హైదరాబాద్ పోలీస్ కమీషనరేట్ ముందు ఓ వ్యక్తి బుధవారం ఆత్మాహుతి యత్నానికి పాల్పడ్డాడు.
హైదరాబాద్: పోలీస్ కమీషనరేట్ ముందు ఓ వ్యక్తి బుధవారం ఆత్మాహుతికి ప్రయత్నించాడు. భూమి విషయంలో గోషామహల్ ఏసీపీ రాం భూపాల్ తనను బెదిరిస్తున్నారంటూ ఈ పనికి యత్నించాడు.
వివరాల్లోకి వెళ్తే.. షాహినాథ్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తన స్థలం వివాదం విషయంలో రూ.2 లక్షలు లంచం ఇవ్వాలని గోషామహల్ ఏసీపీ రామ్‌భూపాల్ డిమాండ్ చేశారని రాజ్ కుమార్ అనే వ్యక్తి ఆరోపించాడు. లంచం ఇవ్వకపోవడంతో ఏసీపీ తన స్థలంలోని షెడ్‌ను ఖాళీ చేయించారని, కూల్చివేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకున్నాడు. ఈ లోపు కమీషనరేట్ ముందున్న భద్రతా సిబ్బంది రాజ్‌కుమార్ యత్నాన్ని అడ్డుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు.