వెరీ స్లో | very slow the sada bainama | Sakshi
Sakshi News home page

వెరీ స్లో

Published Tue, Jul 19 2016 10:49 PM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM

very slow the sada bainama

  • ‘సాదాబైనామా’ పరిశీలన మందగింపు
  • హరితహారంలో నిమగ్నమైన అధికారులు
  • 5602 దరఖాస్తుల తిరస్కరణ
  • మరో నెలన్నర పట్టే అవకాశం
  • ముకరంపుర : జిల్లాలో సాదాబైనామాల భూముల క్రమబద్దీరణకై వచ్చిన «lధరఖాస్తుల పరిశీలన మందకొడిగా సాగుతోంది. ఈ విషయమై కలెక్టర్‌ ప్రత్యేకదష్టి సారించినా హరితహారం ప్రభావంతో పరిశీలనలో వేగం తగ్గింది. గతనెల 22 వరకు మీ సేవ ద్వారా సాదాబైనామాల క్రమబద్దీకరణకు ధరఖాస్తులు స్వీకరించారు. పలుమార్లు గడువు పొడగించడంతో భారీగా దరఖాస్తులు వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా 2,47,538 దరఖాస్తులు వచ్చాయి. వచ్చిన దరఖాస్తులను మండలాలు, గ్రామాల వారీగా విభజించి పరిశీలన ప్రారంభించారు. ఇప్పటివరకు 29,058 మందికి  నోటీసులు జారీ చేసారు. ప్రాథమిక విచారణలో 5,602 ధరఖాస్తులను తిరస్కరించారు. 
    హరితహారంలో అధికారులు బిజీగా ఉండటంతో ఈ ప్రక్రియకు ఆటంకం ఏర్పడుతోంది. సగానికి పైగా మండలాల్లో రోజు వారీగా 5, 6 దరఖాస్తులను పరిశీలిస్తున్నారు.  తిరస్కరించిన వాటిలో ఐదెకరాల కంటే ఎక్కువ భూమి ఉండడం, వ్యవసాయేతర భూములు, ప్రభుత్వ భూములు, మున్సిపాలిటీ, అర్బన్‌ పరిధిలోని భూములు, దరఖాస్తులను సాదాబైనామాలకు జోడించకపోవడం, కొనుగోలు దారులు, విక్రయించిన వారు చనిపోవడం వంటి కారణాలే కనిపిస్తున్నాయి. విక్రయించిన వారి వారసుల పేర్లు రెవెన్యూ రికార్డుల్లో కొనసాగుతుండడంతో సంది«గ్ధం నెలకొంది. పరిశీలన ప్రక్రియకే మరో నెలన్నర కాలం పట్టే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. 
     
    మంథనిలోనే అత్యధికంగా తిరస్కరణ.
    జిల్లాలో 3,14,161 దరఖాస్తుల్లో ఇప్పటివరకు 90,231 మాత్రమే పరిశీలించారు. అందులో 29,058 మందికి నోటీసులు జారీ చేసారు.  5,602 ధరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. 1,89,270 «ధరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. సాదాబైనామాల ధరఖాస్తుల పరిశీలనలో అత్యధికంగా మంథని డివిజన్‌లో తిరస్కరణకు గురయ్యాయి. 19,249 ధరఖాస్తులు రాగా 3,394 ధరఖాస్తులను తిరస్కరించారు. తక్కవగా సిరిసిల్ల డివిజన్‌లో 56 తిరస్కరించారు. పెద్దపల్లిలో 241, కరీంనగర్‌లో 1,835, జగిత్యాలలో 76 ధరఖాస్తులు తిరస్కరించారు. 
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement