'ఎవరి రాష్ట్రాల్లో వారు పనిచేస్తే మంచిది'
హైదరాబాద్: స్థానికత ఆధారంగానే ప్రభుత్వ ఉద్యోగుల విభజన జరగాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అభిప్రాయపడ్డారు. ఉద్యోగులు తమ తమ రాష్ట్రాల్లోనే పనిచేయడం మంచిదని అన్నారు. విభజన పక్రియలో తెలంగాణ ఉద్యోగుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు.
ఉద్యోగుల విభజన సాఫీగా జరగాలని ఆయన ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగుల విభజన ప్రక్రియ వివాదస్పదం అవుతున్న నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. కాగా, ఆంధ్ర ఉద్యోగులను తమ రాష్ట్రంలో పనిచేయనీయబోమని తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎన్నికైన కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.