
కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్‌గా రాజీవ్‌శర్మ
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన రాజీవ్‌శర్మకు రాష్ట్ర ప్రభుత్వం మరో బాధ్యతను అప్పగించింది. తాజాగా కాలుష్య నియంత్రణ మండలి బోర్డు చైర్మన్‌గా నియమించింది.
ఇప్పటికే ఆయన ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా వ్యవహారిస్తున్నారు. కాగా, సెంట్రల్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఉపాధ్యక్ష బాధ్యతలు కూడా ఆయనకే ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది.