
నెల రోజులకు స్వగ్రామానికి మృతదేహం
కరీంనగర్: బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లి అక్కడ గుండెపోటుతో మరణించిన యువకుడి మృతదేహం దాదాపు నెలరోజులకు స్వగ్రామానికి చేరుకుంది. కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలం బావుసాయిపేటకు చెందిన కర్నాల రాజు(30) సంవత్సరం క్రితం దుబాయ్ వెళ్లాడు.
అక్కడ పని చేస్తుండగా హఠాత్తుగా గుండెపోటు వచ్చి మరణించాడు. ఆయన మృతదేహాం కోసం కుటుంబసభ్యులు నెల రోజులుగా ఎదురుచూస్తున్నారు. రాజు మృతదేహం శుక్రవారం ఇంటికి చేరుకోవడంతో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా మృతదేహం స్వగ్రామానికి చేరుకోవడానికి ఇన్ని రోజులు పట్టిందని తెలుస్తుంది.