ఖిల భారత సర్వీసు అధికారుల విభజనకు మరో నెలరోజుల సమయం పడుతుందని ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి.
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత సర్వీసు అధికారుల విభజనకు మరో నెలరోజుల సమయం పడుతుందని ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. అధికారుల విభజన ప్రక్రియ ఆలస్యమయ్యే పక్షంలో తాత్కాలిక తుది జాబితాలో ఎలాంటి సమస్య లేని అధికారులనైనా ఇరు రాష్ట్రాలకు సర్దుబాటు చేస్తూ సర్వ్ టు ఆర్డర్ ఇవ్వాలని కోరినా కేంద్రం అందుకు సుముఖత వ్యక్తం చేయలేదని తెలిసింది. ఇప్పటికే నాలుగైదుసార్లు సమావేశమైన ప్రత్యూష్ సిన్హా కమిటీ తాత్కాలిక తుది జాబితాను ఈనెల 10న ప్రకటించింది. ఆ తర్వాత దీనిపై అభ్యంతరాలు తెలియచేయడానికి అధికారులకు పక్షం రోజుల గడువు ఇచ్చింది. ప్రత్యూష్ సిన్హా కమిటీ చేసే మార్పులపై ఇరు రాష్ట్రాల సీఎస్‌లు సంతకాలు చేశాక... వాటిని కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పంపించనున్నారు. ఆ తర్వాత సదరు మంత్రిత్వ శాఖ నుంచి ఫైలు ప్రధాన మంత్రి ఆమోదం కోసం వెళ్తుంది. అక్కడ రెండు వారాల సమయం పడుతుందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.