శాసనసభ ఉద్యోగుల విభజనలో సీమాంధ్ర ఉద్యోగులు స్థానికతను తప్పుగా చూపారని అసెంబ్లీ తెలంగాణ ఉద్యోగుల సంఘం నేత వేణుగోపాల్ అన్నారు.
హైదరాబాద్: శాసనసభ ఉద్యోగుల విభజనలో సీమాంధ్ర ఉద్యోగులు స్థానికతను తప్పుగా చూపారని అసెంబ్లీ తెలంగాణ ఉద్యోగుల సంఘం నేత వేణుగోపాల్ అన్నారు. 22 మంది సీమాంధ్ర ఉద్యోగులను తెలంగాణ ప్రాంతానికి చెందినవారు పేర్కొన్నారని చెప్పారు. మరో 15 మంది సీమాంధ్ర ఉద్యోగులు తప్పుడు స్థానికతను చూపారంటూ అసెంబ్లీ కార్యదర్శిని కలిసి తెలంగాణ ఉద్యోగులు అభ్యంతరం తెలిపారు.
వాటికి సంబంధించిన ఆధారాలు చూపడానికి అసెంబ్లీ కార్యదర్శిని రెండు రోజులు గడువు కోరామన్నారు. సీమాంధ్ర ఉద్యోగులు తెలంగాణలో కొనసాగుతామంటే సహించబోమని వేణుగోపాల్ అన్నారు. సచివాలయం ఉద్యోగుల విషయంలోనూ సీమాంధ్రులను తెలంగాణ వారిగా చూపారంటూ ఇప్పటికే అభ్యంతరాలు వచ్చాయి.