one month
-
Bharat Jodo Yatra: కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో... నెలకో పాదయాత్ర
నూహ్ (హరియాణా): ‘‘కాంగ్రెస్, బీజేపీ మధ్య జరుగుతున్న పోరాటం కొత్తదేమీ కాదు. రెండు భిన్న భావజాలాల మధ్య వేలాది ఏళ్లుగా జరుగుతూ వస్తున్నదే. ప్రజల గొంతుకగా నిలవడమే కాంగ్రెస్ సిద్ధాంతం. కొద్దిమంది పెద్దలకు మాత్రమే సర్వం దోచిపెట్టడం బీజేపీ సిద్ధాంతం’’ అని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ అన్నారు. ఆయన భారత్ జోడో యాత్ర బుధవారం రాజస్తాన్ నుంచి హరియాణాలోకి ప్రవేశించింది. పలువురు మాజీ సైనికులు తదితరులు ఆయన వెంట నడిచారు. ఈ సందర్భంగా అతి శీతల వాతావరణంలోనూ భారీ సంఖ్యలో గుమిగూడిన ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడారు. ‘‘ఏసీల్లో కూర్చుని, కార్లలో తిరిగితే అర్థం కాని ఎన్నో విషయాలను యాత్ర ద్వారా తెలుసుకుంటున్నా. మన దేశంలో రాజకీయ నాయకులకు, ప్రజలకు మధ్య భారీ అగాథముంది. కాంగ్రెస్, బీజేపీతో సహా అన్ని పార్టీలకూ ఇది వర్తిస్తుంది. ప్రజల గొంతు వినే అవసరం లేదన్నది నాయకుల అభిప్రాయం. అందుకే గంటల కొద్దీ ప్రసంగాలిస్తుంటారు. దాన్ని మార్చేందుకు నేను ప్రయత్నిస్తున్నా. రోజూ ఆరేడు గంటలు నడుస్తున్నా. ఈ సందర్భంగా రైతులు, కార్మికులు, యువత, చిరుద్యోగుల వంటి అన్ని వర్గాల వారి అభిప్రాయాలు వింటూ సాగుతున్నాం. చివర్లో చాలా క్లుప్తంగా మాత్రమే మేం మాట్లాడుతున్నాం’’ అని చెప్పారు. ఇకపై ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కనీసం నెలకో రోజు నేతలు పాదయాత్ర చేయాలని అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు సూచిస్తానన్నారు. -
ఇకపై నెలకు లక్ష వీసాలు జారీ
న్యూఢిల్లీ: అమెరికా వీసాల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూపులు ఇక బాగా తగ్గే అవకాశాలున్నాయి. వచ్చే ఏడాది వేసవి తర్వాత వీసాల మంజూరుకయ్యే రోజులు బాగా తగ్గిపోతాయని, నెలకి లక్ష వీసాలు మంజూరు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం అధికారి ఒకరు వెల్లడించారు. 2023 ఏడాది వేసవి నాటికి వీసా దరఖాస్తులు 12 లక్షలకు చేరుకుంటాయన్న అంచనాలున్నాయని తెలిపారు. కోవిడ్–19 కారణంగా ఉద్యోగుల సంఖ్య తగ్గిపోవడం, వీసాల జారీ తాత్కాలికంగా నిలిపివేత వంటి కారణాలతో భారతీయులు వీసాల కోసం ఏడాదికి పైగా ఎదుచు చూడాల్సిన పరిస్థితి ఉంది. ‘వీసాల మంజూరులో భారత్‌కు మేము అత్యధిక ప్రాధాన్యం ఇస్తాం. వచ్చే ఏడాది నాటికి కరోనా కంటే ముందున్న పరిస్థితులు వస్తాయి. నెలకి లక్ష వీసాలు మంజూరు చేయడమే మా లక్ష్యం’’ అని ఆయన చెప్పారు. వీసాల త్వరితగతి మంజూరు కోసం సిబ్బందిని పెంచడం, డ్రాప్ బాక్స్ సదుపాయం కల్పన వంటి చర్యల్ని తీసుకుంటామని ఆ అధికారి వెల్లడించారు గతంలో కొన్ని కేటగిరీల వీసా కోసం 450 రోజులు ఎదరుచూడాల్సి వచ్చేదని, ఇప్పుడది తొమ్మిది నెలలకి తగ్గిందని వివరించారు. -
నెల రోజుల్లో 5జీ సర్వీసులు.. టెలికం సహాయ మంత్రి చౌహాన్ వెల్లడి
న్యూఢిల్లీ: చిరకాలంగా ఎదురుచూస్తున్న 5జీ సేవలు నెల రోజుల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని కేంద్ర టెలికం శాఖ సహాయ మంత్రి దేవుసిన్హ్ చౌహాన్ తెలిపారు. ఈ ఏడాది ఆఖరు నాటికి ఈ సర్వీసులను దేశవ్యాప్తంగా విస్తరించేందుకు దేశీయంగా అభివృద్ధి, తయారు చేసిన పరికరాలు వినియోగంలోకి రాగలవని ఆయన పేర్కొన్నారు. అటు 6జీ నెట్‌వర్క్‌ను కూడా అభివృద్ధి చేసేందుకు 6జీ టెక్నాలజీ ఇన్నోవేషన్స్ గ్రూప్‌ను ఏర్పాటు చేసినట్లు మంత్రి వివరించారు. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ఆసియా, ఓషియానియా ప్రాంతానికి సంబంధించి నిర్వహిస్తున్న రీజనల్ స్టాండర్డైజేషన్ ఫోరమ్ (ఆర్ఎస్ఎఫ్) ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. దాదాపు వారం రోజుల తర్వాత ఆగస్టు 1న ముగిసిన 5జీ స్పెక్ట్రం వేలంలో రికార్డు స్థాయిలో రూ. 1.5 లక్షల కోట్ల బిడ్లు వచ్చిన సంగతి తెలిసిందే. అమ్ముడైన స్పెక్ట్రంలో రిలయన్స్ జియో దాదాపు సగభాగం కొనుగోలు చేసింది. ఇందుకోసం ఏకంగా రూ. 88,078 కోట్ల విలువ చేసే బిడ్లు వేసింది. -
అన్‌సీన్ పెళ్లి ఫోటోలు షేర్ చేసిన ఆలియా భట్
బాలీవుడ్ లవ్‌బర్డ్స్ ఆలియా భట్- రణ్‌బీర్ కపూర్లు పెళ్లి చేసుకొని నేటికి నెల గడుస్తుంది. ఏప్రిల్14న ఈ జంట వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. రణ్‌బీర్ కపూర్ ఇల్లు బాంద్రాలోని వాస్తులో కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. 5ఏళ్లు ప్రేమలో మునిగితేలిన ఈ జంట గత నెలలో పెళ్లితో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. తాజాగా వీరి పెళ్లయి 1నెల రోజులు అవుతున్న సందర్భంగా ఆలియా భట్ కొన్ని బ్యూటిఫుల్ ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన నెటిజన్లు.. 'ఇలాంటి వేడుకలు ఎన్నో జరుపుకోవాలి.. హ్యాపీ వన్ మంథ్' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Alia Bhatt 🤍☀️ (@aliaabhatt) -
అమెజాన్ ప్రైమ్ యూజర్లకు గుడ్‌న్యూస్...!
మీరు అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటున్నారా అయితే...మీకు గుడ్‌న్యూస్...! అమెజాన్ ప్రైమ్ యూజర్లను దృష్టిలో ఉంచుకొని అమెజాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైమ్ మెంబర్షిప్ నెలవారి సబ్స్క్రిప్షన్ సేవలను తిరిగి అమెజాన్ ప్రారంభించింది. దీంతో కొత్తగా ప్రైమ్ మెంబర్షిప్ సేవలను ప్రయత్నించే వారికి కాస్త ఉపశమనం కల్గనుంది. ప్రైమ్ మెంబర్షిప్ సేవలను నెల రోజుల పాటు పొంది, నచ్చకపోతే ప్రైమ్ మెంబర్షిప్ వెంటనే రద్దు చేసుకోవచ్చును. చదవండి: భారత్‌లో అత్యంత ఖరీదైన స్కూటర్ ఇదే, ధర ఎంతంటే? రిజర్వ్ బ్యాంకు నియమాకాల ప్రకారం అమెజాన్ నెల వారి సబ్స్క్రిప్షన్ సేవలను ఈ ఏడాది ప్రారంభంలో తీసివేసింది. దీంతో యూజర్ల కోసం కేవలం త్రైమాసిక, వార్షిక సబ్స్క్రిప్షన్ అందుబాటులో ఉన్నాయి. అక్టోబర్ 1 నుంచి ఆటో డెబిట్ కార్డు రూల్స్‌పై రిజర్వ్ బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుందే. పునరావృతమయ్యే లావాదేవీలపై ఆర్బీఐ కట్టడి చేసింది. దీంతో తిరిగి వన్ మంత్ సబ్‌స్క్రిప్షన్‌ను అమెజాన్ ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. వన్ మంత్ సబ్స్క్రిప్షన్ కేవలం సెలక్టెడ్ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులతోనే పొందవచ్చును. నెట్‌ఫ్లిక్స్ తరహాలో ఉచిత వన్ మంత్ ట్రయల్ సబ్‌స్క్రిప్షన్‌ను అమెజాన్ తీసివేసిన విషయం తెలిసిందే. చదవండి: అప్పట్లో అంగారకుడు.. కొట్టుకొచ్చిన రాళ్లే సాక్ష్యం!! ఫొటోలు రిలీజ్ చేసిన నాసా -
పెళ్లయిన కొన్నాళ్లకే వరుడు కన్నుమూత.. విషాదంలో వధువు
బరంపురం: గంజాం జిల్లా సరగడ సమితిలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సూర్యకాంత్ గౌడ కరోనా మహమ్మారి బారిన పడి మృతి చెందారు. సమితిలోని చికిలి గ్రామంలో నివాసం ఉంటున్న సూర్యకాంత్ గౌడకు మార్చి 10వ తేదీన వివాహం జరిగింది. వివాహం జరిగి మూడు నెలలు కాకముందే ఆయన మృతిచెందిన వార్త జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు, బంధువులు, స్నేహితుల్లో తీవ్ర విషాదం నింపింది. సూర్యకాంత్ గౌడకు కొద్ది రోజుల క్రితం కరోనా పాజిటివ్ నమోదు కావడంతో జిల్లా కోవిడ్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుదూ సోమవారం ఉదయం 10 గంటల సమయంలో మృతి చెందారు. అయితే కరోనా భయంతో ఉపాధ్యాయుడి మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు బంధువులు, స్నేహితులు ఎవరూ ముందుకు రాలేదు. చివరికి తహసీల్దార్ స్పందించి ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలించి అంత్యక్రియలు పూర్తి చేశారు. చదవండి: తండ్రి సాహసం.. బిడ్డకు ప్రేమతో 300 కి.మీ సైకిల్‌పై.. -
వామ్మో మరో కొత్త రకం వ్యాధి.. ఈ సారి పందులపై..
ఐజ్వాల్: ఓ పక్క కరోనా మహమ్మారి వీర విహారం చేస్తూ భారతదేశాన్ని వణికిస్తోంది. ఈ క్రమంలో మరో వ్యాధి ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ రూపంలో ఈశాన్య రాష్ట్రం మిజోరంను అల్లాడిస్తోంది. ప్రస్తుతం ఈ వైరస్ కారణంగా మిజోరంలో పందులు వేల సంఖ్యల్లో మరణిస్తున్నాయి. గత మార్చి 21న ఈ వ్యాధి వల్ల తొలి మరణం నమోదు అయ్యింది. కాగా ఇప్పటి వరకు మొత్తం 1700 పైగా పందులు మృతిచెందినట్లు సమాచారం. ఈ వ్యాధి కరోనా లానే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి విస్తరిస్తోంది. ప్రస్తుతం ఇది మిజోరంలోని పలు ప్రాంతాలని భయపెడుతోంది. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కారణంగా మిజోరంలో గత నెల రోజులకుపైగా వేల సంఖ్యలో పందుల మరణించాయి. దీని వల్ల రూ.6.91 కోట్ల నష్టం వాటిల్లిందని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రధానంగా ఐదు జిల్లాల్లో ఈ వ్యాధి ప్రభావం తీవ్రంగా ఉందని తెలిపారు. రాష్ట్ర పశుసంవర్ధక, పశువైద్య విభాగం సంయుక్త డైరెక్టర్ డాక్టర్ లాల్మింగ్‌థంగా మాట్లాడుతూ.. భయంకరమైన ఈ వ్యాధి ఇతర ప్రాంతాలకు మరింత వ్యాప్తి చెందుతోంది, అయితే కేంద్రంలో రోజువారీ మరణాల సంఖ్య కొన్ని వారాలుగా తగ్గుతున్న ధోరణిని చూపించింది. చనిపోయిన పందుల నమూనాలను ఇప్పటికే పరీక్షల కోసం సేకరించాము. ఈ మరణాలకు గల కారణం స్పష్టంగా తెలియాల్సి ఉంది. పొరుగున ఉన్న బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి దిగుమతి చేసుకున్న పందుల వల్ల ఏఎస్ఎఫ్ సంక్రమణ మూలాలు సంభవిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ( చదవండి: వైరల్: రాక్షసుల కన్నా దారుణంగా ప్రవర్తించారు ) -
గౌతమ్ క్యాప్షన్‌కు ఇంప్రెస్ అయిన 'చందమామ'
నూతన వధూవరులు కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లులు వన్‌మంత్ యానివర్సిరీని జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను గౌతమ్ కిచ్లు తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఒక నెల గడిచింది..కానీ జీవితాంతం ఇలాంటివి ఇంకెన్నో జరుపుకోవాలంటూ ఇద్దరూ ఒకరిపై ఒకరు చేయి వేసిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. దీనికి కాజల్ సైతం ఫిదా అయ్యి హార్ట్ సింబల్‌తో తన ప్రేమను వ్యక్తపరిచింది. కాగా గత నెల అక్టోబర్ 30 కాజల్-గౌతమ్‌లు ముంబైలోని తాజ్ మహాల్ ప్యాలెస్ హోటల్లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా అతికొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. (కాజల్ వెడ్డింగ్ లెహెంగా.. 20 మంది 30 రోజులు..) View this post on Instagram A post shared by Gautam Kitchlu (@kitchlug) మూడేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట పెద్దల సమక్షంలో వివాహా బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి అనంతరం వీరిద్దరూ హానీమూన్‌కు మాల్దీవులు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ ఐలాండ్ అందాలను ఆస్వాధిస్తున్న ఫొటోలను కాజల్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉన్నారు. కాగా మెగాస్టార్ చిరంజీవితో దర్శకుడు కొరటాల శివ రూపోందిస్తున్న‘ఆచార్య’ సినిమాలో కాజల్ ఫిమేల్ లీడ్ రోల్ చేస్తుంది. ఇటీవల షూటింగ్‌లు పున: ప్రారంభం కావడంతో ఈ సినిమా సెట్స్‌లోకి వెళ్లింది. ప్రస్తుతం ఈ సినిమాలో హైదరాబాద్‌లో షూటింగ్ జరపుకుంటోంది. (కాజల్ అగర్వాల్ వెరీ వెరీ స్పెషల్ View this post on Instagram A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) -
ప్రశాంతంగా ఉండు సుశీ...
బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం ఎంతోమందిని బాధించింది. గత నెల 14న సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. సుశాంత్ మృతి చెంది నిన్నటికి (మంగళవారం, జూలై 14) నెల రోజులు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నటి రియా చక్రవర్తి (సుశాంత్, రియా ప్రేమలో ఉండేవారని వార్తలు వచ్చేవి. ఈ పోస్ట్ వారి అనుబంధాన్ని తెలియజేస్తోంది) ఓ ఎమోషనల్ పోస్ట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ పోస్ట్ సారాంశం ఈ విధంగా... ‘‘నువ్వు (సుశాంత్) లేవనే నిజాన్ని నమ్మలేక నా భావోద్వేగాలతో ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నాను. నా హృదయంలోని అలజడి నన్ను ఇంకా కలవరపెడుతూనే ఉంది. ప్రేమ పట్ల నమ్మకాన్ని కలిగించింది, దాని శక్తిని నాకు తెలిసేలా చేసింది నువ్వే. ఓ చిన్న గణితసూత్రం మన జీవితాలను ఎలా ప్రతిభింబిస్తుందో చెప్పి, జీవితం గురించి నాకు అర్థం అయ్యేలా చేసింది నువ్వే. నీ జ్ఞాపకాల నుంచి ప్రతిరోజూ నేను ఏదో ఒక విషయం నేర్చుకుంటూనే ఉంటానని నీకు మాట ఇస్తున్నాను. ప్రతి అంశాన్ని ఎంతో మంచి మనసుతో ప్రేమించే వ్యక్తివి నువ్వు. ప్రస్తుతం ఎంతటి ప్రశాంత వాతావరణంలో నువ్వు ఉన్నావో నాకు తెలుసు. చంద్రుడు, నక్షత్రాలు, పాలపుంతలు ఓ గొప్ప భౌతికశాస్త్రవేత్త మా వద్దకు వచ్చాడని చప్పట్లతో స్వాగతించి ఉంటాయి. అక్కడ నువ్వు ఓ షూటింగ్ స్టార్‌గా వెలుగుతూనే ఉంటావని ఆశిస్తున్నాను. నా షూటింగ్ స్టార్ మళ్లీ నా దగ్గరకు రావాలని కోరుకుంటున్నాను. మన మధ్య ఉన్న ప్రేమను వ్యక్తపరచడానికి నాకు మాటలు సరిపోవు. నువ్వు దూరమై ముప్పై రోజులవుతోంది. నేను నిన్ను జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటాను. ప్రశాంతంగా ఉండు సుశీ ’’ అని పేర్కొన్నారు రియా. -
కొమ్ములు విరిచామా?
కరోనా కాటుతో యావత్ దేశం స్తంభించి 30 రోజులైంది. మార్చి 22న జనతా కర్ఫ్యూతో ఒక రోజు లాక్డౌన్ శాంపిల్ చూసిన దేశం.. రెండు రోజుల తరువాత ఏకంగా 21 రోజులు, ఆ తరువాత మరో 19 రోజులు ఆంక్షల మధ్య గడిపేందుకు సిద్ధమైంది. చిల్లరగా బయట తిరిగే వాళ్లకు పోలీసు దెబ్బ రుచిచూపడం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజలు సమస్య తీవ్రతను అర్థం చేసుకున్నట్లే కనిపిస్తోంది. అందుకేనేమో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లాక్డౌన్ అమలుపై 73 దేశాల్లో చేసిన సర్వేలో భారత్ తొలిస్థానంలో నిలిచింది. బస్సులు, రైళ్లు, విమానాలన్నింటినీ రద్దు చేయడం, విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతోపాటు అనవసరమైన ప్రయాణాలన్నింటిపై నిషేధం విధించడంలో భారత్ వందకు వంద మార్కులు కొట్టేసింది. తబ్లిగీ సమావేశాలు, వ లస కార్మికుల సమస్య లు లేకుంటే ఈపాటికి కరోనాను జయించిన దే శాల జాబితాలో మన దే శం చేరి ఉండేదేమోగానీ ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. రోజువారీ కేసుల నమో దు, మరణాల రేటు.. కేసులు రెట్టిం పు అవుతున్న వేగం వంటి చాలా అంశా ల్లో భారత్ అగ్రరాజ్యం అమెరికాతోపాటు అనేక యూరోపియన్ దేశాలను కూడా అధిగమించింది. కరోనా కొమ్ములు విరిచే క్రమంలో అగ్రభాగంలో ఉంది. అంకెలు చెప్పే వాస్తవాలు... భారత వైద్య పరిశోధన సమాఖ్య (ఐసీఎంఆర్) ఇటీవల చేపట్టిన పరిశోధనలో కట్టడులేవీ లేకపోతే కరోనా బారినపడ్డ ఒక వ్యక్తి నెల రోజుల్లో కనీసం 406 మందికి వైరస్‌ను అంటించగలడని తేలింది. నాలుగు వందల మంది ఒకొక్కరూ 406 మందికి వైరస్‌ను అంటిస్తే బాధితుల సంఖ్య కాస్తా 1.64 లక్షలకు పెరిగిపోతుంది. చికిత్స, వ్యాక్సిన్లేవీ లేని నేపథ్యంలో పరిస్థితి అలాగే కొనసాగితే కోట్ల మంది ఈ వ్యాధి బారిన పడటానికి ఎక్కువ సమయం పట్టదు. కరోనా వైరస్ ఆర్.నాట్ అంటే.. ఒకరి నుంచి ఎంత మందికి పాకుతుందో తెలిపే సంఖ్య 2.8 వరకూ ఉంటుందని ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి. అంటే.. కట్టడి చర్యలేవీ లేకపోతే ఈ వైరస్ కారణంగా ప్రపంచంలోని అత్యధిక శాతం మంది మంచాన పడేందుకు ఎక్కువ సమయం పట్టదు. కానీ పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉందని మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఇదే కాదు.. లాక్డౌన్ అనేది లేకపోతే ఏప్రిల్ 15కల్లా దేశంలో సుమారు 8 లక్షల మంది కరోనా బారిన పడతారని ఐసీఎంఆర్ లెక్కకట్టినా ఏప్రిల్ 22 నాటికి దేశం మొత్తమ్మీద కేసుల సంఖ్య 21,500 మాత్రమే ఉన్నాయి. మరణాల సంఖ్య కూడా 680 మాత్రమే. మరణాల రేటు తక్కువగానే.. దేశంలో మరణాల రేటు విషయానికొస్తే ఇది 3.4 శాతం నుంచి 3.19 శాతం వరకూ తగ్గింది. జర్మనీలో ఈ సంఖ్య ఇప్పటికీ 3.42 శాతంగా ఉంటే కెనడాలో 4.77 శాతం, అమెరికాలో 5.53 శాతంగానూ ఉంది. చైనాలో ప్రతి వంద మందిలో ఆరుగురు మరణించగా స్పెయిన్‌లో ఏకంగా పది శాతం మంది మరణించారు. ఫ్రాన్స్, ఇటలీ, యూకేల్లో మరణాల రేటు అత్యధికంగా 14 శాతం వరకూ నమోదైంది. అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మిగిలిన దేశాలతో పోల్చుకుంటే భారత్‌లో వ్యాధి నయమై డిశ్చార్జ్ అవుతున్న వారి శాతం చాలా ఎక్కువగా ఉండటం. ఏప్రిల్ 23 నాటికి వ్యాధి బారిన పడ్డ ప్రతి వంద మందిలో చికిత్స తరువాత 20 మందికి నయమవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. రెండు వారా ల కిత్రం కేవలం 8 శాతం మందికే వ్యాధి నయమవుతుం డగా వారం తిరిగేసరికి ఇది 12 శాతానికి పెరిగింది. కేసుల పెరుగుదలలో మార్పు దేశంలో తొలి కరోనా కేసు జనవరి ఆఖరులో నమోదైంది. లాక్డౌన్ కు వారం ముందు, మార్చి 17 నాటికి దేశంలోని కేసుల సంఖ్య 137 కాగా మార్చి 24కల్లా ఇది 519కి చేరిం ది. ఇంకోలా చెప్పాలంటే దాదాపు నాలుగు రెట్లు ఎక్కువైంది. లాక్డౌన్ అమల్లోకి వచ్చాక.. కేసులు పెరిగిపోతున్న రేటులో స్పష్టమైన మార్పు కనిపించింది. మార్చి 25 నాటికి 606 కేసులు ఉండగా తొలివారం కేసులు మూడు రెట్లు పెరిగాయి. ఆ తర్వాతి వారానికి ఇది కాస్త తగ్గింది. రెండో వారానికి కేసుల సంఖ్య రెండు రెట్లు మాత్రమే పెరి గింది. ఏప్రిల్ 21తో ముగిసిన మూడో వారానికి ఈ సంఖ్య మరికొంత తగ్గి ఒకటిన్నర రెట్లకంటే కొంచెం ఎక్కువగా నమోదైంది. కేసుల సం ఖ్య రెట్టింపు అయ్యేందుకు లాక్డౌన్ విధించిన తొలిరోజుల్లో 3 రోజులు పట్టగా లాక్డౌన్ చివరికల్లా ఏడు రోజులు పట్టింది. ఈ మార్పులన్నీ భౌతిక దూరం పాటించడం వల్లేనని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు కె.శ్రీ నాథ్‌రెడ్డి ప్రకటించారు. మే 15 తర్వాత ఉపశమనం దేశంలో కరోనా ఉధృతి మే 15 వరకూ కొనసాగుతుందని, ఆ తర్వాత కొన్ని పరిస్థితులకు అనుగుణంగా తగ్గుముఖం పట్టడం మొదలవుతుందని ఒక టీవీ చానల్ అధ్యయనం చెబుతోంది. మరోవైపు దేశంలోనే ప్రముఖ అంటువ్యాధుల నిపుణులు డాక్టర్ జయప్రకాశ్ ములియల్ మాత్రం మనం కరోనా గ్రాఫ్‌ను ఇప్పటికే ఫ్లాటన్ చేసినట్లు చెబుతున్నారు. కేసులు, మరణాల సంఖ్య, వైరస్‌బారిన పడుతున్నవారి సంఖ్య రెట్టింపు అవుతున్న వేగం వంటి విషయాలన్నీ దేశంలో వైరస్ ఉధృతి తగ్గుతోందనే చెబుతున్నాయని జయప్రకాశ్ ములియల్ అంటున్నారు. అయితే టీవీ చాన ల్ అధ్యయనం మా త్రం మే 22కల్లా దేశంలో కేసుల సంఖ్య 75 వేలకు చేరుకుం టుందని, ఆ తరువాత క్రమేపీ తగ్గుముఖం పడుతుందని చెబు తోంది. లాక్డౌన్, భౌ తిక దూరం, ఆర్.నాట్ వంటి కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నాక తాము అంచనాలను రూపొందించామని ఆ చానల్ పేర్కొంది. లాక్‌డౌన్‌ను మే 3తో ముగించకుండా 15 వరకూ పొడిగిస్తే కేసుల సంఖ్య సున్నాకు చేరేందుకు 4 నెలలు పడుతుందని, అలా కాకుండా లాక్‌డౌన్‌ను మే 30 వరకూ పొడిగిస్తే జూన్‌లోనే కేసుల సంఖ్య సున్నాకు చేరుకుంటుందని తెలిపింది. -
ఆదాయపన్ను కేసుల పరిష్కారానికి మరో నెల గడువు
న్యూఢిల్లీ: ఆదాయపన్ను అపరాధముల పరిష్కారానికి పన్ను చెల్లింపుదారులకు మరి కొంత సమయం లభించింది. డిసెంబర్ 31తో ముగిసిన గడువును జనవరి 31 వరకు పొడిగిస్తున్నట్టు ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) శుక్రవారం ప్రకటన చేసింది. ఈ పథకాన్ని గతేడాది సెప్టెంబర్‌లో తీసుకొచ్చారు. ఉద్దేశపూర్వకంగా చేయని తప్పుల పరిష్కారానికి అవకాశం ఇవ్వడం ద్వారా.. కోర్టుల్లో అపరిష్కృత కేసుల భారాన్ని తగ్గించేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చినట్టు సీబీడీటీ తెలిపింది. -
మహిళ దారుణహత్య
నెలరోజుల తర్వాత వెలుగులోకి అత్యాచారం చేసి హతమార్చినట్లు అనుమానాలు అనంతపురం సెంట్రల్ : అనంతపురం నగర శివారులో మహిళ దారుణహత్యకు గురైంది. నెల రోజుల తర్వాత ఈ సంఘటన వెలుగుచూసింది. అస్థిపంజరం సమీపంలో కండోమ్‌లు పడి ఉండటంతో అత్యాచారం చేసిన తర్వాత హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాలిలా ఉన్నాయి. తపోవనం సర్కిల్‌కు సమీపంలోని ఆయిల్‌ఫెడ్ కార్యాలయం (పాత డాల్డా ఫ్యాక్టరీ) ఆవరణలోని ముళ్లపొదల్లో మహిళ అస్థిపంజరాన్ని కొందరు యువకులు గురువారం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఆ రోజు రాత్రే ఘటనా స్థలానికి చేరుకోవాలని భావించినా సాధ్యం కాకపోవడంతో శుక్రవారం నాల్గవ పట్టణ ఎస్ఐ జీటీ నాయుడు తమ సిబ్బందితో వెళ్లి జేసీబీ సాయంతో ముళ్లపొదలు తొలగించారు. మృతదేహంలో ఎముకలు తప్ప ఎటువంటి ఆనవాళ్లూ కనిపించలేదు. ఎరువుపురంగు ధరించినట్లు తెలుస్తోంది. 40 సంవత్సరాల వయసు ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. సమీపంలో కండోమ్‌లు పడి ఉండటాన్ని బట్టి ఆ మహిళ వ్యభిచారై ఉండొచ్చని, లేదా ఆమెపై సామూహిక అత్యాచారం చేసి, ఆపై హత్య చేశారేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయి. మృతదేహం నుంచి దుర్వాసన వస్తున్నప్పటికీ, పక్కనే మురుగునీరు అంతకన్నా ఎక్కువగా కంపు కొడుతుండటంతో సమీప ప్రజలు ఎవరూ ఈ ఘటనను గమనించలేకపోయారు. మృతదేహానికి శనివారం పంచనామా నిర్వహిస్తామని, త్వరలోనే పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. -
నెలరోజుల్లో ఎంత డబ్బు డిపాజిట్ చేశారంటే..?
-
నెల రోజుల్లో సాగర్ కుడికాల్వకు నీరు
స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు గుంటూరు వెస్ట్: నెలరోజుల్లో సాగర్ కుడి కాల్వకు నీటిని విడుదల చేస్తామని శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. నగరంలోని ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ ఆరుతడి పంటలు, రబీ సాగుకు అవసరమైన నీటిని రైతులకు అందించేందుకుగాను సీఎం చంద్రబాబు నా యుడుతో చర్చించినట్టు తెలిపారు. త్వరలోనే నీటిని విడుదల చేసేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన చెప్పారు. ఇటీవల కురిసిన భారీవర్షాల కారణంగా దెబ్బతిన్న పంట నష్టాలను అంచనా వేసి తగిన పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. పత్తి, మిరప రైతులు నిరాశ చెందకుండా ప్రత్యామ్నాయ పంటలను సాగుచేసుకోవాలని సూచించారు. నాణ్యమైన విత్తనాలను సాగు చేయాలని, నకిలీ విత్తనాలను కొనుగోలు చేసి మోసపోవద్దని విజ్ఞప్తిచేశారు. సమీక్ష సమావేశంలో కోడెల తనయుడు.. తొలుత స్పీకర్ కోడెల శివప్రసాదరావు నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాలకు సంబంధించిన మండలాల అధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వరదల వల్ల జరిగిన పంట నష్టం, గృహాలు, రోడ్లు తదితర అంశాలపై ఆయన సమీక్షించారు. ఎన్ఆర్ఈజీఎస్ పనులు, పంచాయతీరాజ్ రోడ్లు, స్కీమ్‌లపై అధికారుల ద్వారా వివరాలు సేకరించారు. ఈ సమావేశానికి స్పీకర్ కోడెల తనయుడు శివరామకృష్ణ హాజరయ్యారు. ప్రభుత్వ పథకాలపై చేపట్టిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొనడంపై అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. -
వెరీ స్లో
‘సాదాబైనామా’ పరిశీలన మందగింపు హరితహారంలో నిమగ్నమైన అధికారులు 5602 దరఖాస్తుల తిరస్కరణ మరో నెలన్నర పట్టే అవకాశం ముకరంపుర : జిల్లాలో సాదాబైనామాల భూముల క్రమబద్దీరణకై వచ్చిన «lధరఖాస్తుల పరిశీలన మందకొడిగా సాగుతోంది. ఈ విషయమై కలెక్టర్ ప్రత్యేకదష్టి సారించినా హరితహారం ప్రభావంతో పరిశీలనలో వేగం తగ్గింది. గతనెల 22 వరకు మీ సేవ ద్వారా సాదాబైనామాల క్రమబద్దీకరణకు ధరఖాస్తులు స్వీకరించారు. పలుమార్లు గడువు పొడగించడంతో భారీగా దరఖాస్తులు వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా 2,47,538 దరఖాస్తులు వచ్చాయి. వచ్చిన దరఖాస్తులను మండలాలు, గ్రామాల వారీగా విభజించి పరిశీలన ప్రారంభించారు. ఇప్పటివరకు 29,058 మందికి నోటీసులు జారీ చేసారు. ప్రాథమిక విచారణలో 5,602 ధరఖాస్తులను తిరస్కరించారు. హరితహారంలో అధికారులు బిజీగా ఉండటంతో ఈ ప్రక్రియకు ఆటంకం ఏర్పడుతోంది. సగానికి పైగా మండలాల్లో రోజు వారీగా 5, 6 దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. తిరస్కరించిన వాటిలో ఐదెకరాల కంటే ఎక్కువ భూమి ఉండడం, వ్యవసాయేతర భూములు, ప్రభుత్వ భూములు, మున్సిపాలిటీ, అర్బన్ పరిధిలోని భూములు, దరఖాస్తులను సాదాబైనామాలకు జోడించకపోవడం, కొనుగోలు దారులు, విక్రయించిన వారు చనిపోవడం వంటి కారణాలే కనిపిస్తున్నాయి. విక్రయించిన వారి వారసుల పేర్లు రెవెన్యూ రికార్డుల్లో కొనసాగుతుండడంతో సంది«గ్ధం నెలకొంది. పరిశీలన ప్రక్రియకే మరో నెలన్నర కాలం పట్టే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. మంథనిలోనే అత్యధికంగా తిరస్కరణ. జిల్లాలో 3,14,161 దరఖాస్తుల్లో ఇప్పటివరకు 90,231 మాత్రమే పరిశీలించారు. అందులో 29,058 మందికి నోటీసులు జారీ చేసారు. 5,602 ధరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. 1,89,270 «ధరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. సాదాబైనామాల ధరఖాస్తుల పరిశీలనలో అత్యధికంగా మంథని డివిజన్లో తిరస్కరణకు గురయ్యాయి. 19,249 ధరఖాస్తులు రాగా 3,394 ధరఖాస్తులను తిరస్కరించారు. తక్కవగా సిరిసిల్ల డివిజన్లో 56 తిరస్కరించారు. పెద్దపల్లిలో 241, కరీంనగర్లో 1,835, జగిత్యాలలో 76 ధరఖాస్తులు తిరస్కరించారు. -
నెల రోజులకు స్వగ్రామానికి మృతదేహం
కరీంనగర్: బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లి అక్కడ గుండెపోటుతో మరణించిన యువకుడి మృతదేహం దాదాపు నెలరోజులకు స్వగ్రామానికి చేరుకుంది. కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలం బావుసాయిపేటకు చెందిన కర్నాల రాజు(30) సంవత్సరం క్రితం దుబాయ్ వెళ్లాడు. అక్కడ పని చేస్తుండగా హఠాత్తుగా గుండెపోటు వచ్చి మరణించాడు. ఆయన మృతదేహాం కోసం కుటుంబసభ్యులు నెల రోజులుగా ఎదురుచూస్తున్నారు. రాజు మృతదేహం శుక్రవారం ఇంటికి చేరుకోవడంతో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా మృతదేహం స్వగ్రామానికి చేరుకోవడానికి ఇన్ని రోజులు పట్టిందని తెలుస్తుంది. -
అధికారుల పంపిణీకి మరో నెల రోజులు!
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత సర్వీసు అధికారుల విభజనకు మరో నెలరోజుల సమయం పడుతుందని ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. అధికారుల విభజన ప్రక్రియ ఆలస్యమయ్యే పక్షంలో తాత్కాలిక తుది జాబితాలో ఎలాంటి సమస్య లేని అధికారులనైనా ఇరు రాష్ట్రాలకు సర్దుబాటు చేస్తూ సర్వ్ టు ఆర్డర్ ఇవ్వాలని కోరినా కేంద్రం అందుకు సుముఖత వ్యక్తం చేయలేదని తెలిసింది. ఇప్పటికే నాలుగైదుసార్లు సమావేశమైన ప్రత్యూష్ సిన్హా కమిటీ తాత్కాలిక తుది జాబితాను ఈనెల 10న ప్రకటించింది. ఆ తర్వాత దీనిపై అభ్యంతరాలు తెలియచేయడానికి అధికారులకు పక్షం రోజుల గడువు ఇచ్చింది. ప్రత్యూష్ సిన్హా కమిటీ చేసే మార్పులపై ఇరు రాష్ట్రాల సీఎస్‌లు సంతకాలు చేశాక... వాటిని కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పంపించనున్నారు. ఆ తర్వాత సదరు మంత్రిత్వ శాఖ నుంచి ఫైలు ప్రధాన మంత్రి ఆమోదం కోసం వెళ్తుంది. అక్కడ రెండు వారాల సమయం పడుతుందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
నెలలోగా సమస్యలు పరిష్కరించాలి
నల్లగొండ టౌన్, న్యూస్‌లైన్ : జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రిలో తిష్టవేసిన సమస్యలన్నింటినీ నెలరోజుల్లోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ ఎన్.ముక్తేశ్వర్రావు అధికారులను ఆదేశించారు. నల్లగొండలోని ఆస్పత్రి కార్యాలయంలో బుధవారం జరిగిన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. మూలనపడిన అల్ట్రా సౌండ్ మిషన్ స్థానంలో కొత్త మిషన్‌ను కమిటీ తీర్మాణంతో కొనుగోలు చేయాలని, గత ఐదు నెలలుగా పనిచేయని సీటీస్కాన్ మిషన్‌ను వెంటనే మరమ్మతులను చేయించి వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. ఆస్పత్రికి వచ్చే నిరుపేదలకు ఎలాంటి ఇబ్బం దులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత సిబ్బందిపైనే ఉందన్నారు. అత్యవసర మందులను బయట నుంచి కొనుగోలు చేయకుండా జనరిక్ స్టోర్స్ నుంచే కొనుగోలు చేయాలని ఆదేశించారు. అవసరమున్న మందులు సరఫరా చేయడానికి డీఆర్డీఏ సిద్ధంగా ఉందన్నారు. తాగునీటి పైప్‌లైన్‌ను, డ్రెయిన్ పైప్లైన్లను తొలగించి వాటి స్థానంలో కొత్త పైప్లైన్లు వేయించాలని ఆదేశించారు. నాణ్య తా ప్రమాణాలు పాటించే కాంట్రాక్టర్‌ను గుర్తించి పనులను అప్పగించి త్వరితగతిన పూర్తిచేసే విధంగా చూడాలన్నారు. ఆస్పత్రి రక్తనిధి కేంద్రం నుంచి ఆస్పత్రిలోని పేషంట్లకు ఉచి తంగా రక్తం అందజేయాలని, బయటి పేషంట్లకు నామమాత్రపు ఫీజు తీసుకుని అందజేయాలని కోరారు. రోగులకు మెరుగైన వైద్యసేవలను అందించేందుకు వైద్యులు కృషి చేయాలని కోరారు. వచ్చే నెల 7వ తేదీన తిరిగి సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆ సమావేశం నాటికి అస్పత్రిలో సమస్యలన్నింటినీ పరిస్కరించాలన్నారు. ఈ సమావేశంలో డీసీహెచ్ఎస్ డాక్టర్ సురేష్‌కుమార్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ పి.ఆ మోస్, ఆస్పత్రి పర్యవేక్షకులు డాక్టర్ హరినాథ్, ఆర్ఎంఓ డాక్టర్ ఉదయ్‌సింగ్, డాక్టర్లు శ్రీనివాస్‌రావు, నర్సింగరా వు, మాతృనాయక్, హేమలత, రెడ్‌క్రాస్ కార్యదర్శి పులిజాల రాంమోహన్‌రావు, ఈఈ ఇజాజ్ తదితరులు పాల్గొన్నారు. మొక్కుబడిగా సాగిన సమావేశం నిత్యం 300మంది ఇన్‌పేషంట్లు, 500కు పైగా ఔట్ పేషంట్లతో కిటకిటలాడుతున్న జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రిలో అనేక సమస్యలు తిష్టవేసి ఉన్నాయి. వాటిని పరిస్కరించడానికి జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా, స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు ఇతర అధికారులు సభ్యులుగా ఉన్న ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చర్యలు తీసుకోవాల్సి ఉంది. ప్రతి మూడునెలలకు ఒకసారి కమిటీ సమావేశం కావా ల్సి ఉంది. కానీ, 20 నెలల తరువాత సమావేశమైనప్పటికీ ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా హాజరుకాకపోవడం గమనార్హం. సమస్యలపై చర్చించేవారు లేకపోవడంతో సమావేశం మొక్కుబడిగా గంటసేపట్లోనే ముగించేశారు. డీవైఎఫ్ఐ, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రిలో నెలకొన్న సమస్యలు పరిస్కరించాలని, ఆస్పత్రిలో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ బుధవారం నల్లగొండలోని ఆస్పత్రిలో డీవైఎఫ్ఐ, ఏఐవైఎఫ్ల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఎన్.ముక్తేశ్వర్రావు అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలోనికి వెళ్లి వినతిపత్రం ఇవ్వడానికి ప్రయత్నించారు. కానీ సమావేశం అనంతరం వినతిపత్రం తీసుకుంటామని అధికారులు సమాధానం చెప్పడంతో ఆయా సంఘాల నాయకులు సమావేశ మందిరంలోకి చొచ్చుకుని వెళ్లేందుకు ప్రయత్నించడంతో సిబ్బంది అడ్డుకున్నారు. అధికారుల తీరును నిరసిస్తూ అక్కడే ధర్నా నిర్వహించారు. సమాచారం అందుకున్న టూటౌన్ పోలీసులు ఆస్పత్రికి చేరుకుని ధర్నా చేస్తున్న డీవైఎఫ్ఐ నాయకులు జంజిరాల సైదులు, శ్రీనివాసచారి, శ్రీకాంత్,శ్రీను, నరేష్, సాయి ఇమ్రాన్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎల్.శ్రవణ్‌కుమార్, వి.లెనిన్, మునీర్, పి.నాగరాజు, సైదులు, మణీందర్లను అరెస్టు చేశారు.