Employees Division
-
అది రాజ్యాంగ విరుద్ధం
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు ఉద్యోగుల విభజనకు సంబంధించి రాజ్యాంగ విరుద్ధంగా, పునర్విభజన చట్టం మార్గదర్శకాలకు విరుద్ధంగా కేటాయింపులు చేశారంటూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగుల విభజనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన (అపాయింటెడ్ డే) జూన్ 2, 2014ను ప్రాతిపదికగా తీసుకోవాలని స్పష్టం చేసింది. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పడిన 2019 జనవరి 1వ తేదీ ప్రాతిపదికగా ఉమ్మడి హైకోర్టు ఉద్యోగుల విభజన ప్రక్రియ చేపట్టడం రాజ్యాంగ విరుద్ధమని, పునర్విభజన చట్టంలోని సెక్షన్ 77కు విరుద్ధమని తేల్చిచెప్పింది. హైకోర్టు ఏర్పడిన తేదీ ప్రాతిపదికగా విభజన ప్రక్రియ చేపట్టడంతో 2018 జూలై 30న పిటిషనర్లు పదవీ విరమణ చేయాల్సి వచ్చిందని తెలిపింది. 2014 జూన్ 2వ తేదీ ప్రాతిపదికగా ఉమ్మడి హైకోర్టు ఉద్యోగుల నుంచి ఆప్షన్స్ తీసుకొని విభజన ప్రక్రియ పూర్తిచేసి ఉంటే..పిటిషనర్లు 60 ఏళ్లకు పదవీ విరమణ చేసేవారని పేర్కొంది. 2019 జనవరి 1 నుంచి 60 ఏళ్లు పూర్తయ్యే వరకు పిటిషనర్లకు రావాల్సిన జీతభత్యాలను 6 శాతం వడ్డీతో ఎనిమిది వారాల్లో చెల్లించాలని, ఈ మొత్తాన్ని ఏపీ, తెలంగాణ æప్రభుత్వాలు సమానంగా భరించాలని తీర్పులో స్పష్టంచేసింది. ఉమ్మడి హైకోర్టు పూర్వ ఉద్యోగులు కె.బలరామరాజు, మరో 9 మంది దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తులు జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు, జస్టిస్ టి.అమర్‌నాథ్‌గౌడ్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది. తీర్పులో ఇంకా ఏమన్నారంటే.. పిటిషనర్ల పెన్షన్ మదింపునకు కూడా 60 ఏళ్ల సర్వీసు పూర్తి చేసినట్లుగా పరిగణనలోకి తీసుకొని 8 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని, పిటిషనర్ల సర్వీసు రికార్డులను ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌ను ఆదేశించారు. అలాగే ఆప్షన్ ఇచ్చే అవకాశం తిరస్కరించినందుకు ఒక్కో పిటిషనర్‌కు రూ.3 వేల చొప్పున పరిహారం చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు. కాగా, ఉద్యోగుల కేటాయింపుల ప్రక్రియలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు రెండు హైకోర్టుల రిజిస్ట్రార్ జనరల్స్‌కు జరిమానా విధించింది. వివక్షత చూపించడం సరికాదు.. ‘‘న్యాయాధికారుల విభజనకు సంబంధించి 2017 జూలై 8న జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం.. 2014 జూన్ 2 నాటికి సర్వీసులో ఉన్న వారి నుంచి ఆప్షన్స్ తీసుకున్నారు. ఉద్యోగుల విభజనకు సంబంధించి సుప్రీంకోర్టు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. అయితే ఉమ్మడి హైకోర్టు అధికారులు, ఉద్యోగుల విషయంలో మాత్రం 2018 నవంబర్ 1 నాటికి సర్వీసులో ఉన్న వారి నుంచి మాత్రం ఆప్షన్స్ తీసుకోవడం వివక్షత చూపించడమే. ఇందుకు సహేతుకమైన కారణాలను కూడా చూపించలేదు. 2019 జనవరి 1వ తేదీ ప్రాతిపదికగా అధికారులు, ఉద్యోగుల సర్వీసును 60 ఏళ్ల వరకు కొనసాగించాలన్న ఫుల్ కోర్టు నిర్ణయం సరైనది కాదు. సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా, వివక్షతాపూరితంగా హైకోర్టు ఆప్షన్స్ తీసుకుంది. సెక్షన్ 77(2) ప్రకారం అపాయింటెడ్ డే నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు.. ఏ రాష్ట్రంలో పనిచేయాలో కోరుకునే హక్కు ఉందని స్పష్టం చేస్తోంది. 2014 జూన్ ప్రాతిపదికగా వీరి కేటాయింపులు పూర్తిచేసి ఉంటే పిటిషనర్లు పదోన్నతులు, ఇంక్రిమెంట్లు కూడా పొందేవారు. తమకు జరిగిన అన్యాయంపై 2019 జూలై 6న పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. 2020 జూలై 30కి వీరికి 60 ఏళ్లు పూర్తయ్యాయి. అయితే ఈలోగానే తీర్పు ఇవ్వాల్సి ఉన్నా లాక్‌డౌన్‌తోపాటు ప్రతివాదులు కౌంటర్లు దాఖలు చేయడంతోపాటు వాదనలు వినిపించడంలో జాప్యంలాంటి ఇతర కారణాలతో తీర్పు ఇవ్వలేకపోయాం. 2018 జూలై 30న పిటిషనర్లు పదవీ విరమణ చేసినా వారికి జీతభత్యాలు, పెన్షన్ పొందే హక్కు ఉంది’’అని ధర్మాసనం తీర్పులో పేర్కొంది. కాగా, పిటిషనర్ల తరఫున న్యాయవాది కేఎస్ మూర్తి వాదనలు వినిపించారు. -
‘విద్యుత్’ విభజన పూర్తి
సాక్షి, హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఐదేళ్లుగా కొరకరాని కొయ్యగా మారిన విద్యుత్ ఉద్యోగుల విభజన వివాదానికి తెరపడింది. జస్టిస్ డీఎం ధర్మాధికారి ఏకసభ్య కమిషన్ రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్ ఉద్యోగుల పంపకాలు జరుపుతూ సుప్రీం కోర్టుకు తుది నివేదికను సమర్పించింది. విద్యుత్ ఉద్యోగుల విభజనపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధ్యం కాకపోవడం తో ఈ వివాదం హైకోర్టు, తర్వాత సుప్రీంకోర్టుకు చేరింది. ఈ వివాద పరిష్కారానికి రిటైర్డ్ జడ్జి జస్టిస్ ధర్మాధికారితో సుప్రీంకోర్టు గతేడాది నవంబర్ 28న ఏకసభ్య కమిషన్ నియమించింది. కమిషన్ సైతం మధ్యవర్తి త్వం ద్వారా వివాదాన్ని పరిష్కరించలేకపోయింది. దీంతో స్వయంగా ఉద్యోగుల పంపకాలు జరుపుతూ తుది నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల విభజన కోసం జారీ చేసిన మార్గదర్శకాల ఆధారంగా ఈ కేటాయింపులు జరిపింది. ఈమార్గదర్శకాల ప్రకారం రెండు రాష్ట్రాల విద్యుత్ ఉద్యోగుల నుంచి ఆప్షన్లు స్వీకరించారు. తెలంగాణ నుంచి రిలీవైన 1,157 మంది ఉద్యోగుల్లో ఏపీకి ఆప్షన్లు ఇచ్చిన 613 మందితోపాటు ఆప్షన్లు ఇవ్వని 42మంది కలిపి 655 మంది, 2 రాష్ట్రాలకూ ఆప్షన్లు ఇచ్చిన 502 మందిని తెలంగాణకు కేటాయించింది. ఏపీ నుంచి స్వచ్ఛందంగా రిలీవై, తెలంగాణ విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న 229 మంది సెల్ఫ్ రిలీవ్డ్ ఉద్యోగులను తెలంగాణకు కేటాయించింది. తుది నివేదిక అమలు చేయడానికి, తుది కేటాయింపులకనుగుణంగా పోస్టింగులు పూర్తి చేసేందుకు 4 నెలల గడువు విధించింది. అయితే ఏపీ నుంచి తెలంగాణకు ఆప్షన్లు ఇచ్చిన 256 మంది ఉద్యోగుల విషయంలో ధర్మాధికారి కమిషన్ నివేదికలో ఎలాంటి నిర్ణయాన్ని తెలపలేదు. దీంతో ఈ 256 మందిని ఏపీకే కేటాయించినట్లయిందని తెలంగాణ జెన్కో డైరెక్టర్ ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. -
కొలిక్కిరాని ఆర్టీసీ ఆస్తుల పంపిణీ
♦ సెప్టెంబర్ 15న భేటీకి ఇరు రాష్ట్రాల అధికారుల నిర్ణయం ♦ ఉద్యోగుల విభజనపై మాత్రం ఏకాభిప్రాయం సాక్షి, అమరావతి: ఆర్టీసీ ఉమ్మడి ఆస్తుల పంపకంపై రెండు తెలుగు రాష్ట్రాల అధికారుల మధ్య ఏకాభి ప్రాయం రాలేదు. విజయవాడలోని ఆర్టీసీ హౌస్‌లో ఉమ్మడి బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావే శానికి ఏపీ, తెలంగాణ ఆర్టీసీ ఎండీలు మాలకొండయ్య, రమణరావు, కేంద్ర ప్రభుత్వం తరఫున అధికారులు ఆనందరావు, పాటిల్ హాజర య్యారు. బోర్డు సమావేశానికి ముందు తెలంగాణ అధికారులతో ఏపీ ఆర్టీసీ అధికారులు చర్చలు జరి పారు. 14 ఉమ్మడి ఆస్తులలో వాటా ఇవ్వాలని ఏపీ అధికారులు నివేదిక అందించారు. అయితే కేంద్రం గతేడాది హైదరాబాద్‌లోని బస్ భవన్ మాత్రమే ఉమ్మడి ఆస్తిగా ప్రకటించిందని తెలంగాణ అధికారులు తెలిపారు. 9, 10 షెడ్యూళ్ల ఆస్తుల పంపకాలు దామాషా ప్రకారం జరగాలని సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన విషయాన్ని ఏపీ అధికారులు గుర్తుచేశారు. సెప్టెంబర్ 15న మరోమారు బోర్డు సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకునేందుకు ఇరు రాష్ట్రాల అధికారులు అంగీకరించారు. ఉద్యోగుల విభజనపై మాత్రం ఇరు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. జూన్ 2016 నాటికి ఇరు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకుగాను ఉద్యోగుల పంపిణీ జరుగుతుందని స్పష్టం చేశారు. సూపర్వైజర్ల స్థాయిలో తొలుత ఉద్యోగులు ఇచ్చిన ఆప్షన్లను పరిశీలించనున్నారు. ఉమ్మడి ఆస్తుల్లో 58 శాతం దక్కాల్సిందే: ఏపీఎస్ఆర్టీసీ యూనియన్ల డిమాండ్ ఆర్టీసీ విభజన తర్వాత ఆంధ్రాకు 14 ఉమ్మడి ఆస్తులలో 58 శాతం వాటా దక్కాల్సిందేనని ఏపీఎస్ఆర్టీసీ యూనియన్లు నేషనల్ మజ్దూర్, ఎంప్లాయిస్ యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. -
కొత్త జిల్లాలంటే ఉత్తి లెక్కలు కాదు
పేదలకు సేవ చేయాలన్న చిత్తశుద్ధి ఉండాలి: సీఎం సాక్షి, హైదరాబాద్: ‘‘కొత్త జిల్లాలంటే కేవలం లెక్కలు, అంకెలు కాదు.. ప్రభుత్వం కొత్త జిల్లాలను ఎందుకు ఏర్పాటు చేస్తోందో అర్థం చేసుకోవాలి.. రాష్ట్ర స్థాయి అధికారులు, జిల్లా కలెక్టర్లందరిలోనూ ఆ తపన కనిపించాలి. ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేసే ప్రయత్నం జరగాలి.. పేదలకు సేవ చేయాలనే నిబద్ధత, చిత్తశుద్ధితో సన్నద్ధం కావాలి’’ అని సీఎం కేసీఆర్ మంగళవారం జరిగిన కలెక్టర్ల సమీక్షలో వ్యాఖ్యానించారు. ఏ జిల్లాకు ఎంత మంది ఉద్యోగులు అవసరమో ఇప్పటికీ లెక్క తేలకపోవటం, ఏ జిల్లాలో ఎన్ని మంజూరు పోస్టులున్నాయి, ఎందరు ఉద్యోగులు పని చేస్తున్నారనే వివరాలు అందుబాటులో లేకపోవటంపై సీఎం కొందరు అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. సమీక్షలకు వచ్చేటప్పుడు సమగ్రమైన సమాచారంతో రావాలన్నారు. సీఎం ఆశించిన మేరకు సమాచారం అందుబాటులో లేకపోవటం, ఉద్యోగుల కేటాయింపుపైనే ఇప్పటికీ సందిగ్ధత నెలకొనడంతో సీఎం ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. ప్రజాభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని హన్మకొండ జిల్లాను రద్దు చేసి వరంగల్ రూరల్ జిల్లాను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం పునరాలోచనలో ఉంది. అందుకు అనుగుణంగా కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం రెండ్రోజుల కిందటే అధికారులకు సూచించినట్లు తెలిసింది. మంగళవారం నాటి సమీక్షలో ఈ విషయం ప్రస్తావనకు రాకపోవటంతో అధికారులు అయోమయంలో పడ్డారు. గద్వాలను జిల్లా కేంద్రం చేయాలని ఆన్లైన్లో వేల సంఖ్యలో అభ్యంతరాలు వస్తున్నాయని చర్చకు వచ్చినప్పుడు.. అవన్నీ కొద్దిమంది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నవేనని, పట్టించుకోవాల్సిన అవసరమేమీ లేదని సీఎం అభిప్రాయపడ్డట్లు తెలిసింది. ప్రజల డిమాండ్‌ను బట్టి కొత్త మండలాలు అవసరముంటే రెండ్రోజుల్లోనే ప్రతిపాదనలు పంపించాలన్నారు. అలాగే పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయాలు అవసరమైతే ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. త్వరలోనే మరోమారు సమావేశమై పునర్వ్యవస్థీకరణకు సంబంధించి సందేహాలు, సమస్యలన్నీ నివృత్తి చేసుకుందామని చెప్పారు. ఉద్యోగుల విభజన పూర్తయిన శాఖలన్నీ జిల్లాల వారీగా ఆ సమాచారాన్ని సంబంధిత విభాగాలకు పంపించాలని, ఉద్యోగులను ఎక్కడికి కేటాయించారో సీజీజీ ఆన్లైన్లో వివరాలను పొందుపరచాలన్నారు. నెలాఖరులోగా అన్ని జిల్లాల్లో సంబంధిత విభాగాధిపతులు ఉద్యోగులకు వర్క్ టు ఆర్డర్లను జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగుల సర్వీసు రికార్డులు ప్రస్తుత జిల్లా కేంద్రంలోనే ఉంచాలని, స్కానింగ్ చేయించిన ప్రతులను వారికి కేటాయించిన కొత్త జిల్లాలకు పంపించాలని కలెక్టర్లకు సూచించారు. -
విభజనపై వీడనిపీటముడి
- వివాదాస్పదంగా డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ విభజన - తొమ్మిదో షెడ్యూల్ సంస్థలపై రెండు రాష్ట్రాల పేచీ - రాష్ట్ర ప్రభుత్వ నోడల్ అధికారిగా తిరుపతయ్య నియామకం - ఢిల్లీలో రాష్ట్ర విభజన వివాదాల పరిష్కార కమిటీ భేటీ సాక్షి, హైదరాబాద్ : ఏపీ పునర్విభజన చట్టంలోని తొమ్మిదో షెడ్యూల్ సంస్థల విభజనకు రాష్ట్ర ప్రభుత్వం నోడల్ అధికారిని నియమించింది. నోడల్ అధికారిగా డాక్టర్ కె.తిరుపతయ్యను నియమిస్తూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్‌శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతయ్య ప్రస్తుతం ఎంసీహెచ్ఆర్డీ అడిషనల్ డీజీ (శిక్షణ)గా పనిచేస్తున్నారు. మరోవైపు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని రాష్ట్ర విభజన వివాదాల పరిష్కార కమిటీ బుధవారం ఢిల్లీలో భేటీ అయింది. ఈ సమావేశానికి తెలంగాణ, ఏపీల విభజన శాఖల అధికారులు హాజరయ్యారు. కొద్దిరోజులుగా డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ వ్యవహారంపై రెండు రాష్ట్రాల మధ్య వివాదం నెలకొంది. ఈ సంస్థ ఆధ్వర్యంలోని విజయ డెయిరీ ఉత్పత్తులను తెలంగాణలో అమ్ముకునే హక్కులను ఏపీ ప్రభుత్వం మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ ప్రైవేట్ సంస్థ(సాంబశివ డెయిరీ)కి అప్పగించటంతో ఈ వివాదం మొదలైంది. గతేడాది మేలో రెండు రాష్ట్రాల మేనేజింగ్ బోర్డులు సమావేశమై రాష్ట్ర పునర్విభజన చట్టం 2014 సెక్షన్ 101, 103 ప్రకారం సంస్థ తాత్కాలిక విభజనను పూర్తి చేసుకున్నాయి. విభజన తర్వా త జాయింట్ అకౌంట్ మూసేసి విడివిడిగా బ్యాంకు ఖాతాలు తెరిచాయి. కానీ.. సంస్థ ఆర్థిక లావాదేవీలను జాయింట్ అకౌంట్ ద్వారానే నిర్వహించాలని ఏపీ వాదిస్తోంది. హైదరాబాద్ లాలాగూడలోని విజయ భవన్ నుంచి తెలంగాణ డెయిరీ డెవెలప్‌మెం ట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ డెయిరీ డెవెలప్మెంట్ కార్పొరేషన్ తరఫున ఈ వ్యాపారం నిర్వహిస్తోంది. కానీ సంస్థ విభజన జరగకుండానే తెలంగాణ ఈ వ్యాపారం చేస్తోందని, ఉద్యోగుల విభజన కూడా ఏకపక్షంగానే జరిగిందనే రెండు అభ్యంతరాలతో ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. మరోవైపు తొమ్మిదో షెడ్యూల్ సంస్థల ప్రధాన కార్యాలయం నిర్వచనంపై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తొమ్మిదో షెడ్యూల్ సంస్థల విభజనకు కేంద్రం గతంలోనే షీలాబేడీ నేతృత్వంలో కమిటీ వేసింది. ఆ కమిటీ గడువు ముగిసినా మళ్లీ పెంచలేదు. కనీసం ఆ కమిటీ నివేదికలు, మార్గదర్శకాలను సైతం వెల్లడించలేదు. కొత్తగా నోడల్ అధికారి నియామకంతోపాటు ఢిల్లీలో జరిగే భేటీతో విభజన ప్రక్రియ వేగవంతమవుతుందని అధికారవర్గాలు భావిస్తున్నాయి. భేటీలో తెలంగాణ నుంచి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, డెయిరీ డెవెలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ నిర్మల ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
కమల్‌నాథన్ కమిటీ మరోసారి భేటీ
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగుల విభజనపై ఏర్పాటుచేసిన కమల్‌నాథన్ కమిటీ గురువారం మరోసారి సమావేశమైంది. సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో ఉద్యోగుల విభజన అంశం ఓ కొలిక్కి వచ్చే అవకాశముంది. -
స్థానికత ఆధారంగా విభజన చేయండి
సచివాలయంలోని ‘డి’ బ్లాక్‌లో ఉద్యోగులు ధర్నా సాక్షి, హైదరాబాద్: స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన చేయాలంటూ సచివాలయ ఉద్యోగులు ‘డి’ బ్లాక్‌లో బుధవారం ధర్నా నిర్వహించారు. ఏపీ స్థానికత కలిగిన 83 మంది సెక్షన్ అధికారులు, 15 మంది అసిస్టెంట్ సెక్షన్ అధికారులను తెలంగాణకు కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గంట పాటు ఆందోళన చేశారు. ‘తెలంగాణలో ఇంకా ఆంధ్రా అధికారుల పెత్తనమా..సిగ్గు సిగ్గు’, ‘ఏఎస్‌ఓలకు వెంటనే ఎస్‌వోలుగా పదోన్నతులు కల్పించాలి’, అని ఉన్న ఫ్లకార్డులను ప్రదర్శించారు. ఏపీ స్థానికత కలిగిన ఉద్యోగులను వెంటనే వెనక్కి పంపేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. కొందరు ఉన్నతాధికారులు సీఎంని తప్పుదోవ పట్టించి తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యోగులకు కొత్త రిక్రూట్మెంట్, పదోన్నతులు లేకుండా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. -
58-42 దామాషాలోనే ఎస్వో, ఏఎస్‌వోల విభజన
* కమల్‌నాథన్ కమిటీ సూచనను అంగీకరించిన ఇరు రాష్ట్రాల సీఎస్‌లు * తెలంగాణకు కేటాయించిన వైద్యుల స్థానికత వివరాలు ఇవ్వాలని ఆదేశం సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల సచివాల యాల్లో పనిచేస్తున్న సెక్షన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ల విభజన ఓ కొలిక్కి వచ్చినట్టయింది. ఎస్వో, ఏఎస్‌వోలను 58-42 దామాషాలోనే విభజించాల్సిందిగా కమల్‌నాథన్ సూచించినట్టు తెలిసింది. శనివారం సచివాలయంలో కమల్‌నాథన్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశానికి ఏపీ, తెలంగాణ సీఎస్‌లు ఎస్పీ టక్కర్, రాజీవ్‌శర్మతో పాటు కొంతమంది సీనియర్ ఐఏఎస్ అధికారులు పాల్గొన్నారు. కొంతకాలంగా ఉద్యోగుల విభజన జాప్యం కావడం, ఏపీలో పదవీ విరమణ వయసు 60 ఏళ్లకు పెంచడంతో ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. రాష్ట్రం విభజించి రెండేళ్లు కావస్తున్నా ఇలాంటి సమస్యలు కొలిక్కి రాలేదు. మరీ ముఖ్యంగా ఏపీ సచివాలయ ఉద్యోగులు అమరావతికి తరలివెళ్లాల్సిన తరుణంలో ఉభయ సచివాలయ శాఖల్లో పనిచేస్తున్న ఎస్వో, ఏఎస్‌వోల విభజన ప్రధానంశంగా మారింది. ఈ నేపథ్యంలో శనివారం జరిగిన సమావేశంలో ఎస్వో, ఏఎస్‌వోల విభజన 58-42 దామాషాలోనే పంచుకోవాలని, ఇబ్బందులు తలెత్తితే సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించుకోవాలని సూచించారు. దీనికి ఇరు రాష్ట్రాల సీఎస్‌లు అంగీకరించినట్టు తెలిసింది. దీంతోపాటు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగుల విభజనపైనా చర్చ జరిగినట్టు సమాచారం. పదిరోజుల్లో లోకల్ స్టేటస్ తేల్చండి ఏపీకి చెందిన 300 మంది వైద్యులను అన్యాయంగా తెలంగాణకు కేటాయించారని తెలంగాణ వైద్యుల సంఘం వ్యతిరేకించిన నేపథ్యంలో.. అలా కేటాయిం చబడిన వారి స్థానికత వివరాలు పదిరోజుల్లో ఇవ్వాలని కమల్‌నాథన్ కమిటీ ఆదేశించింది. ఇరు రాష్ట్రాల వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో శనివారం కమల్‌నాథన్ కమిటీ సమావేశం జరిగింది. 4 నుంచి 10వ తరగతి వరకూ చదివిన స్టడీ సర్టిఫికెట్లుగానీ, లేదా నివా స ధృవపత్రాలుగానీ పొందు పరచాలని, ఈ ఆధారాలు ఉంటేనే తెలంగాణకు కేటాయింపు వర్తిస్తుందని అన్నట్టు తెలిసింది. దీంతో ఏపీ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఈ వివరాలు పదిరోజుల్లోగా ఆన్లైన్లో పెడతామని హామీ ఇచ్చారని సమాచారం. -
‘విద్యుత్’ చర్చలు విఫలం
♦ ఉద్యోగుల విభజన వివాదంపై జస్టిస్ ధర్మాధికారి సంప్రదింపులు నిష్ఫలం ♦ సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించుకోవాలని సూచన ♦ ఇరు రాష్ట్రాల అభిప్రాయాలపై త్వరలో హైకోర్టుకు కమిటీ నివేదిక సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఏడాది కాలంగా ఉప్పు నిప్పుగా ఉన్న విద్యుత్ ఉద్యోగుల విభజన అంశంపై జస్టిస్ ధర్మాధికారి కమిటీ సంప్రదింపులు విఫలమయ్యాయి. మూడు రోజులపాటు సుదీర్ఘంగా జరిగిన సమావేశాలు ఎలాంటి ఫలితం తేలకుండా ముగిశాయి. ఈ మినిట్స్ కాపీని ‘సాక్షి’ సంపాదించింది. ఇరు రాష్ట్రాల మధ్య కీలక అంశాల్లో ఏకాభిప్రాయం కుదరలేదని కమిటీ ఈ సమావేశాల మినిట్స్‌లో పేర్కొంది. ఈ సమావేశాల వివరాలను హైకోర్టుకు అప్పగించాలని, ఈ అంశంపై నిర్ణయాన్ని హైకోర్టుకే అప్పగించాలని నిర్ణయించింది. సుదీర్ఘంగా చర్చలు విద్యుత్ ఉద్యోగుల వివాద పరిష్కారం కోసం సుప్రీంకోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ ధర్మాధికారి నేతృత్వంలో ఇరు రాష్ట్రాల విద్యుత్ ఉన్నతాధికారులతో హైకోర్టు ఒక కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రెండో దఫా చర్చల్లో భాగంగా ఈ కమిటీ గత నెల 30, ఈ నెల 1, 2వ తేదీల్లో ఇరు రాష్ట్రాల అధికారులతో సుదీర్ఘంగా సంప్రదింపులు జరిపింది. సోమవారం రాత్రి 8 గంటల వరకు జరిగిన చివరి రోజు భేటీలో కూడా ఇరు రాష్ట్రాల అధికారులూ అవే వాదనలు వినిపించారు. స్థానికత ఆధారంగానే విద్యుత్ ఉద్యోగుల విభజన జరపాలన్న డిమాండ్‌ను తెలంగాణ బలంగా వినిపించింది. ఉద్యోగులకు ఆప్షన్లు ఇచ్చి సీనియారిటీ ప్రకారం విభజన జరపాలని ఏపీ పట్టుబట్టింది. ఇరు రాష్ట్రాల మధ్య కీలక అంశాల్లో తీవ్ర భేదాభిప్రాయాలు వ్యక్తం కావడంతో సమావేశాల వివరాలను హైకోర్టుకు వివరించి... నిర్ణయాన్ని కోర్టుకే అప్పగించాలని జస్టిస్ ధర్మాధికారి నిర్ణయించారు. ఆయన ప్రతిపాదించిన ముసాయిదా మార్గదర్శకాలను సైతం ఇరు రాష్ట్రాలు అంగీకరించలేదు. సూపర్ న్యూమరీ పోస్టుల మంజూరుకు తమ ప్రభుత్వం సిద్ధంగా లేదని ఏపీ ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి రాహుల్ పాండే చెప్పారు. ఆప్షన్లు ఇవ్వాల్సిందే: ఏపీ సరిపడా సంఖ్యలో పోస్టులు లేని సందర్భంలో ఉద్యోగుల కేటాయింపులు జరపకూడదని కమిటీ ఎదుట ఏపీ వాదించింది. 2014 జూన్ 1 నాటికి ఉన్న ఖాళీలను మినహాయించిన తర్వాతే తుది కేటాయింపులు జరపాలంది. డిస్కంల ఉద్యోగుల విభజన చేపట్టడానికి వీల్లేదంది. ఉమ్మడి రాష్ట్రం లోని ఏపీసీపీడీసీఎల్ నుంచి అనంతపురం, కర్నూలు జిల్లాలు ఏపీ పరిధిలోకి వెళ్లాయని... వాటితోపాటు ఆ జిల్లాల్లోని పోస్టులు, ఉద్యోగుల్ని ఏపీకి కేటాయించారని తెలిపింది. ఏపీఎన్పీడీసీఎల్ (ప్రస్తుత టీఎస్ఎన్పీడీసీఎల్) పరిధిలోని ఖమ్మం జిల్లా నుంచి 7 మండలాలు ఏపీకి వెళితే అక్కడి పోస్టులు, ఉద్యోగుల్నీ ఏపీకే కేటాయించారని గుర్తు చేసింది. ఏ రాష్ట్రానికి వెళ్లాలన్న అంశంపై ఉద్యోగులకు ఆప్షన్ ఇవ్వాలని డిమాండ్ చేసింది. స్థానికత ప్రాతిపదికనే: తెలంగాణ ఉన్నత స్థాయి పోస్టుల్లో ఏపీవారే ఎక్కువగా ఉండటంతోపాటు తెలంగాణకు జరి గిన అన్యాయాల నేపథ్యంలో... ఉద్యోగుల విభజనకు, పోస్టుల లభ్యతతో ముడిపెట్టాల్సిన అవసరం లేదని తెలంగాణ తేల్చి చెప్పింది. కేటాయింపుల్లో వచ్చే ఉద్యోగులకు సరిపడా ఖాళీ పోస్టుల్లేకుంటే సూపర్ న్యూమరీ పోస్టుల్ని సృష్టిం చుకోవాలని సూచించింది. 2009కి పూర్వం డిస్కంలలో జరిగిన నియామకాల్లో ‘ఆర్టికల్ 371డి’ నిబంధనను అమలు చేయనందున డిస్కంల ఉద్యోగుల విభజన సైతం జరపాలంది. ఉద్యోగులకు ఆప్షన్లు ఇవ్వడం విభజన చట్టం పరిధిలో లేని అంశమని స్పష్టం చేసింది. -
రిలీవైన విద్యుత్ ఉద్యోగులను మళ్లీ చేర్చుకోవద్దు
సాక్షి, హైదరాబాద్: రిలీవైన 1,252 మంది ఏపీ ఉద్యోగులను మళ్లీ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో చేర్చుకుంటే సహాయ నిరాకరణకు దిగుతామని తెలంగాణ విద్యుత్ ఇంజనీర్స్ సంఘాల సంయుక్త కమిటీ హెచ్చరించింది. రిలీవైన ఉద్యోగులను మళ్లీ తెలంగాణలో చేర్చుకుంటే పనివాతావరణం చెడిపోయే ప్రమాదముందని, వారితో కలసి పనిచేయడం సాధ్యం కాదని తేల్చిచెప్పింది. ఏ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగులు ఆ రాష్ట్రంలోనే పనిచేయాలని స్పష్టం చేసింది. విద్యుత్ ఉద్యోగుల విభజనకు మోకాలడ్డుతున్న ఏపీ విద్యుత్ సంస్థల యాజమాన్యాల వైఖరికి వ్యతిరేకంగా నాలుగు విద్యుత్ ఇంజనీర్ల సంఘాల సంయుక్త కమిటీ మంగళవారం విద్యుత్ సౌధలో నిరసన సభ నిర్వహించింది. తెలంగాణ విద్యుత్ రంగ ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడు ఎ.సుధాకర్‌రావు మాట్లాడుతూ రిలీవైన ఉద్యోగులకు తెలంగాణ విద్యుత్ సంస్థల్లో చోటు లేదని, ఏపీ ప్రభుత్వం తమ ప్రాంత ఉద్యోగులను ఆదరించి విధుల్లో చేర్చుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీ విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను తక్షణమే తెలంగాణకు కేటాయించాలని, విద్యుత్ ఉద్యోగుల విభజన ప్రక్రియను సత్వరం పూర్తి చేయాలని కోరారు. 4 నుంచి 7వ తరగతి(4/7) వరకు ఏ రాష్ట్రంలో చదివితే ఆ రాష్ట్ర స్థానికత కలిగి ఉన్నారని నిర్థారించి విద్యుత్ ఉద్యోగుల విభజన చేయాలన్న ప్రతిపాదనలను వ్యతిరేకిస్తున్నామని కొందరు ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. పుట్టిన తేదీ ఆధారంగానే స్థానికతను నిర్థారించి విభజన నిర్వహించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల మనోభావాల మేరకే ఉద్యోగుల విభజన జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ పేర్కొన్నారు. నిరసన సభలో పాల్గొన్న ఉద్యోగులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. శాంతియుతంగానే నిరసనలు తెలపాలని సూచించారు. సుప్రీంలో అప్పీల్ చేయాలి రిలీవైన 1,252 మంది విద్యుత్ ఉద్యోగులకు తెలంగాణ విద్యుత్ సంస్థలే 100 శాతం జీతాలు చెల్లించాలని సుప్రీంకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులపై అప్పీల్ చేయాలని విద్యుత్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. సుప్రీంలో అప్పీల్ చేస్తామని ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీని విస్మరించిన యాజమాన్యాలు రిలీవైన ఉద్యోగులకు పూర్తిగా జీతాలు చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేశాయని ఓ సీనియర్ ఇంజనీర్ ‘సాక్షి’కి తెలిపారు. ఈ నిర్ణయం సరికాదన్నారు. అప్పీల్ విషయంలో తెలంగాణ యాజమాన్యాలను ఒప్పించడంలో విఫలమైన ఉద్యోగ సంఘాలు సోమ, మంగళవారాల్లో పోటాపోటీగా నిరసనలు, ధర్నాలు చేయడం ఎందుకని కొందరు తెలంగాణ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. -
సచివాలయంలో కమల్ నాథన్ కమిటీ భేటీ
హైదరాబాద్: ఉద్యోగుల విభజనపై ఏర్పాటుచేసిన కమల్ నాథన్ కమిటీ బుధవారం హైదరాబాద్ లో సమావేశమైంది. సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇరు రాష్ట్రాలకు చెందిన అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ విభజనలపై కమిటీ చర్చించనుంది. -
ఉద్యోగుల విభజనలో వేగం పెంచండి
డీవోపీటీ అధికారులను కోరిన సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఏర్పాటైన రాష్ట్రంలో అధికారుల అవసరం ఎంతో ఉందని, ఉద్యోగుల విభజన వెంటనే పూర్తిచేయాలని డీవోపీటీ అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కోరారు. డీవోపీటీ కార్యదర్శి సంజయ్ కొఠారీ, సంయుక్త కార్యదర్శి అర్చనా వర్మ, డెరైక్టర్ మిస్ కిమ్ తదితరులు ముఖ్యమంత్రిని క్యాంపు కార్యాలయంలో బుధవారం కలిశారు. నీళ్లు, నియామకాలు, నిధుల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగిందని కేసీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఉద్యోగుల విభజనలో జాప్యం వల్ల పరిపాలనలో చిక్కులు వస్తున్నాయన్నారు. దీనికి కొఠారీ బదులిస్తూ రాష్ట్ర విభజన తర్వాత ఉద్యోగుల విభజన అంశాన్ని ముఖ్యమైన అంశంగా తీసుకున్నామని చెప్పారు. ఇప్పటి దాకా 92 శాఖల్లో దాదాపు 84 శాతం ఉద్యోగుల విభజన పూర్తయినట్లు వెల్లడించారు. ఆగస్టు నెలాఖరుకు ఉద్యోగుల విభజన పూర్తిచేస్తామని చెప్పారు. తెలంగాణకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కొరత ఉన్నందున 30 శాతం అదనంగా కేటాయించినట్లు వెల్లడించారు. -
‘రియల్’ కోసం ఉద్యోగులు బలి!
♦ పదేళ్లు హైదరాబాద్‌లో ఉండే అవకాశముండగా.. ♦ హడావుడి తరలింపు ఎందుకు? ♦ రియల్ఎస్టేట్ బూమ్ సృష్టించడానికి మమ్మల్ని వాడుకుంటారా? ♦ {పభుత్వ తీరును తీవ్రంగా తప్పుపడుతున్న ఉద్యోగులు సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తి కాకముందే.. కొత్త రాజధానిలో రియల్ఎస్టేట్ ప్రయోజనాలకోసం ఉద్యోగుల్ని హడావుడిగా తరలించడానికి ప్రభుత్వం ప్రయత్నించడం పట్ల వారిలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొత్త రాజధానికి వెళ్లడానికి తాము వ్యతిరేకం కాదని, అయితే ప్రభుత్వ పెద్దల్లో కొందరి స్వార్థ ప్రయోజనాలకోసం తమను వాడుకోవడమేంటని ఉద్యోగులు తప్పుపడుతున్నారు. పదేళ్లపాటు హైదరాబాద్‌లో ఉండేందుకు అవకాశముండగా.. హడావుడి తరలింపు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. కార్యాలయాలు, వసతి సదుపాయాల ఏర్పాటుకు కనీస చర్యలు చేపట్టకుండానే సిబ్బందిని తీసుకెళ్లడంవల్ల పాలనలో ఒనగూరే అదనపు ప్రయోజనం ఏమీలేకపోగా.. కొత్త ఇబ్బందులెదురవుతాయని వారు చెబుతున్నారు. విజయవాడ, దాని పరిసర ప్రాంతాల్లో కృత్రిమంగా రియల్ఎస్టేట్ బూమ్ సృష్టించడానికి, తద్వారా భారీగా సొమ్ము చేసుకోవడానికి ప్రభుత్వ పెద్దలు ఆపసోపాలు పడుతున్నారని విమర్శిస్తున్నారు. ఆర్భాటంగా శంకుస్థాపన నిర్వహించినా.. ‘రియల్’ ప్రయోజనం కనిపించకపోవడంతో ఉద్యోగుల్ని తీసుకెళ్లి బూమ్ సృష్టించడానికి పాట్లు పడుతున్నారని మండిపడుతున్నారు. ఎలక్ట్రానిక్ పాలన ఉందిగా.. ఏపీ ఉద్యోగులంతా హైదరాబాద్‌లోనే పనిచేయట్లేదు. రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పెద్దసంఖ్యలో ఉద్యోగులు పనిచేస్తున్నారు. సచి వాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు, ప్రభుత్వరంగ సంస్థల ప్రధాన కార్యాలయాల ఉద్యోగులే హైదరాబాద్‌లో పనిచేస్తున్నారు. హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఏపీ ఉద్యోగుల సంఖ్య 25 వేలు ఉంటుందని ప్రభుత్వ అంచనా. కాగా ఎలక్ట్రానిక్ యుగంలో టెక్నాలజీని సమర్థంగా వాడుకుంటున్నామని, పాలనలో టెక్నాలజీ వాడకానికి పేటెంట్ రైట్ తానే అన్నట్టుగా చెప్పుకొంటున్న సీఎం చంద్రబాబు.. ఉద్యోగులు ఎక్కడ కూర్చుంటున్నారనే విషయంతో సంబంధం లేకుండా పాలన సాగించలేరా? ఈ-ఫైల్స్ వ్యవస్థలో ఫైళ్లను నడిపించలేరా? అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నా రు. ఫైలు ఏస్థాయిలో ఎవరివద్ద ఉంది? అనే విషయాన్ని ఒక్క క్షణంలో చెప్పే టెక్నాలజీ అందుబాటులో ఉందని, సచివాలయం హైదరాబాద్‌లో ఉన్నా ఈ విధానంలో సమర్థంగా ఫైళ్లను నడిపించవచ్చని అభిప్రాయపడుతున్నారు. సీఎం కార్యాలయాలను ఖాళీచేస్తారా? విజయవాడకు తరలిపోయినట్లు సీఎం పదేపదే చెబుతున్నారని, మరి హైదరాబాద్‌లో ఉన్న ముఖ్యమంత్రి కార్యాలయాలను ఖాళీ చేస్తారా? అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్‌లో ఉండాల్సిన అవసరం లేద ని భావించినప్పుడు.. కేవలం ఏడాదికోసం సచివాలయంలోని సీఎం కార్యాలయానికి, లేక్‌వ్యూ అతిథిగృహంలోని క్యాంపు కార్యాలయానికి రూ.కోట్లు ఎందుకు ఖర్చుపెట్టారో చెప్పాలని, ప్రజల సొమ్మును విచ్చలవిడిగా ఖర్చుపెట్టే అధికారం ఎవరిచ్చారో చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సచివాలయ భవనాలకు వేసిన రంగులకు సంబంధించిన బిల్లులను ఇంకా చెల్లించనేలేదని గుర్తుచేస్తున్నారు. వెంటనే వెళ్లిపోవాలనుకుంటే భారీగా ఎందుకు ఖర్చుపెట్టారనే విషయంపై ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ‘ఓటుకు కోట్లు’ కేసులో ఇబ్బందులుంటే.. సీఎం విజయవాడలోనే ఉండాలని, అంతేగానీ అక్కడ కార్యాలయాలు కూడా లేకుండా ఉద్యోగుల్ని తరలి రావాలనడంలో అర్థం లేదని వారంటున్నారు. నోటిఫై చేసి తరలింపు ఉత్తర్వులివ్వండి ప్రభుత్వానికి రియల్ఎస్టేట్ ప్రయోజనాలు కాకుండా ప్రజాప్రయోజనాలకోసమే ఉద్యోగుల్ని తరలించాలనే చిత్తశుద్ధి ఉంటే.. కొత్త రాజధానిని తక్షణం నోటిఫై చేసి, ఉద్యోగుల తరలింపుపై తగిన ఉత్తర్వులివ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో హైదరాబాద్‌లోని కార్యాలయాలనూ ఖాళీచేయాలని, బంధాన్ని పూర్తిగా తెంచుకుని కొత్త రాజధానికి తరలిపోవడానికి సిద్ధమేనని వారు చెబుతున్నారు. కర్నూలునుంచి హైదరాబాద్‌కు రాజధాని మారినప్పుడు ఇదేతరహా ఉత్తర్వులిచ్చారని, అప్పుడు కర్నూలులో పూర్తిగా ఖాళీ చేసి వచ్చిన విషయాన్ని ఉద్యోగులు గుర్తు చేస్తున్నారు. రాజధాని ఎప్పుడు పూర్తవుతుందో చెప్పండి ‘రాజధానికి శంకుస్థాపన చేశారు. ఎప్పటిలోగా నిర్మాణం పూర్తిచేస్తారో చెప్పండి. పూర్తయిన మరుక్షణం రాజధానిని హైదరాబాద్ నుంచి తరలించండి. ఎవరికీ అభ్యంతరం లేదు. ఇప్పుడు విజయవాడ, గుంటూరు, మరోచోట.. తాత్కాలిక భవనాలు నిర్మించాల్సిన అవసరం ఏముంది? లేదంటే.. భారీగా అద్దెలు చెల్లించి తీసుకోవడం ఎందుకు? ఈ ఖర్చంతా ప్రజల మీద పడేదే కదా? రాజధాని శంకుస్థాపనకు ఉదారంగా ఖర్చు చేసినట్టుగా ప్రైవేటు వ్యక్తులు ఇస్తారా? యుద్ధప్రాతిపదికన ఏడాది కాలంలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తే.. ప్రజలమీద లేనిపోని భారం ఉండదు. అలా చేయకుండా, ప్రభుత్వ పెద్దల ప్రయోజనాలకోసం ఉద్యోగుల తరలింపు పేరిట అంతులేని వ్యయానికి తెరతీస్తున్నారు’ అని సచివాలయ ఉద్యోగులు విమర్శిస్తున్నారు. ఉమ్మడి రాజధాని..సెక్షన్-8 ఏమయ్యాయి? ఉమ్మడి రాజధానిలో ఏపీకి సర్వ హక్కులున్నాయని, పదేళ్లపాటు పాలన సాగిస్తామని టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైన ప్రారంభరోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పిన మాటలను ఉద్యోగులు గుర్తు చేస్తున్నారు. ‘ఓటుకు కోట్లు ’ కేసు హాట్‌గా ఉన్నప్పుడు సెక్షన్-8 గురించి ఊదరగొట్టిన సీఎం.. ఇప్పుడు హఠాత్తుగా రూటు మార్చడం వెనక ఉన్న ప్రయోజనాలేమిటో చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
ఏపీ నుంచి వచ్చిన వారికి పోస్టింగ్
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల విభజనలో భాగంగా ఏపీ నుంచి వచ్చిన ఆరుగురు అధికారులకు సాంకేతిక విద్యాశాఖలో తెలంగాణ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఏపీ నుంచి వచ్చిన ఎ.పుల్లయ్యను మెదక్ జిల్లా గోమారం పాలిటెక్నిక్ ప్రిన్సిపల్, బి.కుటుంబశాస్త్రిని కమిషనర్ కార్యాలయంలో డిప్యూటీ డెరైక్టర్‌గా నియమించారు. పీవీ రఘును క్యూక్యూ పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపల్‌గా, ప్రభాకర్‌రెడ్డిని అబ్దుల్లాపూర్‌మెట్ పాలిటెక్నిక్ ప్రిన్సిపల్‌గా, జయశేఖర్‌ను కమిషనర్ కార్యాలయంలో డిప్యూటీ డెరైక్టర్‌గా నియమించారు. చంద్ర శ్రీరాంకుమార్ను మాసబ్‌ట్యాంక్ పాలిటెక్నిక్‌లో కంప్యూటర్ హెడ్‌గా నియమించారు. -
సంచలనమేమీ లేదు!
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో తను సమావేశం కావడంలో ఎలాంటి సంచలనం లేదని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ చెప్పారు. హోంమంత్రితో భేటీ సాధారణ సమావేశమేనని, ఇందులో చెప్పడానికి ఏమీ లేదన్నారు. గురువారం సాయంత్రం హోం శాఖ కార్యదర్శి ఎల్సీ గోయల్‌తో 10 నిమిషాలు, ఆ తర్వాత హోం మంత్రి రాజ్‌నాథ్‌తో పావుగంట పాటు నరసింహన్ సమావేశమయ్యారు. రాష్ట్ర విభజన చట్టంలోని అపరిష్కృత హామీలు, షెడ్యూల్ 9, 10లోని ఉమ్మడి ఆస్తుల పంపిణీ, ఉద్యోగుల విభజన తదితర సమస్యల పరిష్కారంలో జరుగుతున్న జాప్యంతో రెండు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని చెప్పినట్టు తెలుస్తోంది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తాను నిర్వహించిన ‘ఎట్ హోం’ కార్యక్రమానికి ఇరు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, కేసీఆర్‌లు గైర్హాజరైన విషయాన్ని రాజ్‌నాథ్ దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. ఇరు రాష్ట్రాల్లోని విద్యాసంస్థల్లో ర్యాగింగ్ నిరోధానికి కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు గవర్నర్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దీనిపై త్వరలోనే సమావేశాన్ని నిర్వహించనున్నట్టు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ విషయంలో రాజ్యాంగబద్ధంగా వ్యవహరించలేదనే ఆరోపణలపై అడగ్గా.. ‘థాంక్యూ’ అని బదులిచ్చారు. జరిగిన పొరపాటును సరిదిద్దుతారా అని ప్రశ్నించగా, ‘చూద్దాం. రాజ్యాంగపరమైన సమస్య ఉత్పన్నమైనప్పుడు అధిగమిస్తాం’ అన్నారు. రాష్ట్రపతి ప్రణబ్‌ను పరామర్శించిన గవర్నర్ రాష్ట్రపతి ప్రణబ్ సతీమణి సువ్రా ముఖర్జీ ఇటీవల మృతి చెందిన నేపథ్యంలో ఆయనను గవర్నర్ నరసింహన్ దంపతులు పరామర్శించి సంతాపం తెలియచేశారు. -
ఉద్యోగుల విభజన వేగవంతం చేయిస్తా
తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీలకు కేంద్ర మంత్రి దత్తాత్రేయ హామీ సాక్షి, న్యూఢిల్లీ: ఉద్యోగుల విభజన ప్రక్రియను వేగవంతం చేయిస్తానని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలంగాణలోని వివిధ ఉద్యోగ సంఘాల జేఏసీల ప్రతినిధులకు హామీ ఇచ్చారు. ఢిల్లీలో మీ ప్రతినిధిగా ఉండి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్, సిబ్బంది వ్యవహారాల శాఖ మంత్రి జితేందర్ సింగ్, కమిటీలు, అధికారులతో సమావేశమై ఉద్యోగుల విభజన ఇంకా ఆలస్యం జరగకుండా సత్వరమే పూర్తిచేయించే బాధ్యత తీసుకుంటానన్నారు. తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి నేతృత్వంలో 13 ఉద్యోగ సంఘాల జేఏసీల ప్రతినిధులు శుక్రవారం ఇక్కడ మంత్రి దత్తాత్రేయను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటై 14 నెలలు కావస్తున్నా ఉద్యోగుల విభజన అపరిష్కృతంగానే ఉండటం బాధాకరమని, దీనికి గత ప్రభుత్వమే కారణమని దుయ్యబట్టారు. ఆదరా, బాదరాగా విభజన చట్టాన్ని చేసి అనేక సమస్యలు సృష్టించిందని విమర్శించారు. సంక్లిష్టమైన విషయాలను రాజ్యాంగ బద్ధంగా పరిష్కరించడానికి నైతిక బాధ్యత తీసుకుంటానన్నారు. ఉద్యోగుల విభజనలో ఏపీ, తెలంగాణకు అన్యాయం జరగకుండా చూస్తానని చెప్పారు. టీఎన్జీవో నేతలు శ్రీనివాస్‌గౌడ్, దేవీ ప్రసాద్, రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల విభజనకు సంబంధించి విభజన చట్టంలో ఉన్న మార్గదర్శకసూత్రాలను సవరించాలని డిమాండ్ చేశారు. స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన జరగాలని డిమాండ్ చేశారు. కమలనాథన్ కమిటీ కొత్త వివాదాలకు దారితీస్తు తెలంగాణకు నష్టం కలగజేస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ముందున్న బీజేపీ నేతృత్వంలోని కేంద్రం.. ఉద్యోగుల విభజన సమస్య పరిష్కరించాలని, లేని పక్షంలో మరో ఉద్యమం ఊపిరి పోసుకోనుందని హెచ్చరించారు. సహకారం ఉంటేనే విభజన.. * ఉద్యోగ సంఘాల నేతలతో అర్చనా వర్మ రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహకారం ఉంటేనే రాష్ట్రస్థాయి ఉద్యోగుల విభజన సాధ్యపడుతుందని కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం(డీవోపీటీ) సంయుక్త కార్యదర్శి అర్చనా వర్మ తనను కలిసిన తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలతో స్పష్టం చేశారు. రాష్ట్రస్థాయి ఉద్యోగుల విభజన ప్రక్రియను త్వరితగతిన చేపట్టాలని తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు శుక్రవారం డీవోపీటీ కార్యాలయంలో అర్చనా వర్మను కలసి ఒక వినతిపత్రం ఇచ్చారు. తెలంగాణలో ఖాళీగా ఉన్న ఉద్యోగులను నిరుద్యోగులతో భర్తీ చేయాల్సి ఉండగా.. ఆప్షన్ల పేరుతో ఏపీ ఉద్యోగులను భర్తీ చేసే విధానం సరికాదని, ఉద్యోగుల విభజన ప్రక్రియలో ఆప్షన్లు ఒక ప్రాతిపదికే తప్ప పూర్తిగా అదే ప్రాతిపదికన చేయాలని చట్టం చెప్పలేదని వివరించారు. అయితే ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించిన డీవోపీటీ సంయుక్త కార్యదర్శి స్పందిస్తూ రెండు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుంటేనే ఉద్యోగుల విభజన సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డట్టు తెలిసింది. -
మేమేం చేయలేం!
ఉద్యోగుల విభజనపై తేల్చిచెప్పిన కేంద్ర హోంశాఖ న్యూఢిల్లీ: తెలంగాణ, ఏపీల మధ్య ఉద్యోగుల విభజనపై తామేమీ చేయలేమని కేంద్ర హోంశాఖ తేల్చిచెప్పింది. దీనిపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుని సామరస్య పూర్వక ఒప్పందానికి వస్తే తప్ప ఈ సమస్య పరి ష్కారం కాబోదని స్పష్టం చేసింది. గురువారం తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు, ఎన్జీవోలతో పాటు టీఆర్ఎస్ ఎంపీలు జితేందర్‌రెడ్డి, కవిత, బి.వినోద్‌కుమార్, బీబీ పాటిల్, బూర నర్సయ్యగౌడ్ తదితరులు ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ఆ శాఖ అదనపు కార్యదర్శి అనంత్కుమార్సింగ్లతో భేటీ అయ్యా రు. రాష్ట్రస్థాయి ఉద్యోగుల విభజనను సాధ్యమైనంత త్వరగా చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన రాజ్‌నాథ్.. ‘‘తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులను స్థానికత ప్రాతిపదికన విభజించాలంటోంది. కానీ ఏపీ ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన, ఆప్షన్ల ప్రాతిపదికన విభజించాలంటోంది. చట్టంలో మాత్రం ఆప్షన్ల ప్రకారం విభజించాలని ఉంది. అందువల్ల 2 రాష్ట్రాల సీఎంలు కూర్చొని ఒక పరిష్కార మార్గం చూపితే మాకేమీ అభ్యంతరం లేదు. అది కాకుండా మేం ఏ మార్గదర్శకాలు ఇచ్చినా చట్టాన్ని ఉల్లంఘించినట్లు అవుతుంది. మీరు స్థానికత ఆధారంగా విద్యుత్ ఉద్యోగులను పంపించేశారు. ఒకవేళ వాళ్లు ఆప్షన్ల ఆధారంగా విభజించుకుంటే సంబంధిత ఉద్యోగులకు అదే పరిస్థితి ఎదురవుతుంది. అందువల్ల మధ్యే మార్గం ఉండాలి. లేదంటే కమల్‌నాథన్ కమిటీ మార్గదర్శకాలను పాటించాలి. చట్టంలో ఏదైనా సందిగ్ధత ఉంటే ఆ సెక్షన్లపై మేము వివరణ మాత్రమే ఇవ్వగలం..’’ అని తేల్చిచెప్పారు. దీనిపై స్పందించిన తెలంగాణ ప్రతినిధి బృం దం... ఏపీలో ఉద్యోగ ఖాళీలున్నప్పటికీ తెలంగాణలో ఆప్షన్ కోరుకుంటే ఇక్కడి ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందని, అలాంటప్పుడు పరిస్థితి ఇంకా జటిలం అవుతుందని వివరించింది. దీంతో రాష్ట్రస్థాయి ఉద్యోగుల విభజన అంశం కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ(డీవోపీటీ) పరిధిలోకి వస్తుందని, ఆ శాఖ మంత్రిని కలవడం మంచిదని రాజ్‌నాథ్ సూచించారు. ఈ నేపథ్యంలో ప్రతినిధి బృందం డీవోపీటీ మంత్రి వద్దకు వెళ్లి... సమస్య మొత్తాన్ని వివరించింది. అయితే తమ శాఖ కార్యదర్శి అర్చనావర్మ హైదరాబాద్‌లో ఉన్నారని, శుక్రవారం రాగానే సమావేశమవ్వాలని ప్రతినిధి బృందానికి మంత్రి సూచించారు. వెంటనే పరిష్కరించాలని కోరాం..: కవిత ఉద్యోగుల విభజనపై సత్వరమే కచ్చితమైన పరిష్కారం చూపాలని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, సిబ్బంది వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్రసింగ్‌ను కోరామని ఎంపీ కవిత చెప్పారు. కేంద్ర మంత్రులతో భేటీ అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజన తర్వాత ఉద్యోగులు, ఉద్యోగుల భద్రత, పదోన్నతులు, విభజన తర్వాత వచ్చే కొత్త ఉద్యోగాలు చాలా ముఖ్యమైనవని, వాటిని సాధించుకోవాల్సి ఉందన్నారు. ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను రిలీవ్ చేస్తే తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని... అలాగే తెలంగాణలో పనిచేస్తున్న 10వేల మంది ఏపీ ఉద్యోగులను ఆ రాష్ట్రానికి పంపడానికి మార్గదర్శకాలు ఇవ్వాలని కోరామని చెప్పారు. తమ డిమాండ్లపై రాజ్‌నాథ్, జితేంద్రసింగ్ సానుకూలంగా స్పందించారని, శుక్రవారం అధికారులతో సమావేశం నిర్వహిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. టీఎన్జీవోల నేత దేవీప్రసాద్ మాట్లాడుతూ... ఉద్యోగుల విభజనలో లోపభూయిష్ట అంశాలు, స్థానికతను పక్కనపెడుతున్న తీరును రాజ్‌నాథ్, జితేంద్రసింగ్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఉద్యోగుల విభజనకు ఏపీ ప్రభుత్వం మోకాలడ్డుతోందని ఆరోపించారు. టీజీవోల నేత శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. జోనల్, జిల్లా, మల్టీజోనల్‌లో జరిగిన ఉద్యోగాల భర్తీకి సంబంధించి స్థానికతను గుర్తించడానికి కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల విభజన కోసం మరో ఉద్యమం తప్పదన్నారు. ఉద్యోగుల ప్రతినిధి బృందంలో రవీందర్‌రెడ్డి, చంద్రశేఖర్‌గౌడ్, మధుసూదన్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
స్థానికత ఆధారంగానే విభజన
ఉద్యోగుల పంపిణీలో మరో విధానం వద్దని కేంద్రానికి స్పష్టం చేశాం: సీఎస్ రాజీవ్ శర్మ సాక్షి, న్యూఢిల్లీ: స్థానికతను ఆధారంగా చేసుకునే ఉద్యోగుల విభజన జరగాలని కేంద్ర హోంశాఖకు స్పష్టం చేశామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ చెప్పారు. దీనికి మరో పద్ధతేదీ పెట్టుకోవద్దని కోరామని తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 9, 10 షెడ్యూళ్లకు సంబంధించి ఉద్యోగుల విభజనపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోయల్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఉద్యోగుల విభజనపై ఏపీ, తెలంగాణ సీఎస్‌లు ఐవైఆర్ కృష్ణారావు, రాజీవ్‌శర్మ ఉద్యోగుల ఇరు ప్రభుత్వాల వైఖరులను తెలియచేశారు. అనంతరం రాజీవ్‌శర్మ మీడియాతో మాట్లాడారు. 9వ షెడ్యూల్లోని ఉద్యోగుల విభజనతో పాటు ప్రత్యేకంగా విద్యుత్ ఉద్యోగుల అంశంపై చర్చ జరిగిందని ఆయన చెప్పారు. ‘‘తెలంగాణ ప్రభుత్వ వైఖరి స్పష్టంగా ఉంది. స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన చేయాలి. వేరే పద్ధతి పెట్టుకోవద్దని చెప్పాం. ఇక విద్యుత్ ఉద్యోగుల రిలీవ్ వ్యవహారం హైకోర్టు పరిధిలో ఉంది. మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ అప్పీలు కూడా చేశాం. హైకోర్టు తీర్పు వచ్చే వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోబోం..’’ అని వెల్లడించారు. ఉద్యోగుల విభజనకు సంబంధించి కమిటీ ఏర్పాటు ప్రతిపాదనపై ఇరు రాష్ట్రాల అభిప్రాయాలు తెలియచేయాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోయల్ సూచించారని చెప్పారు. కేసు హైకోర్టు పరిధిలో ఉన్నందున కమిటీ ఏర్పాటు సహా మరే ప్రత్యామ్నాయం సాధ్యం కాదని చెప్పామన్నారు. కాగా సమావేశంలో ఏపీ తరఫున ఏం చెప్పారనే దానిపై ఏపీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావును ప్రశ్నించగా...వివరాలు చెప్పేందుకు నిరాకరించారు. -
ఉద్యోగుల విభజన ఇంకెన్నాళ్లు?
అక్టోబర్ 15 లోపు పూర్తికాకపోతే ఢిల్లీలో తేల్చుకుంటాం: శ్రీనివాస్‌గౌడ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం విడిపోయినా ఇంకా ఉద్యోగులు, సంస్థల విభజన జరగలేదని.. దాని వల్ల తెలంగాణలోని ఉద్యోగులు, విద్యార్థులకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం చైర్మన్, ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. శనివారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యోగాల నోటిఫికేషన్లు రాకపోవడానికి, ఉద్యోగులకు పదోన్నతులు లభించకపోవడానికి ఉద్యోగుల విభజనలో జాప్యమే కారణమన్నారు. రాష్ట్రస్థాయి అధికారుల విభజన కోసం ఏర్పాటైన కమల్‌నాథన్ కమిటీ తీవ్ర జాప్యం చేస్తోందని మండిపడ్డారు. ఇక పదో షెడ్యూల్లోని సంస్థల విభజనలో షీలాబిడే కమిటీ కాలయాపన చేస్తోందన్నారు. ఈ అంశాల జాప్యంపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. ఈ ఏడాది అక్టోబర్ 15 నాటికి ఉద్యోగుల విభజన జరగాల్సి ఉండగా... కమిటీలు కాలక్షేపం చేస్తున్నాయన్నారు. గడువులోగా ఉద్యోగుల విభజన జరగకపోతే ఢిల్లీలో తేల్చుకుంటామని హెచ్చరించారు. విభజన జరిగిన ప్రభుత్వ శాఖల్లోని హెచ్వోడీలు పాత స్థానాల్లోనే ఉండేందుకు సాకులు వెదుకుతున్నారని, తెలంగాణవారిమని చెప్పుకొనేందుకు దొంగ బోనఫైడ్ సర్టిఫికెట్లు సృష్టిస్తున్నారని ఆరోపించారు. అలాంటి వారు భవిష్యత్తులో తీవ్ర సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. -
విభజనాంశాలపై పార్లమెంటును స్తంభింపజేస్తాం
రౌండ్ టేబుల్ సమావేశంలో ఎంపీ కవిత రాష్ట్రం పట్ల కొన్ని విషయాల్లో ప్రధాని తీరు సరిగా లేదు దొంగలకే పెద్ద దొంగగా చంద్రబాబు వ్యవహారం హైదరాబాద్: హైకోర్టు, ఉద్యోగుల విభజనతోపాటు తెలంగాణకు సంబంధించిన కీలకాంశాలపై పార్లమెంటును స్తంభింపజేయడం ద్వారా కేంద్రాన్ని నిలదీస్తామని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తెలిపారు. రాష్ట్రంపట్ల కొన్ని విషయాల్లో ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న తీరు సరిగ్గా లేదని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ‘ప్రభుత్వరంగ సంస్థల్లో ఆస్తులు, ఉద్యోగుల విభజన, ఎదుర్కొంటున్న సవాళ్లు-పరిష్కారాలు’ అనే అంశంపై సోమవారం హైదరాబాద్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత ప్రసంగించారు. రాష్ట్రం ఏర్పడ్డాక ఉద్యమాల అవసరం ఉండదని భావించినా ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ సీఎం చంద్రబాబు చేస్తున్న కుట్రల వల్ల వాటిని కొనసాగించాల్సి వస్తోందన్నారు. పొరుగు రాష్ట్ర పాలకులు తెలంగాణ అభివృద్ధి చెందకుండా ప్రాజెక్టులను అడ్డుకునే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఉద్యోగుల విభజన పూర్తికాకపోవడం, ఖాళీలను గుర్తించకపోవడం వల్ల ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్లు ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. పరాయి సొమ్ము తినడానికి అలవాటు పడిన చంద్రబాబు, సీమాంధ్ర అధికారులు అడ్డదారిలో ప్రభుత్వరంగ సంస్థల్లో పాగా వేసి, తెలంగాణ బిడ్డలకు దక్కాల్సిన ఉద్యోగాలు దక్కకుండా చేస్తున్నారని, దొంగలకే పెద్దగా దొంగగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని కవిత దుయ్యబట్టారు. విభజన చట్టానికి విరుద్ధంగా, అక్రమంగా సీమాంధ్ర అధికారులు ఫైళ్లు అపహరించుకుపోతున్నారని ఆరోపించారు. భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ హైకోర్టు, ఉద్యోగుల విభ జనపై కేంద్రం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు సభను స్తంభింపజేస్తామన్నారు. ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ ఉద్యోగుల విభజనకు వేసిన షీలాభిడే, కమలనాథన్ కమిటీలు ఏడాదైనా విభజన ప్రక్రియను పూర్తిచేయట్లేదని విమర్శించారు. జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ ఉద్యోగుల విభజనపై జేఏసీలో సబ్ కమిటీ వేసి చాలా సమాచారం సేకరించామని, త్వరలో రాష్ట్రం, కేంద్రానికి అందజేస్తామన్నారు. టీజీవో గౌరవాధ్యక్షుడు దేవీప్రసాద్ మాట్లాడుతూ ఉద్యోగుల విభజనశాస్త్రీయ పద్ధతిలో జరుగలేదన్నారు. విద్యుత్తు ఉద్యోగుల విభ జన విషయంలో చేపట్టిన విధానం అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో అమలు చేయాలన్నారు. సమావేశంలో టీఎన్జీవో అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, టీజీవో అధ్యక్షురాలు మమత మాట్లాడుతూ స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన జరగాలన్నారు. ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగుల జేఏసీ చైర్మన్ శివాజీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కన్వీనర్ థామస్‌రెడ్డి, వివిధ ఉద్యోగ సంఘాలు, జేఏసీల నేతలు పాల్గొన్నారు. -
‘సూపర్ న్యూమరరీ’కి ఓకే
* రెండు రాష్ట్రాల సీఎస్ల అంగీకారం * 88 విభాగాల్లో 13,070 మంది ఉద్యోగుల పంపిణీ * ఏపీకి 1,005 మంది తెలంగాణ ఉద్యోగులు * తెలంగాణకు 394 మంది ఆంధ్రా ఉద్యోగులు సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల విభజన ప్రక్రియ కొనసాగుతున్న క్రమంలోనే అవసరాన్ని బట్టి సూపర్ న్యూమరరీ పోస్టుల ఏర్పాటు ప్రక్రియ కూడా కొనసాగించేందుకు 2 రాష్ట్రాల మధ్య సూత్రప్రాయంగా అంగీకారం కుదిరింది. రాష్ట్ర స్థాయి ఉద్యోగుల ప్రొవిజనల్ పంపిణీలో ఒక రాష్ట్రానికి కేటాయించిన ఉద్యోగులెవరైనా అభ్యంతరం వ్యక్తం చేసిన పక్షంలో అటువంటి ఉద్యోగులను రిలీవ్ చేయకూడదనే నిబంధన ఉంది. అలాగే అభ్యంతరం వ్యక్తం చేయని ఉద్యోగులను రిలీవ్ చేయకుండా నిలువరించకూడదనే నిబంధన ఉంది. ఈ నేపథ్యంలో ఒక రాష్ట్రానికి చెందిన ఉద్యోగి అభ్యం తరం వ్యక్తం చేసి, మరో రాష్ట్రానికి చెందిన ఉద్యోగి అభ్యంతరం వ్యక్తం చేయకపోవడంతో సూపర్ న్యూమరరీ పోస్టులను ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో వచ్చే మార్చి వరకు ఇరు రాష్ట్రాల్లో తాత్కాలికంగా సూపర్ న్యూమరరీ పోస్టుల ఏర్పాటునకు రాష్ట్ర పునర్విభజన విభాగం పంపిన ప్రతిపాదనలకు ఇరు రాష్ట్రాల సీఎస్‌లు అంగీకరించారు. ఇలా ఉండగా ఇరు రాష్ట్రాల మధ్య రాష్ట్ర స్థాయి కేడర్ ఉద్యోగుల ప్రొవిజనల్ పంపిణీ చివరి దశకు చేరుతోంది. కమలనాథన్ కమిటీ ఇప్పటికే 88 విభాగాల్లోని 13,070 ఉద్యోగులను ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేస్తూ నోటిఫికేషన్లు జారీ చేసింది. పక్షం రోజుల్లో మిగతా విభాగాల్లోనూ ఈ ప్రక్రియ పూర్తి కానుంది. 13,070 ఉద్యోగుల్లో మార్గదర్శకాలు, స్థానికత, ఆప్షన్లు ఆధారంగా ఏపీకి 6,770 మంది ఉద్యోగులను, తెలంగాణకు 6,300 ఉద్యోగులను పంపిణీ చేశారు. అత్యధికంగా తెలంగాణకు చెందిన ఉద్యోగులను ఆంధ్రాకు కేటాయించారు. 1,005 మంది తెలంగాణ ఉద్యోగులు ఏపీకి పంపిణీ అయ్యా రు. కేవలం 394 మంది ఏపీ ఉద్యోగులే తెలంగాణకు పంపిణీ అయ్యారు. ఈ ప్రొవిజనల్ పంపిణీపై అభ్యంతరాల్లేని వారు పంపిణీ అయిన రాష్ట్రాలకు వెళ్లి చేరిపోతున్నారు. అభ్యంతరాలు వ్యక్తం చేసిన ఉద్యోగులను మాత్రం రిలీవ్ చేయకుండా నిలుపుదల చేస్తున్నారు. అభ్యంతరాలను పరిష్కరించాలంటే ఉద్యోగుల తుది పంపిణీ ప్రక్రియా పూర్తి కావాలి. పలు విభాగాల్లో ఉద్యోగుల తాత్కాలిక పంపిణీకి అవసరమైన సమాచారాన్ని పంపించనందున తక్షణం ఉద్యోగుల సమాచారాన్ని రాష్ట్ర పునర్విభజన విభాగానికి పంపాల్సిందిగా ఏపీ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు ఆయా విభాగాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇరు రాష్ట్రాల ఉద్యోగుల పంపిణీ ఇలా.. స్థానికత ఏపీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 5,635 394 తెలంగాణ 1,005 5,813 నాన్ లోకల్ 130 93 మొత్తం 6,770 6,300 -
ఇక కోర్టులోనే తేల్చుకుంటాం
* ఏపీ విద్యుత్ ఉద్యోగులు తొందరపాటుతో కోర్టుకెళ్లారు * ఇక చర్చలకు అవకాశం లేదు * కోర్టుకు వెళ్లకపోయి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది * చర్చలు జరిపి మార్గదర్శకాలపై పునఃపరిశీలన చేసేవాళ్లం * ‘సాక్షి’తో రాష్ట్ర ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల విభజన విషయంలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలు, ఉద్యోగులతో ఇక చర్చల ప్రసక్తే లేదని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సంస్థల చెర్మైన్, మేనేజింగ్ డెరైక్టర్ డి.ప్రభాకర్‌రావు కుండబద్దలు కొట్టారు. ఏపీ ఉద్యోగులు తొందరపాటుతో హైకోర్టును ఆశ్రయించడంతో చర్చలకు తలుపులు మూసుకుపోయాయన్నారు. ఈ అంశాన్ని తాము సైతం కోర్టులోనే తేల్చుకుంటామన్నారు. తెలంగాణ ట్రాన్స్‌కో రూపొందించిన ఉద్యోగుల 1,251 మంది ఏపీ స్థానికత గల ఉద్యోగులను రిలీవ్ చేస్తూ తెలంగాణ విద్యుత్ సంస్థలు ఇచ్చిన ఉత్తర్వులను నిలుపుదల చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఈ నెల 13న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఉద్యోగుల విభజన మార్గదర్శకాలు ఈ నెల 6న, ఉద్యోగుల రిలీవ్ ఉత్తర్వులు ఈ నెల 10, 11 తేదీల్లో జారీ కాగా, కొందరు ఏపీ ఉద్యోగులు 11న హైకోర్టును ఆశ్రయించారు. ఇరు రాష్ట్రాల మధ్య వివాదంగా మారిన ఈ అంశంపై గురువారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. సింగిల్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ సోమవారం డివిజన్ బెంచ్ ముందు అప్పీలు పిటిషన్ వేస్తామన్నారు. ఏపీ ఉద్యోగులు తొందరపడి హైకోర్టుకు వెళ్లకుండా ఉంటే, ఏపీ ట్రాన్స్‌కో, జెన్కో మేనేజింగ్ డెరైక్టర్ విజయానంద్‌తో చర్చలు జరిపి ఆయన సూచనల మేరకు ఉద్యోగుల విభజన మార్గదర్శకాల్లో మార్పులు చేసే అవకాశం ఉండేదన్నారు. ఇరు రాష్ట్రాల విద్యుత్ సంస్థలకు ‘సమాన హోదా’ గల ఉమ్మడి కమిటీని ఏర్పాటు చేసి ఉద్యోగుల విభజన మార్గదర్శకాలను రూపొందించుకుందామని పలుమార్లు లేఖలు రాసినా ఏపీ సంస్థల నుంచి స్పందన లేదన్నారు. ఏపీ నుంచి సరైన సహకారం లేకపోవడంతోనే తామే ఉద్యోగుల విభజన జరిపామన్నారు. ఏపీలో పనిచేస్తున్న 450 మంది తెలంగాణ ఉద్యోగులను సొంత రాష్ట్రానికి పంపాలని కోరినా అక్కడి ప్రభుత్వం ఒప్పుకోలేదన్నారు. సాగర్ టెయిల్‌పాండ్ రాష్ట్రానిదే.. ఆస్తుల కేటాయింపుల్లో భాగంగా నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ తెలంగాణకు వచ్చిందని ప్రభాకర్‌రావు స్పష్టం చేశారు. తాజాగా టెయిల్‌పాండ్ విద్యుత్ కేంద్రం వద్ద ఏపీ ప్రభుత్వం భద్రతా దళాలను ఎందుకు మోహరించిందో తనకు తెలియదని, ఈ అంశంపై ఇటీవల కాలంలో ఏపీతో ఎలాంటి ఉత్తరప్రత్యుత్తరాలు జరగలేదని ఆయన తెలిపారు. -
విద్యుత్ ఉద్యోగుల విభజన సమంజసమే
గవర్నర్‌కు నివేదించిన తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఏపీ విద్యుత్ సంస్థలు, ఉద్యోగుల ఆరోపణలకు సమాధానాలు సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల విభజన విషయంలో ఏపీ విద్యుత్ సంస్థలు, విద్యుత్ ఉద్యోగుల సంఘాలు నిరాధారమైన ఆరోపణలు చేస్తూ తెలంగాణ విద్యుత్ సంస్థలను అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ మండిపడింది. విభజన చట్టానికి లోబడే ఉద్యోగుల విభజనను తెలంగాణ విద్యుత్ సంస్థలు జరిపాయని స్పష్టం చేసింది. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధుల బృందం మంగళవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలసి ఉద్యోగుల విభజన పూర్వపరాలను, తమ వాదనలను తెలియజేశారు. ఏపీ ఉద్యోగ సంఘాలు చేస్తున్న నాలుగు ప్రధానఆరోపణల వెనక వున్న వాస్తవాలను వినతిపత్రం రూపంలో గవర్నర్‌కు సమర్పించారు. గవర్నర్‌ను కలసినవారిలో జేఏసీ నేతలు శ్రీనివాస్, ముష్టాక్, నాగరాజు, ఆరుద్ర తదితరులున్నారు. ఏపీ ఆరోపణలు.. టీవిద్యుత్ సమాధానాలు ఆరోపణ-1: ఏపీని సంప్రదించకుండానే తెలంగాణ విద్యుత్‌సంస్థ లు ఉద్యోగుల తుది కేటాయింపుల మార్గదర్శకాలను రూపొందించాయి. వాస్తవం: విభజన చట్టంలోని సెక్షన్ 77 ప్రభుత్వ ఉద్యోగుల కేటాయింపులకు, సెక్షన్ 82 ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల కేటాయింపులకు వర్తిస్తాయి. విద్యుత్ ఉద్యోగుల విభజనకు సెక్షన్ 77 వర్తింపజేస్తూ ఏపీ సంస్థలు మార్గదర్శకాలను రూపొందించగా, తెలంగాణ సంస్థలు తిరస్కరించాయి. కమల్‌నాథన్ కమిటీ సైతం ఇదే నిర్ణయా న్ని సమర్థించింది. తప్పనిపరిస్థితిలో తెలంగాణ సంస్థలు మార్గదర్శకాలను రూపొందించాయి. ఆరోపణ-2: రాష్ట్రపతి ఉత్తర్వుల్లో పేర్కొన్న నిర్వచనం ఆధారంగా ‘స్థానికత’(లోకల్ స్టేటస్)ను నిర్థారించాలి. వాస్తవం: ప్రభుత్వ రంగసంస్థలకు రాష్ట్రపతి ఉత్తర్వులు-1975 వర్తించవని ఉమ్మడి ఏపీ పాలకులు నిర్ణయించి 2009 వరకు కట్టుబడి వున్నారు. గతంలో ఉన్న వాదనతో పాటు విభజన చట్టంలోని నిబంధనల ప్రకారం ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల విభజనకు రాష్ట్రపతి ఉత్తర్వులు ఏ మాత్రం ఆధారంకాదు. రాష్ట్రపతి ఉత్తర్వుల స్ఫూర్తి పేరు తో 2009 నుంచి ‘371 డీ’ను అమలు చేస్తూ నియమించిన ఉద్యోగులను తెలంగాణ సంస్థలు రిలీవ్ చేయలేదు. ఆరోపణ-3: రిలీవ్ చేసిన ఉద్యోగులను ఏపీకి పంపే అధికారం తెలంగాణ సంస్థలకు లేదు. వాస్తవం: ఏపీ విద్యుత్ సంస్థలు తమ వంతు ఉద్యోగుల విభజన మార్గదర్శకాలను గడువులోగా రూపొందించుకోవడంలో విఫలమైనంత మాత్రాన.. ఆ రాష్ట్ర ఉద్యోగులు తెలంగాణలో శాశ్వతంగా కొనసాగడానికి వీలులేదు. ఏపీలోని టిఉద్యోగులను రిలీవ్ చేయాలని పలుమార్లు కోరినా ఏపీ సంస్థలు ఒప్పుకోలేదు. ఉమ్మడి రాష్ట్రంలో 75 వేలకుపైగా కొలువులు ఉంటే, విభజనలో భాగంగా తెలంగాణ నుంచి ఏపీకి నామమాత్రంగా 1,231 మంది వెళ్తుండగా, ఏపీ నుంచి తెలంగాణకు 450 మంది రావాల్సి ఉంది. ఆరోపణ-4: టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్ సంస్థల పరిధి తెలంగాణకే పరిమితం. ఈ సంస్థల ఉద్యోగులను ఏపీకి పంపలేరు. వాస్తవం: రాష్ట్ర విభజన అనంతరం ఏపీసీపీడీసీఎల్ పేరు టీఎస్ఎస్పీడీసీఎల్గా మారింది. ఏపీసీపీడీసీఎల్ పరిధిలోని కర్నూలు, అనంతపురం జిల్లాలు అవశేషాంధ్రప్రదేశ్లోకి వెళ్లాయి. అలాగే విభజన చట్టం ప్రకారం టీఎస్ఎన్పీడీసీఎల్ పరిధిలోని ఏడు మండలాలు(ఖమ్మం జిల్లా) ఏపీలో విలీనమయ్యాయి. వీటిల్లో విద్యుత్ సరఫరాను ఏపీఈపీడీసీఎల్ చూస్తోంది. ఏపీలో సంస్థలు విలీనమైన నేపథ్యంలో ఉద్యోగుల పంపకాలు కూడా జరపవచ్చు. -
నిక్కచ్చిగా ఉద్యోగుల విభజన
సాక్షి, హైదరాబాద్: స్వీయ ధ్రువీకరణలో ఉద్యోగులిచ్చిన సమాచారం ఆధారంగానే తెలంగాణ,ఏపీలకు వారి తాత్కాలిక కేటాయింపు జరుగుతుందని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టం చేశాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ఏపీ సీఎస్ ఐవీఆర్ కృష్ణారావు మంగళవారం ఈ మేరకు సంయుక్తంగా ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర కేడర్ ఉద్యోగుల కేటాయింపులో భాగంగా ఆప్షన్ల మరింత నిక్కచ్చిగా పరిశీలించేందుకు సంబంధిత ధ్రువ పత్రాలతో పాటు ఆప్షన్ ఫారాలను కూడా అప్లోడ్ చేయాలని ఉన్నతాధికారులకు వారు సూచించారు. ఉద్యోగుల విభజనకు సంబంధించిన సమాచారాన్ని మరింత పక్కాగా అందించాలని, రికార్డులన్నింటినీ స్కాన్ చేసి ఆన్లైన్లో పొందుపరచాలని అన్ని విభాగాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ‘‘విభాగావారీగా వివరాలు, సీనియారిటీ జాబితాలు, ఉద్యోగులు తమ సంతకంతో ఇచ్చిన ఆప్షన్ ఫారాలు, ధ్రువీకరణ పత్రాలన్నింటిపై అధికారులు స్వయంగా సంతకం చేసి, స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. తాత్కాలిక కేటాయింపులో అభ్యంతరాలేమైనా ఉంటే ఉద్యోగులు తాము పని చేస్తున్న రాష్ట్రంలోనే తమ విభాగపు ఉన్నతాధికారికి దరఖాస్తు చేసుకునే అవకాశముంటుంది. అర్జీని రాతపూర్వకంగా అందించటంతో పాటు ఆన్‌లైన్‌లోనూ ఆ వివరాలు పొందుపరచాలి. రీఆర్గనైజైషన్ వెబ్ పోర్టల్‌లో ఇందుకు వీలు కల్పించనున్నాం. అందులో నమోదు చేసిన వివరాలను కూడా డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకోవాలి. ఆ కాపీపై సంతకం చేసి తమ విభాగ ఉన్నతాధికారికి సమర్పించాలి. వాటిని స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సిన బాధ్యత ఉన్నతాధికారిదే. ఆయన ఉద్యోగి అర్జీని పరిశీలించి తన అభిప్రాయాన్ని కూడా వెబ్సైట్లో పొందుపరచాలి. వాటిని కూడా డౌన్లోడ్ చేసి, ప్రింట్ తీసి తన సంతకంతో సాధారణ పరిపాలన (రాష్ట్ర పునర్విభజన) విభాగానికి పంపాలి’’ అని ఆ ఉత్తర్వుల్లో సీఎస్‌లు నిర్దేశించారు. -
ఏడు శాఖల్లో ఉద్యోగుల విభజన పూర్తి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఏడు శాఖల ఉద్యోగుల విభజన పూర్తయింది. డెరైక్డర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్, కమిషనర్ ఆఫ్ మైనారిటీ వెల్ఫేర్, కమిషనరేట్ ఆఫ్ హాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్, కమిషనరేట్ ఆఫ్ సెరీ కల్చర్, డెరైక్టరేట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ డెలివరీ సర్వీసెస్, కామర్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ ప్రమోషన్స్ శాఖల్లో విభజన పూర్తయిందని ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు. మొత్తం244 మంది ఉద్యోగుల్లో తెలంగాణకు 104, ఆంధ్రకు 140 మందిని కేటాయించారని ఆయన అన్నారు. ఇంకా 45 శాఖల విభజన జరగాల్సి ఉందని, ఆప్షన్ల కోసం ఆయా శాఖల ఉద్యోగులకు 15 రోజుల సమయం ఇచ్చామన్నారు. అన్ని శాఖల విభజనకు మరో నెల రోజుల సమయం పడుతుందన్నారు. -
వివాదాల సుడిగుండాలు
తెలంగాణలో స్థానికత 1956కు ముందు నుంచి తెలంగాణలో నివసిస్తున్న వారిని వూత్రమే స్థానికులుగా పరిగణిస్తామని, వారి కుటుంబాల పిల్లలకు మాత్రమే ఫీజుల చెల్లింపు పథకాన్ని (ఫాస్ట్) వర్తింపజేస్తామని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది చట్ట విరుద్ధమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదిస్తోంది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారమే స్థానికతను నిర్ధారించి ఫాస్ట్‌ను వర్తింపజేయాలంటోంది. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించడంలేదు. ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుంచి 1956 తర్వాత ఇక్కడికి వచ్చి స్థిరపడ్డ కుటుంబాలకు చెందిన పేద విద్యార్థుల పరిస్థితి రెండు ప్రభుత్వాల వ్యవహారశైలి వల్ల ఇబ్బందికరంగా మారింది. 1956 స్థానికత అంశంపై తెలంగాణ ప్రభుత్వం అధికారులతో ఏర్పాటు చేసిన కమిటీ ఉత్తర్వులపై కొందరు కోర్టుకు వెళ్లారు. ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సుల్లో చేరినా ఫీజు చెల్లించే స్తోమత లేక చాలామంది చదువుకు స్వస్తి చెప్పాల్సిన దుస్థితి ఏర్పడింది. ఉన్నతాధికారుల పంపిణీ అఖిల భారత సర్వీసు అధికారులను రెండు రాష్ట్రాలకు కేటాయించే ప్రక్రియ కూడా ఆరు నెలల సుదీర్ఘ కాలంలో పూర్తికాలేదు. ఐఏఎస్‌లు చాలనందునే అభివృద్ధి పనుల విషయంలోనూ, విధాన నిర్ణయాల అమల్లోనూ సమస్యలు ఎదుర్కొంటున్నామని, ఈ సమస్య లేకపోతే రాష్ట్ర ప్రగతిని పరుగులు పెట్టించేవారమని స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఈ అధికారుల పంపిణీ విషయంలో ప్రత్యూష్‌సిన్హా చేసిన కసరత్తుపై కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పునఃపరిశీలించాలని ఫైలును వెనక్కు పంపినట్లు ఢిల్లీ అధికార వర్గాలు అంటున్నాయి. ఎన్జీ రంగా వర్సిటీ పేరు మార్పు ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని విభజించకముందే తెలంగాణ ప్రభుత్వం జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అనే పేరు పెట్టి ఉన్నతాధికారిని కూడా నియమించడం వివాదాస్పదంగా మారింది. అంబేద్కర్ విశ్వవిద్యాలయం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, ద్రవిడ యూనివర్సిటీల విభజన విషయంలో ఇరు ప్రభుత్వాలు చర్చించి సానుకూల నిర్ణయం తీసుకున్నట్లే వ్యవసాయ విశ్వవిద్యాలయం విషయంలోనూ తీసుకుంటే సమస్యే ఉండేది కాదనే అభిప్రాయం రెండు రాష్ట్రాల ఉన్నతాధికారుల్లో ఉంది. నాక్‌పై సీఎంల బెట్టు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ విషయంలోనూ ఇరు రాష్ట్రాలు బెట్టుకుపోతున్నాయి. సహకార సంస్థ కింద ఏర్పాటైన నాక్‌లో డెరైక్టర్‌గా భిక్షమయ్యను నియమించి ఆ సంస్థను తెలంగాణ ప్రభుత్వం తన అధీనంలోకి తెచ్చుకునే యత్నం చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యకార్యదర్శి శాంబాబ్‌ను డెరైక్టర్ జనరల్‌గా నియమించడం, ఆయన బాధ్యతలు తీసుకోవడానికి వెళ్లడంతో అడ్డుకోవడం వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాక్ పాలక మండలిని పునర్వ్యవస్థీకరిస్తూ.. ముఖ్యమంత్రి చైర్మన్‌గా ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మరుసటి రోజే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం అధ్యక్షతన పాలక మండలిని నియమించింది. తరచుగా సీఎం కేసీఆర్ నాక్లోనే కూర్చుని వ్యూహాలు రచిస్తుండడం గమనార్హం. రాష్ట్ర ఉద్యోగుల విభజన రాష్ట్రస్థాయి ఉద్యోగుల విభజనకు సంబంధించి కమల్‌నాథన్ కమిటీ గత ఆరు నెలల కాలంలో ఎన్నిసార్లు సమావేశమైనా ఇంకా ఈ కసరత్తు పూర్తికాలేదు. వచ్చే మార్చి నాటికి గాని పూర్తి చేయలేమని స్వయంగా కమల్‌నాథన్ వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రభుత్వ రంగ సంస్థలపై వైరం రాష్ట్ర పునర్వ్యవస్థీరణ చట్టం ప్రకారం జనాభా ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు 58: 42 నిష్పత్తిలో వాటాలు కలిగిన ప్రభుత్వ రంగ సంస్థల బ్యాంకు అకౌంట్ల ఫ్రీజ్ వల్ల అనేక సవుస్యలు ఎదుర్కొంటున్నాయి. పునర్వ్యవస్థీకరణ చట్టం తొమ్మిదో షెడ్యూలులో ఉన్న సంస్థల ఆస్తుల వాటాల విషయంలోనూ, విభజన పూర్తయ్యే వరకూ సమన్వయంతో నడుపుకునే అంశంలోనూ రెండు రాష్ట్రాలు సరైన విధంగా వ్యవహరించలేకపోయాయి. కార్మిక సంక్షేమ నిధికి చెందిన ఫిక్స్డ్ డిపాజిట్లలో రూ. 428 కోట్ల మొత్తాన్ని, ఇరు రాష్ట్రాలకు చెందాల్సిన ఆంధ్రప్రదేశ్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీకి చెందిన రూ. 28 కోట్లను హైదరాబాద్ బ్యాంకు నుంచి తమకు తెలపకుండా విజయవాడలోని బ్యాంకుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరలించిందంటూ తెలంగాణ ప్రభుత్వం ఏకంగా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిందంటే రెండు రాష్ట్రాల మధ్య వైరం ఏస్థాయిలో ఉందో అర్థమవుతోంది. దీని ప్రభావం తొమ్మిదో షెడ్యూలులోని ప్రభుత్వ రంగ సంస్థలపై పడింది. నిథిమ్పై పంతాలు నిథిమ్ సంస్థ విషయంలో ఇరు రాష్ట్రాలు పంతాలకు వెళ్లాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి చందనాఖన్ నిథిమ్‌లో బాధ్యతలు నిర్వహించడానికి వెళ్లడంతో ఆమెను తెలంగాణ ఉద్యోగులు అడ్డుకోవడం, ఆమె అక్కడే ధర్నా చేయడం వంటి వివాదాలు తలెత్తాయి. గవర్నర్ అధికారాలపైనా రెండు రాష్ట్రాలకు ఒకే గవర్నర్ ఉండటం, ఆయనకు విశేషాధికారాలు కల్పించడంపై తెలంగాణ సర్కారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై ఏకంగా పార్లమెంట్‌లోనే తన నిరసన తెలియజేసింది. టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పైనా తాజాగా రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ తెలంగాణ సర్కారు అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఆరోగ్యశ్రీ ట్రస్టు పరిస్థితి ప్రస్తుతం ఉభయ రాష్ట్రాలకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఒకటే పనిచేస్తోంది. ఇప్పటికే దీన్ని విభజించాలని తెలంగాణ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మరో రెండు మాసాల్లో ఈ విభజన జరగొచ్చు. అయితే పేషెంట్లకు రోగనిర్ధారణ, ఆస్పత్రులకు ఆర్థిక అనుమతులు అన్నీ ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. ఆరోగ్యశ్రీ విడిపోతే ట్రస్ట్ కార్యాలయ భవనం తెలంగాణకు వెళుతుంది. ఆ తర్వాత ఇలాంటి సాంకేతిక సంపత్తిని ఏర్పాటు చేసుకోవడంలో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి. -
మార్చి చివరికి ఉద్యోగుల పంపకాలు పూర్తి
* మార్గదర్శకాల్లో మార్పులు లేవు: కమల్‌నాథన్ సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రస్థాయి ఉద్యోగుల పంపకాలు మార్చి చివరివరకు పూర్తిచేస్తామని కమల్‌నాథన్ కమిటీ చైర్మన్ కమల్‌నాథన్ వెల్లడించారు. న్యూఢిల్లీలో శుక్రవారం ఉదయం ఇరు రాష్ట్రాల సీఎస్‌లతో కేంద్ర హోంశాఖ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం నార్త్‌బ్లాక్ వద్ద మీడియాతో మాట్లాడారు. ‘ఈ రోజు స్టేట్ అడ్వైజరీ కమిటీ సమావేశమైంది. రాష్ట్రస్థాయి ఉద్యోగుల పంపకాల ప్రక్రియ మొత్తం మార్చి చివరివరకు పూర్తి చేయాలని నిర్ణయించాం. ఇప్పటికే నోటిఫై చేసిన 15 విభాగాల్లో ఉద్యోగుల విభజన ఆప్షన్లకు వారంరోజుల్లో నోటిఫికేషన్ ఇస్తాం. దీనిపై అభ్యంతరాలు చెప్పేందుకు పదిహేను రోజులు గడువు ఇస్తాం’ అని పేర్కొన్నారు. మొత్తం 85 విభాగాలకుగాను ఇప్పటివరకు 15 విభాగాల్లో నోటిఫై చేసినట్టు చెప్పారు. మిగిలిన వాటిని డిసెంబర్ 10 వరకు పూర్తిచేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. ‘ ఇప్పటికే విభాగాల వారీగా ఉద్యోగుల సంఖ్య గుర్తింపును కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. కమిటీ మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం ఏకగ్రీవంగా ఆమోదించినందున వీటిల్లో ఎలాంటి మార్పులకు అవకాశం లేదు’ అని కమల్‌నాథన్ స్పష్టం చేశారు. అవసరాన్ని బట్టి మరో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఏపీ క్యాడర్లో అధికారులు ఎక్కువగా ఉన్నారన్న వార్తలు వస్తున్నాయని ప్రశ్నించగా.. అందులోకి వెళ్లదలచుకోలేదని సమాధానమిచ్చారు. -
ఇక తుది నిర్ణయం మీదే!
* కేంద్రం వద్దకు చేరిన ఇరు రాష్ట్రాల పంచాయితీ * అన్ని వివాదాలను కేంద్రమే పరిష్కరించాలని ఇద్దరు సీఎస్ల వినతి * కేంద్ర హోం కార్యదర్శితో ఏపీ, తెలంగాణ ఉన్నతాధికారుల భేటీ * కమలనాథన్, ప్రత్యూష్‌సిన్హా కమిటీలతోనూ వేర్వేరుగా సమావేశం * అన్ని అంశాలపై మరోసారి వాదనలు వినిపించిన అధికారులు * ఉద్యోగుల పంపకాలపై నోడల్ కమిటీని వేయాలని ప్రతిపాదన * ఐఏఎస్‌ల కేటాయింపును త్వరగా పూర్తి చేయాలని ఏపీ సీఎస్ విజ్ఞప్తి * ప్రోత్సాహకాలపై నిర్ణయం తీసుకోవాలన్న టీ-సీఎస్ రాజీవ్ శర్మ సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య తలెత్తిన అనేక సమస్యలకు సంబంధించిన పంచాయితీ కేంద్రం వద్దకు చేరింది. ఈ విషయంలో తుది నిర్ణయాన్ని కేంద్రానికే వదిలేయాలని ఇరు ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఆయా సమస్యలపై రెండు రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు పరిశీలించి, న్యాయ సలహా మేరకు తుది నిర్ణయాన్ని వెల్లడించాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శికి ఏపీ, తెలంగాణ ప్రధాన కార్యదర్శులు స్పష్టం చేశారు. పార్లమెంట్ నార్త్‌బ్లాక్‌లోని కేంద్ర హోంశాఖ కార్యాలయంలో హోం కార్యదర్శి అనిల్ గోస్వామితో ఏపీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, తెలంగాణ సీఎస్ రాజీవ్‌శర్మతోపాటు రెండు రాష్ట్రాల విద్యుత్, నీటిపారుదల, ఇంధన, ప్లానింగ్ శాఖల కార్యదర్శులు శుక్రవారం సమావేశమయ్యారు. అలాగే రాష్ట్ర స్థాయి ఉద్యోగుల విభజనకు సంబంధించి ఏర్పాటైన కమల్‌నాథన్ కమిటీ, అఖిల భారత సర్వీస్ అధికారుల పంపిణీపై పనిచేస్తున్న ప్రత్యూష్ సిన్హా కమిటీతోనూ ఇరువురు సీఎస్‌లు వేర్వేరుగా భేటీ అయ్యారు. ఉదయం కమల్‌నాథన్ కమిటీతో భేటీ సందర్భంగా.. ఉద్యోగుల పంపకాల తుది గడువు, దీనికి సంబంధించిన ప్రక్రియపై ఇరు రాష్ట్రాల అధికారులు మరోమారు కూలంకషంగా చర్చించారు. పోస్టులు తక్కువగా, ఉద్యోగులు ఎక్కువగా ఉన్న కొన్ని శాఖల్లో సర్దుబాటు అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. ఉద్యోగుల విభజనలో వచ్చే సమస్యల పరిష్కారం, ఇతర అనుమతులకు సంబంధించి ఓ నోడల్ కమిటీని వేయాలన్న ప్రతిపాదనను ఇరువురు సీఎస్‌లు కేంద్రం దృష్టికి తెచ్చారు. వివాదాలపై వాడివేడి చర్చ రాష్ర్ట విభజన చట్టంలోని అంశాల అమలులో ఇరు రాష్ట్రాల మధ్య తలెత్తుతున్న సమస్యలపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి ముందు ఇరువురు సీఎస్‌లు తమతమ వాదనలు వివరించారు. విద్యుత్ కేటాయింపులు, నదీజలాల పంపకాలు, షెడ్యూల్ తొమ్మిది, పదిలోని ఉమ్మడి సంస్థల నిర్వహణ , ఉమ్మడి పరీక్షల నిర్వహణ తదితర అంశాలపై ఈ సందర్భంగా చర్చ జరిగింది. కృష్ణా బోర్డు ఇచ్చిన ఏకపక్ష నోటీసుల అంశాన్ని తెలంగాణ సీఎస్ ప్రస్తావించారు. ఈ విషయంలో ఏపీ వైఖరి సరిగా లేదని, కావాలనే సమస్యలు సృష్టిస్తోందని ఫిర్యాదు చేశారు. కృష్ణా ట్రిబ్యునల్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోడానికి వీల్లేదని, కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా దక్కేలా చర్యలు తీసుకోవాలని రాజీ వ్‌శర్మ కోరారు. విభజన చట్టంలోని షెడ్యూల్ 8 ప్రకారం హైదరాబాద్‌లో పోలీసు యంత్రాంగా న్ని గవర్నర్ పరిధిలోకి తేవాలని ఏపీ సీఎస్ కోరగా.. అందుకు రాజీవ్‌శర్మ అభ్యంతరం తెలి పారు. చట్టంలో అలా పేర్కొనలేదన్నారు. విద్యుత్ సమస్యలపై ప్రస్తావిస్తూ.. పీపీఏలను అమలు చేసేలా చూడాలని తెలంగాణ సీఎస్ కోరారు. ఉమ్మడి సంస్థలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి సమాచారం లేకుండానే ఏపీకి నిధులు మళ్లించుకున్న అంశాన్ని ఆయన ప్రస్తావించారు. దీనిపై అనిల్ గోస్వామికి ఇరువురు సీఎస్‌లు వేర్వేరుగా నివేదికలను అందజేసినట్టు సమాచారం. పదో షెడ్యుల్‌లో పేర్కొన్న సంస్థలు భౌగోళికంగా తెలంగాణలోనే ఉన్నం దున వాటి నిర్వహణ హక్కు ఏపీ ప్రభుత్వానికి ఎలా ఉంటుందని రాజీవ్ శర్మ ప్రశ్నించినట్లు సమాచారం. ఐవైఆర్ కృష్ణారావు కూడా దీనిపై తన వాదన వినిపించారు. ఇక ఉమ్మడి పరీక్షల నిర్వహణలో తెలంగాణ ప్రభుత్వ తీరు ఇబ్బం దికరంగా ఉందని కూడా ఆయన కేంద్రం దృష్టికి తెచ్చారు. విభజన చట్టంలో చెప్పిన ప్రకారం విద్యా సంస్థల్లో ప్రవేశాలను ఉమ్మడిగా చేపట్టాలని వివరించారు. శ్రీశైలం జల విద్యుత్ ఉత్పత్తి వివాదాన్ని కూడా ప్రస్తావించారు. స్థూలంగా అన్ని సమస్యలపై ఇరు రాష్ట్రాల ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకుని, న్యాయ సలహా మేరకు కేంద్ర ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకోవాలని ఇరువురు సీఎస్‌లు హోంశాఖ కార్యదర్శికి స్పష్టం చేశారు. ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం కింద ఇరు రాష్ట్రాలకు దక్కాల్సిన పలు సదుపాయాలను కేంద్రం దృష్టికి తెచ్చాం. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు, వివాదాలను కూడా వివరించాం. వాటన్నింటినీ పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని కేంద్ర హోంశాఖ కార్యదర్శి చె ప్పారు’ అని ఏపీ సీఎస్ కృష్ణారావు వెల్లడించారు. చట్టంలో పేర్కొన్న అంశాలపై త్వరగా చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని కోరినట్టు టీ-సీఎస్ రాజీవ్‌శర్మ తెలిపారు. ‘తెలంగాణకు ఇచ్చే ప్రోత్సాహకాలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరాం. విభజన చట్టంలోని విధానాల అమలుపై రాష్ర్టం తరఫున ప్రతిపాదనలు పంపుతాం. అదేవిధంగా ఏపీ కూడా పంపుతుంది. వీటిపై న్యాయ సలహా తీసుకుని నిర్ణయం చెప్పాలని కేంద్రాన్ని కోరాం. ఈ సమావేశాలు విజయవంతంగా కొనసాగాయి. సత్ఫలితాలు వస్తాయనుకుంటున్నాం’ అని రాజీవ్‌శర్మ పేర్కొన్నారు. కాగా, సివిల్ సర్వీసెస్ ఉద్యోగుల విభజన అంశంపై ప్రత్యూష్ సిన్హా కమిటీతో ఇద్దరు సీఎస్‌లు భేటీ అయ్యారు. ఐఏఎస్‌ల కేటాయింపుల ఫైలును ప్రధాని నరేంద్రమోదీ తిప్పి పంపిన నేపథ్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఇరువురు సీఎస్‌లు పలు అంశాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా నిర్ణయం తీసుకోవాలని, వీలైనంత త్వరగా కేటాయింపులు పూర్తి చేయాలని కమిటీని కోరారు. -
కొలిక్కివచ్చిన పోస్టుల విభజన
* పదిశాఖల పోస్టులు పంపిణీ చేస్తూ రేపు నోటిఫికేషన్? సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య రాష్ట్రస్థాయి పోస్టులు, ఉద్యోగుల పంపిణీపై కసరత్తును కమలనాథన్ కమిటీ ఓ కొలిక్కి తీసుకువచ్చింది. సెలవు రోజుల్లో కూడా ‘సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్’కు వెళ్లి మరీ సమాచారం రాబట్టడంతో పాటు, మార్గదర్శక సూత్రా ల ప్రకారం పోస్టులు, ఉద్యోగుల పంపిణీకి అనుగుణంగా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. ఈ ప్రక్రియను కమలనాథన్ కమిటీ, రాష్ట్ర పునర్విభజన విభాగం కార్యదర్శి ప్రేమచంద్రారెడ్డి కలసి ఆదివారంతో పూర్తి చేశారు. పోస్టుల పంపిణీ అనంతరం అభ్యంతరాలను తెలియజేయడానికి ఆన్లైన్ గ్రీవియన్స్కు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను సోమవారం రూపొందించనున్నారు. రాష్ట్రస్థాయి పోస్టులను జనాభా నిష్పత్తి ప్రకారం పంపిణీ చేయనున్నారు. శాఖలవారీగా, కేడర్‌వారీగా రాష్ట్రస్థాయి పోస్టుల్లో ఏపీకి 58.32 శాతం, తెలంగాణకు 41.68 శాతం పోస్టులను పంపిణీ చేయనున్నారు. ఇందుకనుగుణంగా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. జనాభా నిష్పత్తి మేరకు కంప్యూటరే 2 రాష్ట్రాలకు పోస్టులను పంపిణీ చేయనుంది. దీన్ని మంగళవారం నుంచి ప్రారంభించాలని కమలనాథన్ కమిటీ నిర్ణయించింది. ఇప్పటికే సిద్ధంగా ఉన్న విభాగాలకు చెందిన మొత్తం పదిశాఖల పోస్టులను మంగళవారం కంప్యూటర్ ద్వారా పంపిణీ చేస్తూ ప్రొవి జనల్ నోటిఫికేషన్ జారీ చేస్తారు. దీనిపై సమస్యలను తెలపడానికి పదిరోజుల గడువిస్తారు. పూర్తి సమాచారం సిద్ధమైన విభాగాల పోస్టులను పంపిణీ చేస్తూ, ఉద్యోగులందరికీ ఆప్షన్పత్రాలను ఇవ్వాలని నిర్ణయించింది. ఉద్యోగుల కేటాయింపునూ కంప్యూటర్ ద్వారానే చేయనున్నారు. స్థానికత, సీనియారిటీ, ఆప్షన్, ఇతర మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకుంటూ పంపిణీ జరిపేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. దీంతో కంప్యూటరే ఏ ఉద్యోగి ఏ రాష్ట్రానికో కేటాయిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్రస్థాయి కేడర్పోస్టులు 76 వేలున్నాయి. ఇందులో 51 వేల మందే పనిచేస్తుండగా, మిగతా పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. మరో వెయ్యి మల్టీజోనల్ పోస్టులున్నాయి. -
ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు విడుదల
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉద్యోగుల పంపిణీకి సంబంధించిన మార్గదర్శకాలను కమలనాథన్ కమిటీ గురువారం విడుదల చేసింది. తెలంగాణ సచివాలయంలో సమావేశమైన కమలనాథన్ కమిటీ ఈమేరకు నిర్ణయం తీసుకుంది. 19 పేజీల్లో పొందుపరిచిన ఈ మార్గదర్శకాలను కమిటీ తన వెబ్సైట్ లో పెట్టింది. 2014 జూన్ 1 వరకు ఉన్న సీనియారిటీ ఆధారంగా ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు రూపొందించినట్టు కమిటీ తెలిపింది. ఉద్యోగులందరికీ ఆప్షన్లు ఇచ్చినట్టు వెల్లడించింది. నాలుగైదు రోజుల్లో ఉద్యోగులకు ఆప్షన్ పత్రాలు ఇచ్చే అవకాశముంది. -
అధికారుల పంపిణీకి మరో నెల రోజులు!
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత సర్వీసు అధికారుల విభజనకు మరో నెలరోజుల సమయం పడుతుందని ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. అధికారుల విభజన ప్రక్రియ ఆలస్యమయ్యే పక్షంలో తాత్కాలిక తుది జాబితాలో ఎలాంటి సమస్య లేని అధికారులనైనా ఇరు రాష్ట్రాలకు సర్దుబాటు చేస్తూ సర్వ్ టు ఆర్డర్ ఇవ్వాలని కోరినా కేంద్రం అందుకు సుముఖత వ్యక్తం చేయలేదని తెలిసింది. ఇప్పటికే నాలుగైదుసార్లు సమావేశమైన ప్రత్యూష్ సిన్హా కమిటీ తాత్కాలిక తుది జాబితాను ఈనెల 10న ప్రకటించింది. ఆ తర్వాత దీనిపై అభ్యంతరాలు తెలియచేయడానికి అధికారులకు పక్షం రోజుల గడువు ఇచ్చింది. ప్రత్యూష్ సిన్హా కమిటీ చేసే మార్పులపై ఇరు రాష్ట్రాల సీఎస్‌లు సంతకాలు చేశాక... వాటిని కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పంపించనున్నారు. ఆ తర్వాత సదరు మంత్రిత్వ శాఖ నుంచి ఫైలు ప్రధాన మంత్రి ఆమోదం కోసం వెళ్తుంది. అక్కడ రెండు వారాల సమయం పడుతుందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
ఢిల్లీకి కమలనాథన్ కమిటీ నివేదిక
సాక్షి, హైదరాబాద్: రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజనకు సంబంధించి కమలనాథన్ కమిటీ నివేదిక ఢిల్లీకి చేరింది. నివేదికను మొదట ఈ మెయిల్ రూపంలో, తరువాత కొరియర్లో పంపించింది. సిఫారసులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించి నోటిఫై చేసిన తరువాత ఇరు రాష్ట్రాలకు ఉద్యోగుల కేడర్ సంఖ్యను నిర్దారించనున్నారు. ఇటీవల కమలనాథన్ కమిటీ ఇచ్చిన ఉద్యోగుల వివరాలు అప్పటి వరకు ప్రభుత్వం వివిధ సమయాల్లో మంజూరు చేసిన ఉద్యోగాలు, ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులు, ఖాళీలపైనే వివరించింది. రాష్ట్రస్థాయి కేడర్ అధికారులను విభజించడానికి ముందు కేడర్ సంఖ్య నిర్దారించాలని ఇది కొన్నింటికి సంబంధించి జనాభా నిష్పత్తిలో, మరికొన్ని భౌగోళిక పరిస్థితి ఆధారంగా నిర్దారించాలని నిర్ణయించారు. -
ఉద్యోగుల విభజన.. తప్పులతడక
కమలనాథన్ కమిటీ ప్రకటించిన ఉద్యోగుల విభజన అంతా తప్పుల తడకగా ఉందని తెలంగాణ ఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ మండిపడ్డారు. అన్ని స్థాయిలలోని పోస్టులను కలిపి గంపగుత్తగా చూపించారని, ఇది సరికాదని ఆయన అన్నారు. ఇది సరికాదని, ఏ స్థాయి ఉద్యోగులను ఆ స్థాయిలో విభజించాలని ఆయన అన్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజన ప్రక్రియను మళ్లీ చేపట్టాలని దేవీప్రసాద్ డిమాండ్ చేశారు. -
మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే...
హైదరాబాద్: నాన్ గెజిటెడ్ తెలంగాణ ఉద్యోగుల సంఘం(టీఎన్జీవో) ప్రతినిధులు కమలనాథన్‌ను కలిశారు. ఉద్యోగుల విభజన త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా జోనల్ పోస్టుల్లో 40 వేలకు పైగా ప్రాంతీయేతర ఉద్యోగుల్ని గుర్తించి వారి వివరాలు కమిటీకి సమర్పించామని టీఎన్జీవో అధ్యక్షుడు దేవిప్రసాద్ తెలిపారు. విభజన సమస్యలపై రెండు ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని ఆయన సూచించారు. తెలంగాణ ఉద్యోగుల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే నష్టపోయేది ఆంధ్రప్రదేశేనని ఆయన హెచ్చరించారు. ఉద్యోగుల విభజనలో కమలనాథన్ కమిటీ మార్గదర్శకాల్లోని 18(ఎఫ్) నిబంధన తొలగించాలని అంతకుముందు దేవిప్రసాద్ డిమాండ్ చేశారు. ఆంధ్రకు చెందిన ఉద్యోగులకు ఆప్షన్స్ వర్తింప చేయరాదని అన్నారు. -
అన్యాయం జరిగితే మళ్లీ ఉద్యమం
కమలనాథన్ కమిటీ విడుదల చేసిన మార్గదర్శకాలపై తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వాస్తవానికి అక్టోబర్ 31లోగా ఉద్యోగుల విభజన పూర్తి చేయాలని జేఏసీ నాయకుడు దేవీప్రసాద్ అన్నారు. ఎవరికీ ఆప్షన్లు ఇవ్వద్దని, స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన జరగాలని డిమాండ్ చేశారు. తప్పుడు సర్టిఫికెట్లు పెట్టిన వారిపై న్యాయవిచారణ జరపాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ జీఏడీ విభజనతో తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందని, తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా దీనిలో భాగస్వామ్యం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగుల విభజన మొత్తం స్వతంత్ర సంస్థతో నిర్వహించాలని, తమకు మాకు అన్యాయం జరిగితే మరోసారి ఉద్యమిస్తామని జేఏసీ చైర్మన్ దేవీప్రసాద్ స్పష్టం చేశారు. -
అన్యాయం జరిగితే మళ్లీ ఉద్యమం
-
ఏడేళ్ల విద్యార్హత ఆధారంగానే స్థానికత
-
ఏడేళ్ల విద్యార్హత ఆధారంగానే స్థానికత
ఏడేళ్ల విద్యార్హతల ఆధారంగానే స్థానికతను నిర్ణయించాలని కమలనాథన్ కమిటీ సూచించింది. ఈ మేరకు ఉద్యోగుల విభజన అంశానికి సంబంధించి తాము సూచించిన మార్గదర్శకాలను ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ వెబ్సైట్లో కమిటీ ఉంచింది. కేంద్రం ఆమోదం మేరకు 19 పేజీల మార్గదర్శకాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెబ్సైట్లో ఉంచింది. ఉద్యోగులలో దంపతులు, ఒంటరి మహిళలకు ఆప్షన్లు ఉంటాయని, అయితే రిటైరయ్యే ఉద్యోగులకు మాత్రం ఆప్షన్లు లేవని అందులో తెలిపారు. ఆర్టికల్ 371 డి రెండు రాష్ట్రాల్లో కొనసాగుతుందని, గ్రూప్-4 ఉద్యోగులను పూర్తిగా స్థానికత ఆధారంగా విభజించాలని నిర్ణయించారు. ఏడేళ్ల విద్యార్హత ఆధారంగానే స్థానికత నిర్ణయిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు ఆప్షన్లు ఇవ్వాలని నిర్ణయించారు. వికలాంగులకు, తీవ్రమైన వ్యాధులతో బాధపడేవారికి ఆప్షన్ సదుపాయం ఉంటుందని తెలిపారు. అలాగే, ఒక్కసారి ఆప్షన్ ఇస్తే మళ్లీ మార్చడం కుదరదని స్పష్టం చేశారు. విధివిధానాలపై అభ్యంతరాలు, సలహాలు ఉంటే ఆగష్టు 5 లోపు ఇవ్వాలని కమలానాథన్ కమిటీ కోరింది. వాటిని పరిశీలనకు తీసుకున్న తర్వాత మళ్లీ కేంద్రం తుది మార్గదర్శకాలను ఖరారు చేస్తుందని చెప్పారు. 1975 ఆర్డర్ సర్వీసు రికార్డ్ ఆధారంగా స్థానికతను గుర్తిస్తామన్నారు. తప్పుడు స్థానికత ధ్రువీకరణ ఇస్తే తీవ్రమైన కఠినచర్యలు ఉంటాయని హెచ్చరించారు. -
ఇక్కడి సంస్థకు.. అక్కడి అధికారి!
హైదరాబాద్: పునర్విభజన చట్టానికి భిన్నంగా నాచారంలోని ఏపీ ఫుడ్స్ వ్యవహారం సాగుతోంది. రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసేందుకు బాలామృతం పేరిట పౌష్టికాహారాన్ని ఈ సంస్థ ఉత్పత్తి చేస్తోంది. విభజన చట్టంలోని 9వ షెడ్యూలులో ఏపీ ఫుడ్స్‌ను చేర్చారు. చట్టంలోని 53వ సెక్షన్ ప్రకారం సంస్థ ఎక్కడ ఉంటే అది ఆ రాష్ట్రానికే చెందుతుంది. ఏపీ ఫుడ్స్‌కు మరెక్కడా యూనిట్లు లేనందున ఈ సంస్థ తెలంగాణ రాష్ట్రానికే చెందాలి. కానీ, ఈ సంస్థకు తెలంగాణ ప్రభుత్వం ఉన్నతాధికారిని నియమించలేదు. ఐఏఎస్ అధికారుల కొరతకారణంగా ఈవైపు దృష్టి సారించలేదని తెలుస్తోంది. ఇప్పటివరకు ఎండీగా ఉన్న విజయ్‌మోహన్ కర్నూలు కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. దీంతో ఈ విషయాన్ని సంస్థ కార్మికసంఘం అధ్యక్షుడు కూడా అయిన హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి కార్మికనేతలు వివరించారు. సీఎం దృష్టికి తీసుకెళ్లి.. తెలంగాణ ప్రభుత్వ అధికారిని నియమిం చేలా చూస్తానని నాయిని హామీ ఇచ్చినా ఫలితం లేదు. ఎండీ బదిలీ కాగానే ఏపీ మహిళా శిశుసంక్షేమశాఖలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్న బాలమాయదేవిని ఇన్చార్జ్ ఎండీగా నియమించారు. -
'తెలంగాణ ఉద్యోగులు ఆందోళన చెందవద్దు'
హైదరాబాద్ : స్థానికత విషయంతో తెలంగాణ ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సచివాలయం తెలంగాణ ఉద్యోగుల సంఘం నేత నరేందరరావు తెలిపారు. తెలంగాణ ఉద్యోగుల సంఘం నేతలు మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను కలిశారు. అనంతరం నరేందర్‌రావు మీడియాతో మాట్లాడుతూ ఆగస్టులోపు ఏ ప్రాంత ఉద్యోగులు అక్కడే పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సీఎస్‌ను కోరామన్నారు. స్థానికత సర్టిఫికెట్లను పరిశీలించేందుకు కమిటీ వేస్తామని సీఎస్ హామీ ఇచ్చినట్లు నరేందరరావు తెలిపారు. దొంగ సర్టిఫికెట్లతో ఉద్యోగం సంపాదించినవారిపై కమిటీ చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. కాగా రాష్ట్ర విభజన నేపధ్యంలో.. ఏ ప్రాంతానికి చెందిన ఉద్యోగులను ఆ ప్రాంతానికి కేటాయించేందుకు రెండు రాష్ట్రాలు అంగీకరిస్తేనే ఉద్యోగుల పంపిణీ సులభతరం కానుంది. లేదంటే ఇరు రాష్ట్రాలకు ఉద్యోగుల పంపిణీ చిక్కుముడిగా మారి మరింత కాలం గందరగోళం తప్పకపోవచ్చని అధికారులు చెప్తున్నారు. ఏ ప్రాంతానికి చెందిన ఉద్యోగులను ఆ ప్రాంతానికి కేటాయించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పటికే కమలనాథన్ కమిటీకి ఇదే విషయాన్ని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ తెలిపారు. -
స్థానికత ఆధారంగానే..
* ఉద్యోగుల విభజన జరగాలి: టీ.ఉద్యోగ సంఘాల జేఏసీ విన్నపం సాక్షి, హైదరాబాద్: స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభ జన చేపట్టాలని, గిర్గ్లానీ కమిటీ సిఫారసుల మేరకు సర్వీస్ బుక్‌లో నమోదు చేసిన వివరాలనే స్థానికతకు గీటురాయిగా తీసుకోవాలని కమలనాథన్ కమిటీకి తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల జేఏసీ విన్నవించింది. సర్వీస్ బుక్‌లో స్థానికతను నమోదు చేయని వారిని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులుగా గుర్తించాలని కోరింది. సోమవారం సచివాలయంలో కమలనాథన్‌ను జేఏసీ ప్రతినిధులు కలిశారు. విభజనకు సంబంధించిన వివిధ సమస్యలపై చర్చించి విజ్ఞాపన పత్రాలు అందజేశారు. పనిచేస్తున్న వారి సంఖ్య ఆధారంగా చేసిన విభ జనను రద్దు చేయాలని, మంజూరైన పోస్టుల ఆధారంగా విభజన చేపట్టాలని సూచించారు. నాలుగో తరగతి ఉద్యోగులు, డ్రైవర్లు, అటెండర్లు, స్వీపర్లను మంజూరైన పోస్టుల ఆధారంగా కాకుండా వారి స్థానికత ఆధారంగా విభజించాలని, ఒకవేళ పోస్టులకన్నా ఉద్యోగులు ఎక్కువగా ఉంటే ఆయా రాష్ర్ట ప్రభుత్వాలు సూపర్ న్యూమరరీ పోస్టులను సృష్టించాలని విన్నవించారు. జోనల్, మల్టీ జోనల్, స్టేట్ కేడర్ పోస్టుల్లోని వారి విభ జనను కూడా ఇదే పద్ధతిలో చేపట్టాలని, ఈ మొత్తం ప్రక్రియను రెండు నెలల్లో పూర్తి చేయాలని ప్రతిపాదించారు. అనారోగ్య కారణాల వల్ల తెలంగాణలో ఉండాలనుకునే ఆంధ్రా ఉద్యోగులకు మెడికల్ బోర్డు పరీక్షలు నిర్వహించాలని పేర్కొన్నారు. కొన్ని డీఎస్సీలలో 30 శాతం నాన్ లోకల్ కోటాలో, మరికొన్ని డీఎస్సీల్లో 20 శాతం కోటాలో నియమితులై న వారు ఎక్కువగా తెలంగాణలోనే ఉన్నారని, వారిని ఏపీకి పంపించాలని కూడా కమలనాథన్ దృష్టికి తెచ్చారు. అలాగే ఖమ్మం జిల్లాలోని 7 మండలాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల కోరిక మేరకు వారిని బదిలీ చేయాలని సూచించారు. ఉద్యోగుల జాబితాను ముందుగా వెబ్సైట్లో పెట్టి.. వారి స్థానికతపై ఫిర్యాదులు వస్తే పరిశీలించిన తర్వాతే తుది కేటాయింపులు చేయాలని కోరారు. కమలనాథన్‌ను కలిసిన వారిలో టీఎన్జీవో అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దేవీప్రసాద్, రవీందర్‌రెడ్డి, పీఆర్టీయూ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వెంకట్‌రెడ్డి, నరోత్తంరెడ్డి, ప్రభుత్వ లెక్చరర్ల సంఘం ప్రధాన కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి, పీఆర్టీయూ-తెలంగాణ అధ్యక్షుడు హర్షవర్ధన్‌రెడ్డి, ఉద్యోగ సంఘాల నేతలు విఠల్, రేచల్, నారాయణ, జ్ఞానేశ్వర్ తదితరులు ఉన్నారు. -
ఎక్కడి వారు అక్కడికెళ్తే ఓకే!
* తెలంగాణ సర్కారు సిద్ధం * ఏపీ అభిప్రాయమే కీలకం * నేడు ఏపీ, తెలంగాణ సీఎస్‌లతో కమిటీ, అధికారుల భేటీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపధ్యంలో.. ఏ ప్రాంతానికి చెందిన ఉద్యోగులను ఆ ప్రాంతానికి కేటాయించేందుకు రెండు రాష్ట్రాలు అంగీకరిస్తేనే ఉద్యోగుల పంపిణీ సులభతరం కానుంది. లేదంటే ఇరు రాష్ట్రాలకు ఉద్యోగుల పంపిణీ చిక్కుముడిగా మారి మరింత కాలం గందరగోళం తప్పకపోవచ్చని అధికారులు చెప్తున్నారు. ఏ ప్రాంతానికి చెందిన ఉద్యోగులను ఆ ప్రాంతానికి కేటాయించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పటికే కమలనాథన్ కమిటీకి ఇదే విషయాన్ని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ తెలిపారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో ఎటువంటి వైఖరిని తెలియజేయలేదు. ఆంధ్రాలో పనిచేస్తున్న తెలంగాణకు చెందిన ఉద్యోగులను తెలంగాణ రాష్ట్రానికి, అలాగే తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్రాకు చెందిన ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించేందుకు ఇరు రాష్ట్రాలు అంగీకరిస్తే కమలనాథన్ కమిటీ అందుకు అనుగుణంగా ముసాయిదా మార్గదర్శకాలను సిద్ధం చేయడానికి ఎటువంటి సమస్య ఉండదు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదవీ విరమణ వయస్సును రెండు సంవత్సరాలు పెంచిన నేపథ్యంలో ఆంధ్రాలో పనిచేస్తున్న తెలంగాణకు చెందిన కొంతమంది ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రానికి వచ్చేందుకు ఇష్టపడటంలేదు. ఇష్టపడని ఉద్యోగులను అక్కడే ఉండేలాగ, ఇష్టపడిన ఉద్యోగులను తెలంగాణకు కేటాయించేలాగ రెండు విధానాలను అవలంబించడం సాధ్యం కాదనేది కమలనాథన్ కమిటీ అభిప్రాయంగా ఉంది. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన అభిప్రాయాన్ని చెప్పాల్సి ఉంది. కమలనాథన్ కమిటీ ముసాయిదా మార్గదర్శకాలను ఖరారు చేయడానికి సోమవారం సాయంత్రం 4-30 గంటలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు కార్యాలయంలో సమావేశం కానుంది. ఈ సమావేశంలో తెలంగాణ సీఎస్ రాజీవ్‌శర్మతో పాటు తెలంగాణ ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి నాగిరెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి పి.వి.రమేశ్, కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం సంయుక్త కార్యదర్శి అర్చనావర్మలు కూడా పాల్గొంటారు. రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టుల్లో తెలంగాణకు చెందిన ఉద్యోగులు జిల్లాలతో సహా ఆంధ్రాలో పనిచేస్తున్న వారు 3,000 మంది వరకు ఉంటారని, అలాగే రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టుల్లో ఆంధ్రాకు చెందిన ఉద్యోగులు జిల్లాలతో సహా తెలంగాణలో పనిచేస్తున్న వారు 4,000 మంది ఉంటారని అంచనా వేశారు. -
సీఎస్ లతో కమలనాథన్ కమిటీ సమావేశం
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఉద్యోగుల విభజన అంశంపై కమలనాథన్ కమిటీ గురువారం సచివాలయంఓ భేటీ అయ్యింది. ఉద్యోగుల శాశ్వత విభజన మార్గదర్శకాలపై కమిటీ తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ సమావేశానికి కేంద్ర కార్యదర్శి అర్చనా వర్మ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఐవైఆర్ కృష్ణారావు, రాజీవ్ శర్మలు హాజరయ్యారు. అలాగే ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. -
సంక్షేమ భవన్లో విభజన లొల్లి!
హైదరాబాద్: అధికారికంగా రెండు రాష్ట్రాలు ఏర్పాటై వారం గడుస్తున్నా... సంక్షేమశాఖలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం సంక్షేమ కార్యాలయాల విభజన కూడా ఈ శాఖలో కనిపించడం లేదు. హైదరాబాద్‌లోని సంక్షేమ భవన్లో రెండు ప్రాంతాల అధికారులు, ఉద్యోగుల మధ్య సమన్వయం కొరవ డడంతో కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. జూన్ 2 అపాయింటెడ్ డే నుంచి తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పాటు కావడంతో అంతకు ముందే ప్రభుత్వం సంక్షేమభవన్‌లోని ఆరు అంతస్తులను జనాభా ప్రాతిపదికన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు విభజించింది. గ్రౌండ్ ఫ్లోర్, మొదటి, రెండో అంతస్తులను తెలంగాణకు, మూడు నుంచి ఆరు అంతస్తులను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. ఈ మేరకు సంక్షేమ భవన్లో విభజన వివరాలను కాగితాలపై ముద్రించి అన్ని అంతస్తులలో అతికించారు కూడా. అయితే వారం రోజులు గడిచినా... రెండు ప్రాంతాల అధికారులు, ఉద్యోగులు తమ చాంబర్లను ఖాళీ చేయలేదు. దీంతో సంక్షేమభవన్‌కు వచ్చే ప్రజలు, ఫీజు రీయింబర్స్‌మెంటు కోసం వచ్చే విద్యార్థులు అయోమయ పరిస్థితి ఎదుర్కొంటున్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగంలో పూర్వపు ఆంధ్రప్రదేశ్‌లో 516 మంది ఉద్యోగులు ఉండగా, ప్రధాన కార్యాలయమైన సంక్షేమ భవన్లో 69 మంది ఉద్యోగులున్నారు. ఈ 69 మందిలో స్థానికత ఆధారంగా 23 మంది ఉద్యోగులను తెలంగాణకు కేటాయించారు. మిగతా 46 మందిని ఆంధ్రప్రదేశ్ కు అప్పగించారు. మంజూరైన పోస్టుల ఆధారంగా జరిగిన ఈ విభజనలో సీమాంధ్రకు వెళ్లినవారిలో 13 మంది తెలంగాణ వారున్నారు. -
'పూర్తిస్థాయి కేటాయింపులకు మరికొంత సమయం'
హైదరాబాద్: త్వరలో కొత్తగా ఏర్పడబోవు ఇరు రాష్ట్రాలకు సంబంధించి ఉద్యోగుల కేటాయింపులు ప్రస్తుతానికి తాత్కాలిక ప్రతిపదికనే జరుగుతున్నట్లు సీఎస్ మహంతి స్పష్టం చేశారు. ఈ రోజు ఉద్యోగ సంఘాల నేతలతో భేటీ అయిన అనంతంర ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతానికి తాత్కాలిక ప్రాతిపదికనే ఉద్యోగుల కేటాయింపు జరిగిందని.. మూడునెలలపాటు ఈ కేటాయింపుల ప్రకారమే పనిచేయాలని తెలిపారు. ఇది శాశ్వత కేటాయింపు కాదని, పూర్తిస్థాయి కేటాయింపుకు కొంత సమయం పడుతుందన్నారు. వివాదాల పరిష్కారానికి గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జూన్ 2 నుంచి 9 వరకు రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఫైళ్లు, ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియ జరుగుతుందన్నారు .జూన్1 వ తేదీ రాత్రి ఉద్యోగుల విభజన లిస్ట్ వెబ్సైట్లో పెడతామన్నారు. ఉద్యోగుల విభజన నాలుగు దశల్లో జరుగుతుందని..మొదటి దశలో ఐఏఎస్ ల కేటాయింపు, రెండో దశలో సచివాలయ, శాఖాధిపతుల పోస్టుల కేటాయింపు జరుగుతుందని మహంతి తెలిపారు.మూడో దశలో స్టేట్ కేడర్ పోస్టుల విభజన, నాలుగో దశలో జోనల్ పోస్టుల విభజన జరుగుతుందన్నారు. రెండు ప్రభుత్వాలు ఏర్పడ్డాక..ఆ ప్రభుత్వాల అవగాహన మేరకు ఉద్యోగుల సర్ధుబాటు జరుగుతుందన్నారు. -
28 ఉద్యోగ సంఘాలతో సీఎస్ మహంతి చర్చలు
హైదరాబాద్ : రాష్ట్ర విభజనలో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి ఎల్లుండి 28 ఉద్యోగ సంఘాలను చర్చలకు ఆహ్వానించారు.శుక్రవారం సాయంత్రం జరిగే ఈ భేటీలో ఆయన రాష్ట్ర విభజనకు సహకరించాలని ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాలను కోరనున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఉద్యోగుల పంపిణీ శాశ్వత మార్గదర్శకాలపై చర్చించనున్నారు. మరోవైపు ఉద్యోగుల విభజనపై కేంద్రం నియమించిన కమలనాథన్ కమిటీ బుధవారం కేంద్ర హోంశాఖ కార్యాలయంలో సమావేశం అయ్యింది. ఉద్యోగుల విభజనపై మార్గదర్శకాలను ఖరారు చేసే అవకాశం ఉంది. కాగా నిబంధనల ప్రకారం ఉద్యోగుల పంపిణీ జరగాలని సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం కోరగా, స్థానికత ఆధారంగా పంపిణీ జరగాలని, తెలంగాణ ఉద్యోగుల అసోసియేషన్ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి ఉద్యోగులతో సమావేశమై వారు లేవనెత్తిన అంశాలపై దృష్టి సారించాలని సిఎస్ మహంతి భావిస్తున్నారు. -
ఉద్యోగుల విభజనలో అన్యాయం
* తెలంగాణ వారిని సీమాంధ్రకు పంపే కుట్ర * వివాదాలు సృష్టిస్తున్న ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్ * టీ-ఎన్జీవోల సంఘం ధ్వజం * సీఎస్‌కు, కమలనాథన్ కమిటీకి ఫిర్యాదు సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల విభజనలో అన్యాయం జరుగుతోందని, తెలంగాణ వారిని కావాలనే సీమాంధ్రకు పంపే కుట్ర జరుగుతోందని టీ-ఉద్యోగ సంఘాలు ధ్వజమెత్తాయి. ఉద్యోగుల విభజన ప్రక్రియలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్ అనవసర వివాదాలు సృష్టిస్తున్నారని టీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు దేవీప్రసాద్, కన్వీనర్ విఠల్, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఉద్యోగుల విభజన మార్గదర్శకాల కమిటీ చైర్మన్ కమలనాథన్‌కు శుక్రవారం ఫిర్యాదు చేశారు. అనంతరం సచివాలయం మీడియా పాయింట్లో టీ-ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడారు. ఇంటర్మీడియెట్ బోర్డులో మొత్తం 31 సీనియర్ అసిస్టెంట్ పోస్టులుండగా ప్రస్తుతం ఏడుగురు మాత్రమే పనిచేస్తున్నారని వివరించారు. వారిలో ఐదుగురు తెలంగాణ, ఇద్దరు సీమాంధ్రకు చెందిన వారున్నారని తెలిపారు. ఖాళీ పోస్టులను భర్తీ చేయకుండా, వాటిని పరిగణనలోకి తీసుకోకుండానే ఉద్యోగుల విభజన చేశారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే ముగ్గురు సీనియర్ అసిస్టెంట్లను తెలంగాణకు, నలుగురిని సీమాంధ్రకు కేటాయించారని, వీరిలో ఇద్దరు తెలంగాణ వారున్నారని వివరించారు. తెలంగాణ ఉద్యోగుల సంఘం నాయకుడిగా పోరాడుతున్న విఠల్‌ను కావాలనే సీమాంధ్రకు కేటాయించేందుకు కుట్ర చేశారని ధ్వజమెత్తారు. ఉద్యోగుల విభజన స్థానికత ఆధారంగా జరగాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యోగులు అధికంగా ఉన్నారని చూపించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మాధ్యమిక విద్యా మండలిలోనూ ఇదే విధంగా చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ వారు తెలంగాణ ప్రభుత్వంలో, సీమాంధ్రులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేయాలే తప్ప.. అక్కడి వారిని ఇక్కడకు, ఇక్కడి వారిని అక్కడకి మార్చితే అంగీకరించే ప్రసక్తే లేదని ఉద్యోగ నేతలు స్పష్టం చేశారు. అవసరమైతే తెలంగాణ ఉద్యోగులు మరోసారి పోరాడటానికి సిద్ధమని ప్రకటించారు. సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల్లో పనిచేసే నాలుగో తరగతి ఉద్యోగులను కూడా స్థానికత అధారంగా విభజించాలన్నారు. ఇంటర్మీడియెట్ బోర్డులో తప్పుడు విధానాలతో చేపట్టిన విభజనను తాము తెలంగాణకు కాబోయే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లామని, ఆయన దీన్ని తీవ్రంగా పరిగణించారని చెప్పారు. తమపై సీమాంధ్ర ఆధిపత్యాన్ని చూస్తూ కూర్చోబోమని వ్యాఖ్యానించారు. ఉద్యోగుల మధ్య విద్వేషాలు సృష్టించవద్దని, రెచ్చగొట్టే విధంగా కేటాయింపులు ఉండరాదని హితవు పలికారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతిని కూడా కలిసిన టీ-ఉద్యోగ నేతలు ఈ విషయాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. -
అధికారుల వ్యవహారశైలిపై కేసీఆర్ అసంతృప్తి
హైదరాబాద్: రాష్ట్ర విభజన అంశంలో ఉద్యోగుల విభజన విషయంలో అధికారుల వ్యవహారశైలిపై టీఆర్ఎస్ శాసనసభ పక్షం నాయకుడు కేసీఆర్ తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కారు. అధికారుల సరైన చర్యలు పాటించకపోవడం, తొందరపాటు చర్యల వల్ల రాష్ట్రంలో ఘర్షణ వాతావరణం నెలకొంటోందని కేసీఆర్ అన్నట్టు సమాచారం. రెండు ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత పరిష్కరించవలసిన సమస్యను ముందుగానే వివాదం చేశారని అధికారులను కేసీఆర్ మందలించినట్టు తెలుస్తోంది. ఉద్యోగుల విభజన అంశంలో సరైన ప్రమాణాలను పాటించాలని అధికారులకు కేసీఆర్ సూచించినట్టు తెలిసింది. ఉద్యోగుల విభజన అంశంలో గత రెండు రోజులుగా ఇరుప్రాంతాల ఉద్యోగ సంఘాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. -
అసెంబ్లీ ఉద్యోగుల విషయంలోనూ...
హైదరాబాద్: శాసనసభ ఉద్యోగుల విభజనలో సీమాంధ్ర ఉద్యోగులు స్థానికతను తప్పుగా చూపారని అసెంబ్లీ తెలంగాణ ఉద్యోగుల సంఘం నేత వేణుగోపాల్ అన్నారు. 22 మంది సీమాంధ్ర ఉద్యోగులను తెలంగాణ ప్రాంతానికి చెందినవారు పేర్కొన్నారని చెప్పారు. మరో 15 మంది సీమాంధ్ర ఉద్యోగులు తప్పుడు స్థానికతను చూపారంటూ అసెంబ్లీ కార్యదర్శిని కలిసి తెలంగాణ ఉద్యోగులు అభ్యంతరం తెలిపారు. వాటికి సంబంధించిన ఆధారాలు చూపడానికి అసెంబ్లీ కార్యదర్శిని రెండు రోజులు గడువు కోరామన్నారు. సీమాంధ్ర ఉద్యోగులు తెలంగాణలో కొనసాగుతామంటే సహించబోమని వేణుగోపాల్ అన్నారు. సచివాలయం ఉద్యోగుల విషయంలోనూ సీమాంధ్రులను తెలంగాణ వారిగా చూపారంటూ ఇప్పటికే అభ్యంతరాలు వచ్చాయి. -
'ఎవరి రాష్ట్రాల్లో వారు పనిచేస్తే మంచిది'
హైదరాబాద్: స్థానికత ఆధారంగానే ప్రభుత్వ ఉద్యోగుల విభజన జరగాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అభిప్రాయపడ్డారు. ఉద్యోగులు తమ తమ రాష్ట్రాల్లోనే పనిచేయడం మంచిదని అన్నారు. విభజన పక్రియలో తెలంగాణ ఉద్యోగుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. ఉద్యోగుల విభజన సాఫీగా జరగాలని ఆయన ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగుల విభజన ప్రక్రియ వివాదస్పదం అవుతున్న నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. కాగా, ఆంధ్ర ఉద్యోగులను తమ రాష్ట్రంలో పనిచేయనీయబోమని తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎన్నికైన కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
వెబ్సైట్లో ఉద్యోగుల స్థానికత వివరాలు
హైదరాబాద్ : రాష్ట్ర విభజనపై అధికారులు వేగంగా కసరత్తులు పూర్తి చేస్తున్నారు. ఏ రాష్ట్రానికి ఏమి కేటాయించాలో అన్నీ చకచకా చేసేస్తున్నారు. జూన్ రెండో తేదీని అపాయింటెడ్ డేగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్యోగుల విభజనపై ప్రభుత్వం హడావుడి నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో ఉద్యోగులందరి స్థానికత వివరాలను అధికారులు మంగళవారం ప్రభుత్వ వెబ్సైట్లో ఉంచారు. అభ్యంతరాలు ఉంటే ఒక్కరోజులోనే తెలపాలని ఆదేశాలు జారీ చేశారు. దాంతో ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. కాగా రాష్ట్రవిభజన నేపథ్యంలో జూన్ 2నుంచే ఇరు రాష్ట్రాల్లో ఉద్యోగులు వేరు వేరుగా విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని అధికారులు ఉద్యోగ విభజనకు సంబంధించి ముందస్తుగా మార్గదర్శకాలు జారీ చేశారు. స్థానికత ఆధారంగా సుమారు 50 వేలమంది ఉద్యోగుల విభజన చేపట్టే అవకాశం ఉంది. -
'కొత్త ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాతే ఉద్యోగుల విభజన'
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన అంశంలో రాష్ట్రస్థాయి ఉద్యోగుల పంపిణీకి సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర హోంశాఖ సిద్ధం చేస్తోంది. రాష్ట్ర స్థాయి ఉద్యోగుల పంపిణీపై కేంద్ర హోంశాఖ కార్యాలయంలో కమల్‌నాథన్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి(సీఎస్) పీకే మహంతి పాల్గొన్నారు. పూర్తి స్థాయి ఉద్యోగుల విభజన కొత్త ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాతే జరుగుతుందని కేంద్రానికి సీఎస్ మహంతి తెలిపారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన మహంతి..వారం రోజుల్లో విభజన పక్రియ పూర్తి చేస్తామని తెలిపారు. -
'సీమాంధ్ర ఉద్యోగులను తెలంగాణలో ఉంచొద్దు'
న్యూఢిల్లీ: సీమాంధ్ర ఉద్యోగులను వారి సొంత రాష్ట్రానికి పంపాలని కేంద్రాన్ని కోరినట్టు తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) నేత శ్రీనివాసగౌడ్ తెలిపారు. ఈ విషయమై కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఉన్నతాధికారులను కలిసి విన్నవించామని చెప్పారు. ఖాళీలు లేవన్న నెపంతో సీమాంధ్ర ఉద్యోగులను తెలంగాణలో ఉంచొద్దని విజ్ఞప్తి చేశామని వెల్లడించారు. సీమాంధ్ర ఉద్యోగులకు ఆప్షన్లు ఇవ్వొద్దని కోరామని చెప్పారు. స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన జరగాలని సూచించామన్నారు. తెలంగాణలో ఉన్న సీమాంధ్ర ఉద్యోగులను గుర్తించి వారి సొంత ప్రాంతానికి పంపాలని కోరినట్టు తెలిపారు. అపాయింటెడ్ డే మార్చడం కుదురదని హోంశాఖ తేల్చి చెప్పిందని శ్రీనివాసగౌడ్ వెల్లడించారు. -
కమలనాథన్ కమిటీ కీలక భేటీ
న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ కార్యాలయంలో కమలనాథన్ కమిటీ సమావేశమయింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి, ఉన్నతాధికారులు ఈ కీలక సమావేశానికి హాజరయ్యారు. విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల విభజనపై మార్గదర్శకాలను కమలనాథన్ కమిటీ నేడు ఖరారు చేయనుంది. ఈ ఉదయం ప్రత్యూష్ సిన్హా కమిటీతో పీకే మహంతి భేటీ అయ్యారు. ఎక్కడ పనిచేయాలో ఎంచుకునే అవకాశం (ఆప్షన్) ఇవ్వలా, వద్దా అనే దానిపై కీలక నిర్ణయం తీసుకోనుంది. అయితే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులకు ఎక్కడ పనిచేయాలో నిర్ణయించుకునే ఆప్షన్ ఇవ్వరాదని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది. అఖిల భారత సర్వీసులకు సంబంధించి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎస్ఎఫ్ అధికారుల విషయంలో మాత్రం కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. -
‘ముంపు’ ఉద్యోగులు తెలంగాణకే..
- టీఎన్జీజీవో కార్యవర్గ సమావేశం తీర్మానం - 2న ఘనంగా ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయం సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను తెలంగాణకే కేటాయించాలని తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘ కార్యవర్గ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. టీఎన్జీవో అధ్యక్షులు దేవీప్రసాద్ అధ్యక్షతన తెలంగాణభవన్‌లో సోమవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. సమావేశంలో ప్రధానకార్యదర్శి కారం రవీందర్‌రెడ్డి ప్రతిపాదించిన 11 తీర్మానాలను కార్యవర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది. రాష్ర్ట విభజన ప్రక్రియ జరుగుతున్నా.. ఇప్పటి వరకు రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలను వెల్లడించకపోవడంపై సమావేశం నిరసన వ్యక్తం చేసింది. స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన జరగాలని, సీమాంధ్ర ఉద్యోగులను తెలంగాణలోనే కొనసాగించడానికి తాత్కాలిక జాబితాను రూపొందిస్తే మరో ఉద్యమానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చింది. సమావేశంలో కేంద్ర సంఘం నాయకులు, వివిధ జిల్లాల నాయకులు పాల్గొన్నారు. సమావేశం చేసిన తీర్మానాలివీ... - ఎన్నికల్లో ఉద్యోగుల పాత్రకు అభినందనలు. ఎన్నికల విధుల్లో పాల్గొన్న అన్ని స్థాయిల్లోని ఉద్యోగులు, సిబ్బందికి ఒక నెల వేతనం ప్రోత్సాహకంగా ఇవ్వాలి. - స్థానికత ఆధారంగానే గ్రామ సచివాలయం నుంచి రాష్ట్ర సచివాలయం దాకా ఉద్యోగుల విభజన జరగాలి. రాష్ట్ర, జోనల్ స్థాయిలో పనిచేస్తున్నవారిని ఆంధ్రప్రదేశ్‌కు పంపాలి. - జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పెద్ద ఎత్తున జరుపుకోవాలి. అమరవీరులకు నివాళులు అర్పించి, వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తామని ప్రతిజ్ఞ చేసి, కొత్తరాష్ట్రంలో విధులకు హాజరుకావాలి. - స్థానికత పేరుమీద తప్పుడు ధ్రువపత్రాలను సమర్పిస్తున్నవారిపై సమగ్ర పరిశీలన జరిపి, చర్యలు తీసుకోవాలి. - ఎన్నికల మేనిఫెస్టోల్లో పార్టీలు ఇచ్చిన హామీలను అమలుచేసే విధంగా ప్రభుత్వంపై నిరంతర ఒత్తిడి తేవాలి. - గిర్గ్లానీ నివేదికను, 610 జీవోను అమలుచేసే విధంగా చర్యలు తీసుకోవాలి. పదో పీఆర్సీ అమలు, ఆరోగ్యకార్డుల జారీ విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలి. - పోలవరం ముంపు గ్రామాల ఉద్యోగులను తెలంగాణకే కేటాయించాలి. తెలంగాణలోనే ఉండాలంటూ ముంపు గ్రామాల ప్రజలు చేస్తున్న ఉద్యమాలకు మద్దతు ఇవ్వాలి. - ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని సంస్కృతిని పెంచడానికి అన్ని జిల్లాల్లో సెమినార్లు నిర్వహించాలి. పనిగంటలతో సంబంధం లేకుండా పనిచేయాలి. - తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన తర్వాత అన్ని శాఖల్లో జరిగిన ప్రమోషన్లు, నియామకాలపై విచారణ జరపాలి. అక్రమ నియామకాలు, పదోన్నతులను నిలిపివేయాలి. -
సంక్షేమ శాఖల్లో విభజన కొలిక్కి
* 58:42 ప్రాతిపదికన సీమాంధ్ర, తెలంగాణలకు పంపకాలు * గిరిజన శాఖలో మాత్రం 46 : 54 నిష్పత్తిని సూచించిన అధికారి * సంక్షేమ భవన్లో తెలంగాణకు మూడు, సీమాంధ్రకు నాలుగు ఫ్లోర్లు.. ప్రభుత్వానికి నివేదిక సాక్షి, హైదరాబాద్: సంక్షేమశాఖల్లో విభజన ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చింది. ఆస్తులు, అప్పులతో పాటు ఉద్యోగుల విభజన పై కూడా ప్రతిపాదనలు తయారుచేసిన సంక్షేమ శాఖల అధికారులు ఆన్లైన్ ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె. మహంతికి పంపించారు. 58 :42 నిష్పత్తిలో సీమాంధ్ర, తెలంగాణలకు విభజనను పూర్తిచేశారు. రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, వికలాంగుల సంక్షేమశాఖలు పనిచేస్తున్నాయి. 23 జిల్లాలకు సంబంధించి ఏ జిల్లాకు ఆ జిల్లా యూనిట్‌గా ఉన్న నేపథ్యంలో హైదరాబాద్‌లో కేంద్రీకృతమైన ఉద్యోగులు, అధికారుల విభజన, ఆస్తులు, అప్పుల పంపకాల విషయంలో గత నెల రోజులుగా ప్రత్యేక దృష్టిసారించారు. ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా నివేదిక రూపొందించినట్టు ఉన్నతాధికారి ఒకరు‘సాక్షి’కి తెలిపారు. గిరిజనశాఖ విషయంలో జనాభా పట్టని వైనం తెలంగాణ ప్రాంతంలో గిరిజనుల జనాభా సీమాంధ్ర కన్నా ఎక్కువ కాబట్టి... తెలంగాణకు 54 శాతం, సీమాంధ్రకు 46 శాతం కింద పంపకాలుండాలని,ఆమేరకు నివేదిక రూపొందించాలని ఉన్నతాధికారి ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. అయితే అధికారి చెప్పిన విధంగా ఓ నివేదికను రూపొందించినప్పటికీ, ఆన్లైన్లో మాత్రం సీమాంధ్రకే 58 శాతం, తెలంగాణకు 42 శాతం ప్రకారమే విభజనను ప్రతిపాదించి అప్లోడ్ చేసినట్టు తెలిసింది. సీమాంధ్రకు 58 శాతం, తెలంగాణకు 42 శాతం ప్రాతిపదికన పంపకాలు జరపాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా అన్ని సంక్షేమ శాఖలు నివేదికలు రూపొందించాయి. ఓపెన్ కేటగిరీ కింద ఉద్యోగాలు సంపాదించి హైదరాబాద్‌లో పనిచేస్తున్న సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగులకు సంబంధించి కూడా అవే మార్గదర్శకాలనే పాటించారు. కాగా గిరిజన సంక్షేమశాఖకు సంబంధించి జనాభా ఆధారంగా విభజించాలని, సీమాంధ్ర కన్నా తెలంగాణలో గిరిజనులు అధికంగా ఉన్నందున పంపకాల విషయంలో ఉన్నతస్థాయి వర్గాల నుంచి కొత్త ప్రతిపాదనలు వచ్చాయి. అయినప్పటికీ మిగిలిన శాఖల మాదిరిగానే పంపకాలతో నివేదిక పంపించినట్టు తెలిసింది. సంక్షేమ భవన్ రెండు విభాగాలుగా... మాసాబ్‌ట్యాంక్‌లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్‌ను కూడా 58:42 ప్రకారమే సీమాంధ్ర, తెలంగాణలకు విభజించారు. ఏడు అంతస్తులున్న ఈ భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మూడు అంతస్తులను తెలంగాణకు, నాలుగు నుంచి ఏడు అంతస్తులను సీమాంధ్రకు కేటాయించాలని ప్రభుత్వానికి నివేదించారు. అయితే తెలంగాణ ఉద్యోగులు, అధికారులు పై మూడు అంతస్తులను తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తే, వారికి ప్రాధాన్యత ఇస్తూ తదనుగుణంగా మార్పులు చేయాలని కూడా నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. శ్రీశైలం ఐటీడీఏ నుంచి వేరుకానున్న మహబూబ్‌నగర్ శ్రీశైలం ఐటీడీఏ పరిధిలో కర్నూలు, మహబూబ్‌నగర్, నల్లగొండ, ప్రకాశం జిల్లాలున్నాయి. విభజన కారణంగా శ్రీశైలం సీమాంధ్రకు వెళుతున్నందున మహబూబ్‌నగర్ జిల్లాను ఈ ఐటీడీఏ నుంచి వేరుచేశారు. ఇప్పటికి తెలంగాణలో ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ ఐటీడీఏలు ఉన్నాయి. మహబూబ్‌నగర్ అటవీప్రాంతం, చెంచుగ్రామాల కోసం ప్రత్యేకంగా ఐటీడీఏ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. -
ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతానికే
-
ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతానికే
* రాష్ట్రస్థాయి కేడర్ ఉద్యోగుల పంపిణీపై అధికార యంత్రాంగం నిర్ణయం * తొలుత ప్రొవిజనల్ జాబితా.. జీవో 610 ఆధారంగా స్థానికత * తెలంగాణ రాష్ట్రానికి ఉద్యోగులు కేటాయిస్తూ మే 25లోగా ఆదేశాలు * రెండు ప్రభుత్వాలు ఏర్పాటయ్యాకే ఉద్యోగుల తుది పంపిణీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్ర స్థాయి కేడర్ ఉద్యోగుల పంపిణీని మే 25లోగా పూర్తి చేయాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. తొలుత ఏ ప్రాంతానికి చెందినవారిని ఆ ప్రాంతానికే కేటాయిస్తూ ప్రొవిజనల్ జాబితాను విడుదల చేయనున్నారు. జీవో 610 ప్రాతిపదికన స్థానికతను పరిగణనలోకి తీసుకోవాలని ఉద్యోగుల పంపిణీపై సీనియర్ ఐఏఎస్ అధికారి కమలనాథన్ అధ్యక్షతన ఏర్పాటైన రాష్ట్ర సలహా కమిటీ నిర్ణయానికి వచ్చింది. జీవో 610 మేరకు నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు నాలుగేళ్లు ఎక్కడ చదివితే దానినే స్థానికతగా పరిగణనలోకి తీసుకోనున్నారు. ఈ మేరకు మే 25లోగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఉద్యోగులను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయనున్నారు. మిగిలిన ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందినవారుగా పరిగణిస్తారు. వారి గురించి ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం లేదని అధికారులు తేల్చారు. ఉద్యోగుల తుది పంపిణీని మాత్రం ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఏర్పాటైన తర్వాతే చేయాలని రాష్ట్ర సలహా కమిటీ నిర్ణయించింది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించిన తర్వాతే ఉద్యోగుల తుది పంపిణీని పూర్తి చేయాలని అది భావిస్తోంది. ప్రభుత్వాలు ఏర్పాటు కాకుండా ఉద్యోగుల తుది పంపిణీ సాధ్యం కాదని, ఇందులో వచ్చే సమస్యలను ఇప్పుడు పరిష్కరించలేమని అధికారులు చేతులెత్తేశారు. 8న సలహా కమిటీ భేటీ ఉద్యోగుల పంపిణీకి సంబంధించిన కీలకమైన మార్గదర్శకాలను ఖరారు చేయడం కోసం ఈ నెల 8న ఢిల్లీలో కమలనాథన్ అధ్యక్షతన రాష్ట్ర సలహా కమిటీ సమావేశం కానుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పి.వి.రమేశ్, సాగునీటి శాఖ ముఖ్యకార్యదర్శి నాగిరెడ్డి, ఏపీఐఐసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ జయేశ్‌రంజన్, బి.వెంకటేశం, కేంద్ర వ్యక్తిగత సిబ్బంది, శిక్షణ విభాగం సంయుక్త కార్యదర్శి అర్చన వర్మ ఈ భేటీలో పాల్గొంటారు. ఈ సమావేశంలో ఖరారు చేసే మార్గదర్శకాలకు ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ ఆమోదం కూడా తీసుకోవాల్సి ఉంది. ఎన్నికలు పూర్తయిన తర్వాత ప్రధాని ఎటువంటి ఆమోదాలు తెలపరని రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందింది. దీంతో రాష్ట్ర విభజనకు సంబంధించి రాష్ట్రస్థాయి ఉద్యోగులు, అఖిల భారత సర్వీసు అధికారుల పంపిణీ మార్గదర్శకాలపై ఈ నెల 12లోగానే ప్రధాని చేత ఆమోదం పొందాలని అధికార యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర స్థాయి ఉద్యోగుల పంపిణీలో భార్య-భర్త, ఎస్సీ, ఎస్టీ, అనారోగ్యం, ఐదేళ్లలో పదవీ విరమణ చేసే ఉద్యోగులకు ఆప్షన్లను రాష్ట్ర సలహా కమిటీ మార్గదర్శకాల్లో ప్రతిపాదించనుంది. -
ఉద్యోగుల విభజనకు మే 8న మార్గదర్శకాలు
* కేంద్రమంత్రి జైరాం రమేశ్ వెల్లడి * కేంద్ర హోంకార్యదర్శి పర్యవేక్షణ * హైకోర్టు విభజనకు న్యాయశాఖకు ప్రతిపాదనలు సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల మధ్య ఉద్యోగుల విభజనకు అనుసరించాల్సిన ముసాయిదా మార్గదర్శకాలను వచ్చేనెల (మే) 8న వెబ్సైట్లో ఉంచుతున్నామని రాష్ట్ర విభజనపై ఏర్పాటయిన మంత్రుల బృందం సభ్యుడు, కేంద్ర మంత్రి జైరాం రమేశ్ తెలిపారు. విభజన ప్రక్రియపై కేంద్ర హోంశాఖ అధికారులతో మంగళవారం చర్చించిన అనంతరం ఆయన విలేకరులతో కొద్దిసేపు మాట్లాడారు. పోలింగ్‌కు ముందుగా మార్గదర్శకాలు విడుదల చేస్తే ఇబ్బందులు వస్తాయని, అందుకోసమే సీమాంధ్రలో మే 7న పోలింగ్ ముగిసిన మరునాడు మార్గదర్శకాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. విభజనపై ఏర్పాటయని 21 కమిటీల నివేదికలను కూడా మే 8న వెబ్సైట్లో పొందుపరుస్తామని తెలిపారు. మే 9న సమావేశమై విభజన ప్రక్రియను వేగంగా పూర్తి చేయడానికి అనుసరించాల్సిన విధానంపై చర్చించనున్నామని చెప్పారు. కొత్త రాష్ట్రాల ఆవిర్భావం తర్వాత విభజన పనులు సజావుగా పూర్తి చేయడానికి, విభజన ప్రక్రియను పర్యవేక్షించడానికి వీలుగా కేంద్ర హోం కార్యదర్శి నేతృత్వంలో 2 రాష్ట్రాల సంయుక్త కమిటీ ఏర్పాటు చేయనున్నామని జైరాం చెప్పారు. ఈ కమిటీలో 2 రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు సభ్యులుగా ఉంటారని చెప్పారు. హైకోర్టు విభజన రెండు రాష్ట్రాకు హైకోర్టులు ఏర్పాటు చేయడానికి వీలుగా ప్రతిపాదనలు న్యాయశాఖకు పంపించామని చెప్పారు. న్యాయశాఖ నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చిన తర్వాత కొత్త హైకోర్టు ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు ప్రకారం ప్రస్తుత హైకోర్టునే తెలంగాణ హైకోర్టుగా పరిగణించాలని, ఆంధ్రప్రదేశ్‌లో కొత్త హైకోర్టు ఏర్పాటయ్యే వరకు ప్రస్తుతం ఉన్నదే ఉమ్మడిగా పనిచేయాల్సి ఉంటుంది. విభజన ప్రక్రియకు మార్గదర్శకాలను న్యాయశాఖ ఖరారు చేసిన తర్వాత హైకోర్టు విభజన ప్రారంభమవుతుంది. ఐఏఎస్‌లకు ఆప్షన్స్ లేనట్లే! అఖిల భారత సర్వీసు అధికారుల విభజనకు అనుసరించాల్సిన మార్గదర్శకాలు ఖరారు చేయడానికి ఏర్పాటయిన ప్రత్యూష్ సిన్హా కమిటీ మంగళవారం సమావేశమైంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి ఈ భేటీకి హాజరయ్యారు. ఆప్షన్స్ సౌకర్యం కల్పించాలని అఖిల భారత అధికారులు కమిటీకి విన్నవించిన నేపథ్యంలో.. ఆప్షన్స్ ఇవ్వడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను సమావేశంలో చర్చించినట్లు తెలింది. ఆప్షన్స్ ఇవ్వడం సాధ్యం కాదని ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఎన్నికల తర్వాత మార్గదర్శకాలను వెల్లడించడానికి కమిటీ కసరత్తు చేస్తోంది. -
తెలంగాణకు అన్యాయం జరిగితే మరో ఉద్యమం
టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్ ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్రా న్ని పోరాడి సాధించుకున్నామని, ఉద్యోగుల విభజనలో అన్యాయం జరిగితే మరో ఉద్యమం చేస్తామని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్ అన్నారు. స్థానిక టీఎన్జీవో ఫంక్షన్ హాల్లో శనివారం నిర్వహించిన సభ్యత నమోదు కార్యక్రమం, ఆ తర్వాత జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన జరగాలన్నారు. ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రంలో అదనంగా రెండు గంటలు విధులు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. సీమాంధ్ర ఉద్యోగులు తెలంగాణను విడిచి వెళ్లాల్సిందేనని అన్నారు. లేదంటే ప్రత్యేక రాష్ర్ట ఏర్పాటుకు సార ్థకత ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర ప్రశంసనీయమని చెప్పారు. టీఎన్జీవో రాష్ర్ట ప్రధాన కార్యదర్శి కారం రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఉద్యమించాలని పిలుపునిచ్చారు. స్థానికత ఆధారంగానే విభజన జరగాలని, ఆప్షన్లు ఇస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. టీఎన్జీవో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కూరపాటి రంగరాజు, గంగవరపు నరేందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనకోసం జరిగిన మలి దశ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర మరువలేనిదన్నారు. పోలవరం ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలపడం సరికాదన్నారు. పోలవరం ఎత్తు తగ్గించే వరకు ఉద్యమించాలన్నారు. సమావేశంలో సంఘం రాష్ట్ర కోశాధికారి గుంటుపల్లి వేణుగోపాల్, హైదరాబాద్ నగర అధ్యక్షుడు వెంకట్. గణాంక ఉద్యోగుల సంఘం రాష్ర్ట అధ్యక్షుడు వేణుమోహన్, టీఎన్జీవో కేంద్ర సంఘం సభ్యులు లక్ష్మినారాయణ, సోమయ్య, రామారావు, కె.శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వల్లోజు శ్రీనివాసరావు, ఆర్.వి.ఎస్ సాగర్, కోశాధికారి రమణయాదవ్, దుర్గాప్రసాద్, వెంకటేశ్వర్లు, రామయ్య, సరస్వతి, పుల్లమ్మ పాల్గొన్నారు. -
సచివాలయంలో నరసింహన్
* సెక్రటేరియట్‌కు వచ్చిన తొలి గవర్నర్‌గా చరిత్ర * విభజన నేపథ్యంలో రెండు రాష్ట్రాల పాలనకు బ్లాకుల కేటాయింపులపై స్వీయ పరిశీలన * డి బ్లాకు, సౌత్ బ్లాకు, అసెంబ్లీ, మండలి, జూబ్లీహాల్‌ను పరిశీలించిన నరసింహన్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ సచివాలయాన్ని సందర్శించడం ద్వారా కొత్త చరిత్ర సృష్టించారు. రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు ఏ గవర్నర్ సచివాలయానికి రాలేదు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీకి గవర్నర్లు రావడం, సభ్యులనుద్దేశించి ప్రసంగించడం సాధారణమే. అయితే ముఖ్యమంత్రి పాలనా కేంద్రమైన సచివాలయాన్ని గవర్నర్ సందర్శించడం ఇదే తొలిసారి. అయితే గవర్నర్ నరసింహన్ ఈ సందర్శన రాష్ట్రపతి పాలనలో భాగంగా చేయలేదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సచివాలయంలోని బ్లాకులను రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఉద్యోగులకు పంపిణీ చేయాల్సి ఉన్నందున గవర్నర్ నరసింహన్ స్వయంగా పరిశీలించాలని తీసుకున్న నిర్ణయంలో భాగంగా సచివాలయ సందర్శన జరిగింది. జూన్ 2వ తేదీ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల కార్యాలయాలను, మంత్రులు, ఉద్యోగుల కార్యాలయాలను సచివాలయంలోనే కేటాయించాల్సి ఉంది. పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉండే గ్రేటర్ హైదరాబాద్‌లో ఇరు రాష్ట్రాలకు భవనాల కేటాయింపు అధికారం గవర్నర్‌కే ఉంది. ఈ నేపథ్యంలో నరసింహన్ ఆదివారం సాయంత్రం సచివాలయానికి వచ్చారు. ఆయన వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి, సలహాదారు ఎ.ఎన్.రాయ్, ఐఏఎస్ అధికారులు శ్యాంబాబు, లక్ష్మీపార్థసారథిలు కూడా ఉన్నారు. తొలుత సచివాలయంలోని డి బ్లాకుకు గవర్నర్ చేరుకున్నారు. ఆ బ్లాకులోని మూడు అంతస్థులను పరిశీలించారు. అక్కడి నుంచి సౌత్ హెచ్ బ్లాకు వెనుక నుంచి నడుచుకుంటూ సచివాలయం ప్రధాన గేటు ముందు వరకు వచ్చారు. అక్కడే అధికారులతో గవర్నర్ చర్చించారు. అక్కడి నుంచి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయంగా కేటాయించాలని ప్రతిపాదించిన సౌత్ హెచ్ బ్లాకులోకి వెళ్లి పరిశీలించారు. అదే బ్లాకులో గల లైబ్రరీలోకి వెళ్లారు. అక్కడ అధికారులు సచివాలయానికి సంబంధించిన మ్యాప్‌లతో గవర్నర్‌కు వివరాలు తెలిపారు. అనంతరం సౌత్ హెచ్ బ్లాకు ముందు గల పాడుబడిన జి బ్లాకును బయట నుంచే గవర్నర్ పరిశీలించారు. తరువాత అసెంబ్లీకి, శాసనమండలికి, జూబ్లీహాల్‌కు వెళ్లి పరిశీలించి రాజ్‌భవన్‌కు వెళ్లిపోయారు. -
ఆప్షన్లు వద్దని ఒకరు... ముద్దని మరొకరు
-
ఆప్షన్ల విధానం ఉండాలి... వద్దు
హైదరాబాద్: విభజనలో ఉద్యోగులకు ఆప్షన్ల విధానం ఉండాలని కమల్‌నాథన్ కమిటీని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం కోరింది. రాజకీయ ప్రమేయం, ఒత్తిళ్లు ఉండకూడదన్నారు. స్థానికతతో సంబంధంలేకుండా ఉద్యోగుల విభజన జరగాలన్నారు. విభజన తేదీకి ముందే పీఆర్సీని ప్రకటించాలన్నారు. పెన్షనర్ల ప్రయోజనాలను కేంద్రమే కాపాడాలన్నారు. ఉద్యోగుల విభజనకు ఆప్షన్ల విధానం వద్దని కమల్‌నాథన్ కమిటీకి తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. తెలంగాణలో తెలంగాణ వాళ్లు, సీమాంధ్రలో సీమాంధ్ర ఉద్యోగులు మాత్రమే పనిచేయాలని అన్నారు. స్థానికత ఆధారంగానే విభజన జరగాలన్నారు. స్థానికతక ప్రాతిపదిక ఏంటనేది కమలనాథన్ కమిటీ తేల్చాలని సూచించారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ఉద్యోగాల్లో కొనసాగుతున్నవారి సంగతి తేల్చాలన్నారు.