
బాలీవుడ్ లవ్‌బర్డ్స్ ఆలియా భట్- రణ్‌బీర్ కపూర్‌లు పెళ్లి చేసుకొని నేటికి నెల గడుస్తుంది. ఏప్రిల్14న ఈ జంట వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. రణ్‌బీర్ కపూర్ ఇల్లు బాంద్రాలోని వాస్తులో కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. 5ఏళ్లు ప్రేమలో మునిగితేలిన ఈ జంట గత నెలలో పెళ్లితో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.
తాజాగా వీరి పెళ్లయి 1నెల రోజులు అవుతున్న సందర్భంగా ఆలియా భట్ కొన్ని బ్యూటిఫుల్ ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన నెటిజన్లు.. 'ఇలాంటి వేడుకలు ఎన్నో జరుపుకోవాలి.. హ్యాపీ వన్ మంథ్' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment