
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయం దాదాపు 44 ఏళ్ల తర్వాత మారనుంది. గురువారం కొత్త కార్యాలయం నుంచి తన కార్యకలాపాలను ప్రారంభించనుంది. ఇప్పటివరకు ఉన్న ఐటీఓ మార్గ్ నుంచి సెంట్రల్ ఢిల్లీలోని జైసింగ్ మార్గ్‌లోని 17 అంతస్థుల భవనంలోకి అక్టోబరు 31న అడుగుపెట్టనుంది. 1912లో బ్రిటిష్ పాలనా కాలంలో కశ్మీర్ గేట్ వద్ద ప్రధాన కార్యాలయం ఉండేది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దాన్ని అక్కడినుంచి మార్చి 1970లో ప్రస్తుతమున్న ఐటీఓ మార్గ్‌లోని పిడబ్ల్యూడి భవనానికి మార్చారు. అప్పుడు ఐజీ ర్యాంకు అధికారి అధిపతిగా ఉండేవారు. అనంతరం 1976లో మొదటిసారిగా కమిషనరేట్ ఏర్పాటు చేసి, జైనారాయణ్ చతుర్వేదిని మొదటి కమిషనర్‌గా నియమించారు.