హైదరాబాద్ : స్థానికత విషయంతో తెలంగాణ ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సచివాలయం తెలంగాణ ఉద్యోగుల సంఘం నేత నరేందరరావు తెలిపారు. తెలంగాణ ఉద్యోగుల సంఘం నేతలు మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను కలిశారు. అనంతరం నరేందర్రావు మీడియాతో మాట్లాడుతూ ఆగస్టులోపు ఏ ప్రాంత ఉద్యోగులు అక్కడే పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ను కోరామన్నారు. స్థానికత సర్టిఫికెట్లను పరిశీలించేందుకు కమిటీ వేస్తామని సీఎస్ హామీ ఇచ్చినట్లు నరేందరరావు తెలిపారు. దొంగ సర్టిఫికెట్లతో ఉద్యోగం సంపాదించినవారిపై కమిటీ చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు.
కాగా రాష్ట్ర విభజన నేపధ్యంలో.. ఏ ప్రాంతానికి చెందిన ఉద్యోగులను ఆ ప్రాంతానికి కేటాయించేందుకు రెండు రాష్ట్రాలు అంగీకరిస్తేనే ఉద్యోగుల పంపిణీ సులభతరం కానుంది. లేదంటే ఇరు రాష్ట్రాలకు ఉద్యోగుల పంపిణీ చిక్కుముడిగా మారి మరింత కాలం గందరగోళం తప్పకపోవచ్చని అధికారులు చెప్తున్నారు. ఏ ప్రాంతానికి చెందిన ఉద్యోగులను ఆ ప్రాంతానికి కేటాయించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పటికే కమలనాథన్ కమిటీకి ఇదే విషయాన్ని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ తెలిపారు.
'తెలంగాణ ఉద్యోగులు ఆందోళన చెందవద్దు'
Published Tue, Jul 1 2014 12:40 PM | Last Updated on Sat, Jun 2 2018 4:41 PM
Advertisement