'సీమాంధ్ర ఉద్యోగులను తెలంగాణలో ఉంచొద్దు'
న్యూఢిల్లీ: సీమాంధ్ర ఉద్యోగులను వారి సొంత రాష్ట్రానికి పంపాలని కేంద్రాన్ని కోరినట్టు తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) నేత శ్రీనివాసగౌడ్ తెలిపారు. ఈ విషయమై కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఉన్నతాధికారులను కలిసి విన్నవించామని చెప్పారు. ఖాళీలు లేవన్న నెపంతో సీమాంధ్ర ఉద్యోగులను తెలంగాణలో ఉంచొద్దని విజ్ఞప్తి చేశామని వెల్లడించారు.
సీమాంధ్ర ఉద్యోగులకు ఆప్షన్లు ఇవ్వొద్దని కోరామని చెప్పారు. స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన జరగాలని సూచించామన్నారు. తెలంగాణలో ఉన్న సీమాంధ్ర ఉద్యోగులను గుర్తించి వారి సొంత ప్రాంతానికి పంపాలని కోరినట్టు తెలిపారు. అపాయింటెడ్ డే మార్చడం కుదురదని హోంశాఖ తేల్చి చెప్పిందని శ్రీనివాసగౌడ్ వెల్లడించారు.