో పని చేస్తున్న జి.వెంకట్‌రెడ్డి, డి.కృష్ణమోహన్, బి.జగదీశ్వర్‌రావు, జి.జగన్నాథ్, జి.రాజేందర్‌గౌడ్, ఎం.మహేందర్‌రెడ్డి, కె.రవీందర్, కె.సత్యనారాయణ, కె.కృష్ణప్రసాద్, కె.శ్రీనివాస్‌రావు, ఎస్.రామన్, డి.ప్రశాంత్, బి.వెంకటేశం, మహ్మద్ షకీర్ అలీ, జి.వెంటకరామిరెడ్డి, ఎస్.రవికుమార్, జె.నిరంజన్‌రావు, జి.వీరాస్వామి, ఎన్.సురేష్, పీవీఆర్ ప్రసాదరావు, ఎస్.హరికృష్ణ గౌడ్.
♦ సైబరాబాద్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఎస్.వెంకన్న, కె.చంద్రశేఖర్‌రెడ్డి, కె.నాగయ్య, ఎన్.శ్రీధర్‌రెడ్డి, శివకుమార్, ఎం.వెంకటేశం, ఎం.వేణుకుమార్, సి.గంగాధర్.
♦ రాచకొండకు చెందిన బి.నర్సయ్య, పి.రాజశేఖర్, హెచ్.ప్రభాకర్, ఎస్.సుధీర్‌కృష్ణ, జి.నాగరాజు, ఎస్.లక్ష్మణ్.
Comments
Please login to add a commentAdd a comment