Shifted
-
Darshan: బెంగళూరు జైలే బెటరు
సాక్షి బెంగళూరు: రేణుకాస్వామి హత్య కేసులో బళ్లారి సెంట్రల్ జైలులో ఉన్న కన్నడ స్టార్ నటుడు దర్శన్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ ఇంకా కోర్టు విచారణలోనే ఉంది. అయితే అంతలోనే ఎలాగైనా బెంగళూరుకు తిరిగి వచ్చేయాలని దర్శన్ పట్టుబడుతున్నాడు. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న దర్శన్.. ఆ కారణం చూపి బళ్లారి జైలు నుంచి బెంగళూరుకు రావాలనుకుంటున్నాడు. అక్కడ కటకట బెంగళూరు పరప్పన జైలు నుంచి దర్శన్‌ను బళ్లారి కేంద్ర కారాగారానికి తరలించిన విషయం తెలిసిందే. బళ్లారి జైలులో గడ్డు పరిస్థితి ఉన్నట్లు తెలిసింది. బెంగళూరు జైలులో ఇతర ఖైదీలతో మాట్లాడేవాడు.. కానీ బళ్లారి జైలులో మాట్లాడేందుకు కూడా ఎవరూ లేరు. సౌకర్యాల లేమి పీడిస్తోంది. ఇదే సమయంలో ఆయనకు ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువయ్యాయి. బళ్లారిలోని వైద్యులు స్కానింగ్ చేయించుకోవాలని సూచించారు. అయితే తాను బెంగళూరులోనే చేయించుకుంటానని పట్టుబట్టాడు. ఇప్పటికీ బెయిలు రాకపోతే బళ్లారి జైలులో ఉండలేనని, అందుకే బెంగళూరుకు తరలి వెళ్లాలని దర్శన్ మొండికేసినట్లు తెలిసింది. దర్శన్‌కు అదనపు వసతులపై సోమవారం ఆయన న్యాయవాదులు కోర్టులో పిటిషన్ వేసే అవకాశముంది. -
విగ్రహాలకు స్థానచలనం
న్యూఢిల్లీ: నూతన పార్లమెంట్ ప్రాంగణంలో చూడగానే ఎదురుగా కనిపించే మహాత్మా గాంధీజీ, బీఆర్ అంబేడ్కర్, ఛత్రపతి శివాజీ మహరాజ్, జ్యోతిబా ఫూలే సహా పలువురు దేశ ప్రముఖుల విగ్రహాలను ప్రభుత్వం వేరే చోటుకు తరలించింది. ఉన్న చోటు నుంచి పాత పార్లమెంట్(సంవిధాన్ సదన్)లోని ఐదో నంబర్ గేట్ దగ్గరి లాన్ వద్దకు మార్చింది. ఈ లాన్లో ఇప్పటికే గిరిజన యోధుడు బిర్సా ముండా, మహారాణాప్రతాప్‌ల విగ్రహాలు ఉన్నాయి. విగ్రహాల తరలింపుపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘మహాత్ముడు, అంబేడ్కర్, ఛత్రపతి శివాజీ విగ్రహాలను ఉద్దేశపూర్వకంగా అప్రాధాన్య చోట్లో ప్రతిష్టించడం అరాచకం’అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘ సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్ర ఓటర్లు బీజేపీని తిరస్కరించారు. అందుకే మహారాష్ట్రతో అనుబంధమున్న ఛత్రపతి శివాజీ, అంబేడ్కర్ల విగ్రహాలను వేరే చోటుకు మార్చేశారు. గుజరాత్లో బీజేపీ ఈసారి క్లీన్‌స్వీప్ చేయలేకపోయింది. అందుకే గుజరాతీలపై ఆగ్రహంతో గాం«దీజీ విగ్రహాన్నీ తరలించారు’ అని మరో నేత పవన్ ఖేడా వ్యాఖ్యానించారు. ‘మహానుభావుల విగ్రహాలు తొలగించి గాడ్సే, మోదీ విగ్రహాలు పెడతారా?’ అని టీఎంసీ ఎంపీ జవహర్ సర్కార్ ప్రశ్నించారు. విమర్శలపై లోక్‌సభ సచివాలయం స్పందించింది. పార్లమెంట్‌కు విచ్చేసే సందర్శకులు చూసేందుకు అనువుగా ‘ప్రేరణ స్థల్’కు విగ్రహాలను తరలించామని పేర్కొంది. ఏ విగ్రహాన్ని పక్కనపడేయలేదని స్పష్టంచేసింది. -
స్వగ్రామానికి సత్యవేణి మృతదేహం
గచ్చిబౌలి: గచ్చిబౌలి పరిధిలోని బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ పై నుంచి శనివారం కారు పడిన ప్రమాదంలో మృతిచెందిన పసల సత్యవేణి(57) మృతదేహన్ని పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు గ్రామానికి తరలించారు. సత్యవేణి భర్త సోమశేఖర్ రావు మాదాపూర్‌లోని ఓ రెస్టారెంట్లో అకౌంటెంట్‌గా పని చేస్తున్నారు. పెద్ద కుమార్తె నాగ ప్రణీత ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేసి 4 రోజుల క్రితమే ఉద్యోగానికి రాజీనామా చేసి మరో ఉద్యోగం కోసం వేచి చూస్తోంది. చిన్న కూతురు వాణి నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తోంది. కూతుళ్ల కోసమే సత్యవేణి, సోమశేఖర్ రావు హైదరాబాద్‌కు వచ్చి పుప్పాలగూడలోని శ్రీరాంనగర్‌లో నివాసం ఉంటున్నారు. కాగా, ఫ్లైఓవర్ ఘటనలో కృష్ణమిలాన్ రావుకు ఓవర్ స్పీడ్‌కు రూ.వెయ్యి చలానా విధించారు. -
రాజధానిలో మారనున్న పోలీసు ప్రధాన కార్యాలయం
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయం దాదాపు 44 ఏళ్ల తర్వాత మారనుంది. గురువారం కొత్త కార్యాలయం నుంచి తన కార్యకలాపాలను ప్రారంభించనుంది. ఇప్పటివరకు ఉన్న ఐటీఓ మార్గ్ నుంచి సెంట్రల్ ఢిల్లీలోని జైసింగ్ మార్గ్‌లోని 17 అంతస్థుల భవనంలోకి అక్టోబరు 31న అడుగుపెట్టనుంది. 1912లో బ్రిటిష్ పాలనా కాలంలో కశ్మీర్ గేట్ వద్ద ప్రధాన కార్యాలయం ఉండేది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దాన్ని అక్కడినుంచి మార్చి 1970లో ప్రస్తుతమున్న ఐటీఓ మార్గ్‌లోని పిడబ్ల్యూడి భవనానికి మార్చారు. అప్పుడు ఐజీ ర్యాంకు అధికారి అధిపతిగా ఉండేవారు. అనంతరం 1976లో మొదటిసారిగా కమిషనరేట్ ఏర్పాటు చేసి, జైనారాయణ్ చతుర్వేదిని మొదటి కమిషనర్‌గా నియమించారు. -
చర్లపల్లి జైలుకు ఉగ్రవాదులు
కుషాయిగూడ: నగరంలో పట్టుబడ్డ ఉగ్రవాదులను గురువారం రాత్రి చర్లపల్లి జైల్‌కు తీసుకువచ్చారు. వారిలో అబ్దుల్లా బిన్ అహ్మద్ అల్ అమోదీ, మహ్మద్ ఇబ్రహిం యజ్దాని, హబీబ్ మహ్మద్, మహ్మద్ ఇలియాస్ యజ్దాని, ముజాఫర్ హుస్సేన్ రిజ్వాన్ అనే ఐదుగురు ఉగ్రవాదులు ఉన్నట్లు జైల్ పర్యవేక్షణాధికారి కొలను వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యా వారికి కేటాయించిన ఖైదీ నెంబర్లు, బ్యారక్ల వివరాలను చెప్పలేమని ఆయన పేర్కొన్నారు. -
'చంచల్‌గూడ జైలు, రేస్ కోర్స్ తరలించండి'
-
నెల రోజులకు స్వగ్రామానికి మృతదేహం
కరీంనగర్: బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లి అక్కడ గుండెపోటుతో మరణించిన యువకుడి మృతదేహం దాదాపు నెలరోజులకు స్వగ్రామానికి చేరుకుంది. కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలం బావుసాయిపేటకు చెందిన కర్నాల రాజు(30) సంవత్సరం క్రితం దుబాయ్ వెళ్లాడు. అక్కడ పని చేస్తుండగా హఠాత్తుగా గుండెపోటు వచ్చి మరణించాడు. ఆయన మృతదేహాం కోసం కుటుంబసభ్యులు నెల రోజులుగా ఎదురుచూస్తున్నారు. రాజు మృతదేహం శుక్రవారం ఇంటికి చేరుకోవడంతో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా మృతదేహం స్వగ్రామానికి చేరుకోవడానికి ఇన్ని రోజులు పట్టిందని తెలుస్తుంది. -
ప్రత్యేక విమానంలో నవీద్ తరలింపు!
ఢిల్లీ: పాకిస్థాన్ ఉగ్రవాది మహమ్మద్ నవేద్ యాకూబ్ ను గురువారం ఢిల్లీకి తరలించనున్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు అతడ్ని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ లో ఉధంపూర్ లో బీఎస్ఎఫ్ జవాన్లను లక్ష్యంగా చేసుకుని దాడి జరిపి ప్రాణాలతో పట్టుబడిన నవేద్ యాకూబ్ ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు పట్టుకున్నారు. అనంతరం ఎన్ ఐఏ కోర్టు అతడికి14 రోజులు కస్టడీకి అనుమతినిచ్చింది. ఉధంపూర్ లో ఉగ్రవాది నవీద్ ను స్థానికులు అత్యంత సాహసోపేతంగా వ్యవహరించి . భారత సైన్యానికి పట్టిచ్చారు. మరో ఉగ్రవాది ఎన్ కౌంటర్ లో చనిపోయాడు. ఇప్పటివరకు 11మందిని అరెస్టు చేసిన పోలీసులు వారినుంచి కీలక సమాచారాన్ని రాబట్టారు. అయితే ముఖ్యంగా భారత్‌లోకి ఎలా ప్రవేశించారన్న దానిపై ఆరాతీశారు. నవేద్ యకూబ్ పై అక్రమ కార్యకలాపాల నిరోధక చట్టం, ఆయుధ చట్టం, పలు సెక్షన్ల కింద నవీద్‌పై కేసులు నమోదయ్యాయి. అయితే పట్టుబడిన నవెద్ కు 12 మంది ఉగ్రవాదులతో లింకులు ఉన్నాయని ఇప్పటికే అధికారులు గుర్తించారు. తమ విచారణలో నవీద్ చెప్పే మాటల్లో, చేసే ప్రకటనల్లో స్పష్టత లేదని, కొత్త కథనాలను తెరపైకి తెస్తున్నాడని అధికారులు చెబుతున్నారు. -
వారంలోగా ఉస్మానియా ఖాళీ
-
ఆ భూకంపం ఎవరెస్టును జరిపేసింది
బీజింగ్: నేపాల్ వచ్చిన భూకంపం మాములు భూకంపం కాదని ఇప్పటికే అర్థమైనా అది ఎంత శక్తిమంతమైనదో ఈ విషయం తెలిస్తే ఇట్టే బోధపడుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద పర్వత శిఖరం మౌంట్ ఎవరెస్టును నేపాల్ భూకంపం ఏకంగా 1.2 సెంటీమీటర్లు జరిపినట్లు చైనాకు చెందిన ఓ సంస్థ వెల్లడించింది. గత ఏప్రిల్ 28న నేపాల్ 7.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. దీని కారణంగా దాదాపు పదివేలమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ భూకంపం సంభవించిన తర్వాత మౌంట్ ఎవరెస్టులో వచ్చిన మార్పులపై చైనాలోని జియోలాజికల్ సంస్థ అధ్యయనం చేసింది. ఈ అధ్యయనంలో ఎవరెస్టు.. నైరుతి దిక్కుకు 1.2 సెంటీ మీటర్లు జరిగినట్లు తెలిసిందని పేర్కొంది.