రాష్ట్ర విభజనలో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి శుక్రవారం 28 ఉద్యోగ సంఘాలను చర్చలకు ఆహ్వానించారు.
హైదరాబాద్ : రాష్ట్ర విభజనలో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి ఎల్లుండి 28 ఉద్యోగ సంఘాలను చర్చలకు ఆహ్వానించారు.శుక్రవారం సాయంత్రం జరిగే ఈ భేటీలో ఆయన రాష్ట్ర విభజనకు సహకరించాలని ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాలను కోరనున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఉద్యోగుల పంపిణీ శాశ్వత మార్గదర్శకాలపై చర్చించనున్నారు. మరోవైపు ఉద్యోగుల విభజనపై కేంద్రం నియమించిన కమలనాథన్ కమిటీ బుధవారం కేంద్ర హోంశాఖ కార్యాలయంలో సమావేశం అయ్యింది. ఉద్యోగుల విభజనపై మార్గదర్శకాలను ఖరారు చేసే అవకాశం ఉంది.
కాగా నిబంధనల ప్రకారం ఉద్యోగుల పంపిణీ జరగాలని సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం కోరగా, స్థానికత ఆధారంగా పంపిణీ జరగాలని, తెలంగాణ ఉద్యోగుల అసోసియేషన్ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి ఉద్యోగులతో సమావేశమై వారు లేవనెత్తిన అంశాలపై దృష్టి సారించాలని సిఎస్ మహంతి భావిస్తున్నారు.