అడ్వకేట్ జనరల్‌తో మాట్లాడుతున్న వైద్యులు
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ కమిషనరేట్ పునర్ విభజన నేపథ్యంలో కొత్తగా రెండు జోన్లు వస్తున్న విషయం విదితమే. వీటితో పాటు డివిజన్లు, ఠాణాలు అధికారికంగా ప్రారంభం కావాల్సి ఉంది. ఇప్పటికే సౌత్ వెస్ట్ జోన్‌కు ఖారె కిరణ్ ప్రభాకర్, సౌత్ ఈస్ట్ జోన్‌కు చెన్నూరి రూపేష్‌లను డీసీపీలుగా నియమించారు. వీరికి పీఏలను సైతం కేటాయిస్తూ కొత్వాల్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. సౌత్ ఈస్ట్ డీసీపీకి మీర్జా ఇమ్రాన్ ఖాన్, సౌత్ వెస్ట్ డీసీపీకి టి.వినీత్ కుమార్ పీఏలుగా నియమితులయ్యారు. సౌత్ జోన్‌లో పని చేస్తున్న కె.అనిల్ రెడ్డిని సెంట్రల్ జోన్ డీసీపీ పీఏగా బదిలీ చేస్తూ మంగళవారమే ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ పీఏలు గురువారం బాధ్యతలు స్వీకరించారు.
ముగిసిన ప్రీబిడ్ సమావేశాలు
సాక్షి, సిటీబ్యూరో: ఈ నెల 21 నుంచి వరుసగా మూడు రోజుల పాటు జరిగిన ప్రీ బిడ్ సమావేశాలు గురువారం ముగిశాయి. మేడ్చల్– మల్కాజిగిరి జిల్లాలోని 5 ల్యాండ్ పార్సిల్స్‌పై ఉప్పల్ సర్కిల్ కార్యాలయంలో గురువారం ప్రీబిడ్ మీటింగ్ జరిగింది. హెచ్‌ఎండీఏ చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గంగాధర్, మేడిపల్లి తహసీల్దార్ మహిపాల్ రెడ్డి, హెచ్‌ఎండీఏ డీఏవో శోభారాణి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రామారావు, ఎమ్మెస్‌టీసీ ప్రతినిధులు పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లాలో 10, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 5, సంగారెడ్డి జిల్లాలో 23 ల్యాండ్ పార్సిల్స్ కొనుగోలుదారులు కోసం సిద్ధంగా ఉన్నాయి. గండిపేట మండలంలో 3, శేరిలింగంల్లి 5, ఇబ్రహీంపట్నం మండలంలో 2 చొప్పున అమ్మకానికి ఉన్నాయి. మేడిపల్లి 4, ఘట్‌కేసర్ 1, అమీన్‌పూర్ 16, ఆర్‌సీపురం 6, జిన్నారం మండలంలో 1 చొప్పున విక్రయించనున్నారు. మార్చి 1న ఈ మొత్తం 38 ల్యాండ్ పార్సిల్స్‌ను ఎమ్మెస్‌టీసీ ఆధ్వర్యంలో ఆన్‌లైన్ వేలం ద్వారా విక్రయించేందుకు హెచ్‌ఎండీఏ సన్నాహాలు చేపట్టింది.
ఉస్మానియాలో హైకోర్టు అడ్వకేట్ జనరల్‌కు వైద్య పరీక్షలు
అఫ్జల్‌గంజ్: రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ గురువారం ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆయనకు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్, ఆర్‌ఎంఓ–1 డాక్టర్ శేషాద్రిలు రక్త, జనరల్ పరీక్షలు చేయించారు. ఆస్పత్రిలో పేద రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, శస్త్ర చికిత్సలు అవయవ మార్పిడి శస్త్ర చికిత్సల గురించి ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ ఆయనకు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment