న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ కార్యాలయంలో కమలనాథన్ కమిటీ సమావేశమయింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి, ఉన్నతాధికారులు ఈ కీలక సమావేశానికి హాజరయ్యారు. విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల విభజనపై మార్గదర్శకాలను కమలనాథన్ కమిటీ నేడు ఖరారు చేయనుంది. ఈ ఉదయం ప్రత్యూష్ సిన్హా కమిటీతో పీకే మహంతి భేటీ అయ్యారు. ఎక్కడ పనిచేయాలో ఎంచుకునే అవకాశం (ఆప్షన్) ఇవ్వలా, వద్దా అనే దానిపై కీలక నిర్ణయం తీసుకోనుంది.
అయితే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులకు ఎక్కడ పనిచేయాలో నిర్ణయించుకునే ఆప్షన్ ఇవ్వరాదని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది. అఖిల భారత సర్వీసులకు సంబంధించి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎస్‌ఎఫ్ అధికారుల విషయంలో మాత్రం కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
కమలనాథన్ కమిటీ కీలక భేటీ
Published Thu, May 8 2014 4:05 PM | Last Updated on Sat, Jun 2 2018 4:41 PM
Advertisement
Advertisement